వాడుకరి చర్చ:Kumarrao/పాత చర్చ 1

తాజా వ్యాఖ్య: మరల స్వాగతం టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

చరిత్ర గురించి మార్చు

మీరు చరిత్ర గురించి గొప్ప వ్యాసాలు వ్రాసారు. మీరు కూడా ఒక బ్లాగ్ ప్రారంభించొచ్చు కదా. చరిత్ర గురించి మీరు వ్రాసే విషయాలు డైరీలా ఉంటాయి.

అమరావతి కథలు-నోబెల్ బహుమతి మార్చు

అమరావతి కథా సంగ్రహం అన్న పేరుతో ప్రత్యేక వ్యాసం ప్రతి కథ గురించి సంక్షిప్తంగా వ్రాయటం మొదలు పెట్టాను. చాలా వ్యాసాలు వ్రాసిన అనుభవం గల మీరు వీలుచేసుకొని కొన్ని కథల గురించి వ్రాయగలరు.

మీరు అమరావతి కథలు వ్యాస చర్చా పుటలో, ఈ కథలకు నోబెల్ బహుమతి ఇచ్చి ఉండాల్సింది అని అన్నమాట నన్ను ఎంతగానో అనందపరిచింది. ఇప్పటికైనా మించిపోయంది లేదు. మన తెలుగు సాహితివేత్తలందరూ కలసికట్టుగా (ఇది సాధ్యమేనా!!!)తమ తమ "ఇజాలను" "అహాలను" పక్కకుపెట్టి ప్రయత్నిస్తే నొబెల్ బహుమతి ఈ కథా సంపుటికి ప్రతిపాదింపచెయ్యటం పెద్ద కష్టం కాదనుకుంటాను. మీరు ఢిల్లీ నగరంలో ఉన్నారు కాబట్టి, ఈ విషయంలో స్వీడిష్/నార్వే దేశ రాయబార కార్యాలయాలను సంప్రదించి, నోబెల్ బహుమతికి 30 సంవత్సరాల క్రితం రచించబడిన కథలకు, ఆ రచయిత మరణించిన 21 సంవత్సరాలకు ఇవ్వటానికి అవకాశం ఉన్నదా? ఉంటే ఎలా, ఎవరు ప్రతిపాదించాలి అన్న వివరాలు తెలుసుకుంటే, సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఒక పద్ధతి ప్రకారం కొంత కృషి చేసి (మన వ్యక్తిగతంగా)సాహితీవేత్తలను ఈ దిశలో సత్యం శంకరమంచి గారికి, మరణానంతరం నొబేల్ బహుమతి కొరకు ప్రతిపాదనను పంపమని కోరటానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. త్వరలో మీ ఉద్దేశ్యం తెలుపగలరు.--SIVA 15:05, 16 నవంబర్ 2008 (UTC)

కుమార్ రావుగారూ!ధన్యవాదములు. హైదరాబాదులో స్నేహితులున్నప్పటికి, వారికి ఈ సాహిత్య విషయలమీద అంతగా అవగాహన మరియు అభిరుచి లేదు. ఈసారి నేను వెళ్ళినప్పుడు గాని లేదా ఉత్తరం ద్వారా గాని కొంత పని జరుగుతుందేమోనని నా ఆశ. మీరు కూడ ఈ దశగా కొంత ప్రయత్నించమని నా విన్నపం.--SIVA 16:56, 29 నవంబర్ 2008 (UTC)
అమరావతి కథాసంగ్రహంలో మీరు కూడ కొన్ని కథల గురించి వ్రాయగలరు.--SIVA 16:56, 29 నవంబర్ 2008 (UTC)
కృష్ణమూర్తి గారి ఈ మైలు చిరునామా నాకు కూడ తెలియ చెయ్యగలరు. నేనుకూడ ఈ మైలు ద్వారా వారికి ఈ విషయం మీద తెలియచెయ్యటాని ప్రయత్నిస్తాను.--SIVA 02:24, 2 డిసెంబర్ 2008 (UTC)
కృష్ణమూర్తి గారి ఈ-మెయిల్ ఐడి:bhk@hd1.vsnl.net.in కృష్ణమూర్తి గారి గురించి ఈవ్యాసములలో చూడగలరు: (http://www.engr.mun.ca/~adluri/telugu/language/linguistics/krishnamurti.html), (http://en.wikipedia.org/wiki/Bhadriraju_Krishnamurti).Kumarrao 07:01, 4 డిసెంబర్ 2008 (UTC)

