వాడుకరి చర్చ:Dev/క్రితం చర్చ 7

ధన్యవాదములు

మార్చు

దేవా గారూ! మీ అభినందనలకు ధన్యవాదములు. ప్రస్తుతం ఇక్కడ బెంగుళూరులో బ్రిటిష్ లైబ్రరీ నుంచి ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను. ఇంకా ఇంటిదగ్గర ఇంటర్‌నెట్ రాలేదు. చాలా ఆశ్ఛ్యర్యకరమైన విషయం ఏమంటే బెంగుళూరులో (ఐ టీ ప్రధాన కేద్రమని పేరొందిన)ఇంటర్‌నెట్ కనెక్షన్ విరివిగా దొరకకపోవటం. నేనున్న ఏరియా (విజయనగర)నగర నడిబొడ్డునున్నది కాని నాకు ఈ కష్టం తప్పలేదు. ఏది ఏమయినా త్వరలో మళ్ళీ వికీలో వ్యాసాలు వ్రాయటానికి ఉత్సాహంగా ఉన్నది. త్వరలో మళ్ళీ కలుద్దాం. --S I V A 11:51, 4 ఏప్రిల్ 2009 (UTC)Reply

తెలుగు వ్యంగ చిత్రకారుల మూస

మార్చు

దేవాగారూ! ధన్యవాదములు. చాలా చక్కగా చేశారు. మీరు చెప్పినట్టు, కొన్ని ఇతర కార్టూనిస్టుల పేర్లు జతపరిచాను. ఆ సమయంలో కొంత కష్టపడాల్సివచ్చింది. కొన్ని పేర్లు ఇప్పటికే ఉన్న వ్యాసాలకు దారి తీస్తున్నాయి. మళ్ళి వెళ్ళి తగిన మార్పు చేశాను. మరొకసారి ధన్యవాదములు.--S I V A 17:53, 16 జనవరి 2009 (UTC)Reply

దేవాగారూ, మీరు తయారుచేసిన మూసలో నేను గీసిన ఒక కార్టూన్ చిత్రం జతపరిచాను. మూసలో చూస్తే కనపడుతున్నది. కాని,ఈ మూస పెట్టబడిన జయదేవ్, ఊమెన్ వ్యాసాల పుటలలో నేను ఇప్పుడు జతపరచిన చిత్రం మూసలో కనపడటంలేదు. ఆ తరువాత, నేను ఈ మార్పు చెయ్యగానే, ఊమెన్ వ్యాసం పుట చివర ఎవో కొత్త మూసలు ఏర్పడినాయి. ఒకసారి దయచేసి చూడండి. అవసరమేన మార్పులు చెయ్యగలరు. నేను బొమ్మ జతచెయ్యటం వల్లన ఏదైనా అనుకోని ఫలితం వచ్చిందేమో మరి తెలియదు. చూసి చెప్పగలరు.--S I V A 18:18, 16 జనవరి 2009 (UTC)Reply


ఆయా వ్యాసాలలో మూసను ఒకసారి తొలగించి, మళ్ళీ అమరిస్తే సమస్య తొలగింది. కాని, ఈ వ్యాసాల కింద, అంతకు ముందు లేని ఒక కొత్త సందేశం కనపడుతున్నది:

ఈ పేజీకి 12:28, జనవరి 16, 2009న చివరి మార్పు జరిగినది. విషయ సంగ్రహం GNU Free Documentation License కి లోబడి లభ్యం. గోప్యతా విధానం వికీపీడియా గురించి అస్వీకారములు

దీనికి కారణం ఏమిటో చూసి చెప్పండి. మీకు మళ్ళీ పని పెట్టినందుకు చింతిస్తున్నాను.--S I V A 00:54, 17 జనవరి 2009 (UTC)Reply

గమనించాను దేవాగారూ. ధన్యవాదములు.--S I V A 09:50, 18 జనవరి 2009 (UTC)Reply

నిర్వాహకుల వాండలిజం

మార్చు

వాడుకరి:వైజాసత్య మాటి మాటికి మూలాలున్న పేజిలతో సహా అనేక వ్యాసాలు తొలిగిస్తోంది. క్లారా జెట్కిన్ వ్యాసం కూడా పొంతన లేని కారణాలు చెప్పి తొలిగించింది. మోడరేటర్లకి నీతి నియమాలు అవసరం లేదన్న మాట. ఇది తెలుగు వికీపీడియా అసలు నైజం

దేవా గారు, మీ యొక్క అభిప్రాయమునకు, వినమ్రతాపూర్వకముగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు నా యొక్క బొమ్మ ను , సరి చేసి నందులకు ధన్యవాదాలు. మీకు మిగతా వాతిని కూడా చేసి పెట్టగలను. మీ యొక్క వ్యాక్య నాకు మరింత బలాన్ని చేకూర్ఛింది. ఇట్లు . ఆకాష్ (gspandan@gmail.com)

దేవా గారు, తెవికీలో మళ్ళీ రచనలు చేపట్టినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇలాగే తెవికీ వృద్ధికి తోడ్పడండి. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:42, 20 జూన్ 2008 (UTC)Reply

