వికీపీడియా:తెవికీ పండగ-25/సన్నాహక సమావేశాలు

ప్రధాన పేజీచర్చకార్యక్రమ
ప్రణాళిక
కమిటీలుసన్నాహక
సమావేశాలు
స్కాలర్‌షిప్స్నివేదిక

తెవికీ పండగ-25 ప్రణాళిక, నిర్వహణల కోసం ఏర్పాటు చేసుకునే సమావేశాల ప్రకటనలు ఇక్కడ ఉంటాయి.

తొలి సమావేశం

మార్చు

జూలై 28 న జరిగిన తెవికీ బడి శిక్షణా కార్యక్రమంలో దీని ప్రస్తావన వచ్చింది. వెంటనే సమావేశాన్ని నిర్వహించాలని ఆ సమావేశంలో పాల్గొన్న అందరూ భావించారు. దానికి అనుగుణంగా కింది సమావేశాన్ని ఏర్పాటు చేయడమైనది. లక్ష వ్యాసాల తెవికీ ప్రయాణం 21 ఏళ్ళ కిందట ఒక్క మొదటిపేజీ తోనే మొదలైంది. అలాగే తెవికీ పండగ-25 కు ఏర్పాట్లు కూడా ఈ తొలి సమావేశం తోనే మొదలౌతాయి. తెవికీమీడియన్లందరూ దీనికి ఆహ్వానితులే.

చర్చాంశాలు
  • తెవికీ పండగ-25 ఉత్సవాలు ఎక్కడ జరపాలి
  • లక్ష వ్యాసాల ఉత్సవం ఎలా జరపాలి
  • నిధులు ఎలా సమకూర్చుకోవాలి
  • ఉత్సవాలను ప్లాను చెయ్యడం కోసం తొలి సమావేశం ఎప్పుడు జరగాలి
ఎప్పుడు
2024 జూలై 31 బుధవారం, సాయంత్రం 7 గంటలకు
ఎక్కడ
గూగుల్ మీట్‌లో
లింకు
https://meet.google.com/dks-axdu-yrp
ఎవరెవరు
వికీమీడియన్లందరూ

సమావేశానికి వచ్చేవారు

మార్చు

సమావేశానికి వచ్చేవారు ఇక్కడ సంతకం చెయ్యవలసినది.

  1. చదువరి (చర్చరచనలు)
  2. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు)
  3. Kasyap (చర్చ)
  4. బత్తిని వినయ్ కుమార్ గౌడ్
  5. నేతి సాయి కిరణ్ (చర్చ) 14:38, 28 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  6. --V.J.Suseela (చర్చ) 14:44, 28 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  7. Saiphani02 (చర్చ) 11:14, 31 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  8. యర్రా రామారావు (చర్చ) 11:34, 31 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  9.  ప్రభాకర్ గౌడ్చర్చ 16:09, 6 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  10. --A.Murali (చర్చ) 06:55, 11 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

సమావేశ నివేదిక

మార్చు

అనుకున్న సమయానికి సమావేశం జరిగింది. అనుకున్న చర్చాంశాలపై సభ్యులు తమతమ అభిప్రాయాలు చెప్పారు. ఆ అభిప్రాయాలు ఇలా ఉన్నాయి:

అంశం: పుట్టినరోజు ఉత్సవాలు ఎక్కడ జరపాలి; లక్ష వ్యాసాల ఉత్సవం ఎలా జరపాలి

మార్చు
  • రాజశేఖర్: రెండూ ఒకసారి, తెలుగు రాష్ట్రాల్లో చేయాలి.
  • గుంటుపల్లి రామేశం: వేరువేరుగా చేయాలి, తెలుగు రాష్ట్రాల్లోనే చెయ్యాలి. పుట్టినరోజు అనంతగిరి లోనూ, లక్షవ్యాసాల పండగ అమరావతి లోనూ చెయ్యాలి.
  • రామారావు: వేరువేరుగా చేయాలి. లక్షవ్యాసాల పండగ అమరావతిలో చెయ్యాలి. పుట్టినరోజు ఎక్కడైనా ఓకే.
  • సుశీల: తెలుగు రాష్ట్రాల్లో చేయాలి. విడిగా అయినా కలిపి అయినా ఓకే.
  • మురళీమోహన్: వేరువేరుగా చేయాలి. లక్షవ్యాసాల పండగ డిసెంబరులో, పుట్టినరోజు జనవరిలో చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో చేయాలి.
  • ఫణి: వేరువేరుగా గాని, కలిపి గాని చేసినా ఓకే. తెలుగు రాష్ట్రాల్లో చేయాలి.
  • ప్రణయ్: వేరువేరుగా చేయాలి. లక్షవ్యాసాల పండగ అమరావతి... పుట్టినరోజు కొత్త ప్రాంతం కావాలి. నిర్వహణ పరమైన ఇబ్బందులు వస్తే రెండూ ఒకసారి చేయాలి.
  • కశ్యప్: అమరావతిలో రెండూ ఒకసారి చేద్దాం. ముందురోజు లక్షవ్యాసాల పండగ, మిగతా రెండురోజులు పుట్టినరోజు పండగ.
  • చదువరి: విడివిడిగా చేస్తే చేయోచ్చు. కానీ, నాలుగు నెలల్లో 3 పెద్ద కార్యక్రమాలు చేయాలి. దీనికి శ్రమ, కృషి చేయాలి. గ్రాంట్లు విడివిడిగా అడగాలి. అంచేత రెండూ ఒకసారి, కలిపి చేస్తే బాగుంటుంది. రెండూ కలిపి చేస్తే అమరావతిలో, వేరువేరుగా అయితే లక్షవ్యాసాల పండగ అమరావతిలో, పుట్టినరోజు హైదరాబాదులో చెయ్యాలి.
  • ప్రభాకర్ గౌడ్: గతంలో ఒక ప్రతిపాదన వచ్చినట్లు, పుట్టినరోజును బెంగళూరులో చేస్తే బానే ఉంటుంది.

మొత్తమ్మీద: సరిపడినన్ని నిధులు, కార్యకర్తలు అందుబాటులో ఉంటే విడివిడిగా చెయ్యాలి, లేదంటే కలిపి చెయ్యాలి అనే అభిప్రాయానికి వచ్చారు.

నిధులు, ప్లానింగు, తోడ్పాటు

మార్చు

నిధులు ఎలా తేవాలి, కార్యక్రమాల ప్రణాళిక ఎప్పుడు మొదలు పెట్టాలి, మీరు చురుగ్గా ఏర్పాట్లలో పాల్గొంటారా అనే మూడు ప్రశ్నలకు వచ్చిన అభిప్రాయాలు:

  • ప్రభాకర్ గౌడ్: ఏర్పాట్లలో పాల్గొంటాను. ఇతర అంశాలపై అందరూ ఎలా అంటే అలాగే చేద్దాం
  • కశ్యప్: ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొంటాను. నాయకత్వం వహించను. వెంటనే పనులు మొదలు పెట్టాలి. నిధుల కోసం ఫౌండేషను నుండి గ్రాంటు పొందాలి. సుమారు 75 లక్షల వరకు గ్రాంటు ఇచ్చే అవకాశం ఉంది. మనం 30-35 లక్షల వరకు అడగవచ్చు. నేను ఈసరికే కొన్ని గ్రాంటులు తీసుకుని ఉన్నందున ఈ గ్రాంటు అడగలేను, కానీ గ్రాంటు రాయడంలో సహాయం చేస్తాను.
  • రామారావు: ఏర్పాట్లలో పాల్గొంటాను. గ్రాంట్ కు అప్లై చేయాలి. వెంటనే పనులు మొదలు పెట్టాలి. ఈ విషయమై ప్రతి బుధవారం ఆన్లైన్ సమావేశం జరపాలి.
  • ప్రణయ్: ఏర్పాట్లలో పాల్గొంటాను. గ్రాంట్ కు అప్లై చేయాలి. వెంటనే పనులు మొదలు పెట్టాలి. ప్రతి బుధవారం ఆన్లైన్ సమావేశం జరపాలి.
  • సాయిఫణి: ఏర్పాట్లలో పాల్గొంటాను. గ్రాంట్ కు అప్లై చేయాలి. వెంటనే పనులు మొదలు పెట్టాలి.
  • మురళీమోహన్: ఆరోగ్యం సహకరిస్తే చురుగ్గా పాల్గొంటాను, లేదంటే పాల్గొనలేను. గ్రాంట్ కు అప్లై చేయాలి. వెంటనే పనులు మొదలు పెట్టాలి.
  • సుశీల: పాల్గొంటాను. వెంటనే పనులు మొదలు పెట్టాలి.
  • రాజశేఖర్: పాల్గొంటాను. వెంటనే పనులు మొదలు పెట్టాలి.
  • చదువరి: వెంటనే పనులు మొదలు పెట్టాలి. గ్రాంటుకోసం ఎంతరాయాలి, ఎలా రాయాలి అనేది చూడాలి. రేపే ప్రారంభించాలి, ముగ్గురు కావాలి. కశ్యప్ గారు ఉంటారు. కార్యక్రమాల రూపకల్పన కోసం మీటింగ్ కూడా చేయాలి. ఆన్లైన్ లో చురుగ్గా పాల్గొంటాను. ఆఫ్లైన్ లో సాధ్యం కాకపోవచ్చు.