రావుగారూ! మీ ఈ మైల్ ఐడి ఇవ్వగలరా.--SIVA 02:09, 23 డిసెంబర్ 2008 (UTC)

అభ్యర్ధన మార్చు

ప్రదీపు గారు,

నేను వ్రాసిన మాలిక్ మక్బూల్ ఛూడగలరు. మక్బూల్ సమాధి ని నేను కొన్ని ఫొటొలు తీసితిని. వాటిని వ్యాసములో కూర్చుటకు మీ సాయము కావలెను. సాధ్యమేనా? ఐనచో ఫొటోలు ఎలా పంపగలను?Kumarrao 11:05, 5 మార్చి 2008 (UTC)Reply

ఒక సారి క్రింద ఇచ్చిన లింకులలో ఉన్న సమాచారాన్ని చదివండి, మీ ప్రశ్నలకు సమాధానం దొరకవచ్చు.
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానం
__మాకినేని ప్రదీపు (+/-మా) 05:14, 6 మార్చి 2008 (UTC)Reply

తెలుగు వ్యాసములు మార్చు

టిప్పు సుల్తాన్ వ్యాసం గురించి మార్చు

మీరు వ్రాసినట్టు టిప్పు సుల్తాన్ హిందూ ద్వేషి కాదు. నిజానికి బ్రిటిష్ వాళ్ళే శ్రీరంగపట్నంలో అనేక మంది హిందువులని చంపి అనేక మంది హిందూ స్త్రీలని రేప్ చేశారు. ఎం.వి.ఆర్. శాస్త్రి గారు వ్రాసిన ఇదీ చరిత్ర పుస్తకం చదవండి.

చరిత్రని కాదనలేము. బ్రిటిష్ వారు కూడ అకృత్యాలు చేశారు. అదీ కాదనలేము.Kumarrao 09:57, 5 డిసెంబర్ 2009 (UTC)

ప్రదీపు గారు,

దినేశ్ కన్నంబాడి అను కన్నడిగుడు తెలుగు భాష పై నేను వ్రాసిన వాక్యములు, చేసిన దిద్దుబాటులను మార్చుచున్డెను. Please see: en:Telugu language, en:Telugu script, en:Bhattiprolu. ఆతని మొండి వాదనలు, ఆతనికి తోడ్పాటుగా మరి ముగ్గురు కన్నడిగులు తెలుగు వ్యాసములలో నన్ను ఒక సంవత్సరముగా మిగుల విసిగించుచుండిరి. వికి లో గల సౌలభ్యములతో నన్ను బహుళ చికాకుపరచి నేను చేసిన అన్ని మార్పులను తొలగంచుచున్నారు. ఈ విషయమున నేను మీ అందరి సహాయము కోరుతున్నాను.Kumarrao 06:14, 11 మార్చి 2008 (UTC)Reply