పునః స్వాగతము --93.96.17.98 17:21, 20 జూన్ 2008 (UTC)Reply
మీరెవరో గానీ ధన్యవాదాలు. δευ దేవా 09:08, 23 జూన్ 2008 (UTC)Reply
దేవా గారూ, తెవికీలో మిమ్మల్ని మరలా చూచి మనఃపూర్వకంగా ఆనందపడుతున్నాను. మీ కృషి తెవికీకి చాలా అవసరమని భావిస్తూ... మిత్రుడు. నిసార్ అహ్మద్ 19:02, 20 జూన్ 2008 (UTC)Reply
మీ నిర్ణయం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. రవిచంద్ర(చర్చ) 04:18, 23 జూన్ 2008 (UTC)Reply
దేవాగారూ, తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ!! హావ్ ఫన్ --వైజాసత్య 04:53, 23 జూన్ 2008 (UTC)Reply
నిజంగా తమరిరాక మాకెంతో ఆనందం.అదండీ తేవీకీ మహిమంటే.దూరంగా ఉండాలన్నా ఉండలేం కదండీ.తమిళంలో పిడుంగళ్ అంటే తెలుగులో పీకడం .అలాగే పిడుంగి అంటే పీకేవాడు అని అర్ధం.--t.sujatha 16:11, 25 జూన్ 2008 (UTC)Reply
మీ ఆత్మీయతకు ధన్యవాదాలు దేవా.మీలాంటి మిత్రులనందించిన తేవీకీ జోహార్లు.--t.sujatha 15:49, 26 జూన్ 2008 (UTC)Reply

నియోజకవర్గాలు

మార్చు
  • అసెంబ్లీ నియోజక వర్గాల సీరియల్ నంబర్లు తెలిస్తే అన్ని మూసలలో చేర్చండి. మూసలోని రెండవ భాగానికి కూడా జిల్లాలవారీగా నియోకవర్గాలు అని హెడ్డింగ్ ఉంటే బాగుంటుంది. ధన్యవాదాలు.Rajasekhar1961 06:53, 2 జూలై 2008 (UTC)Reply
దేవా గారు, నియోజకవర్గాల మూసలలో అన్ని జిల్లాల లింకులు చేర్చడం బాగుంది. నాకు ఇదివరకే ఈ ఆలోచన వచ్చిననూ నియోజకవర్గాల వ్యాసాలు ఇంకనూ ప్రారంభదశలోనే ఉన్నాయి కాబట్టి తరువాత ఆ పని చేద్దాంలే అనుకున్నాను. ఇంతలో మీరే ఆ కార్యానికి పూనుకోవడం సంతోషమే. నియోజకవర్గాల వ్యాసాలలో సమాచారం చేర్చడానికి మనం కృషిచేస్తే ఎన్నికల వరకు వ్యాసాలు సంపూర్ణదశకు చేరుకుంటాయి. దీనికి పేజీహిట్స్ కూడా బాగానే ఉంటాయనుకుంటున్నాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:11, 2 జూలై 2008 (UTC)Reply
    • కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం అందంగా తయారయింది. బొమ్మలు తయారుచేయడంతో చాలా ఆకర్షనీయంగా బాగుంది. ఇది ఒక మోడల్ గా భావించవచ్చును. బొమ్మలు ఎలా చేశారు తెలియజేస్తే మేమందరం కూడా చేతులేసి అన్ని శాసనసభ స్థానాలకు ఇలా బొమ్మలు తయారుచేస్తాము. మీ ఐడియా కి జోహార్లు.Rajasekhar1961 07:18, 10 జూలై 2008 (UTC)Reply

ధన్యవాదాలు

మార్చు

దేవా గారు, వినమ్రతాపూర్వకముగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.Kumarrao 12:39, 10 జూలై 2008 (UTC)Reply

కొత్త ఉద్యోగం

మార్చు

గత మే నెల్లో కొత్తగా ఉద్యోగంలో చేరాను. ఒరాకిల్ హైదరాబాద్ లో. మొదట్లో ట్రైనింగ్ గట్రా ఉంటాయి కదా అందుకనే వికీకి ఎక్కువ సమయాన్ని కేటాయించలేకున్నాను. అయినప్పటికీ మద్య మద్యలో కొత్త సభ్యులకు స్వాగతం పలకడం లాంటి చిన్న చిన్న పనులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను. ఉద్యోగంలో కొద్దిగా కుదురుకున్న తరువాత మళ్ళీ మార్పులు మొదలు పెడతాను. రవిచంద్ర(చర్చ) 03:41, 11 జూలై 2008 (UTC)Reply

గ్రామాల పేర్లలో తప్పులు

మార్చు

దేవా గారూ, గ్రామాల పేర్లు దాదాపు అన్నీ ఆంగ్లం జాబితా నుండి అనువదించినవే కనుక మీరు చెప్పిన తప్పులు వచ్చి ఉండవచ్చును. మీకు ఖచ్చితంగా తెలిసిన పేర్లను సరైన పేర్లకు తరలించేయండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:07, 22 జూలై 2008 (UTC)Reply

RE: స్వాగతం

మార్చు

ఏదో టైం పాస్ కోసమని వచ్చాను :) చర్చసాయీరచనలు 02:13, 7 ఆగష్టు 2008 (UTC)

