వాడుకరి చర్చ:Pavan santhosh.s/పాత చర్చ 2

తాజా వ్యాఖ్య: డి.ఎల్.ఐ. లంకెల గురించి టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: స్వరలాసిక
     పాత చర్చ 2   
All Pages:  ... (up to 100)


పనస పొట్టు కూర

మీరు వండి తెవికీ సభ్యులకు పంచిన పనస పొట్టు కూర చాలా రుచిగా ఉన్నది. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 10:43, 28 మార్చి 2014 (UTC)Reply

ధన్యవాదాలండీ. :-)--పవన్ సంతోష్ (చర్చ) 12:49, 28 మార్చి 2014 (UTC)Reply

మీకు తెలుసా! వాక్యాలు

పవన్ సంతోష్ గారికి, మీరు విశేష రచనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు వీలుంటే వికీపీడియా:మీకు తెలుసా? భండారము లో ఆశక్తి కరమైనవి అనిపించే కొత్త వ్యాసాలను చేర్చండి.మీరు వ్రాస్తున్న పుస్తక పరిచయాల్లో విశేషమైనవాటిని ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేర్చితే బాగుంటుందని నా అభిప్రాయం.----  కె.వెంకటరమణ చర్చ 16:43, 21 ఏప్రిల్ 2014 (UTC)Reply

థాంక్యూ అండీ. కొన్ని చేసి చూశాను. ఇకపై రెగ్యులర్‌గా మీ సలహా ఫాలో అవుతాను.--పవన్ సంతోష్ (చర్చ) 05:49, 22 ఏప్రిల్ 2014 (UTC)Reply

ఏప్రిల్ 27, 2014 సమావేశం

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:59, 23 ఏప్రిల్ 2014 (UTC)Reply

ప్రత్యక్షంగా పాల్గొనే ప్రయత్నం చేసి సఫలీకృతుణ్ణి కాలేకపోయాను. స్కైప్ ద్వారా తప్పకుండా పాల్గొంటాను. కృతజ్ఞతలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:00, 25 ఏప్రిల్ 2014 (UTC)Reply

సూచనలకు ధన్యవాదములు

పవన్ గారూ తప్పకుండా వ్రాయండి. ఎంత చిన్న అవకాశాన్నైనా అంది పుచ్చుకోవడమే మనం చేయ వలసినది..... Bhaskaranaidu (చర్చ) 13:06, 3 మే 2014 (UTC)Reply

IEG interview

Hi Santhosh, I haven't gotten any response from you via email so I'm trying you on-wiki instead :) I'd like to setup a time to talk about your IEG proposal with you this week...we have just 2 more days for interviews. Can you please email me at sbouterse wikimedia.org as soon as you can? Thanks! Sbouterse (WMF) (చర్చ) 15:16, 21 మే 2014 (UTC)Reply

Hello Santhosh: We have not received a response from you via email. As part of the due-diligence process, we need determine if you are eligible to receive a grant. In order to do this, we need some information about you personally. It is important that we complete this step prior to announcing the final decisions for this round by the end of this week. Please contact us at grantsadmin wikimedia.org. Looking forward to hearing from you soon. Sincerely, -- Jtud (WMF) (చర్చ) 21:54, 28 మే 2014 (UTC)Reply
Sbouterse and Jtud mails are sorted under spam by my gmail. So this inconvenience occurred. I've already responded for these messages through mail and hangouts by seeing these on wiki messages and due to your on wiki messages I could respond well on time. Thanks --పవన్ సంతోష్ (చర్చ) 03:30, 30 మే 2014 (UTC)Reply

Proposed deletion of పరీక్షిత్తు (పుస్తకం)

 

The article పరీక్షిత్తు (పుస్తకం) has been proposed for deletion because of the following concern:

విషయం సంగ్రహం, మొలక

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. --  కె.వెంకటరమణ చర్చ 12:16, 28 జూలై 2014 (UTC) --  కె.వెంకటరమణ చర్చ 12:16, 28 జూలై 2014 (UTC)Reply

పరీక్షిత్తు (పుస్తకం) వ్యాసాన్ని విస్తరించగలరు.----  కె.వెంకటరమణ చర్చ 12:58, 28 జూలై 2014 (UTC)Reply