మీరు మూలంగా చూపిస్తున్న ఒక సైటులో ఉన్న ఈ పేజీలో తెలుగు లిపి, మరియు ప్రస్తుత కన్నడ లిపి, పాత కన్నడ లిపి నుండి పుట్టాయని ఉంది. తెలుగు లిపి పాత కన్నడ లిపి నుండి కాకుండా వేరే లిపి నుండి పుట్టిందని చెప్పటానికి మీ దగ్గర రుజులేమన్నా ఉన్నాయా? మీరు రాసిన వ్యాసాలను కొన్ని చూసాను, వాటిలో సమాచారం బాగానే ఉంది, వాటిలో మీకు వీలయితే మూలాలను inline citation (using <ref>) ద్వారా చేర్చండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:00, 11 మార్చి 2008 (UTC)Reply
కుమారరావు గారూ! ఆంగ్లవికీలో చర్చను చదివితే, వారందరూ మీ(వ్రాతల)పై ఉమ్మడి దాడి చేస్తున్నట్లుగా అనిపిస్తున్నది. మీరు చాలా పట్టుదలగా పోరాడుతున్నారు. ఈ విషయాలలో నేనే మాత్రం పండితుడిని కాను. అయినా వీలయినంత పరిశోధిస్తాను. రెండు విన్నపాలు: (1) కొంత కాలం అంగ్ల వికీనుండి విరామం తీసికొని తెలుగు, తెలుగు లిపి, భట్టిప్రోలు వ్యాసాలను తెలుగు వికిపీడియాలో అభివృద్ధి చేయమని కోరుతున్నాను. (2) మీరు వ్రాసే వ్యాసాలలో 'వచ్చెను', 'చేసిరి', 'ఉండెను' వంటి పదాలు వాడుతున్నారు. కాని ఇప్పటి వార్తా మాధ్యమాలలో లాగా 'వచ్చాడు', 'చేశాడు', 'ఉన్నాడు' వంటి వాడకాలు మెరుగు. (మాధ్యమాలు అంటే TV9 భాష మాత్రం కాదు - "దుమ్ము లేపారు", బాక్సు బద్దలు కొట్టారు", "అంట కత్తెర వేశారు" - ఇవీ వారు క్రికెట్ విజయాన్ని గురించి చెప్పిన వార్తలలో వాడిన మాటలు) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:25, 12 మార్చి 2008 (UTC)Reply
నాకు దినేశ్ కన్నంబాడి పరిచయమే..ప్రస్తుతం కాస్త బిజీగా ఉన్నాను..వీలు చిక్కగానే చూస్తాను --వైజాసత్య 01:26, 13 మార్చి 2008 (UTC)Reply

అభినందనలు మార్చు

కుమార రావుగారు! మీ వ్యాసాలు చూస్తున్నాను గాని సమయం లేక వ్యాఖ్యానించలేదు. కొనసాగించండి. హైదరాబాదు కమ్మసంఘం హాలులో ముసునూరి కాపయ నాయకుడి పెయింటింగ్ ఉందని ఎవరో చెప్పారు. ఫొటో తెప్పించడానికి ప్రయత్నిస్తాను. మీరింకా మాలిక్ మక్బూల్ సమాధి ఫొటోలు అప్‌లోడ్ చేయలేదు. అప్‌లోడ్ చేయడం కష్టం కాదు. ప్రయత్నించండి. ఒకవేళ కుదరకపోతే నాకు ఈ మెయిల్ ద్వారా పంపండి. మీరు ఢిల్లీలో ఉంటున్నారు గనుక వికీకి ఉపయోగకరమైన మరిన్ని ఫొటోలు సంపాదించడం సాధ్యం అనుకొంటాను. ముఖ్యంగా చరిత్ర, వ్యక్తులకు సంబంధించినవి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:00, 25 మార్చి 2008 (UTC)Reply

కల్లూరి చంద్రమౌళి మార్చు

కల్లూరి చంద్రమౌళి వ్యాసాన్ని బాగా విస్తరించారు. కృతజ్ఞతలు. నేను సమాచారం సేకరించటానికి ప్రయత్నించాను కానీ దొరకలేదు. ఎక్కడైనా వీలైతే ఒక ఫోటో కూడా సంపాదించి పెడితే బాగుంటుంది. ఇకపోతే, వికీపీడియాలో ఏకవచన ప్రయోగం చెయ్యాలన్న నియమం ఉన్నది. అది పాటించగలరు --వైజాసత్య 02:14, 24 ఏప్రిల్ 2008 (UTC)Reply

తెవికీ పాలసీలపై ఒక చర్చ మార్చు

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:04, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

భట్టిప్రోలు లిపి మార్చు

కాసుబాబు గారు, తెలుగు వ్యాసములో నున్న లిపి పరిణామము బొమ్మ ను నేను రాసిన en:Bhattiprolu Scriptలో పెట్టగలరా?Kumarrao 15:40, 20 మే 2008 (UTC)Reply

