Sasidharpingali గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:45, 12 జూలై 2011 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలు

నా దగ్గర పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలున్నాయి. అవి వికీలో అప్‌లోడ్ చేయవచ్చునా?

సినిమా ప్రకటనలు Fair Use బొమ్మల క్రిందికి వస్తాయి. కనుక వాటిని ఆ సినిమాకు సంబందించిన వ్యాసంలోనే వాడవచ్చును. బొమ్మను scan చేసి, లేదా digital camera తో ఫొటో తీసి, వికీలోకి అప్‌లోడ్ చేయవచ్చును. అప్లోడ్ చేసేటప్పుడు అవసరమైన వివరాలు ఇవ్వండి. సరియైన మూసలతో వివరాలు చేర్చబడతాయి. ఉదాహరణలకు ఇప్పటికే ఎక్కించిన అటువంటి చిత్రాల పేజీలు చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

భారతదేశం ప్రధానంగా హిందూదేశం. హైందవ సంస్కృతీ సంప్రదాయలకు ప్రతీక గా ఇక్కడి ప్రజల జీవన శైలి ఉంటుంది. వేరే మతాలున్నప్పటికీ అధిక శాతం హిందువులు ఉన్నారుకాబట్టి హిందూ దేశంగా పిలవబడుతోంది. మతమేదైనా భగవంతుడున్నాడనేది నిర్వివాదాంశం. పేర్లు వేరుకావచ్చు కానీ, ఏ మతగ్రంధమైనా చెప్పే నీతి ఒకటే. మానవుణ్ణి ఒక ఉన్నతమార్గంలో నడిపించటానికి ఉపయోగపడేవీ ఇవి అన్నీ.

మనకు ఎన్నో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలూ వున్నాయి. ఇవన్ని మన వ్యక్తిత్వం మీద యెంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. అక్షరాస్యతతో సంబంధం లేకుండా చదవడం, వినడం తెలుసుకోవడం ద్వారా పండిత పామర బేధం లేకుండా అందరికి ఎంతో కొంత పురాణ ఙ్ఞానాన్ని అందించాయి. భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తినా, మానవునిగాపుట్టి, సత్యధర్మాలకు కట్టుబడి కష్టాలుపడి మానవజాతికి ఆదర్శంగా నిలిచిన దైవావతారం శ్రీ రామావతారం. రామాయణాన్ని ఆదికవి వాల్మీకి వ్రాసినా అ తదుపరి దాదాపుగా అన్ని భారతీయ భాషలలోనూ ఒకటికంటే ఎక్కువసంఖ్యలోనే అనువాదాలుగానూ, అనుసృజనగానూ ఎంతో మంది వ్రాశారు. అందునా తెలుగులో ఉన్నన్ని రామాయణ గాధలు మరే భాషలోనూ లేవంటే అతిశయొక్తి కాదేమో. రామాయణం కధ తెలియని మనిషి లేనట్లే, రామమందిరం లేని ఊరూ మన భరతదేశంలో లేదు.

ఇక జానపదులు సంస్కృతాంధ్రాలు చదవలేకపోయినా వారు పెద్దల ద్వారా విన్నవి తమదైన భాషలో, తమదైన శైలిలో పాటలుగా వ్రాసుకొని నిత్యం పనులు చేసుకుంటూనే పాడుకొని సేదతీరేవారు. ఒక్కొక్కసారి ఆ పాటలలోని ఆర్ద్రత కంటతడి పెట్టిస్తే, శృంగారం, హాస్యం, చమత్కారం పండితుల్ని సైతం ముక్కున వేలువేసుకునేలా చేస్తాయి. జానపదుల పాటలకు ముగ్ధులై కొందరు కవులు వారికోసం వారిభాషలో తమ కవిత్వాన్ని నడిపినవారూ వున్నారు. అందుకు అనువైన చందస్సు గా ద్విపద, మంజరీద్విపదలను ఎంచుకొని రామాయణాన్ని రచించినారు. ఉదా|| రంగనాధరామాయణం మొదలైనవి.

అలాగే రచయిత ఎవరో చెప్పలేను కానీ, ఈక్రింది మంజరీ ద్విపదలో వ్రాయబడ్డ రామాయణాన్ని చూడండి.

రామాయణం

దశరధుడనురాజు ధరయేలుచుండె వానికి ముగ్గురూ భార్యలూ కలరు కౌసల్య శ్రీరాము గన్నట్టి తల్లి కనియె సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులను భరతుండు ఆకైక గర్భమున బుట్టె

నలుగురూ కొడుకులూ నాల్గు రత్నములు ఆనలుగురును గూడ అతిబాల్యమందే అన్ని విద్యలు నేర్చిరి అతిశ్రద్ధతోడ రాజులందరిలోన రామచంద్రుండు విలువిద్యలో చాల పేరుగన్నాడు ఎట్టివారును బట్టి ఎత్తలేనట్టి శివుని విల్లెక్కిడి స్త్రీరత్నమైన సీతను పెండ్లాడి శ్రీరామమూర్తి కడు కీర్తిగన్నాడు కల్యాణ మూర్తి

తండ్రిమాటను నిలుపదలచి రాముండు ఘొల్లు ఘొల్లున ప్రజల్ గోలపెట్టంగ పయనమై అడవికీ బయలుదేరంగ అతని వెంటనెబోయిరి అతిభక్తి తోడ తమ్ముడు సౌమిత్రి, తరుణి సీతమ్మ కడుభయంకరమైన కాననంబులకు

అన్నకు వదినకు అనువైనయట్లు లక్ష్మణుడు పర్ణశాలను కట్టి యిచ్చె ఆ పర్ణశాలలో ఆ యాలుమగలు సుంతలోపములేక సుఖముగానుండ ఘనులైన రామలక్ష్మణులు లిరువురు ఇంటలేని సమయమ్ము నదునుగాజూచి రాక్షసరాజైన రావణాసురుడు ఆదిలక్ష్మిని సీతనపహరింపంగ సీతకై దుఃఖించి శ్రీరామమూర్తి సుగ్రీవుతో మైత్రి సొంపుగాచేసి తనసేన నాతండు సిద్ధపరుప వారితోడుత మేటి వారధిందాటి రావణుం గడదేర్చి రామభద్రుండు తమ్ముని తోడను, సతి సీత తోడ తనపట్టణంబునకు తా జేరుకొనియె

మారామచంద్రుండు మముగన్న తండ్రి మా లక్ష్మణస్వామి, మా తల్లి సీత మాకంటబడినారు మాభాగ్యమనుచు ఉప్పొంగిరప్పుడు అయోధ్యప్రజలు

మనరామ చరితంబు మనసార మీరు బాలబాలికలార పాటపాడండి.

Invite to WikiConference India 2011 మార్చు

 

Hi Sasidharpingali,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011