ఆహ్వానానికి ధన్యవాదాలు

పవన్ సంతోష్ గారికి నమస్కారాలు. మీ అభినందనలకు, " తె. స. అం. లోకి" అనే ప్రాజెక్ట్ లో భాగస్వామ్య ఆహ్వానానికి ధన్యవాదాలు. గతంలోనే రాజశేఖర్ గారు వికీసోర్స్ లో పని చేయమని సూచించినా, కొన్ని కార్యాంతరాల వలన ఆ పనిని చేయలేకపోయాను. ప్రస్తుతం తప్పకుండా భాగస్వామిని అవుతాను. నా జీవిత యాత్ర టంగుటూరి ఆత్మకథను, వీలును బట్టి దిద్దే పనిని మొదలుపెడతాను. Naidugari Jayanna (చర్చ) 12:54, 28 జూలై 2014 (UTC)Reply

కృతజ్ఞతలండీ. వీలువెంబడి ప్రాజెక్టు పేజీలో సభ్యుల జాబితాలో సంతకం చేసి, కిందనున్న పని విభజనలో మీ ప్రాధాన్యతను ఎంచుకోండి. --పవన్ సంతోష్ (చర్చ) 13:09, 28 జూలై 2014 (UTC)Reply

పవన్ గారూ

పవన్ గారూ, మీతో ఇమెయిల్ లో సంభాషించ దలచాను. మీ ఇమెయిల్ ఐ.డి. ఇవ్వండి, లేదా నా మెయిల్ ahmadnisarsayeedi@yahoo.co.in కు పంపేది. అహ్మద్ నిసార్ (చర్చ) 19:30, 3 ఆగష్టు 2014 (UTC)

నిసార్ గారూ, మీ మెయిల్ ఐడీకి నేను ఒక మెయిల్ పంపాను. చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 02:36, 4 ఆగష్టు 2014 (UTC)

వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ

నమస్కారం, సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 19:41, 3 ఆగష్టు 2014 (UTC)

నిసార్ గారూ మీరు ఈ పేజీ ప్రారంభించినప్పటి నుంచే నేను ఈ కృషిలో పాలుపంచుకుంటున్నాను. ఐతే ప్రస్తుతం గూడెంలో రెండు వికీ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ఉన్నందున నా కృషి వేగం తక్కువగా ఉంది. ఈ నెల 9 నుంచి నేను మరింత చురుకుగా పాల్గొంటాను.--పవన్ సంతోష్ (చర్చ) 05:41, 6 ఆగష్టు 2014 (UTC)

Trasnalate

Hello. I want you, if you have time, to translate the introductory paragraphs of en:Nea Salamis Famagusta FC and create the article in your wiki. Xaris333 (చర్చ) 07:25, 13 ఆగష్టు 2014 (UTC)

I can. But it is a food ball club and we Indians, that too telugu people, have very little interest over that game. Even though I'll translate it. I assume there might be some good reason because you take such a great pain. --పవన్ సంతోష్ (చర్చ) 11:22, 13 ఆగష్టు 2014 (UTC)
Hello and thanks for your offer to help. I want you to translate the introductions paragraphs from the article en:Nea Salamis Famagusta FC and create the article in your wiki. Xaris333 (చర్చ) 23:25, 8 ఆగష్టు 2015 (UTC)
Xaris333 thanks for your interest on tewikipedia. But I don't think these articles will be notable enough to be created in tewiki. No telugu news paper covers these clubs and their matches, and telugus also not so interested on soccer that too a cyprus based professional football club. So, let me discuss with our community and decide whether to translate or not. --పవన్ సంతోష్ (చర్చ) 04:09, 9 ఆగష్టు 2015 (UTC)

వర్గం:ఎం.వి.ఆర్.శాస్త్రి సాహిత్యం

వర్గం:ఎం.వి.ఆర్.శాస్త్రి సాహిత్యం, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you. --  కె.వెంకటరమణ చర్చ 12:40, 17 సెప్టెంబరు 2014 (UTC)Reply

వర్గం:సాహితీ సర్వస్వాలు

వర్గం:సాహితీ సర్వస్వాలు, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you. --  కె.వెంకటరమణ చర్చ 13:09, 17 సెప్టెంబరు 2014 (UTC)Reply

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా

పవన్ సంతోష్ గారికి - మీరు వికీలో క్రియాశీలకంగా పనిచేస్తూ, కొత్త ఆలోచనలో ముందుకు నడిపిస్తున్నందుకు శుభాభినందనలు.