కొంచెం ఆగండి. వైజాసత్య నుండి కాపీ హక్కుల సమాచారం కనుక్కొని, తరువాత ఆంగ్ల వికీలో పెడతాను. ఇంతలు ముందు ఆంగ్ల వికీలో ఇలాంటి కొన్ని బొమ్మలను తొలగించారు కదా? ఈ సందర్భం వచ్చింది గనుక మళ్ళీ en:Talk:Telugu script లో చర్చను చూశాను. వాళ్ళది pure chauvinism. ఇందులో సందేహం లేదు. నేను బెంగళూరులో కొంతకాలం ఉన్నాను. కన్నడిగులలో ఈ తరహా ప్రవర్తన నేను ఇదివరకు గమనించలేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:30, 20 మే 2008 (UTC)Reply
కుమారరావు గారూ! తెలుగు లిపి వ్యాసాన్ని ఆంగ్ల వికీ నుండి కాపీ చేశాను. ఈ వ్యాసంపై ఆంగ్లం వికీలో మీరు పడ్డ శ్రమ నాకు తెలుసు. కనుక ఈ తెలుగు వ్యాసం కూడా మీరే "అనువాదం + స్వతంత్ర రచవ" చేయమని కోరుతున్నాను. మీరు బిజీగా ఉన్నారు గనుక సమయం దొరికినప్పుడే కానియ్యండి. మీరు వ్యాసం ప్రధానాంశాలను, విభాగాలను కాస్త అమర్చిన తరువాత అనువాదం స్టేజిలో నేను పాల్గొంటాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:49, 24 మే 2008 (UTC)Reply

"భట్టిప్రోలు"తో మీకు ప్రత్యేక అనుబంధమేమైనా ఉందా? దీని గురించిన వ్యాసాలపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారనిపించింది. ఆంధ్రుల చరిత్ర భట్టిప్రోలుతోనే ప్రారంభమైందని చెప్పవచ్చునని ఒక చరిత్ర కారుడన్నాడు. ఎక్కడో వెతికి చూస్తాను. ఈ మధ్య నేను ఆఫీసు, ఇల్లు పనుల కారణంగా పెద్ద వ్యాసాలు వ్రాయలేకపోతున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:46, 9 జూన్ 2008 (UTC)Reply

బాగా కనిపెట్టారు. మా ఊరు (తెనాలి పక్కన కూచిపూడి) భట్టిప్రోలుకి బహుసమీపము. తెనాలి-భట్టిప్రోలు బస్సు మాఊరిమీదుగా వెళుతుంది. నేను చిన్నపుడు భట్టిప్రోలు, అచటి తవ్వకములోనున్న స్తూపము చూశాను. మరలా వెళ్ళి చూద్దామని ఉంది. దక్షిణభారత చరిత్రకు ఆద్యమయిన ఒక గొప్ప ప్రాచీనసంపదకు వారసులలో ఒకడినని గర్విస్తాను. దానికి తోడు మాప్రాంతములో వారందరికి బౌద్ధమంటే చాల అభిమానము, ప్రేమ. ఎందుకోతెలియదు.Kumarrao 05:49, 10 జూన్ 2008 (UTC)Reply
అభినందనలు. ఈ సారి వెళ్ళినపుడు మంచి ఫొటోలు తీసుకురండి. పురాతన అవశేషాలు, ప్రస్తుతం వూరు కూడా. "బౌద్ధము-ఆంధ్రము" పుస్తకం లింకు ఇది. http://www.archive.org/details/bouddamuandhramu018708mbp మీరు తప్పక చూడాల్సిన పుస్తకం. ఇందులో భట్టిప్రోలు గురించి చక్కని వ్యాసం ఉంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:20, 10 జూన్ 2008 (UTC)Reply

తెలుగు మెడల్ మార్చు

  తెలుగు మెడల్
కుమార్ రావు గారూ! మీరు చేస్తున కృషి అమోఘం. చరిత్రకు సంబంధించిన విషయాలు చాలా అభివృద్ది చెందుతున్నాయి. మీ కృషిని ఇలాగే కొనసాగించండి. చారిత్రాత్మక విషయాలు తెలుగు వికీలో చేరుస్తున్నందుకు ఈ తెలుగు మెడల్ అందుకోండి. δευ దేవా 09:41, 10 జూలై 2008 (UTC)Reply

