వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/పాత చర్చ 3

విషయ ప్రాముఖ్యత మార్చు

విషయ ప్రాముఖ్యత నిర్ణయించడానికి కొన్ని ఆలోచనలు

 • తెలుగు భాష, సంస్కృతి, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ వంటి విషయాల పరిధిలోకి రాని విషయాలకు విషయ ప్రాముఖ్యత నిర్ధారించడంలో మరింత నిశిత పరిశీలన, మరింత కట్టుదిట్టమైన నిర్ణయాలు వర్తిస్తాయి.
 • ఇది వరకే ఉన్న వ్యాసాలకు కనీసం కొంతైన సంబంధం ఉండటం ఒక వ్యాసం విషయ ప్రాముఖ్యతా పరీక్షలో విజయవంతమవ్వటానికి దోహదపడవచ్చు.
 • ప్రధాన స్రవంతిలో లేని విషయాలకు కూడా మరింత పటిష్టంగా నియత్రించబడతాయి.
 • అతివాద, తీవ్రవాద, వ్యాపార ప్రకటనా వెబ్‌సైట్లను వెంటనే తొలగించాలి.
 • ప్రాపగాండా వ్యాసాలపై కఠినంగా వ్యవహరించాలి (ఏది ప్రాపగాండా వ్యాసమని నిర్ణయిస్తాము ? - ఆ వ్యాసంలో ఏక ధృక్కోణముండి, అవతలి అభిప్రాయాలకు తావియ్యకుండా, కేవలం ఒక విషయంపై ఒక వర్గపు అభిప్రాయాలాను నిజాలుగా చెలామణి చేసే ప్రయత్నం జరిగినప్పుడు వాటిని ప్రాపగాండా వ్యాసాలుగా నిర్ణయించాలి)
నేను కొన్ని ఆలోచనలు ముందుకు తెచ్చాను. ఇవి పరిపూర్ణము కావు. వీటిని ఇతర సభ్యుల అభిప్రాయాలు, మార్పులు చేర్పులతో మరింత స్పష్టత, వివరణ తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు --వైజాసత్య 09:02, 27 డిసెంబర్ 2008 (UTC)
వైజాసత్య గారు ప్రతిపాదించిన అంశాలు బాగున్నాయి. నా మద్దతు ప్రకటిస్తున్నాను. దాంతో బాటు ఆంగ్లవికీ నుండి అనామక సభ్యుడు తీసుకువచ్చే అనవసర, చెత్త వ్యాసాలు కూడా వెంటనే తొలిగించాలి. అంతగా ప్రాముఖ్యతలేని ఏ పాలస్తీనా గురించో, ఏ అరబ్బు గురించో వ్యాసం మనకు అనవసరం. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:01, 27 డిసెంబర్ 2008 (UTC)
సత్యాగారూ! మీరు ప్రతిపాదించిన విషయాలు చక్కగా ఉన్నాయి. ముఖ్యుంగా ప్రాపగాండ వ్యాసాల విషయంలో కఠినంగా వ్యవహరించ వలసిన అవసరం ఎంతయినా ఉన్నది. మీ ఆలోచనలకు నా మద్దతు.--SIVA 19:40, 28 డిసెంబర్ 2008 (UTC)
అతి వాద, తీవ్ర వాద వ్యాసాలకు నేను పూర్తిగా వ్యతిరేకం. ఇటీవలి కాలంలో అలాంటి వ్యాసాలు చాలా వచ్చాయి. వీటిని మెజారిటీ (మెజారిటీ మాత్రమే) తెవికీ సభ్యులు వ్యతిరేకించిన పిదప తొలగించడం సమంజసం. సదరు వివాదాస్పద వ్యాసాలు తెవికీలో ఉండాలన్న ఆ సభ్యుని వాదనలో పస లేదు. ఎవరు అవునన్నా కాదన్నా కొన్ని వ్యాసాలు ముస్లింల మనోభావాలను దెబ్బ తీసేవే. వీటిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. రవిచంద్ర(చర్చ) 04:53, 29 డిసెంబర్ 2008 (UTC)
 • వీకీలో ప్రస్థుతం వస్తున్న కొన్ని వ్యాసాలు లేవనెత్తే చర్చలు వీకీ అభివృద్ధిని ఆటంక పరచే పోకడలు కనిపిస్తున్నాయి.వాస్తవాలే అయ్నా అతివాద ధోరుణులు వీకీలో చోటు చేసుకోవడం మంచిది కాదు.ఉద్రేకాన్ని రేకెత్తించేవి ఉద్రిక్తలను పెంచేవి నిజాలైన వీకీలో చోటు చేసుకోకపోవడం క్షేమం.ఆ విషయంలో నిర్వాహకులు నిష్పక్షపాతంగా వ్యవహరించవచ్చు.వ్యాసాలు ఎవరి మనసుని నొప్పించని విధంగా ఉండటం మంచిది.సభ్యులు వివాదాస్పదమైన వ్యాసాలకు దూరంగా ఉండాలని

మనివి.--t.sujatha 16:40, 30 డిసెంబర్ 2008 (UTC)

వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం తయారు చేసే ప్రయత్నమని నమ్ముతున్నాను. ఇటువంటి ప్రయత్నంలో అనేక విషయాలను గురించి వ్రాయవలసి వస్తుంది. ఇది వ్రాస్తే వీరి మనోభావలు దెబ్బతింటాయి, మరొకటి వ్రాస్తే మరొకరు నొచ్చుకుంటారు అని మనం కండిషన్‌ అయిపోతే ఎలాగ? మరప్పుడు, ఒక్క సైన్సు గురించి వ్రాసి ఊరుకోవాలి. సాంఘిక విషయాల జోలికి పోకూడదు. నిజాలైన వికీలో చోటు చేసుకోకపోవటం క్షేమం అన్న వాదనతో ఏకీభవించలేక పోతున్నాను. నిజం వ్రాస్తే కోందరు బాధపడితే, అన్ని నిజాలు వ్రాయకుండా, కొన్ని నిజాలను మరుగుపరచి, మసి పూసి మారేడు కాయ చేసే (ప్రాపగాండా)వ్యాసాల సంగతి ఏమిటి, వాటిని చూసి బాధపడే వాళ్ళు కూడ ఉంటారు, వారు తీవ్రంగా స్పందించక పోవచ్చు. ఇతరులు వ్రాసిన విషయాలను నిజానిజ నిర్ధారణ మాత్రమే గీటురాయిగా చర్చలు ఉండాలి గాని, మనకున్న సొంత అభిప్రాయాలు, ప్రాపగాండా కోసరం వికీని వాడుకోవటం సమంజసం కాదు. వికీలో నిజాలు మాత్రమే వ్రాయాలి. ఒక విషయం నిజమని నిర్ధారణ అయినప్పుడు, ఆ నిజాన్నిఒప్పుకోగల శక్తి మనకు ఉండాలి.--S I V A 23:54, 1 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