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా తయారుచేయటం చాలా చక్కని ప్రయత్నం. ఇది తెలుగు సముదాయానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందులో సందేహం లేదు. కానీ ఈ చిట్టా వికీపీడియాలో వ్యాసంగా ఉండదగినది కాదు. వికీపీడియా:ఏది వికీపీడియా కాదులో చెప్పినట్టు డైరెక్టరీలకు, లైబ్రరీ కేటలాగులు వికీలో ఇమడవు. ఇది వికీసోర్సులో వికీసోర్సు నేంస్పేసులో ఉండాలనుకుంటాను. వికీపీడియాలోనే ఉంచాలనుకుంటే ప్రధాన పేరుబరిలో కాకుండా వికీపీడియా పేరుబరికి తరలించే విషయమై ఆలోచించండి. --వైజాసత్య (చర్చ) 03:20, 21 సెప్టెంబరు 2014 (UTC)Reply

వైజా సత్య గారికి, మీ పునరాగమనానికి శుభాకాంక్షలు. అభినందనలకు కృతజ్ఞుణ్ణి. డీఎల్‌ఐ ప్రాజెక్ట్ విషయమై జరుగుతున్న అభివృద్ధిని సమీక్షించి వికీసోర్సు నేమ్‌స్పేసులోకి గానీ, వికీపీడియా: పేరుబరిలో గానీ చేర్చమని సూచించారు. ఐతే ఇప్పటికే ఈ విషయమై కొంత చర్చ ఈ పేజీల నిర్వహణకు మార్గసూచిగా ఏర్పాటుచేసుకున్న ప్రాజెక్టు యొక్క చర్చ పేజీలో జరిగింది. నాతో సహా రాజశేఖర్ గారు, రెహమానుద్దీన్ గారు, వెంకటరమణ గారు అక్కడ కొంత చర్చించారు. ఇప్పటికే చూసి ఉంటే సరి. లేదంటే మరోసారి అక్కడ చర్చను చూసి మీ అభిప్రాయం/నిర్ణయం అక్కడ వెల్లడించేందుకు ప్రయత్నించగలరు. మీ వికీ సమయాన్ని ఇలా వినియోగిస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి. --పవన్ సంతోష్ (చర్చ) 06:05, 23 సెప్టెంబరు 2014 (UTC)Reply

సందేహం

పవన్ గారూ, మీ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతున్నది? మీరు ఇంకో ప్రాజెక్టుకు అప్లై చేయడానికి అర్హులేనా? లేదా ఇతర ప్రాజెక్టులలో భాగస్వామ్యం కావడానికి వికీమీడియా ఫౌండషన్ కు సమ్మతమౌతుందా? అలా అయినచో ఇతర ప్రాజెక్టులలో భాగస్వామ్యులు కావడానికి మీకు సమ్మతమేనా? తెలుపగలరు. అహ్మద్ నిసార్ (చర్చ) 15:12, 24 సెప్టెంబరు 2014 (UTC)Reply

నా ప్రాజెక్టు ఈ డిసెంబరుతో పూర్తవుతోంది. మరో ప్రాజెక్టులో భాగస్వామ్యం తీసుకోవడానికి నేను అర్హుణ్ణో కానో నాకైతే స్పష్టంగా తెలియదు. ఒక ప్రాజెక్టు చేసినవారికి మరో ప్రాజెక్టు ఇవ్వరాదని వారికి నియమం ఉందో లేదో నాకు తెలియదు మరి. --పవన్ సంతోష్ (చర్చ) 16:42, 24 సెప్టెంబరు 2014 (UTC)Reply
వాడుకరి:అహ్మద్ నిసార్ గారూ ఇటువంటి అన్ని సందేహాలూ తీర్చేందుకు గ్రాంట్లపై ఆసక్తి చూపుతున్న వ్యక్తులకు, అనుభవం కలవారు, గ్రాంట్లను రివ్యూచేసేవారితో చేయదగ్గ ఓ సమావేశం హేంగ్‌అవుట్స్‌లో జరగనుంది. సమావేశం సమయం, వివరాలు మీ మెయిల్ ఐడీకి ఫార్వర్డ్ చేశాను. ఒకసారి హాజరై అన్ని సందేహాలూ తీర్చుకునేందుకు ప్రయత్నిద్దాం.--పవన్ సంతోష్ (చర్చ) 04:47, 25 సెప్టెంబరు 2014 (UTC)Reply