బోయింగ్ 747 ఎలా ఉంది? చర్చసాయీరచనలు 13:41, 7 ఆగష్టు 2008 (UTC)
అవును. నా తెలుగు అంతంత మాత్రమే. చూస్తాను. వేదిక అంటే portal కద? చర్చసాయీరచనలు 13:49, 7 ఆగష్టు 2008 (UTC)
ఆ పని మీదే ఉన్నాను. రేపు కలుద్దాం :) చర్చసాయీరచనలు 14:02, 7 ఆగష్టు 2008 (UTC)

Look here చర్చసాయీరచనలు 15:58, 9 ఆగష్టు 2008 (UTC)

హెడర్ స్క్రిప్టు

మార్చు
వైజాసత్య గారు! ఒక చిన్న సమస్యండి. స్క్రిప్ట్ లాగిన్ అయి ఉంటేనే పనిచేస్తున్నట్టుంది. ఒకసారి వేదిక:ఆంధ్ర ప్రదేశ్/బొమ్మ ఈ పేజీ లాగిన్ అయి మళ్ళీ లాగ్ అవుట్ అయి చూడండి, మీకర్థమవుతుంది, సమస్యేమిటో! హెడర్ మాయమవుతుంది, లాగ్ అవుట్ అవగానే! మీరు వేరే ఫైల్ లో పేస్ట్ చెయ్యాలేమో! మీడియావికీ:Common.css కి బదులు మీడియావికీ:Monobook.css లో చెయ్యాలేమో! δευ దేవా 22:39, 9 ఆగష్టు 2008 (UTC)
నాకు లాగవుట్ అయినా హెడర్ బాగానే కనిపిస్తుంది. common.css లో అతికిస్తేనే అందరికీ వర్తిస్తుంది. ఒక్కొక్క సభ్యుడు ప్రత్యేక డిజైను మార్పులు చేసుకోవటానికే మోనోబుక్.సిఎసెస్ వాడాలి. ఇంకా మీరు తయారు చేసిన హెడర్ను కూడా కామన్ సిఎసెస్ లో అతికించా --వైజాసత్య 19:55, 10 ఆగష్టు 2008 (UTC)

అనువాదం సరిగా ఉందా? చర్చసాయీరచనలు 12:29, 27 ఆగష్టు 2008 (UTC)

Hey Dev! Are you available to finish this translation on Meta-Wiki? You can do it here. If you need help, you can talk to us on IRC at #wikimedia-translation, e-mail me, or leave a message on my meta talk page. Thanks! Cbrown1023 చర్చ 21:33, 29 ఆగష్టు 2008 (UTC)

SVGకరణకు పతకం

మార్చు

దేవాగారు మ్యాపులను SVGకరిస్తున్నందుకు నా తరపునుండి ఈ చిరుకానుకను అందుకోండి. దీనిని మీ సభ్యపేజీలో చేర్చుకోగలరు.

  SVGకరణకు పతకం
వికీలో ఉన్న అనేక జిల్లా మండలాల బొమ్మలను SVGకరిస్తున్నందుకు దేవాగారికి ఒక చిరుకానుక మాకినేని ప్రదీపు (+/-మా) 06:26, 15 సెప్టెంబర్ 2008 (UTC)

__మాకినేని ప్రదీపు (+/-మా) 06:26, 15 సెప్టెంబర్ 2008 (UTC)

దేవా గారు, వేదిక, బొమ్మల మరియు మూసల తయారీలో మీ కృషి మెచ్చదగింది. నియోజకవర్గాల వ్యాసాల అభివృద్ధికి సాంకేతికంగా బాగా కృషిచేస్తున్నారు. రాజకీయాలు లేదా నియోజకవర్గాలు పై కూడ ఒక వేదిక ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ విషయంపై ఆలోచించండి. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల వ్యాసాలు, నియోజకవర్గాల వ్యాసాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే ప్రస్తుతమున్న వేదికలకు సంబంధిత వర్గాలలో ఐకాన్ల లింకులు (ఆంగ్ల వికీలో మాదిరిగా) పెడితే బాగుంటుంది. ఎందుకంటే కొత్తవారికి వేదికల గురించి పరిచయం లేదు అలాంటి వారికి లింకులు బాగా ఉపయోగపడతాయి, అసలు మొదటి పేజీలోనే వేదికలకు లింకులుంటే ఇంకాబాగుంటుంది. తెవికీ హిట్ల ప్రకారం చూస్తే మొదటి పేజీలో లింకులున్న వాటికి హిట్లు బాగా వస్తున్నాయి. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:15, 15 సెప్టెంబర్ 2008 (UTC)
Image:Test drawing.svgలో నాకైతే తెలుగు అక్షరాలేమీ కనిపించడం లేదు. ఒక నల్లటి బాక్సు దానిపైన Charset=utf-8 అనే ఆంగ్ల అక్షరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. -- C.Chandra Kanth Rao(చర్చ) 22:07, 15 సెప్టెంబర్ 2008 (UTC)
దీనికి సంభందించే అప్పుడెప్పుడో ఒక బగ్గు ఫైలు చేశాం వేరే అన్ని భాషలకు వికీమీడియాలో SVG-PNG conversionకి ఫాంటులను ఏర్పాటు చేసారు. తెలుగుకు ఇంకా చేయలేదు! ఆ బగ్గు వివరాలున్న లింకు: https://bugzilla.wikimedia.org/show_bug.cgi?id=8898 . అలాగే ఇదే విషయానికి సంభందించి ఇంతకుముందు జరిగిన ఒక సంభాషణఉ చూడండి: వికీపీడియా:రచ్చబండ_(సాంకేతికము)#SVG ఫైళ్లలలో తెలుగు టెక్స్ట్ . ప్రస్తుతానికి SVG ఫైల్లలో తెలుగు ఫాంటు ఉపయోగించి రాస్తున్న అక్షరాలను "ఆబ్జెక్ట్లు"గా మార్చుకుని ఎక్కిస్తే ఎటువంటి సమస్యా ఉండదు. ఉదాహరణకు: దేవా ఎక్కించిన ఈ బొమ్మలో రెండు తెలుగు వాక్యాలు ఉంటే ఒకటే కనపడుతుంది, రెండోది అసలు కనపడటంలేదు, అలా కనపడకపోవడం వికీమీడియా సాఫ్టువేరులో SVG-PNG conversion అప్పుడు సరైన ఫాంటు దొరకకపోవడమే కారణం. __మాకినేని ప్రదీపు (+/-మా) 03:03, 16 సెప్టెంబర్ 2008 (UTC)