విషయ ప్రాముఖ్యత నిర్ధారణ మార్చు

 • ఒక వ్యాసం యొక్క విషయ ప్రాముఖ్యతపై సందేహాలు లేవనెత్తినప్పుడు, అది తొలగింపునకు గురైతున్నప్పుడు దాని యొక్క విషయప్రాముఖ్యతను నిరూపించే బాధ్యత ఆ వ్యాసాన్ని ప్రారంభించిన లేదా అభివృద్ధి పరుస్తున్న సభ్యునిపైనే ఉన్నది.
 • విషయ ప్రాముఖ్యతను నిరూపించడానికి వ్యక్తులకు చెందిన వ్యాసాలకు, మిగిలిన వ్యాసాలకంటే భిన్నమైన మరింత కఠినమైన నియమాలు వర్తిస్తాయి
 • వ్యాసంలోని వ్యక్తి గురించి అనేక స్వతంత్ర ప్రధానస్రవంతి అచ్చు పత్రికలలో పుస్తకాలలో ప్రస్తావించబడి ఉండాలి.
 • విషయప్రాముఖ్యత నిరూపణకు బ్లాగులు, ప్రాపగాండా వెబ్‌సైట్లు, నిర్వాహకులు ఆమోదించిన కొన్ని తటస్థ వెబ్‌సైట్లను మినహాయించి వెబ్‌సైట్లు చెల్లవు.
 • ప్రస్తుత తెలుగు వికీపీడియా పరిధిలో ఉన్నదా లేదా అన్న విషయం కూడా విషయ ప్రాముఖ్యతను నిర్ధారిస్తుంది (ఉదాహరణకు "క్ష" అనే వ్యక్తి ఎస్టోనియా ఫుట్‌బాల్ జట్టులో ఒకప్పటి క్రీడాకారుడనుకోండి. ఆయనకు పేరు ఉన్నదని నిరూపించగలిగినా ఎస్టోనియాకే ప్రస్తుతం తెలుగు వికీలో వ్యాసంలేని పరిస్థితిలో ఆ వ్యక్తి వ్యాసానికి తెలుగు వికీపీడియా పరిధికి సుదూరంగా ఉన్నందున విషయ ప్రాముఖ్యత లేని విషయంగా నిర్ధారించబడును) - పరిధి ఎప్పటికప్పుడు విస్తరిస్తూ ఉంటుందని గ్రహించాలి.
 • అన్ని నియమాలకు పట్టువిడుపులున్నటే వీటీకీనూ, వాటి గురించి సముదాయం నిర్ణయం తీసుకోగలదు
వ్యాసాన్ని ప్రారంభించే ముందు దానికి కావలసిన సమాచారం కొంతవరకైనా సిద్ధం చేసుకుని ప్రారంభిస్తే మొలకలను తగ్గించవచ్చు.ఇక మీదట సభ్యులు ఈ విషయంపై దృష్టి సారించి పనిచేస్తే బాగుంటుందనుకుంటా.--t.sujatha 08:34, 28 డిసెంబర్ 2008 (UTC)
సుజాత గారు సరిగా చెప్పారు. కేవలం కొద్ది వాక్యాలతో ఒక పేజీ సృష్టించి దానికి 'విస్తరణ ' 'మొలక ' లాంటి ట్యాగ్ తగిలించడం కంటే, ముందే అసలు ఆ విషయం 'వ్యాసానికి ' తగినదా లేక వ్యాసంలో ఉండదగిన 'వాక్యాలకు ' తగినదా బేరీజు వేసుకుంటే బాగుంటుంది. --Svrangarao 19:06, 28 డిసెంబర్ 2008 (UTC)
సుజాత గారు చెప్పిన సూచన పాటిస్తే కొత్తగా మొలకలు ఏర్పడవు. ఇప్పుడు అధిక సంఖ్యలో ఉన్న చిన్న వ్యాసాలు మొలకలు కూడా కావు, అవి కలుపు మొక్కలు లాంటివి. అవి అసలు మొక్కలను హాని కలిగిస్తాయి. కాబట్టి వెంటనే తొలిగించాలి. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:25, 28 డిసెంబర్ 2008 (UTC)


నేను కూడ ఏకీభవిస్తున్నాను. ఏక పద వ్యాసాలు, ఏక వ్యాక్య వ్యాసాలు, ఉట్టి రచనల జాబితాలున్న వ్యాసాలు (ఆ రచనలు ఎంత ప్రాచుర్యం పొందాయో తెలియదు) తెలుగు వికిపేడియాకు శొభనివ్వవు. వ్యాసాలను వ్యాశేటప్పుడు, విషయ ప్రాముఖ్యత తప్పనిసరిగా పరిశీలించాలి. మంచి చర్చ మొదలు పెట్టారు, ఈ చర్చాఫలితం, వికీ వ్యాసాల నాణ్యత మరియు పరిణితి పెరగటానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాను.--SIVA 19:45, 28 డిసెంబర్ 2008 (UTC)

విషయ ప్రాముఖ్యత, వివాదాస్పదం మార్చు

"విషయ ప్రాముఖ్యత", "వివాదాస్పదమైన వ్యాసాలు" - ఇవి రెండూ వేరు వేరు సంగతులు. పై చర్చలో రవిచంద్ర వ్యాఖ్యలు ఈ రెంటినీ కలిపి చూస్తున్నట్లు అనిపిస్తున్నాయి. వాటిని వేరుగా చర్చించమని కోరుతున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:13, 29 డిసెంబర్ 2008 (UTC)

భాషా శైలి మార్చు

వ్యాసాల్లో రాసే భాష ఎలా ఉండాలనే విషయమై ఓసారి వెనక్కి తిరిగి చూసుకోడం అవసరమేమోనని అనిపిస్తోంది. శైలి వ్యాసంలో ఇలా నిర్దేశించి ఉంది.. "మాట్లాడే శైలి కాకుండా రాసే శైలిని అవలంభించండి."

వ్యాసాల్లోని భాషాశైలి వివిధ రకాలుగా ఉంటోంది. "వెళ్ళుచుండెను" "వెళ్ళుచున్నాడు" "వెళ్తున్నాడు" ఇటువంటి ప్రయోగాలు కనిపిస్తున్నాయి. మొదటి రెండు ప్రయోగాలు ఇప్పటి రచనల్లోగానీ, మాట్టాడ్డంలోగానీ లేవని మనకు తెలుసు. ఇక్కడి వ్యాసాల్లో కూడా అలాంటి ప్రయోగాలు ఉండకూడదు. అందుచేత పైన ఉదహరించిన శైలి వ్యాసంలో కింది వాక్యాలు చేర్చుదామని అనుకుంటున్నాను.