మూస సహాయం

పవన్ సంతోష్ గారికి, మీరు మూస:వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి అనే మూసను అతికించటము చాలా చోట్ల అనేక సార్లు చూశాను. నాకు మాత్రం ఎందుకో అర్థం కాలేదు. మూస ఎక్కడెక్కడ వినియోగించాలో తెలియజేస్తే నేను కూడా మూసను అతికించేందుకు సహాయము చేస్తాను. JVRKPRASAD (చర్చ) 16:31, 27 నవంబర్ 2014 (UTC)

నేను వికీమీడియా ఫౌండేషన్ వారి సహకారంతో చేస్తున్న గ్రాంట్ ప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ద్వారా ఇప్పటికే జాబితాల ద్వారా పుస్తకాలను చేరుస్తూ అందుబాటులోకి తెస్తున్నాను కదా. ఆ పుస్తకాలు వికీపీడియా పేజీలకు మూలాలుగా వినియోగపడాలి. ఈ నేపథ్యంలో వాటిని ఉపయోగించి పలు పేజీలను అభివృద్ధి చేస్తున్నాం. అలా అభివృద్ధి చేసిన వికీపీడియా పేజీలను గుర్తించేందుకు (మిగిలిన వికీప్రాజెక్టులకు చేసినట్టే) ఆయా వికీపేజీల చర్చపేజీల్లో ఈ మూస చేరుస్తున్నాం.--పవన్ సంతోష్ (చర్చ) 16:37, 27 నవంబర్ 2014 (UTC)
మీరు చెప్పిన అర్థం ఆ మూస ద్వారా రావడము లేదండి. అది ఒక రకమయిన ప్రచారముగా ఉన్నట్లుంది. JVRKPRASAD (చర్చ) 14:15, 29 నవంబర్ 2014 (UTC)
ప్రచారం కాదనేందుకు కూడా ఏమీ లేదు. ఫలానా ప్రాజెక్టు సాగుతోంది, దానిలో భాగంగా ఈ పేజీని అభివృద్ధి చేస్తున్నాం. మీరు కూడా వీలుంటే ఇందులో పాల్గొనవచ్చు అన్నదే కదా మన భావం. మరో విషయమేంటంటే ఈ మూసకు మోడల్ ఇప్పటికే విజయవంతమైన తెలుగు ప్రముఖులు, పుణ్యక్షేత్రాలు వగైరాల నుంచే స్వీకరించాను తప్ప నా స్వంతం ఏమీ లేదని మనవి. అచ్చంగా దించాననవచ్చు. :) --పవన్ సంతోష్ (చర్చ) 14:20, 29 నవంబర్ 2014 (UTC)
నా సందేహానికి మీ స్పందనలకు, మీకు నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 14:33, 29 నవంబర్ 2014 (UTC)

డి.ఎల్.ఐ. లంకెల గురించి

http://www.dli.gov.in/ ఈ లింకు చాలా సందర్భాలలో పనిచేయటంలేదు. http://www.new1.dli.ernet.in/ ద్వారా దివాకర్ల వేంకటావధాని, నీలా జంగయ్య మొదలైన వ్యాసాలలో లింకులు ఇచ్చాను. మీరు కావాలంటే వాటిని మొదట పేర్కొన్న సైటుద్వారా మార్చి ఇచ్చుకోవచ్చు.--స్వరలాసిక (చర్చ) 02:59, 4 డిసెంబరు 2014 (UTC)Reply
Return to the user page of "Pavan santhosh.s/పాత చర్చ 2".