రాజశేఖర్ గారు, ఒక్క వికీపీడియా మాత్రమే కాక, ఇతర తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో జరిగిన కృషిని కూడా ఉత్సవాలలో హైలైటు చెయ్యాలి అన్నారు. ఇతరులు దాన్ని సమర్థించారు. వికీసోర్సు 20 వేల పేజీల స్థాయికి చేరిన అంశాన్ని, విక్షనరీలో లక్ష పైచిలుకు ఎంట్రీలు ఎప్పుడో చేరాయి, వగైరాలను కూడా ఉత్సవాల్లో చేర్చాలి.

తదుపరి చర్యలు

మార్చు

పై అభిప్రాయాలను అనుసరించి కింది విషయాలపై నిర్ణయం తీసుకోవాలి. వాడుకరులందరూ తమతమ అభిప్రాయాలను కింద, "అభిప్రాయాలు, సూచనలు" విభాగంలో రాయవలసినది:

  1. లక్ష వ్యాసాల ఉత్సవం, పుట్టినరోజు ఉత్సవం కలిపి 2025 జనవరిలో చెయ్యడం; ఈ ఉత్సవాన్ని అమరావతిలో చెయ్యడం
  2. ఫౌండేషను వారి నుండి గ్రాంటు తీసుకునే విషయం
  3. పనులు మొదలు పెట్టడం
    1. గ్రాంటు రాసేందుకు ఉపక్రమించడం: ఇద్దరు/ముగ్గురు సభ్యులు కలిసి ఈ పనిని చేపడితే బాగుంటుంది. ఇది వెంటనే జరగాలి. ఈ సభ్యులు ఎవరెవరు ఉండాలో సూచించండి.
    2. కార్యక్రమ ప్రణాళిక కోసం మరొక సమావేశం ఏర్పాట్లు చేసుకోవడం. ఈ చర్చలో సభ్యుల అభిప్రాయాల తరువాత ఈ సమావేశం పెట్టుకుందాం. ఈ సమావేశం 11 వతేదీ మధ్యాహ్నం 1 గంటకు జరపాలని తాత్కాలిక ప్రతిపాదన

