వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/సవరణకొరకు చర్చించాల్సిన జిల్లా, మండల, గ్రామ వ్యాసాల వర్గాల జాబితా
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ వ్యాసాలకు చెందిన వర్గాలు అవసరంలేని పదాలతో నిడివి ఎక్కువ ఉండి, ఒకే రకం వర్గాలు కొన్ని ఒకే పద్ధతిలో కాకుండా, కొద్ది మార్పులతో వ్యాకరణ విరుద్ధంగా వివిధరకాలుగా ఉన్నాయి.అన్నీ ఒకే రకంగా ఉంటే బాగుంటుదనే అభిప్రాయంతో వాటిని సవరించటానికి చర్చకొరకు ప్రతిపాదించటమైంది.ఇవి కేవలం మాదిరి వర్గాల మాత్రమే.ఈ పద్ధతి అన్ని వర్గాలకు వర్తిస్తుంది. 7, 8 కాలమ్స్ లోని వర్గాల ప్రకారం మండల వ్యాసాల శీర్షికలుకూడా అధికారక పేర్లుకు లోబడి తరలింపు చేయవలసి ఉంది.
--B.K.Viswanadh (చర్చ) 03:28, 15 మే 2022 (UTC)
గమనిక:కొన్ని వర్గాలలో "లోని" అనే పదం కొన్ని వర్గాలలో కలిపి, కొన్ని వర్గాలలో విడిగా ఉంది.ఒకే సరియైన పద్ధతి వీటిలోనే కాదు అన్ని వర్గాలలో ఉంటే బాగుంటుంది.
అభిప్రాయాలు, స్పందనలు, సూచనలు, సలహాలు
మార్చు- "ఇవి కేవలం మాదిరి వర్గాల మాత్రమే.ఈ పద్ధతి అన్ని వర్గాలకు వర్తిస్తుంది." అని ప్రతిపాదనలో రాసారు. ఈ పద్ధతిని ఇలా జనరలైజు చెయ్యకూడదనేది నా అభిప్రాయం. కొన్ని సందర్భాల్లో వర్గం పేరులో "లోని" అనేది ఉండాల్సిన అవసరం ఉండొచ్చు. ఉదాహరణకు వర్గం:బంగ్లాదేశ్ లోని ప్రపంచ సంస్కృతి స్థలాలు. అంచేత ఈ లోని తీసెయ్యాలనేది ఇక్కడ సూచించిన వర్గాలకు/ఇలాంటి వర్గాలకు మాత్రమే వర్తింపజెయ్యాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:07, 14 మే 2022 (UTC)
- వర్గం:ఆత్మకూరు మండల (అనంతపురం) గ్రామాలు వంటి చోట్ల చాలా సందర్భాల్లో ఆ మండలం పేరు ఒక రకంగాను, వర్గం పేరు మరో రకంగానూ ఊంటోంది. ఉదాహరణకు ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా), వర్గం:ఆత్మకూరు (వనపర్తి జిల్లా) మండలంలోని గ్రామాలు ఇలాంటి సందర్భాల్లో వర్గం పేరు కూడా వర్గం:ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) గ్రామాలు అని ఉండాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:29, 14 మే 2022 (UTC)
- మూసల విషయంలో "సంబంధించిన" అనేది ఎందుకు ఉండాలంటే - "తెలంగాణ మూసలు" అని కాకుండా "తెలంగాణకు సంబంధించిన మూసలు" అని ఎందుకుండాలంటే - మూస అనేది ఒక వికీపీడియా విశేషం. వికీకే పరిమితమైన తార్కిక వర్గీకరణ. తెలంగాణ లోని భౌతిక, భౌగోళిక, రాజకీయ సామాజిక అంశమేమీ కాదు. వికీ గురించి అంతగా తెలియని వారికి, కొత్తవారికీ మూస అనేది సరిగ్గా తెలీక తెలంగాణ మూస ఏమిటబ్బా అని తికమకపడొచ్చు. "సంబంధించిన" అనేది ఆ తికమకను కొంత తగ్గిస్తుంది. __చదువరి (చర్చ • రచనలు) 06:29, 14 మే 2022 (UTC)
- మూస అనేది విపులంగా ఉంటేనే బాగుంటుంది. దీని వల్ల పాఠకులకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు కదా అని నా అభిప్రాయం --Muralikrishna m (చర్చ) 13:37, 14 మే 2022 (UTC)
- "తెలంగాణ మూసలు" "ఆంధ్రప్రదేశ్ మూసలు" "నిజామాబాదు జిల్లా మూసలు" అనే వర్గాలకు నేను సమర్థించినా పైన చదువరి గారు వివరించిన విషయాన్ని బట్టి ఆలోచిస్తే "తెలంగాణకు సంబంధించిన మూసలు" అనేది సరైనది అనిపిస్తుంది. మూసలు వికీపీడియా విశేషం కనుక "తెలంగాణకు సంబందించిన మూసలు" అని ఉంటే బాగుంటుందని నా అబిప్రాయం. అదే విధంగా "ఆంధ్రప్రదేశ్ కు సంభంధించిన ముసలు" "నిజామాబాదు జిల్లాకు సంబంధించిన మూసలు" అనే వాటికి సమర్థిస్తాను. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 00:19, 23 మే 2022 (UTC)
కాలపరిమితి
మార్చు2022 మే 12 వరకు
స్పందన కొరకు సమయం
మార్చుఇంకా స్పందించవలసినవారు రెండు రోజులలో 2022 మే 17 లోపు స్పందించగలరు.
ఫలితం
మార్చు- చర్చలో జిల్లా లోని మండలాలు, మండలం లోని గ్రామాలు లాంటి వర్గాల పేర్ల నుంచి లోని అనే పదాన్ని తొలగిస్తే సంక్షిప్తంగా బాగుంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు కాబట్టి ఆ పదాన్ని తొలగించాలని నిర్ణయించడమైనది. ఈ పద్ధతిని జనరలైజు చేయకుండా ఈ చర్చలో పేర్కొన్న వర్గాల పేరు మార్పుకే పరిమితం చేయాలి.
- మండల గ్రామాల వర్గం పేరులో జిల్లా పేరు బ్రాకెట్లో కనిపిస్తే (ఉదాహరణకు ప్రస్తుతం వర్గం:ఆత్మకూరు (అనంతపురం) మండలంలోని గ్రామాలు) జిల్లా పేరును ఆఖర్లో బ్రాకెట్లో చేర్చాలి అంటే ఇలా ఉండాలి. వర్గం:ఆత్మకూరు మండల గ్రామాలు (అనంతపురం). అలాగే రూరల్ అని బ్రాకెట్లో వస్తే (ఉదాహరణకు: వర్గం:ఆదిలాబాద్ (రూరల్) మండలంలోని గ్రామాలు) దాన్ని గ్రామీణ అని మార్చాలి (ఉదాహరణ: ఆదిలాబాద్ గ్రామీణ మండల గ్రామాలు)
- మూసల పేర్లలో సంబంధించిన అనే పదాన్ని తీసివేయడానికి నలుగురు సమర్ధించినా, ముగ్గురు సభ్యులు సరైన కారణాన్ని చూపి (వర్గం పేరువల్ల గందరగోళానికి గురి కావడం) వ్యతిరేకించినందున, అవి అలాగే కొనసాగాలని నిర్ణయిస్తున్నాను.
- రవిచంద్ర (చర్చ) 07:30, 31 మే 2022 (UTC)
- రవిచంద్ర గారూ నిర్ణయ ఫలితం ప్రకటించినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 08:29, 31 మే 2022 (UTC)