ధన్యవాదాలు

మార్చు

ప్రదీప్ గారూ! మీ అభిమానానికి ధన్యవాదాలు. అప్‌లోడ్ చేయడం ప్రారంభించగానే అభినందించినందుకు ధన్యవాదాలు. బాగా బిజీగా ఉన్నట్టున్నారు, మీరు అసలు కనిపించడం లేదు వికీలో! δευ దేవా 11:54, 15 సెప్టెంబర్ 2008 (UTC)

అవును ఒకేసారి అన్ని వైపులనుండీ బోలెడన్ని పనులు వచ్చేసాయి. మెలగా ఒక్కోదాని పూర్తిచేసి మళ్లీ ఇక్కడ కొంచెం ఎక్కువగా కనపడటానికి ప్రయత్నిస్తాను  :) . __మాకినేని ప్రదీపు (+/-మా) 03:10, 16 సెప్టెంబర్ 2008 (UTC)

బొమ్మలను తరలించడం

మార్చు

దేవా! బొమ్మలకు "తరలించు" ట్యాబ్ లేదని ఇప్పుడే గమనించాను. బొమ్మలను పేరు మార్చాలంటే అదే బొమ్మను మళ్ళీ సరైన పేరుతో అప్‌లోడ్ చేసి పాత బొమ్మను తొలగించాలి. అంతే గదా? మరేమైనా పద్ధతి ఉందా? మీ దగ్గర ఆ బొమ్మలు ఎలాగూ ఉన్నాయి గనుక వాటిని సరైన పేర్లతో మళ్ళీ అప్‌లోడ్ చేయగలరా? అప్పుడు పేరు తప్పుగా ఉన్న బొమ్మను నేను చెరిపేస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:58, 20 సెప్టెంబర్ 2008 (UTC)

బొమ్మలకు మరియు వర్గాలకు తరలించడం సాధ్యం కాదు. కాబట్టి కాసుబాబు గారన్నట్లు కొత్త పేరుతో బొమ్మలు మళ్ళి అప్‌లోడ్ చేయాల్సిందే. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:25, 20 సెప్టెంబర్ 2008 (UTC)
ఓకే. ధన్యవాదాలు.δευ దేవా 06:51, 21 సెప్టెంబర్ 2008 (UTC)

నియోజకవర్గాల బొమ్మలు

మార్చు

దేవా గారు! మీరు తయారుచేస్తున్న నియోజకవర్గాల బొమ్మలు చూడముచ్చటగా ఉన్నాయి. ఇవి నియోజకవర్గాల వ్యాసాలకే వన్నెతెస్తున్నాయి. నియోజకవర్గపు వ్యాసాలలో మూసలు, బొమ్మలు చేర్చడం చాలా బాగుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:00, 26 సెప్టెంబర్ 2008 (UTC)

అవును ఇది చాలా ప్రశంసనీయమైన కృషి. అభినందనలు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:32, 26 సెప్టెంబర్ 2008 (UTC)
చంద్రకాంత్ గారికి, కాసుబాబు గారికి ధన్యవాదాలు. అన్ని నియోజకవర్గాలకి బొమ్మలు చేద్దామని అనుకుంటున్నాను. ఎంత సమయం పడుతుందో మరి. అన్ని నియోజకవర్గాలతో ఆంధ్రప్రదేశ్ బొమ్మ కూడా చేద్దామనుకుంటున్నాను. δευ దేవా 20:16, 26 సెప్టెంబర్ 2008 (UTC)

I was wondering if you could replace Image:Question book-3.svg with Image:Question book-4.svg in the మూస:మూలాలు_సమీక్షించండి template. Thanks in advance! Tkgd2007 22:43, 26 సెప్టెంబర్ 2008 (UTC)

  I have replaced the image as you have asked. δευ దేవా 22:47, 26 సెప్టెంబర్ 2008 (UTC)