"వ్యావహారిక భాషలో రాయండి. సరళ గ్రాంథికంలో రాయవద్దు. ఉదాహరణకు.. "వెళ్ళుచుండెను" "వెళ్ళుచున్నాడు" "వెళ్తున్నాడు" వంటి క్రియాప్రయోగాలు భాషలో ఉన్నాయి. మొదటి రెండు ప్రయోగాలు గతకాలపు రచనల్లో కనిపిస్తాయిగానీ, ఇప్పటి రచనల్లోగానీ, మాట్టాడ్డంలోగానీ లేవని మనకు తెలుసు. అందుచేత వికీపీడియా వ్యాసాల్లో అలాంటి ప్రయోగాలు ఉండకూడదని గమనించండి."

అలాగే, ము, అనుస్వారా (సున్నా)ల వాడుకలో కూడా ఒక విధానాన్ని రూపొందించుకోవాలి. ప్రపంచములో, విధానములు, అంధకారము, అనికాక ప్రపంచంలో, విధానాలు, అంధకారం అని రాస్తూంటాం. అదే పద్ధతిని ఇక్కడి వ్యాసాల్లోనూ వాడాలని నా సూచన.

ఈ విషయమై సభ్యులు అభిప్రాయాలు చెప్పగలరు. __చదువరి (చర్చరచనలు) 10:48, 18 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు వ్రాసినవన్నీ సబబుగానే ఉన్నాయి. శైలిలో వ్రాసేయండి. (రెండవ వాక్యంలో "ప్రపంచములో" అని మళ్ళీ వ్రాసారు. దానిని "ప్రపంచంలో"గా మార్చాను.) --కాసుబాబు 17:26, 31 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
"ప్రపంచంలో" - నెనరులు. శైలి వ్యాసంలో వీటిని చేర్చాను. __చదువరి (చర్చరచనలు)

తేదీలను రాసే విధానం మార్చు

తేదీలను వివిధ రకాలుగా రాస్తున్నాం. ఎలా రాయాలో నిర్ధారించుకోవాలి. ఉదాహరణకు, 2009 జనవరి 26 అని రాయాలా? లేక, ఇంగ్లీషులో రాసినట్టు, 26 జనవరి 2009 అని రాయాలా? ఏదో ఒక పధతినే అనుసరించాల్సిన అవసరం ఉంది. రెండు ఉదాహరణలను గమనిస్తే..

2006, డిసెంబరు 1 నాటికి వికీపీడియాలో 24035 వ్యాసాలున్నాయి.
1 డిసెంబరు, 2006 నాటికి వికీపీడియాలో 24035 వ్యాసాలున్నాయి.

రెండో పద్ధతి ఇంగ్లీషుకు అనువుగా ఉంటుందిగానీ, తెలుగుకు అనువుగా ఉండదనిపిస్తోంది. సభ్యులు అభిప్రాయాలు రాయండి. పత్రికల్లో ఏ పద్ధతిని అనుసరిస్తారనేది కూడా చూడాలి. __చదువరి (చర్చరచనలు) 10:12, 31 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

పత్రికలలో వ్రాయటానికి ఏ పద్ధతిని అనుసరిస్తున్నారో కానీ, ఏదైనా చెప్పేటప్పుడు మాత్రం మొదటి పద్ధతే సులువుగానూ ఉంటుంది. నేను గమనించినంతవరకు మొదటి పద్ధతి వాడుకే ఎక్కువని నా అభిప్రాయం. ఒకవేల పత్రికలలో ప్రమాణికంగా రెండో పద్ధతే ఉపయోగిస్తుంటే, అలాగే చేద్దాం --వైజాసత్య 11:44, 31 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు అంకెలు మార్చు

తెలుగు అంకెలు ఈ వికీపీడియా లో ఎందుకు ఉండకుడదు? దయచేసి మీరు మార్చిన క్రమ సంక్య ను ఆంగ్ల అంకెల స్థానములో తెలుగు అంకెలు మాత్రమే చేర్చాలి. అభినందనలతో--Ranjithsutari 10:21, 19 ఆగష్టు 2010 (UTC)

