వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 3
- 2008 : ప్రపంచ సైకిల్ దినోత్సవం
- 1657 : రక్తప్రసరణ వ్యవస్థను కనుగొన్న బ్రిటిషు వైద్యుడు విలియం హార్వే మరణం(జ.1578). (చిత్రంలో)
- 1867 : బాల్య వివాహ నియంత్రణ చట్టం-1929ను ప్రవేశపెట్టిన భారతీయ విద్యావేత్త, న్యాయమూర్తి హర్ బిలాస్ సర్దా జననం (మ. 1955).
- 1924 : తమిళనాడు 3వ ముఖ్యమంత్రి కరుణానిధి జననం (మ. 2018).
- 1965 : భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు సురీందర్ ఖన్నా జననం.
- 1972 : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు టి. హరీశ్ రావు జననం.
- 1984 : అమృత్సర్ నందు స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ మొదలై జూన్ 10 వరకు కొనసాగింది.
- 1989 : ఇరానీ మతనాయకుడు, పండితుడు ఆయతొల్లాహ్ ఖొమైనీ మరణం (జ.1902).
- 2011 : వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త కరుటూరి సూర్యారావు మరణం (జ.1933).