తెలుగు వికీపీడియాకు మారుపేరు వైజాసత్య గారు

మార్చు

ప్రారంభం నుంచి తెలుగు వికీపీడియాకు అహర్నిషలు కృషిచేసిన వైజాసత్య గారి పైన కొందరు పిచ్చిపట్టిన అనామక వ్యక్తులు విమర్శలు చేయడం భాధ కలుగుతుంది. ఇది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు. తెలుగు వికీపీడియన్ల సంపూర్ణ మద్దతు అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వైజాసత్య గారికి ఉంటుంది. వైజాసత్య గారు ఏది చేసిననూ అది తెవికీ అభివృద్ధికేనన్న మాట సంపూర్ణ తెలుగు సమాజానికి తెలుసు. తెలుగు వీపీడియాపై విమర్శలు చేసిన పిచ్చి వ్యక్తికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఇక ఈ విజ్ఞానసర్వస్వం లోకి రానేకూడదు. అతను చేసిన అన్ని రచనలకు ఇక తొలిగించడమే తరువాయి. దీనికి చర్చ కూడా అనవసరం. తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా నీచవ్యాఖ్యలు చేసిన అతడి రచనలను మనం మాత్రం ఎందుకుంచాలి. సభ్యులందరూ దీన్ని గమనించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 10:41, 28 డిసెంబర్ 2008 (UTC)

చాలా కాలంగా తెవికీలో సమయం వెచ్చించలేకపోతున్నాను. వైజాసత్య గారు అనుభవజ్ఞులు, తెవికీ ఎదుగుదలకు ఎంతో కృషి చేసారు. వారిపై వ్యాఖ్యలు చేసిన సభ్యుడు నిజంగా మూర్ఖుడే! δευ దేవా 17:01, 28 డిసెంబర్ 2008 (UTC)

వేదిక:ఆంధ్ర ప్రదేశ్

మార్చు

దేవా గారు, చాలా కాలం నుండి అచేతనంగా ఉండిన వేదిక:ఆంధ్ర ప్రదేశ్లో కొత్త సమాచారం చేర్చినారు. మీరు ఇలాగే చురుగ్గా తెవికీలో మార్పులు చేస్తారని ఆశిస్తున్నాను. -- C.Chandra Kanth Rao-చర్చ 16:07, 15 మార్చి 2009 (UTC)Reply

ఇక కొంతకాలం చురుగ్గా తెవికీలో పాల్గొనదలచాను. ఎన్నికలకు సంబంధించిన వ్యాసాలల్లో మీకు సహాయంగా ఉండడానికి కృషి చేస్తాను. δευ దేవా 16:52, 15 మార్చి 2009 (UTC)Reply
చాలా సంతోషం. నియోజకవర్గాల వ్యాసాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. వాటన్నిటినీ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. నా సహాయం మీకుంటుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 17:02, 15 మార్చి 2009 (UTC)Reply

దేవా గారు, పట్టికలలో పార్టీ రంగు బదులు పార్టీ జెండా వస్తే బాగుంటుదనుకుంటున్నాను. వీలైతే చూడండి. -- C.Chandra Kanth Rao-చర్చ 17:48, 15 మార్చి 2009 (UTC) మంచి ఆలోచన, ప్రయత్నిస్తాను. స్వింగ్‌కు తెలుగు పదం చెప్పగలరా? δευ దేవా 17:50, 15 మార్చి 2009 (UTC)Reply

ఎన్నికల పరిబాషలో స్వింగ్‌కు రెండు పార్టీల మధ్య ఓటర్ల వైఖరి/ఇద్దరు అభ్యర్థుల తారతమ్యం/మెజారిటీగా అర్థం చెప్పుకోవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 18:44, 15 మార్చి 2009 (UTC)Reply
మీరు నియోజక వర్గాలలో పెట్టిన పట్టిక చూశాను. స్వింగ్‌కు అర్థం గత ఎన్నికకు ఇప్పటి ఎన్నికకు ఓట్లలో మార్పు శాతంగా ఇచ్చారనుకుంటా. దానికి తెలుగులో సరైన పదం దొరకడం లేదు. ప్రస్తుతానికి స్వింగ్‌గా ఉంచి తర్వాత ఆలోచిద్దాం. -- C.Chandra Kanth Rao-చర్చ 18:51, 15 మార్చి 2009 (UTC)Reply

నియోజకవర్గాల బొమ్మలు

మార్చు

దేవా గారు, మీరు నియోజకవర్గాల బొమ్మలను చాలా చక్కగా రూపొందిస్తున్నారు. మీ కృషి చాలా బాగుంది. మీకు బొమ్మలను తయారుచేయడంలో ఈనాడు ప్రత్యేక ఎన్నికల పేజీలు పాంచజన్య, జిల్లాల రౌండప్‌లో ఇక్కడి బొమ్మలు సహకరిస్తాయని అనుకుంటున్నాను. దీని వల్ల మీ పని సులువౌతుంది. ఒక్కొక్క మండలాన్ని వెదికి పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. -- C.Chandra Kanth Rao-చర్చ 17:08, 28 మార్చి 2009 (UTC)Reply