తెలుగు వికీపీడియాలో ఆంగ్ల అంకెలు ఎందుకని మంచి సందేహం వెలిబుచ్చారు. తెవికీలో ఆంగ్ల అంకెలే కాకుండా ఆంగ్ల పదాలు కూడా చాలా ఉన్నాయి. తెవికీ ముఖ్యలక్ష్యం లేదా ఉద్దేశ్యం తెలుగుభాషలో వ్యాసాలు రచించి తెలుగు ప్రజలకు వాటిని అందుబాటులో ఉంచడం మాత్రమే. దీనికై వాడుకలో ఉన్న తెలుగు పదాలను, అంకెలను మాత్రమే తెవికీ ఉపయోగిస్తుంది. మీరు చెప్పినట్లు ఆంగ్ల అంకెలను కాకుండా తెలుగు అంకెలను మాత్రమే ఉపయోగిస్తే వాటిని ఎంతమంది తెలుగు వ్యక్తులు అర్థంచేసుకుంటారన్నది సందేహాస్పదమే. తెలుగు ప్రజానీకం అందరికీ అందుబాటులో ఉండడమే కాకుండా అందరూ అర్థంచేసుకోవడానికి, సద్వినియోగం చేసుకోవడానికి తయారవుతున్న తెలుగు విజ్ఞానసర్వస్వములో సాధ్యమైనంతవరకు అందరికీ అర్థమయ్యే భాషను మరియు శైలిని ఉపయోగిస్తూ, వాడుకలో ఉన్న పదాలను, అంకెలను మాత్రమే వాడవలసి ఉంటుంది. అంతేకాకుండా తెలుగు పుస్తకాలు, తెలుగు ప్రసార మాధ్యమాలు (టెలివిజన్, వార్తాపత్రికలలో) తదితర చోట్ల తెలుగు అంకెలను కాకుండా ఆంగ్ల అంకెలను మాత్రమే వాడుచున్నారనే విషయం మీకు తెలుసు. కాబట్టి తెవికీ కూడా వాటి ప్రకారమే ముందుకుపోవల్సి ఉంటుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే తెవికీ తెలుగు సమాజంలో మార్పులు తేవడానికి కాకుండా వాడుకలో ఉన్న శైలినే ఉపయోగిస్తూ తెలుగు సమాజానికి అందుబాటులో ఉండడం. ఇదివరకు ఆర్టీసి వారు బస్సులపై అంకెలు కూడా తెలుగులో ఉండాలని హటాత్తుగా నిర్ణయించి, అమలుపరిచి విమర్శలకు గురయ్యారు. బస్సు అంటే గుర్తుకొచ్చింది, ఇది కూడా ఆంగ్లపదమే. ఇలాంటివి తెలుగులో చాలా ఉన్నాయి, వాడుకలో మనం ఆ పదాలనే ఉపయోగిస్తున్నాము కాబట్టి తెవికీలో అలానే రాస్తున్నాం. రైలుకు, బల్బుకు అచ్చ తెలుగు పదం రాస్తే వాటిని ఎందరు అర్థం చేసుకుంటారన్నది మీకు చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఉన్న పద్దతిలో మార్పు వచ్చి, క్రమక్రమంగా తెలుగు ప్రజలు కూడా తెలుగు అంకెలు ఉపయోగిస్తున్నప్పుడు తెవికీ కూడా తప్పకుండా తెలుగు అంకెలను వాడుతుంది. ఆ మార్పు వస్తుందని కోరుకుందాం. కాని ఆ మార్పు మొదట తెలుగు సమాజంలో రావాలి, అంతేకాని తెవికీలో కాదు. మరో విషయం మీరు తెలుగు అంకెలు టైపు చేశారు కదా, అసలు తెవికీ ఎడిట్ పేజీలో ఆ సదుపాయమే లేదు. ఎందుకనే విషయం ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 12:19, 19 ఆగష్టు 2010 (UTC)
మీ వాదన చూస్తువుంటే, నాకు చాల నవువస్తుంది( అంటే ఫాన్నీగా అనిపిస్తుంది). మిమల్ని సమర్ధించాలి ( అంటే సపోర్ట్ చేయాలి) అనిపించినా మిమల్ని వ్యతిరేకించక(అంటే ఆపోజ్ చేయక) తపటము లేదు. Well ఏది ఏమైనపటికి(అంటే whatever) ఇకడ తెలుగు వికీపీడియాను ఆర్టీసి లేదా ప్రసార మాధ్యమాల(టెలివిజన్, వార్తపత్రికల)తో పోల్చకుండా తెవికి లాంటి ఇతర ప్రాజెక్టులు అంటే హిందీ, ఉరుదు, గుజరాతి, కన్నడ వంటి వికీపీడియా సిస్టర్ ప్రాజెక్టులతో పోల్చుకుంటే అసలు సమస్య ఏంటో అర్ధమవుతుంది.
మాధ్యమాలు(వార్తాపత్రికలు) అంటే గురుతుకు వచ్చింది ఒకసారి వార్తాపత్రికవారు వై.ఎస్.అర (ఆపటి ముఖ్యమంత్రిని)ని తెలుగు బాషపై మీ అభిప్రాయము చెపమంటే "I love my teలుగు బాషా" అని ఆనాడు. తన మత్రుబాషను ప్రేమిస్తున్నాను అని తెలుగులో చేపలేక పోయాడు అని అదే వార్తపత్రికవారు విమర్శించారు.
అందరికీ అర్థమయ్యే భాషను మరియు శైలిని ఉపయోగిస్తూ, వాడుకలో ఉన్న పదాలను, అంకెలను మాత్రమే వాడవలసి ఉంటుంది అంటే మరి పైన పేరుకోన వికీపీడియా సిస్టర్ ప్రాజెక్టులలో కూడా ఎందుకు ఈ పదతి పాటించడములేదు. మీరు చేపినటు "ప్రస్తుతం ఉన్న పద్దతిలో మార్పు వచ్చి, క్రమక్రమంగా తెలుగు ప్రజలు కూడా తెలుగు అంకెలు ఉపయోగిస్తున్నప్పుడు తెవికీ కూడా తప్పకుండా తెలుగు అంకెలను వాడుతుంది" అన్నారు కానీ వికీపీడీయా ఒక వ్యక్తిగత ఆలోచన లేదా అభిప్రాయం కాదు, లేదా వికీపీడియా భవిష్యత్తు చూసే మాయాదర్పణం కాదు. కాబటి దయచేసి మిగతా వికీపీడియా సిస్టర్ ప్రాజెక్టులతో సమానముగా మత్రుబాష లోని తెలుగు అంకెలను మాత్రమే వాడవలెను. అభినందనలతో--Ranjithsutari 18:04, 19 ఆగష్టు 2010 (UTC)
మీకు ఇతర వికీపీడీయాలలో పనిచేసిన అనుభవం ఉండవచ్చు కాని తెవికీ గురించి తెలుసుకోవాల్సిన అవరం ఉంది. నేను చెప్పినది నా వాదన అనుకుంటున్నారు అంతేకాకుండా నా వ్యక్తిగత ఆలోచన లేదా అభిప్రాయం అని అనుకొని పొరపడుతున్నారు. అది కానేకాదు నేను చెప్పినది తెవికీ అభిప్రాయమే. నేను భవిష్యత్తును చూసి జోస్యం చెప్పే అవసరం నాకు లేదు. భవిష్యత్తులో అలా జరిగినప్పుడు మాత్రమే తెవికీలో అలాంటి మార్పు వస్తుందని సూచనప్రాయంగా చెప్పాను, అది సరైనదే. ఏ వ్యవస్థ అయినా సరే సమాజంలో జరిగే మార్పులకు అనుగుణంగా మారవలసిందే. అంతేకాని తెవికీనే మొదట మార్పులకు వత్తిడి చేయదు. ఇతర సోదర వికీపీడియాలతో తెవికీని పోల్చే అవసరం లేదు అక్కడి నియమాలు అక్కడ వర్తిస్తే, మన నియమాలు మాకు వర్తిస్తాయి. వారు అలా చేస్తున్నారని మేము కూడా అలానే చేయాలని అనుకోవడం బాగుండదు, ఆ అవసరం కూడా లేదు. నేను ప్రసార మాధ్యమాలను, ఆర్టీసిని ఉటంకించడం సరైనదే (అది తెలుగు అంకెలకు సంబంధించిన విషయమే మరి). ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఆర్టీసి వారే బస్సుపై తెలుగు అంకెలను వెనక్కి తీసుకున్నప్పుడు తెలుగు అంకలపై తెలుగు ప్రజలకు ఎంత అవగాహన ఉందో ఊహించవచ్చు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. అంతకు ముందునుంచే తెవికీ ఇదే అభిప్రాయంపై ఉంది. వార్తాపత్రికలలో ఎప్పుడో ఒకప్పుడు, ఎవరిపైనే చేసిన విమర్శలు మాకు అవసరం లేదు. ప్రసార మాధ్యామాల సాధారణ భాష గుంచి మాత్రమే చెప్పాను. . సి. చంద్ర కాంత రావు - చర్చ 18:37, 19 ఆగష్టు 2010 (UTC)