నిస్సందేహంగా. కుమార రావుగారు తెలుగు వికీలో చరిత్ర వ్యాసాలకు క్రొత్త హంగులు కూర్చారు. ముఖ్యంగా కుమారరావు గారి రచనలు నాలుగు లైన్లతో కాకుండా సమగ్ర వ్యాసాలుగా ఉంటున్నాయి. దేవాకు, కుమారరావుగారికి అభినందనలు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:20, 10 జూలై 2008 (UTC)Reply

సముచితమైన సత్కారము. ఎంతో కృషి చేసి చారిత్రక విషయాలపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నందుకు అభినందనలు --వైజాసత్య 12:45, 14 జూలై 2008 (UTC)Reply
వైజాసత్య గారికి ధన్యవాదాలు.Kumarrao 13:22, 15 జూలై 2008 (UTC)Reply

మూలాలు ఉదహరించడం, అమరావతి స్తూపం మార్చు

కుమారరావు గారూ, మూలాలు అన్నీ చివర్లో గుప్పించకుండా వీలైనవాటన్నింటినీ పాఠ్యంలోనే ఎక్కడికక్కడ తగిన మూలాలను అందజేస్తే తరువాత నిర్ధారించుకోవటానికి సులభంగా ఉంటుంది. ఆ మూలాలు ఉపయోగకరంగానూ ఉంటాయి. మీరు ఆంగ్లవికీలో పనిచేశారు కదా మూలాలను పాఠ్యంలోనే ఎలా ఉదహరించాలో తెలిసే ఉంటుందని భావిస్తున్నాను. కృతజ్ఞతలతో --వైజాసత్య 00:47, 18 జూలై 2008 (UTC)Reply


అమరావతి స్తూపం విస్తరణ నాకు చేతనయినంత వరకు పూర్తి చేశాను. ఒకమారు చూడగలరు. ముఖ్యంగా చివరి భాగం. అలాగే ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు కూడా చూడ గలరు. మీకు ఆసక్తిగా ఉంటుందని --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:48, 18 జూలై 2008 (UTC)Reply
కొత్త సమాచారముతో వ్యాసము చాల బాగుంది. మీ శ్రమకు ధన్యవాదాలు. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో విభాగాలు చాల పెద్దవిగా ఉన్నాయి. వాటిని సంక్షిప్తపరిస్తే బాగుంటుందేమో. మీరు అనుమతిస్తే ఆ పనికి పూనుకుంటాను.Kumarrao 06:35, 21 జూలై 2008 (UTC)Reply
రెండు మూడు రోజులు ఆగండి. ఆ వ్యాసాన్ని పునః పరిశీలించి మీతో చర్చిస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:48, 21 జూలై 2008 (UTC)Reply

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర వ్యాసం గురించి మార్చు

కుమార్ రావ్ గారూ ఎంత మాటన్నారు, నేనోదో ఎప్పుడో నాలుగు విత్తనాలు అలా చల్లాను అంతే దాన్ని అందరూ కలిసి మహా వృక్షం చేశారు కదా! అభినందనలు. ఇహ నా అనుమతి ఎందుకండీ, ఏదైనా చర్చా పేజిలో చర్చించుకొని కుమ్మెయ్యడమే! Chavakiran 16:08, 26 జూలై 2008 (UTC)Reply

గోరంట్ల వెంకన్న అనే మహానుభావుని పేరు నాకు ఇంతకు ముందు తెలియదు. మీరు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. మీరు బిజీగా ఉన్నారని కాకతీయులు వ్యాసం కొంత నేను వ్రాశాను. ఒకమారు మీరు చూడండి. ఏవైనా తప్పులుంటే సరి చేయండి. "ప్రతాపరుద్రుడు" సెక్షన్ మీరు విస్తరించాల్సిందే. ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర వ్యాసంలో అధిక భాగం ఇతర వ్యాసాలనుండి కాపీ చేసి సంక్షిప్త పరచిందే. కొంచెం పొడవైనా ఇది స్వతంత్రంగా ఒక పూర్తి వ్యాసంగా ఉంటే బాగుంటుందని ఇలా చేస్తున్నాను. వివరాలు చదివే ఓపిక లేనివారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందనుకొంటాను. భద్రిరాజు కృష్ణమూర్తి గారి పుస్తకం లింకు మళ్ళీ ఒకసారి ఇవ్వగలరా? గోరంట్ల వెంకన్న వంటి వ్యాసాలకు సమాచారం ఎక్కడినుండి తీసుకున్నారో తెలియజేస్తే ఇంకా బాగుంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:45, 2 ఆగష్టు 2008 (UTC)