అభినందనలు

మార్చు

దేవాగారూ నమస్తే, నియోజకవర్గాలలో మీరు కూరుస్తున్న, ఇన్ఫోబాక్సులు, బొమ్మలు అత్భుతం, అభినందనలు అందుకోండి. "మీ టెక్నికల్ ఎక్సలెన్సీ" ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అహ్మద్ నిసార్ 17:40, 28 మార్చి 2009 (UTC)Reply

దేవాగారూ నమస్తే, మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం చిత్తూరు జిల్లా పటం బహుబాగు. అలాగే ఆంధ్రప్రదేశ్ పటమూ చాలా బాగున్నది, కాని ఆంధ్రప్రదేశ్ పటములో మదనపల్లె నియోజకవర్గం చూపించే స్థలం కొద్ది wrong location లో కుప్పం స్థానంలో వున్నది (ఈ తప్పు నాదే సుమా), అలాగే తంబళ్ళపల్లె అసెంబ్లీ నియోజకవర్గం, మరియు పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం కూడానూ. దయచేసి సరిదిద్ద గలరు. అహ్మద్ నిసార్ 20:44, 3 ఏప్రిల్ 2009 (UTC)Reply
మదనపల్లె నియోజకవర్గంలో నేను సరిచేశాను. మిగితా నియోజకవర్గాలకు సంబంధించి అక్షాంశ, రేఖాంశాలు లభ్యం కావాల్సి ఉంది. -- C.Chandra Kanth Rao-చర్చ 21:04, 3 ఏప్రిల్ 2009 (UTC)Reply
ధన్యవాదాలు చంద్రకాంతరావుగారూ. అహ్మద్ నిసార్ 21:20, 3 ఏప్రిల్ 2009 (UTC)Reply
అక్షాంశ రేఖాంశాలను కొద్దిగా అటూ ఇటూ మార్చి, సరిచూస్తూ, నేను సాధారణంగా పటాలకు చేరుస్తుంటాను. మీరు కూడా అలా చేసి చూడవచ్చు. δευ దేవా 23:46, 3 ఏప్రిల్ 2009 (UTC)Reply

సభ్యుల వ్యాఖ్యలు

మార్చు

చంద్రకాంత్ గారూ! మీకు శివగారికి మధ్య జరిగిన చర్చలు చూసాను. ఇది చాలా చిన్న విషయం అని నేననుకుంటున్నాను. సహనం కోల్పోవద్దు. ఇంత మంది సభ్యులున్నప్పుడూ అప్పుడప్పుడూ మాటా మాటా రావడం సహజం. δευ దేవా 11:21, 4 ఏప్రిల్ 2009 (UTC)Reply