తెలుగు ప్రజానీకం కోసం తయారవుతున్న తెవికీని తెలుగు సమాజం, తెలుగు ప్రసార మాధ్యమాలు, తెలుగు ప్రాంతపు సంఘటనలతోనే పోల్చుకోవాలి కాని కన్నడ, గుజరాతీ, హిందీ, ఉర్దూ వికీల గురించి పోల్చడమెందుకు? (అవి సోదర వికీ ప్రాజెక్టులయినా సరే) అక్కడి పద్దతులు కొన్ని నచ్చితే తీసుకోవచ్చు అంతేకాని తెలుగు అంకెలకు సంబంధించి ఇది వర్తించదు. కర్ణాటకలో, గుజరాత్‌లో ఆయా భాషల అంకెల వినియోగం ప్రజలలో ఉండవచ్చునేమో ! ఆ ప్రాంతానికి సంబంధించి అది సరైనప్పుడు ఈ ప్రాంతానికి కూడా ఆ పద్దతే సరైనదని అనుకోలేము. ఆయా భాషలలో వారి అంకెల వినియోగం లేకున్ననూ వారెందుకు ఉపయోగిస్తున్నారనేది అక్కడే తేల్చుకోవాలి. తెలుగు భాషలో అంకెల వినియోగం ఎందుకు లేదన్నది తెవికీకి సంబంధం లేని ప్రశ్న. తెలుగు ప్రజలందరూ వాటినే ఉపయోగించాలని తెవికీ బలవంతం చేయదు. ఉన్న పరిస్థితులను అనుగుణంగా తెవికీ నడుచుకుంటుంది, మార్పులకు అనుగుణంగా తెవికీ కూడా మారుతుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 19:45, 19 ఆగష్టు 2010 (UTC)
చంద్రకాంతరావు గారి స్పందనకు ఏకీభవిస్తున్నాను. ప్రపంచమే ఒక గ్రామముగా మారుతున్నప్పుడు, ఒకేవిధమైన అంకెలు చాలావరకు సొలభ్యంగా వుంటాయి. కన్నడ సంఖ్యలు వాడే మోటారు వాహనం ప్రమాదంలో చిక్కుకుందనుకోండి, మీకు ఆ అంకెలు తెలియకపోతే, కనీస విలువైన సమాచారాన్ని తెలియచేయటంలో కష్టాన్ని గమనించండి --అర్జున 04:28, 20 ఆగష్టు 2010 (UTC)
 • చాలా మంది తెలుగు ప్రజలకు తెలుగు సంఖ్యలు ఉన్నట్టు కూడా తెలియదు. తెవికీ ఉద్ధేశం తెలుగు అభివృద్ధి. మరి మనం కూడా తెలుగు సంఖ్యలను వాడక పోతే ఇక భవిష్యత్తు తరాలకు అసలు అవి ఉన్నట్టు కూడా తెలియదు. మనం వాడితే వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం, ఆతృత మిగిలిన వారికి కలుగుతుంది. నాకు కూడా తెలుగు సంఖ్యలు రావు. కానీ పది సంఖ్యలను గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే సరైన లంకెలను జతచేసి వాడుకరులకు సులభంగా తెలుసుకునేట్టు తోడ్పడితే బాగుంటుంది. అంతర్జాలంలో తెలుగు వాడుకరులు తక్కువ. వాడేవారు తెలుగు మీద అభిమానంతో వాడుతారు. అలాంటి అభిమానులకు పది సంఖ్యలను నేర్చుకోవడం కష్టమేమీ కాదు. ఎలాగూ ఆంగ్ల సంవత్సరాలు, నెలలు వాడుతున్నాం, కనీసం ఆ సంఖ్యలన్నా తెలుగులో ఉంటే బాగుంటుంది. మొదట్లో తెలుగు టైపింగు చాలా కష్టం అనిపించింది. తెలుగు మీద అభిమానంతో రెండు రోజుల్లో బాగా పట్టు వచ్చింది. తెలుగు టైపింగు నేర్చుకోవడం కంటే తెలుగు సంఖ్యలను నేర్చుకోవండం పెద్ద కష్టమేమీ కాదు. ఇదేదో కొత్తగా ఉందే అని అందరికీ కుతూహలం కలిగి వాటి గురించి తప్పక తెలుసుకుంటారు. పాత రోత అని కొత్త సంఖ్యలకు వారు ఆకర్షితులౌతారు. ఒకే విధమైన సంఖ్యలు సౌలభ్యంగా ఉంటాయన్నది నిజమే. మరి ఆ లెక్కన ఒకే భాష మరింత సౌలభ్యంగా ఉంటుంది. అందరం చక్కగా ఆంగ్ల భాష నేర్చుకుందాం. తెవికీ లో మనం తెలుగు పదాలు ఉన్నంతవరకూ వాటినే వాడతాం, లేనప్పుడు అరువు తెచ్చుకుంటాం. మరి సంఖ్యలకు కూడా అదే నియమం ఉండాలి కదా. ఇంటర్నెట్ అంటే అందరికీ అర్ధం అయ్యే పదం, కానీ మనం అంతర్జాలం అంటున్నాం. అలాగే చాలా పదాలు ఉన్నాయి. మనం అంతర్జాలం అని వాడినపుడు , చదివేవాడికి దాని అర్ధం ఏంటో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగి తెలుసుకుంటాడు. కానీ మనం ఇంటర్నెట్ అని వాడితే తెలుగు భాషలో ఒక పదాన్ని తగ్గించిన వాళ్ళమౌతాం.
ఒక పనిచేద్దాం. ఇక్కడ ఓటింగ్ పద్దతి కన్నా ఇంకోలా పరిష్కరిద్దాం. తెలుగు సంఖ్యలు వాడడం వల్ల ఉపయోగాలు మరియు ఆంగ్ల సంఖ్యల వల్ల ఉపయోగాలు అని రెండు గ్రూపులు రాసి తర్వాత ఏది సబబు అనిపిస్తే అది వాడదాం. అలా కాకుండా డైరెక్టుగా ఓటింగ్ పెట్టడం వల్ల అందరూ ఆంగ్ల సంఖ్యల పట్ల మొగ్గు చూపుతారు. ముందు రెండు గ్రూపులను పరిశీలించి తర్వాత వాడుకరులను ఓట్ చెయ్యమంటే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. లేకపోతే అందరూ నాకు ఇది అర్ధం అవుతుంది కనుక నేను దీనికి ఓట్ వేస్తా అని వేస్తారు. --శశికాంత్ 06:05, 20 ఆగష్టు 2010 (UTC)
అయ్యా! మీ మాతృభాషా అభిమానానికి, వెలుబుచ్చిన సందేహానికి జేజేలు. తెలుగు వికీపీడియాలో కూడా తెలుగు అంకెలు వాడే రోజూ వస్తుందని ఆశిద్దాం. ఇహపోతే, తెలుగు అంకెలు ఎందుకు వాడట్లేదంటే ప్రస్తుతపు తెలుగు అచ్చులో (పత్రికలు, పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు ఇతరత్రా తెలుగు సాహిత్యంలో) వాటిని వాడట్లేదు. వికీపీడియా వాటిని ప్రతిఫలిస్తుందే కానీ, మార్గనిర్దేశం చెయ్యదు. ఎందుకు చెయ్యకూడదు? అని మీరు అడగనూ వచ్చు. అది కూడా సమంజసమైన ప్రశ్నే. వికీపీడియా ఏ వాదాన్ని తలకెత్తుకోదు (అభ్యుదయవాదం, భాషా, సంఘసంస్కరణా వాదం, సాంప్రదాయవాదం). అలా చేస్తే మొదటికే మోసమొచ్చే ప్రమాదముంది. ఇంకా వికీపీడీయా ఏదికాదో తెలుసుకోవటానికి WP:NOT చదవండి. మీరు ఉదహరించిన భారతీయ వికీల్లో ఆయా భాషాల అంకెలు వాడుతున్నారంటే వాళ్ళ సాహిత్యంలో ఇంకా స్థానిక అంకెలే వాడుతూండవచ్చు లేకపోతే కాస్త భాషాసంస్కరణను నెత్తికెత్తుకొని ఉండవచ్చు. (భాషా సంస్కరణేం ఖర్మ కొన్ని భారతీయ వికీలు సంఘ సంస్కరణను కూడా నెత్తికెత్తుకొనటం నేను చూశాను) మన ఖర్మానికి మన భాషలో స్థానిక అంకెలు వాడుకలో లేవు. భాషా సంస్కరణను నెత్తికెత్తుకొనే ఉద్దేశం తెవికీ సమాజానికి లేదు. --వైజాసత్య 06:29, 20 ఆగష్టు 2010 (UTC)
వైజాసత్య, మీరు వికీపీడియా ఏ వాదాన్ని తలకెత్తుకోదు( అభ్యుదయవాదం, భాషా, సంఘసంస్కరణా వాదం, సాంప్రదాయవాదం) అంటూనే తెలుగు అంకెలు వాడే రోజూ వస్తుందని ఆశిద్దాం అంటునారు, మీ ఆశాభావం ఎలావునపటికి తెలుగు అంకెలు వాడే సమయం ఇపుడే ఎందుకు కాకూడదు? "భాషా సంస్కరణేం ఖర్మ కొన్ని భారతీయ వికీలు సంఘ సంస్కరణను కూడా నెత్తికెత్తుకొనటం నేను చూశాను" అని అనారు ఈలాంటి సందర్బం ఏదైనా వుంటే దయచేసి చేపగలరు(along with citations and links if any), ఎందుకంటే బహుశా తెలుగు వికీపీడియాలో తెలుగు అంకెలను వాడుటకు అలాంటి సంస్కరణ మొదలుపెటక తపదేమో? ఎందుకంటే నేను కూడా తెవికీ సమాజానికి చెందినవాడినే.