అభిప్రాయాలు, సూచనలు

మార్చు

"తదుపరి చర్యల" విషయమై మీమీ అభిప్రాయాలు కింద రాయవలసినది

  1. నాకు హఠాత్తుగా మొన్నటి నుంచి బాగా అనారోగ్యం చేసింది. నిన్న చేరడం వీలుకాలేదు. అయితే, నా అభిప్రాయం ఇక్కడ చెప్తాను. లక్ష వ్యాసాల పండుగ విడిగా చేయడం మంచి ఆలోచనే. కాకపోతే, అలా చేయాలంటే మనం అక్టోబరులో ఒక కార్యక్రమం (లక్ష వ్యాసాల పండుగ), డిసెంబరులో ఒక కార్యక్రమం (హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో మన స్టాల్), జనవరి/ఫిబ్రవరిలో మరో కార్యక్రమం (తెవికీ పండగ) చేయాల్సి వస్తుంది. ఇందుకు కావాల్సినవి రెండు:
    1. ఆర్థిక వనరులు: మూడు కార్యక్రమాల్లో మనకు ఒకదాని నిర్వహణకు వికీమీడియా ఫౌండేషన్ నుంచి గ్రాంట్ లభించింది. (పుస్తక ప్రదర్శనలో స్టాల్) మిగిలిన రెంటిలో తెవికీ పండగ గనుక జనవరి తర్వాత చేసేట్టయితే రాబోయే సెప్టెంబరు 2 లోపుల మనం దానికి తగ్గ కాన్ఫరెన్స్ గ్రాంటుకు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు, మనం మూడో కార్యక్రమమైన లక్ష వ్యాసాల పండుగ గురించి చూద్దాం. ఇది సెప్టెంబరులోనో, అక్టోబరులోనో చేయాలనుకుంటే మనం దీనికి వికీమీడియా ఫౌండేషన్ నుంచి ఆర్థిక వనరులు సంపాదించుకోవడం దాదాపు అసాధ్యం.
    2. మానవ వనరులు: గత తెవికీ పండగ నిర్వహణలో కీలక బాధ్యత వహించి ఆ సాధకబాధకాలు అనుభవించినవాడిగా, కార్యక్రమంలో పాల్గొనడానికి, ఎలా చేయాలో చెప్పడానికి ఉన్నంత ఉత్సాహంతో మనలో చాలామంది కార్యనిర్వహణలో బాధ్యతలు తీసుకోవడంలో ఉండడం లేదు. కనీసం, కార్యక్రమం ముగిశాకా దాని గురించి నిర్మాణాత్మకమైన పరిశీలన చేయడానికి కూడా అంతగా ఆసక్తి కనబరచలేదు. కాబట్టి, మరీ ఎక్కువమంది నిర్వహణలో భాగం పంచుకోకపోయే అవకాశం ఉందన్నది అర్థం చేసుకుని మనం నిర్వహించుకోవాలి.
ఈ నేపథ్యంలో నేను సూచించేది ఏమిటంటే, మనం ఈ కార్యక్రమాన్ని తెవికీ పండగలో మొదటి రోజు కార్యక్రమంగా చేద్దాం. రెండు ప్రాంతాల్లోనూ చేయదలుచుకుంటే గనుక ఆ కాన్ఫరెన్సు గ్రాంటులోనే పెట్టి ఒక కార్యక్రమం రెండో రాష్ట్రంలోనూ చేసుకుందాం. ఇదీ నా సలహా. ఏది చేయాలన్నా, సెప్టెంబరు 2 లోపు దరఖాస్తు చేయాలి, సాధ్యమైనంత త్వరగా (రేపటెల్లుండలో) మనం మన ఆసక్తి వికీమీడియా గ్రాంట్స్ అధికారికి చెప్పెయ్యాలి. --పవన్ సంతోష్ (చర్చ) 14:03, 1 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Pavan santhosh.s గారూ ముందు రెండు కార్యక్రమాలకు సుమారుగా గ్రాంటు ఎంతయిందో ఒక అంచనాకు వచ్చి సెప్టెంబరు 2లోగా గ్రాంటుకు అఫ్లై చేయటానికి నేను అంగీకరిస్తున్నాను.కార్యక్రమాలు రెండుగా చేయాలనా లేదా రెండు కలిపి చేయాలనా అనే దానిపై సముదాయ సభ్యులు నిర్ణయానికి లోబడి చేద్దాం అని నా అభిప్రాయం.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 02:12, 3 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