(నేను వ్యక్తిగతంగా తీరిక లేకుండా ఉన్నాను కాబట్టి సమాధానం వ్రాయడంలో ఆలస్యమైనందులకు చింతిస్తున్నాను) అవును దేవా గారు, ఇది చాలా చాలా చిన్న విషయం. అసలు దీనిపై చర్చే అవసరం లేదు. ప్రారంభంలో నాకు కూడా ఎందరో సభ్యులు తెలియని విషయాలు చెప్పారు, నేను తెలుసుకున్నాను, అంతే. ఈ విషయంలో మీ నుంచి కూడా నేను నేర్చుకున్నది ఎంతో ఉంది. కాని నేనూ ఎప్పుడు కూడా ఇతరుల చర్చకు వ్యతిరేకంగా వ్యవహరించలేను. నాకు తెలిసిన తెవికీ విషయాలు, పాలసీలు ఇతరులకు చెప్పి తెవికీ వృద్ధి పర్చాలనేదే నా ఉద్దేశ్యం. కాని కొందరికి ఇది నచ్చడం లేదు. నచ్చకుండా పర్వాలేదు, ఇతరుల చేసిన చర్చలను రెచ్చగొట్టే సారాంశంతో వ్రాయడం బాగుండదు కదా! మామూలుగా చర్చలు తొలిగిస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఇదివరకు ఎవరో ఒక అజ్ఞాత సభ్యుడు చేసిన చర్చలను చాలా సభ్యులు తొలిగించుకున్నారు, అందులో నేను ఒకడిని. అంతెందుకు నేను చేసిన చర్చలను ప్రస్తుతమున్న ఒక సభ్యుడు కూడా తన చర్చాపేజీల నుండి తొలిగించివేశాడు. కాని నేను వాటికి అభ్యంతరపర్చలేను. ఎందుకంటే సభ్యపేజీలలో, సభ్యుల చర్చాపేజీలలో ఏదిఉంచాలి, ఏది తుంచాలనేది వికీ మౌళిక లక్ష్యాలకు భంగం కలగనంతవరకు సభ్యులకు స్వేచ్ఛ ఉంది. ఇంకో విషయం కొందరు సభ్యులు నాకు నచ్చినదే నేను చేస్తా అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. కాని ఇది తెవికీ నైజం కాదు. ఇతర సభ్యులకు ఆదరణ, సభ్యుల చర్చలకు గౌరవం, తెవికీ పాలసీలకు ప్రాధాన్యత, తెవికీ సంప్రదాయానికి సముచిత స్థానం తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. సభ్యుల పొరపాట్లను తెలియజేయడం అనేది తెవికీ దృష్ట్యా తప్పు పని కానేకాదు. ఈ విషయంలో సభ్యులు కోపం తెచ్చుకొనే అవసరం రానేకూడదు. తమ పొరపాట్లను తెలుసుకొని తదుపరి పర్యాయం ఆ తప్పులను చేయకుండా ఉంటే చాలు. లేదంటే తెవికీ పాలసీలను, ఇదివరకు జరిగిన అన్ని చర్చాపేజీలను ఒకసారి తిరగేస్తే ఎవరికైనా తెవికీపై కొంత పట్టు వస్తుంది. దాని ద్వారా పొరపాట్లు సాధ్యమైనంతవరకు తగ్గిపోతాయి. ఇక బొమ్మ విషయంలో వస్తే ప్రారంభంలో ఒక సారి ప్రదీప్ గారు నేను అప్లోడ్ చేసిన బొమ్మను ఏకంగా తొలిగించిననూ నేనేమీ బాధపడలేను మరియు బాధను వ్యక్తం చేయలేను. అలాంటి పొరపాటును మరోసారి చేయలేను అంతేతప్ప చర్చను సాగదీయలేను. అంతెందుకు ఈవాబొ విషయంలోనే కాసుబాబు గారు నేను అప్లోడ్ చేసిన తాండూర్ నాపరాతి గనులకు సంబంధించిన బొమ్మను "ఈవారం బొమ్మ" గా పరుగణిద్దామని చర్చాపేజీలో మూస పెట్టారు. ఆ బొమ్మ స్పష్టంగా లేదని సాయి దానికి అభ్యంతరం చెప్పగా కాసుబాబు గారు తొలిగించారు. ఈ విషయంలో నేను తలదూర్చలేను. "అసలు రాళ్ళకు సంబంధించిన గనులు స్పష్టంగా ఉద్యానవనంలా ఎలా ఉంటాయి, గనులలో ఉండేది దుమ్ము, ధూళి మరి అలాంటప్పుడు అంతకంటె స్పష్టమైన బొమ్మ ఎలా వస్తుంద"ని నేను పాయింటు లాగలేను. ఇంకో మాట నేను కూడా చాలా బొమ్మలను అప్లోడ్ చేశాను కాని ఇంతవరకు కూడా "ఈవాబో"గా కాదు కనీసం బొమ్మ చర్చాపేజీలలో కూడా "ఈవాబొ" మూసను చేర్చలేను. ఎందుకంటె తెవికీ ప్రయోజనాల దృష్ట్యానే నేను అప్లోడ్ చేశాను కాని, నా బొమ్మ మొదటి పేజీలో కనిపించాలని నేను ఏనాడు కోరుకోలేను. ఇక నిర్వహణ బాధ్యత విషయానికి వస్తే తెవికీలో కనీసం ఎవరో ఒక్కరు సభ్యుల రచనల బాగోగులు చూడాల్సి ఉంటుంది. నేను చురుకుగా ఉండేటప్పుడు తెవికీలో ప్రవేశించగానే నా దిద్దుబాట్లను కాకుండా క్రితం సమయం నుండి ప్రస్తుతం వరకు ఎవరెవరు ఏయే రచనలు చేశారు, ముఖ్యంగా కొత్త సభ్యులు చేసిన రచనలు, వారి మార్పులు నిశితంగా గమనిస్తాను. ఇక చివరగా నేను చెప్పేదేమిటంటే సభ్యులు ఒకసారి ఒక చిన్న పొరపాటును చేయగానే వారి తప్పును తెలియజేసే పనినేను చేయను. సాధారణంగా నేను అందరి రచనలను గమనిస్తాను. మళ్ళీ మళ్ళీ పొరపాట్లను చేస్తున్నప్పుడే వారికి తెలియజేస్తాను. సాధారణంగా వ్యాసాలలో చేసిన మార్పులను చూసి ఎంతో నేర్చుకోవచ్చు. నేను ప్రారంభంలో రచిస్తున్న వ్యాసాలలో వైజాసత్య గారు తరుచుగా మార్పులు చేస్తుండేవారు. ఎలా మార్పులు చేశారు, ఎందుకు చేశారో గమనించి నేను వాటిని పాటించాను. అది నాకు మంచి ఫలితాన్నే ఇచ్చింది. అంతేకాని నేను వ్రాసినవాటికి ఎందుకు చేస్తున్నారు అని వ్యతిరేకంగా ఆలోచించలేను. కొందరు వ్రాసిన వ్యాసాలలో బహువచనం ఉందని వాటిని వికీకరిస్తే మళ్ళీ మళ్ళీ అలాగే చేయడం భావ్యమా! సాధారణంగా ఇతరులు చెప్పే పరిస్థితి రానీయకూడదు. నెలల అనుభవం ఉన్న సభ్యులకు కూడా పొరపాట్ల గురించి తెలియజేయడం నాకే చిన్నతనం అనిపిస్తోంది. కాని తప్పడం లేదు. ఈ విషయంలో నాకు ఇంకనూ చెప్పాలని ఉన్నా నాకు ప్రస్తుతం తీరిక లేనందున ముగిస్తున్నాను. ---- C.Chandra Kanth Rao-చర్చ 20:21, 9 ఏప్రిల్ 2009 (UTC)Reply
క్షమించండి. δευ దేవా 11:41, 11 ఏప్రిల్ 2009 (UTC)Reply
దేవా గారూ! మీరు క్షమాపణలు చెప్పడం దేనికి? పై వ్యాఖ్యలు మీకు ఉద్దేశించినవి కాదుకదా! -- C.Chandra Kanth Rao-చర్చ 18:27, 11 ఏప్రిల్ 2009 (UTC)Reply
ఏమో చెప్పాలనిపించింది. టైమ్ దొరకడం లేదు చంద్రకాంత్ గారూ, వికీలో బొమ్మలు ఎక్కించడానికి. δευ దేవా 11:58, 12 ఏప్రిల్ 2009 (UTC)Reply
దేవా గారూ! బొమ్మల కొరకు అంతగా చింతించే అవసరం లేదు. మీకు తీరిక ఉన్నప్పుడే చేర్చండి. వ్యక్తిగతంగా తీరిక లేకుండా ఉండటం వల్ల మనం అనుకున్న విధంగా చేయలేకపోతాం. నిదానంగా అయినా సరే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ గమ్యాన్ని సాధిస్తే చాలు. -- C.Chandra Kanth Rao-చర్చ 18:56, 12 ఏప్రిల్ 2009 (UTC)Reply