గమనిక మార్చు

వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చర్చా పేజీలో వ్యాఖ్యలు రాసిన ఐపి ఆడ్రసు సమాచారం:

netname: BSNLNET descr: NIB (National Internet Backbone) descr: Bharat Sanchar Nigam Limited descr: Sanchar Bhawan,20, Ashoka Road, New Delhi-110001

మీరు ఢిల్లీ లో పని చేస్తున్నారు కదా. మీ ఆఫీసులోనే ఎవరో మిమ్మల్ని గమనిస్తూ మీరు చేసే రచనలకు వ్యాఖ్యలు రాస్తున్నట్టున్నారు. గమనించగలరు. రవిచంద్ర(చర్చ) 14:16, 29 ఆగష్టు 2008 (UTC)

తెలుగు పదాలు మార్చు

అవి తెలుగు పదాలే కావచ్చు. కానీ వాటిని జనసామాన్యంలో వాడుకలో మనం అసభ్యంగా పరిగణిస్తాం.అలా మాట్లాడిన వారిని మన సమాజం గౌరవం లేని వారిగా పరిగణిస్తుంది. దానికి చారిత్రాత్మక కారణాలు ఉండి ఉండవచ్చు. ఉదాహరణకు కంపు అనే తెలుగు పదాన్ని నేడు మనం దుర్వాసన అనే పదానికి పర్యాయపదం గా వాడుతున్నాం.కానీ దాని అసలు అర్థం వాసన (ఎటువంటి వాసన అయినా సరే)అని. అది ఎందుకు అలా జరిగిందనేది మనకు తెలియదు. అలాగే నేను మాత్రం ఆ పదాన్ని మంచి అర్థం తోనే వాడతాను అంటే మిగతా సభ్యులు అంగీకరించకపోవచ్చు. కాబట్టి అలాంటి పదాలు వ్యాసాలలో ఉండకుంటా ఉంటే మంచిదని నా అభిప్రాయం. రవిచంద్ర(చర్చ) 09:07, 31 ఆగష్టు 2008 (UTC)

ఆంగ్ల వికీ మార్చు

డియర్ ప్రదీపు గారు, ఆంగ్ల వికీ లో నేను వ్రాసిన వ్యాసములు, పాత చర్చలు చదువుతుంటే మీరు (Mlpkr) 'దినేశ్ కన్నంబాడి' వ్యాసాలకు తయారు చేసిన పటాలు, బొమ్మలు, మొదలగు విషయాలు చూశాను (Mlpkr మీరే అని ఇపుడు గ్రహించాను). ఇతను, ఈతని స్నేహితులు సర్వజ్ఞ, గ్నానపితి, అమర్ వగైరా తెలుగు చరిత్రకు, తెలుగుకు సంబంధించిన వ్యాసాలకు ఎనలేని ద్రోహం చేశారు. నన్ను, 'తేజం', 'ఆల్ట్రూయిజం' అను వారిని ముప్పుతిప్పలు పెట్టారు. నన్ను, తేజం ఒకరే అని బ్లాకు చేయించారు (తేజం నేను పనిచేసే సంస్థలో తోటి తెలుగు వాడు). దక్షిణ భారత చరిత్ర అంతా కన్నడిగుల చరిత్ర అని పెక్కు వ్యాసాలు వ్రాశారు. ఆధారాలతో నేను చేసిన ప్రతి మార్పునూ ఏదో ఒక సాకుతో నలుగురూ కలిసి తొలగించేవారు. వీరి వ్యాసాలన్నీ రెండే రెండు పుస్తకాలు, వెబ్ సైట్లు (అవీ కన్నడిగులవి) ఆధారముగా వ్రాయబడ్డాయి. ప్రఖ్యాత ఆంగ్ల చరిత్రకారులను చులకనగా చూస్తారు. వారికి నచ్చకపోతే. అడ్లూరి గారిని పలు అవాకులు చవాకులు పేలారు. వారి 'తెలుగు భాషా చరిత్ర', లిపి పట్టిక వికీలోనుండి తొలగించేదాక నిద్ర పోలేదు. వారి భాషలో అహంకారము, అసహనము, దుర్భాషలు, అసూయ మున్నగు అవలక్షణాలు తొంగిచూసేవి. నేను వారితో చేసిన చర్చలు, వాదములు చూడగలరు. ఈ సందర్భములో ఎంతో మంది తెలుగు వారిని సహాయము అర్ధించాను. ఎవ్వరూ పట్టించుకోలేదు. కొంతమంది వికీ వారు కూడ ఈ కూటానికి సహకరించేవారు. ముఖ్యముగా విజయనగర చరిత్ర, చాళుక్యులు, తెలుగు లిపి, ఆంధ్ర చరిత్ర వ్యాసాలలో వీరి పరభాషా దురభిమానము తెలుస్తుంది. ఇదంతా ఎందుకు వ్రాశానంటే మీరు అపాత్ర దానము చేశారని చెప్పడానికి. దయ చేసి అపార్ధము చేసుకోకండి. Kumarrao 11:01, 14 అక్టోబర్ 2008 (UTC)