WMF కాన్ఫరెన్స్ గ్రాంటు

మార్చు

తెవికీ పండగ 2025 గ్రాంటు కోసం మనం సమర్పించవలసిన వివరాలు చాలా ముఖ్యమైనవి. ఒకే గ్రాంటులో లక్ష మైలురాయి మహావేడుక , తరువాత మన తెవికీ 21వ వార్షికోత్సవం-తెవికీ పండగ 2025 కు కావలసిన సహాయం కోరవచ్చు , నా అభిప్రాయం ప్రకారం ఈ రెండు కార్యక్రమాలకు కలిపి కనీసం 30 లక్షల వరకూ ఖర్చు అవుతుంది, వేరే భాషల వికీపీడియా వారికి ఆహ్వానించాలి అంటే మంచి హోటల్ , ఫ్లయిట్ రవాణాకు 50 లక్షలు కూడా సరిపోదు. దయచేసి మీకు తెలిసిన సమాచారాన్ని ఈ లింక్ ద్వారా తదుపరి సమావేశం నాటికి చేర్చగలరు. నేను గత సమావేశంలో చెప్పినట్లు, నేను ఏ కార్యవర్గం లేదా కోర్ టీం లలో భాగంగా ఉండలేను. అయితే, అవసరమైన ఏదైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఇందులో ఆసక్తి వున్న సభ్యులు ఇందులో అవసరం సమాచారం తదుపరి సమావేశం కల్లా చేర్చగలరు,ఎడిట్ లింకు ఇవ్వగలను వివరాలు : https://docs.google.com/document/d/1kKCgfqq56_XWchd_RIausEuHmxoqRzr9vsGkLb-SQCw/edit?usp=sharing

బడ్జెట్  : https://docs.google.com/spreadsheets/d/1kvIjbyhtU8vTlTOECCNP3uvbNB8P3mF4Zp7S_cIgItA/edit?usp=sharing

మీ అందరి సహకారానికి ముందుగా ధన్యవాదాలు : Kasyap (చర్చ) 08:58, 2 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఉత్సవాల ఏర్పాట్లలో బాధ్యతలు పంచుకునేవారు

మార్చు

గతంలో విశాఖలో జరిపిన ఉత్సవాల ప్రణాళిక, ఏర్పాట్ల కోసం కొన్ని కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. ఆయా బాధ్యతలను పంచుకోటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాళ్ళే ఆయా కమిటీల్లో చేరారు. అయితే చివరికి పనులు చేసే సమయం వచ్చేసరికి, కొందరే ఆ పనుల్లో చురుగ్గా పాల్గొని, తమతమ బాధ్యతలను నిర్వర్తించి ఉత్సవాలను జరిపారు.

ఈసారి, కమిటీలకు నేతృత్వం వహిస్తూ, లేదా కనీసం కమిటీల్లో భాగంగా ఉంటూ బాధ్యతలను తలకెత్తుకునేవారు ఎవరో ముందే తెలుసుకుంటే బాగుంటుందనిపిస్తోంది. ఆ తర్వాత ఈ ఉత్సవాల ప్లానింగు, వగైరాలపై ముందుకు పోవచ్చు. అంచేత, కమిటీల్లో భాగంగా ఉంటూ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నవారు (బయటి నుండి సహాయం చెయ్యడం కాకుండా) కింద తమ సంతకం చెయ్యవలసినదిగా విజ్ఞప్తి.

  1. యర్రా రామారావు (చర్చ) 02:14, 3 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:48, 3 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  3. V.J.Suseela (చర్చ) 06:09, 3 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  4.  ప్రభాకర్ గౌడ్చర్చ 16:14, 6 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  5. Saiphani02 (చర్చ) 09:03, 8 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  6. Rajasekhar1961 (చర్చ) 04:52, 10 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  7. --A.Murali (చర్చ) 06:53, 11 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

రెండవ సమావేశం

మార్చు

2024 ఆగస్టు 15న జరిగిన రెండవ సమావేశంలో చదువరి, అంగజాల రాజశేఖర్, సుశీల, కశ్యప్, పవన్ సంతోష్, యర్రా రామారావు, మురళీకృష్ణ అంగజాల, ప్రభాకర్ గౌడ్, సాయిఫణి, ఐ. మహేష్, ప్రణయ్ రాజ్ పాల్గొన్నారు.