చంద్ర కాంత, మీరు తెవికీ ని ఇతర సోదర వికి ప్రాజెక్టులతో పోల్చలేనపుడు మరి తెలుగు అచ్చులతో(పత్రికలు, పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు ఇతరత్రా తెలుగు సాహిత్యంలతో) లేదా అర.టి.సిలతో పోల్చటం తగదు. మన సరళి ఎవరికీ ఇబంది కలగకుంట వుంటే చాలేమో, కానీ అందుకొరకు తెలుగు పదాలకు మరియు అంకెలకు ప్రత్యంన్యయంగా ఇతర భాషలోని పదాలను ఆశ్రయించుట సభబుకాదు. మీకు తెలుసో లేదో మనము ఇలాగే కొనసాగిస్తే చాలా ఈబండులకు గురి అవుతాము, వాడుకలోవున సరళి/ శైలి అని మనము పటుకు కూర్చుంటే మొదటికే మోసంవస్తుంది.--Ranjithsutari 09:48, 20 ఆగష్టు 2010 (UTC)
రంజిత్ గారూ, ఎప్పటికైనా వికీలో తెలుగు అంకెలు వాడే రోజు వస్తుందని వ్యక్తం చేసింది, సమాజంలో తిరిగి తెలుగు అంకెలకు ప్రాముఖ్యత పెరిగి, విరివిగా వాడబడితే, అప్పుడు తెలుగు వికీలో కూడా వాడవచ్చు అనే వ్యక్తిగత ఆశావాహం తప్ప మరేమి కాదు. నా వ్యక్తిగత అభిప్రాయానికి, వికీ పద్ధతికి ఏమి సంబంధం లేదు. వికీలో భాషా సంస్కరణ మొదలెడితే అది అంకెలతో ఆగదు. అప్పుడు వికీ నవ్వులపాలై, నిరుపయోగమౌతుంది అంతకు తప్ప ఒరిగేదేమీ లేదు. నేను అన్న "మొదటికి మోసం" వికీ మూల ఉద్దేశ్యం చెడుతుందని. మీరంటున్న "మొదటికి మోసం" భాష గుల్లైపోతుందని. మీ అవేదనను నేను అర్ధం చేసుకోగలను. వికీ శక్తివంతమైన మాధ్యమమే కానీ భాషను సంస్కరించేంత సత్తా లేదు. వికీలో ఒక పదం కానీ పద్ధతి కానీ, అంకెలు కానీ వాడినంత మాత్రాన అవి భాషలో భాగమై పోతాయని, భాషను ఉద్ధరిస్తాయని అనుకోవటం మృగతృష్ణే. ఉదాహరణకి : మీకు బణువు అన్న పదం తెలుసా? తెలీకపోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఒక తెలుగు ఆచార్యులవారు దీన్ని సృష్టించారు. 60 లలో ఆయన వ్రాసిన కొన్ని సైన్సు పుస్తకాలలో కూడా ఉపయోగించారు. ఆయన దాన్ని ప్రచారం చెయ్యటానికి ఇక్కడా ఒక వ్యాసం సృష్టించారు. అది ఇంకో వందేళ్ళైనా, వికీలో ఉన్నా ఎవరికీ తెలియదు, ఎవరూ దాన్ని ఉపయోగించరు. ఎందుకంటే అది వాడుకలో నాని వచ్చిన పదం కాదు. పాఠ్యపుస్తకాల్లో చేర్చి లక్షలాదిమంది విద్యార్ధులకు నేర్పినది కాదు. అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ దీని వళ్ళ వికీ ఎలా నవ్వులు పాలౌతుందని మీరు అడగవచ్చు. ఇంకొన్నాళ్ళకు నా లాంటి ఎల్లయ్య ఒకరు వచ్చి, నేను బణువుకే మరో పదం చెణువు అని సృష్టించాను, నా బ్లాగులో కూడా వాడాను అని చెణువు అన్న పేరుతో వ్యాసం సృష్టిస్తారు. ఇలా పరస్పర విరుద్ధమైన, హాస్యాస్పద పదాలతో వికీ ఒక కలగూరగంపై ప్రామాణికత కోల్పోతుంది. అందుకనీ ఇక్కడి నుండి నరుక్కు రావటం వళ్ళ పెద్ద ప్రయోజనం లేదు. తెలుగు అంకెలు కానీ, తెలుగు పదాలు కానీ ప్రాచుర్యం పొందాలంటే వాడుక పెంచడానికి ప్రయత్నించండి. పాఠ్యపుస్తకాల్లో చేర్చటానికి, పిల్లలికి నేర్పటానికి ఉద్యమించండి. మీ రోజువారీ పనుల్లో ఉపయోగించండి. అప్పుడు వికీలో సమస్తం అంకెలు మార్చటం ఒక చిటికెలో పని. మీ అభిప్రాయానికి ఇక్కడ స్థానం లేదని కాదు. రంజిత్ గారు చెప్పారని ఈ రోజు మారిస్తే, రేప్పొద్దున ఇంకో సభ్యుడు వచ్చి, ఆంగ్ల అంకెలకు మార్చండి అన్నప్పుడు నిరాకరించడానికి హేతువేమీ ఉండదు.
భారతీయ వికీల్లో సంఘ సంస్కరణా ధోరణులకు ఉదాహరణ అడిగారు - నాకు ఇప్పుడు అది వెతికి పట్టుకునే ఓపిక లేదు కానీ స్థూలంగా విషమేమిటంటే, తమిళ వికీలో అనుకుంటా కొన్నేళ్ళ క్రితం, వ్యక్తుల గురించి వ్యాసాలు వ్రాస్తున్నప్పుడు కుల ప్రస్తావన అనవసరం, కులాని ప్రస్తావిస్తే వాటికి ఇంకా నవ సమాజంలో ఆమోదముద్ర వేస్తున్నట్టే, కాబట్టి ఇక్కడ కులాల ప్రస్తావన కూడదు అని కొందరు అభ్యుదయవాద సభ్యులు ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత దాని గురించే ఏంచేశారో తెలీదు కానీ అదన్నమాట. అంతెందుకు ఇక్కడా అప్పుడప్పుడు అలాంటి సభ్యులు తారసపడతారు. మన వ్యక్తిగత ఆశలు, ఆశయాలు, ఉద్దేశాలకు (మంచివైనా) వికీ వేదిక కాదు, కాకూడదు. --వైజాసత్య 17:41, 20 ఆగష్టు 2010 (UTC)
 • చర్చ పొడుగిస్తున్నందుకు తప్పుగా అనుకోకండి. తెలుగు అంకెలు వాడుకలో లేవని ఎవరు చెప్పారు. అంతర్జాలంలో వాడుకలో ఉన్నాయి. పుస్తకాలలో వాడుకలో ఉన్నాయి. కాకబోతే విరివిగా ఉపయోగించట్లేదు. అంతే గాని అసలు వాడుకలో లేవన్నది అవాస్తవం. కావాలంటే ఈ లంకెని చూడండి. 70 వేల లంకెలలో తెలుగు సంఖ్య ౧ ఉన్నది. http://www.google.co.in/#hl=te&q=%E0%B1%A7+&aq=f&aqi=&aql=&oq=&gs_rfai=&fp=b7a9349d932124f4 ఇక పుస్తకాల విషయానికి వస్తే నా దగ్గర రామాయణము , భగవద్గీత, పంచాంగ పుస్తకాలలో వీటిని వాడారు. తెలుగు పద్యాలు ఉన్న మరో పుస్తకంలో కూడా చూశాను. కనుక ఇది భాషా సంస్కరణ కిందకు రాదు. ఉద్యమం కిందకు రాదు. ఎవరికి నచ్చిన సంఖ్యలను వారిని వాడుకోనివ్వండి. నిషేధించాల్సిన అవసరం ఎందుకు ? అసలు వీటి మీద ఏ సంస్ధ కూడా నిషేధం విధించలేదు. కేవలం ఒక్క లంకె కాదు, 70 వేలు. అంతే కాదు, మిగిలిన సంఖ్యలకు కూడా అంతే ఫలితాలు వచ్చాయి చూడండి. కాని అంతర్జాలం అన్న పదానికి కేవలం 14,900కు పైగా ఫలితాలు వచ్చాయి.http://www.google.co.in/#hl=te&q=%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B2%E0%B0%82&aq=1&aqi=g10&aql=&oq=%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B2&gs_rfai=&fp=b7a9349d932124f4 మరి అది వాడుతున్నప్పుడు దానికి రెట్టింపు ఫలితాలు వచ్చిన సంఖ్యలను ఎందుకు వాడకూడదు. అంతర్జాలం పదానికన్న తెలుగు సంఖ్యలు రెట్టింపు ఉపయోగంలో ఉన్నాయి. మరో విషయం, ఈ సంఖ్యలను మేము కనిపెట్టలేదు. బణవుతో పోలిక తప్పు.