నేను తెలుగు వికీలో అప్పుడెప్పుడో కొన్ని పటాలు తయారు చేసడం వలన, ఈ (Mlpkr), అనే సభ్యుడు కూడా పటాలు తయారు చేస్తుండడం వలనా, అతనూ నేనే ఇద్దరం తెలుగు వాళ్లమే అవటం వలననూ; మీరూ ఈ Mlpkr అనే సభ్యుడిని నేనే అని పొరపడినట్లున్నారు. నేను మొత్తం అన్ని వికీపీడియాలలోనూ Mpradeep అనే సభ్యనామంతోనే ఉంటాను. నాకు ఏ వికీపీడియాలోనూ Mpradeep అనే సభ్యనామం కాకుండా ఇంకో సభ్యనామం లేదు. ఇక ఆంగ్లవికీలో మీకు వచ్చిన సమస్యను అక్కడివారితోనే పరిశ్కరించుకోవాలి (నేను ఆంగ్లవికీలో పెద్దగా చేసింది ఏం లేదు.). అందుకు మీరు అక్కడి సమస్యలను పరిష్కరించే సమూహాన్ని సంప్రదించండి, ఏమయినా ఉపయోగం ఉంటుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 14:17, 15 అక్టోబర్ 2008 (UTC)

సంయమనం పాటించండి మార్చు

కుమారరావు గారూ, కాస్త ఇక్కడ వాతావరణం వేడెక్కినట్టుంది. మీరు ప్రతిస్పందించకుండా కాస్త సంయమనం పాటించగలరని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు --వైజాసత్య 06:19, 5 డిసెంబర్ 2008 (UTC)

నా మాటను గౌరవిస్తూ సంయమనం పాటించినందుకు కృతజ్ఞతలు. నేను నా చర్చా పేజీలోనూ, రచ్చబండలోనూ ఈ విషయంపై స్పందించాను. --వైజాసత్య 15:31, 5 డిసెంబర్ 2008 (UTC)
అలాగే మల్లి అనువదించడం మొదలు పెట్టినప్పుడు ఎప్పటికప్పుడు మూలాలను పేర్కొంటూ మీ అనువాదాన్ని కొనసాగించండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 13:19, 11 డిసెంబర్ 2008 (UTC)

విన్నపం మార్చు

కుమార్ రావు గారూ! తెవికీలో మీరు ఎన్నో విలువైన మరియు సమగ్రమైన వ్యాసాలు అందించారు. అయితే మీరు రాసే ఆ వ్యాసం కొన్ని సున్నితమైన విషయాలు కలిగి ఉన్నందున కొన్ని సమస్యలు ఎదురవడం సహజం. వాటిని మీరు కొంచెం ఓపికతో ఎదుర్కోమని అభ్యర్థిస్తున్నాను. —రవిచంద్ర 05:02, 10 జూలై 2009 (UTC)Reply