తెవికీ పండగ నిర్వహణకు సముదాయ సభ్యుల నుండి స్పందన తక్కువగా వచ్చింది. దాంతో, గతంలో చర్చించుకున్నట్లుగా లక్ష వ్యాసాల ఉత్సవం, పుట్టినరోజు వేడుకలు (తెవికీ పండగ-2025) రెండు వేరువేరుగాకాకుండా అవిరెండూ కలిపి ఒకేసారి జరుపుకోవాలని హాజరైన సభ్యులు నిర్ణయించారు.

అలాగే, లక్ష వ్యాసాల ఉత్సవానికి ప్రభుత్వం తరపున మంత్రులనుగానీ, ప్రజాప్రతినిధులనుగానీ జోడించవద్దని, వికీ ఎడిటర్ కేంద్రంగానే కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని కూడా నిర్ణయించారు.

కెపాసిటీ బిల్డింగ్ మీద మనం కార్యక్రమాలను రూపొందించుకోవాలని నిర్ణయించారు. వికీలో ఎవరికివారుగా పనిచేయడం కాకుండా అందరూ కలిసి లక్ష్యానికి తగ్గట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, వచ్చే సంవత్సరం ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామో వాటిని ముందుగానే నిర్ణయించుకొని, వాటిగురించి వికీ పండగలో చర్చించుకుంటే బాగుంటుందని సభ్యులు అభిప్రాయపడ్డారు.

తెవికీ పండగ-2025 అనేది తెలుగు రాష్ట్రాల్లోనే నిర్వహించుకోవాలని, హైదరాబాదు కాకుండా, మరీ నగర వాతావరణంలో కాకుండా రిసార్టు వంటి దానిలో జరపాలని, స్థలం నిర్ణయమయ్యేలోగా గ్రాంటు రాయడం కోసం "తిరుపతి" అనుకోవాలని నిర్ణయించారు.

కమిటీలు

  1. కార్యక్రమ కమిటీ: సాయిఫణి (టీం లీడ్), చదువరి, పవన్ సంతోష్, రాజశేఖర్, సుశీల, ఐ. మహేష్
  2. పుస్తక కమిటీ: చదువరి, పవన్ సంతోష్, సుశీల, యర్రా రామారావు
  3. కమ్యూనికేషన్ & స్కాలర్ షిప్ కమిటీ: రవిచంద్ర (టీం లీడ్), ప్రణయ్ రాజ్
  4. ఎగ్జిక్యూషన్ & లాజిస్టిక్స్ కమిటీ: కశ్యప్, ప్రణయ్ రాజ్, సాయిఫణి, ప్రభాకర్ గౌడ్, మురళీకృష్ణ అంగజాల
  5. గ్రాంటు కమిటీ: యర్రా రామారావు గారు గ్రాంటు కోసం అప్లికేషను పెడతారు. కశ్యప్, మహేష్, పవన్ సంతోష్, చదువరిలు అందుకు సాయపడతారు.

--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:33, 15 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నాల్గవ సమావేశం

మార్చు

2024 ఆగస్టు 25న జరిగిన నాల్గవ సమావేశంలో చదువరి, అంగజాల రాజశేఖర్, సుశీల, కశ్యప్, పవన్ సంతోష్, యర్రా రామారావు, మురళీకృష్ణ అంగజాల, ప్రభాకర్ గౌడ్, సాయిఫణి, ఐ. మహేష్, బివి ప్రసాద్, ప్రణయ్ రాజ్ పాల్గొన్నారు.

  • కమ్యూనిటి సర్వే ఫారంను ఈరోజే ప్రచురించి, అందరూ వారికి తెలిసిన సభ్యులకు, సమూహాలకు పంపించాలని, తొందరగా సర్వేను ముగించి, గ్రాంటు దరఖాస్తు 30వ తేది నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారు.
  • తెవికీ పండగ నిర్వహణ స్థలం, తేదీలు, బడ్జెట్ గురించిన చర్చ జరిగింది.

--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:23, 25 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]