తెలంగాణా కొత్త జిల్లాల విషయంలో కృషికి ఆహ్వానంసవరించు

వినయ్ గారూ,
నమస్తే. మీరు వికీలో శలవు తీసుకున్నారన్న అంశం తెలిసినా, ఆంగ్ల వికీలో మీరు చేస్తున్న కృషి గమనించి మిమ్మల్ని ఇలా అడిగేందుకు సాహసిస్తున్నాను. ఆంగ్ల వికీలో ఇప్పటికే మీరు తెలంగాణాలో ఏర్పడిన కొత్త జిల్లాల విషయమై గ్రామ వ్యాసాల్లోనూ, ఆయా జిల్లాల వ్యాసాల్లోనూ తగిన కృషి చేస్తున్న విషయం గమనించాను. ప్రస్తుతానికి తెవికీలో ఆ దిశగా చంద్రకాంత రావు గారూ, కొంతవరకూ ప్రణయ్ రాజ్ గారి వంటి కొందరు చేస్తున్న విషయం గమనించాను. అయితే ఈ దిశగా చేయాల్సిన పని చాలానే వుందన్నది నిస్సందేహం. మరిన్ని చేతులు కలిసి మరింతగా పని సాగితే బావుంటుంది కదా. ఈ నేపథ్యంలో మీరు తెవికీలో కూడా తెలంగాణా కొత్త జిల్లాల వ్యాసాలు, తెలంగాణా గ్రామాల వ్యాసాల్లో సంబంధిత మార్పుల్లో నిర్మాణాత్మకమైన కృషి చేస్తారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:56, 12 అక్టోబరు 2016 (UTC)

@Pavan santhosh.s: ఆంగ్ల వికీలొ పని ఉండటం వల్ల తెవీకీ కి తాత్కాలికంగా మాత్రమే సెలవు తీసుకున్నాను. మీరు కోరినట్టే ఇవాళ్ళ ఆ వ్యాసాలపై పని చేస్తాను. మీ సహయం అవసరమైతే కోరతాను. ధన్యవాదాలు.--Vin09(talk) 11:19, 12 అక్టోబరు 2016 (UTC)