హిందువులపై ఆకృత్యాలు - ముగింపు విభాగం మార్చు

కుమారరావు గారూ, హిందువులపై ఆకృత్యాలు వ్యాసాన్ని చక్కగా మూలాలతో సహా అనువదించారు. కానీ చివర ముగింపు అని విభాగంలో మొత్తం విషయంపై మీ సొంత తీర్పునివ్వటం బాగోలేదు. అది వ్యాసం యొక్క నిష్పాక్షికత దెబ్బతీస్తుంది. అవన్నీ జరగలేదు అని ఎవ్వరూ అనట్లేదు. ఆ విషయంపై మంచి చెడ్డలు, తుదితీర్పులు పాఠకులకే వదిలేస్తే బాగుంటుంది. వికీపీడియన్లు కేసును ఇరువైపులనుండి నిష్పక్షపాతంగా ఇది జరిగింది అని అధారసహితంగా చూపేవాళ్ళమే కానీ తుదితీర్పునిచ్చే న్యాయనిర్ణేతలం కాము. --వైజాసత్య 23:12, 17 జూలై 2009 (UTC)Reply

బొమ్మలు మార్చు

ఆంగ్ల వికీ నుండి తీసుకొని ఉమేశ్ చంద్ర బొమ్మ పెట్టినందుకు ధన్యవాదాలు. అలాగే కాపానీడు, లీల నాయుడు, రాజశ్రీ పతి బొమ్మలు పెట్టగలరా? Kumarrao 12:15, 10 సెప్టెంబర్ 2009 (UTC)

కుమారరావుగారూ! మీతో చర్చించి చాలా కాలమయ్యింది. మరియు ఈ మధ్య ఆఫీసు పనులలో బిజీగా ఉన్నాను.

  • కాపానీడు బొమ్మ గురించి ఇదివరకు మీరు అడిగారు గాని నేను మరచిపోయాను. అప్పుడు కూడా వెనుకాడడానికి కారణం ఆ బొమ్మ గురించి కొన్ని సందేహాలున్నాయి. ఉదాహరణకు - అది కాపానీడు బొమ్మేనా? లేక నిర్మల్ శైలిలో చిత్రించిన ఒక వీరుని బొమ్మా? మీరు మరొకసారి కన్ఫర్మ్ చేసుకొంటే అప్పుడు కామన్స్‌లోకి అప్‌లోడ్ చేస్తాను.
  • లీలానాయుడు బొమ్మ ఆంగ్ల వికీలో కూడా లేదు.
  • రాజశ్రీపతి గురించిన ఆంగ్ల వికీ వ్యాసం దొరకలేదు. స్పెల్లింగ్ చెప్పగలరా?

--కాసుబాబు 22:27, 10 సెప్టెంబర్ 2009 (UTC)

రవి అరిమిల్లి - బొమ్మను అప్‌లోడ్ చేయడం కుదరదనుకొంటాను. ఎందుకంటే జీవించి ఉన్నవారి బొమ్మల గురించి నిబంధనలు మరింత దృఢంగా ఉన్నాయి. ప్రస్తుతానికి బొమ్మ లేకుండా వ్యాసం ఉండనీయడం మంచిదనుకొంటాను. --కాసుబాబు 16:00, 22 సెప్టెంబర్ 2009 (UTC)

వైజాసత్య గారు, ఒక అనామక సభ్యుడు వ్యాసములో నిరాధార, అసభ్య వ్రాతలు వ్రాయుచున్నాడు. రద్దు చేసిననూ తిరిగి అదే పని చేయుచున్నాడు. చూడగలరు.Kumarrao 15:48, 20 సెప్టెంబర్ 2009 (UTC)

కూమరరావు గారూ, అనామక సభ్యులు మార్పులు చేయకుండా ఆ పేజీని సంరక్షించాను. తిరిగి తెవికీలో కృషిచేస్తున్నందుకు కృతజ్ఞతలు --వైజాసత్య 16:51, 20 సెప్టెంబర్ 2009 (UTC)

మరల స్వాగతం మార్చు

కుమార్ రావు గారు, మీరు మరల తెవికీలో మార్పులు చేస్తున్నందులకు సంతోషం. మీలాంటి అనుభవజ్ఞులు సహకారం తెవికీ ఎంతో అవసరం. --అర్జున (చర్చ) 04:09, 4 మే 2012 (UTC)Reply

Return to the user page of "Kumarrao/పాత చర్చ 1".