Crazy, Cute, Dumb, Indifferent, Winner, Sinner and Scientific!

మార్చు

ప్రపంచాన్ని సీరియస్‌గా తీసుకోకుండా, శాస్త్రాలన్నీ చంకన చుట్టి, గెలవటమే ధ్యేయంగా ముందుకు సాగే ముద్దైనా పిచ్చి "సిన్నాసి" ;-) హహ్హహ్హా వాతావరణాన్ని తేలికపరచడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలకు కృతజ్ఞతలు. --వైజాసత్య 20:58, 30 ఏప్రిల్ 2009 (UTC)Reply

థాంక్స్, కానీ ఇందులో కవిత్వం జలధరిస్తే బాగుంటుందేమో, ఇంకెవరైనా ఓ రాయి విసిరితే సంతోషిస్తా! ఈ మధ్య కవిత్వం రాయాలని పిచ్చి కోరిక పుడుతుందేంటో! ఇంకో విషయం ఏంటంటే మొన్నో రోజు ఓ శుభ ఘడియలోనో అశుభ ఘడియలోనో ఓ కవిత రాసా కానీ ఏం రాసానో మర్చిపోయా! δευ దేవా 22:59, 30 ఏప్రిల్ 2009 (UTC)Reply
Winner: విజేత
థాంక్స్ రవిచంద్ర గారూ! δευ దేవా 17:57, 5 మే 2009 (UTC)Reply
దేవాగారూ నమస్తే, వైజాసత్యగారు చెప్పినట్లు మీరు వాతావరణాన్ని ఆహ్లాద పరుస్తున్నారు. కృతజ్ఞతలు అందుకోండి. మీరిచ్చిన ఆంగ్లపదాలకు అర్థాలు ఇవ్వడానికి ప్రయత్నించాను;

Crazy = పిచ్చోడు (తన లోకంలో లీనమైన) , Cute = ముద్దైన (అందమైన), Dumb = మూగ (మౌన), Indifferent = వేరుగాలేని (సాధారణ), Winner = విజేత , Sinner = పాపి , Scientific = (స)శాస్త్రీయ.

అలాగే దీనిని ఓ సారి చూడండి;

" తన పిచ్చే తనకు ముద్దైన వేళ, తన నుండి వేరుగాని మౌనంతో పోరాటం సల్పుతూ, శాస్త్రాల ముసుగులో పాపాలు చేస్తూ, విజయాన్ని కోరుతూ ధరణిపై ధ్వజాన్ని ఎగురవేసేవాడా, ఎవరు నీవు? సాధారణ మానవుడివా? పండితుడివా? పామరుడివా? తన మేధోజ్వాలలతో ప్రపంచాన్ని దహింపజేసే జ్వాలాముఖివా? లేదా తన మేధోకాంతితో ధరిత్రిని వెలుగుతో నింపే దివిటీవా? "

(నాకు తెలుగులో కవిత్వం వ్రాయడం చేతగాదు, ఇది రాయి విసరడం లాంటిదే! దయచేసి భరించండి). :-). అహ్మద్ నిసార్ 19:35, 5 మే 2009 (UTC)Reply

బాగుంది నిసార్ గారూ! కానీ ఇది పొగడ్తో తిట్టో అర్థం కావడం లేదు. హహహ δευ దేవా 22:26, 5 మే 2009 (UTC)Reply
నిసార్ గారూ! చాలా పెడర్థం తీసారండి మీరు, అక్కడ చెప్పిన పదాల్లో ఏ పదానికీ ఇతర పదంతో సంబంధం లేదు. వదిలేయండి. నా పదాలు వెనక్కి తీసుకుంటున్నా! δευ దేవా 17:05, 6 మే 2009 (UTC)Reply
Return to the user page of "Dev/క్రితం చర్చ 7".