http://www.google.co.in/#hl=te&q=%E0%B1%A8&aq=&aqi=g10&aql=&oq=%E0%B1%A8&gs_rfai=&fp=b7a9349d932124f4 89,900కు పైగా ఫలితాలు
http://www.google.co.in/#hl=te&q=%E0%B1%A9+&aq=&aqi=g2&aql=&oq=%E0%B1%A9+&gs_rfai=&fp=b7a9349d932124f4 91,700కు పైగా ఫలితాలు
http://www.google.co.in/#hl=te&q=%E0%B1%AA&aq=f&aqi=g10&aql=&oq=&gs_rfai=&fp=b7a9349d932124f4 1,030,000కు పైగా ఫలితాలు
http://www.google.co.in/#hl=te&q=%E0%B1%AB&aq=f&aqi=g6&aql=&oq=&gs_rfai=&fp=b7a9349d932124f4 59,100కు పైగా ఫలితాలు
http://www.google.co.in/#hl=te&q=%E0%B1%AC&aq=f&aqi=g3&aql=&oq=&gs_rfai=&fp=b7a9349d932124f4 57,200కు పైగా ఫలితాలు
http://www.google.co.in/#hl=te&q=%E0%B1%AD&aq=f&aqi=g2&aql=&oq=&gs_rfai=&fp=b7a9349d932124f4 52,400కు పైగా ఫలితాలు
http://www.google.co.in/#hl=te&q=%E0%B1%AE&aq=f&aqi=g2&aql=&oq=&gs_rfai=&fp=b7a9349d932124f4 55,600కు పైగా ఫలితాలు
http://www.google.co.in/#hl=te&q=%E0%B1%AF&aq=f&aqi=g9&aql=&oq=&gs_rfai=&fp=b7a9349d932124f4 58,400కు పైగా ఫలితాలు
--శశికాంత్ 03:25, 21 ఆగష్టు 2010 (UTC)

ఫర్లేదు, సద్భావంతో జరిగే చర్చలన్నీ మంచివే. అసలే కనుమరుగయ్యాయని ఎవరూ అనలేదు. వాడుక అంటే ఇవ్వాళ్టి వ్రాతలో పెద్దగా ఉపయోగించట్లేదనే ఉద్దేశంతోనే చంద్రకాంతరావు గారైనా, నేనైనా చెప్పింది. నేను చదువుకున్నప్పుడు పెద్దబాలశిక్షలో తప్ప మరే పాఠ్యపుస్తకంలోనూ తెలుగు అక్షరాలు కనిపించిన గుర్తు లేదు. కానీ హిందీ పాఠ్యపుస్తకాల్లో హిందీ అంకెలు ఉండేవి. వాడుక అంటే ఉదాహరణకు మీరు సాధారణ జీవితంలోఒక వ్యాసమో, ఒక ఉత్తరమో వ్రాస్తున్నారనుకోండి తెలుగు అంకెలు ఉపయోగిస్తున్నారా? పోనీ ఏదైనా తాజా కబుర్లలో అంకెలు తెలుగు కనిపించాయా లేదే? అలాంటి వాడుకే చర్చలోప్రస్తావించింది. మీరు అంతర్జాలంలో తెలుగు అంకెలకు ఇన్ని ఫలితాలు వచ్చాయని అన్నారు. మరి ఆంగ్ల అంకెలు ఉపయోగించిన తెలుగు పేజీలతో పోల్చుకుంటే ఇవి ఎంత శాతం ఉంటాయంటారు. అంకెలను బణువుతో పోల్చలేదు, భాషా సంస్కరణ తలకెత్తుకొని ఆ దిశగా పయనిస్తే, ఎలాంటి చోటికి చేరతామో ఉదాహరణతో చూపించానంతే. పనిగట్టుకొని తెలుగు అంకెలను ఏమీ నిషేధించలేదు. ఇక్కడా కొన్ని వ్యాసాల్లో అక్కడక్కడా తెలుగు అంకెలున్నాయి. ఎవరికి నచ్చిన సంఖ్యలు వారు వాడుకోవటాన్ని ఎందుకు ప్రోత్సహించడం లేదంటే ఇది ఒక విజ్ఞాన సర్వస్వం, దీనికి కొన్ని భాషా, శైలి ప్రామాణికతలు ఉంటాయి. పుస్తకంలో ఒక పేజీలో ఆంగ్ల అంకెలు, మరో పేజీలో తెలుగు అంకెలు ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినట్టు వాడితే ఎందుకు బాగుండదో, ఇక్కడా అంతే. మీకు ఉదాహరణ రూపకంగా నిరూపించాలంటే ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్రాస్తే ఇలా ఉంటుంది. దీంతో మళ్లీ భాషా ప్రామాణికత మీద చర్చ లేస్తుందేమో :-)
బణువును, అంకెలను పోల్చలేనట్టే, అంతర్జాలం అన్న పదాన్ని, అంకెలను పోల్చలేము. వ్యక్తిగతంగా అంతర్జాలం అని వికీలో వాడటం ఇంకా premature అని నా భావన. మీ పద్ధతిలో అంకెలకు మరిన్ని ఫలితాలు రావటానికి కొన్ని కారణాలు లేకపోలేదు. అంతర్జాలం బదులు ఇంటర్నెట్టు అన్న పదం తీసుకున్నా అంకెలతో ఓడిపోతాయని నా అభిప్రాయం. ఎందుకంటే, ఇంటర్నెట్టు అన్న ఒక్క పదం కంటే అంకెలను (తెలుగైనా, ఇంగ్లీషైనా) విరివిగా ఉపయోగిస్తారు కాబట్టి (usage bias). రెండవ కారణం ఈ తెలుగు అంకెలను కొన్ని వందల ఏళ్ల సాహిత్యంలో వాడారు. ఆ సాహిత్యం అంతర్జాలలో ఎక్కడున్నా శోధనా ఫలితాల్లో వస్తుంది. కానీ అంతర్జాలం అన్న పదం కొత్తది. దానికి అంకెలంత చరిత్ర లేదు. మూడవ కారణం అంకెలు శోధిస్తున్నప్పుడు variant forms, conjugates శోధనలో మిస్సయ్యే అవకాశం లేదు. అదే అంతర్జాలం అన్న పదానికి చాలా variant forms, conjugates ఉన్నాయి అవన్నీ శోధలలో దొరికి ఉండకపోవచ్చు. నాలుగవ కారణం అంకెలు ఒక విషయసందర్భం లేకుండా ఎక్కడైనా ఉండొచ్చు. కానీ అంతర్జాలం అన్న పదం అసందర్భంగా రామకోటిలాగా ఎక్కడైనా వ్రాస్తారని నేననుకోను. :-) వైజాసత్య 06:41, 21 ఆగష్టు 2010 (UTC)
శశికాంత్, మీరు తెవికిలో తెలుగు అంకెలను వాడుటకు సమర్దిస్తునందుకు మీకు దన్యవాదములు, మీరు చేపినటుగా "ఎవరికి నచ్చిన సంఖ్యలను వారిని వాడుకోనివ్వండి" అనే దానికి నాకు ఎలాంటి అబ్యంతరము లేదు.
వైజాసత్య, మీరు ఈకడ తపు-ఒప్పు, మంచి-చెడు లాంటివి మాట్లాడే టపుడు దయచేసి దానికి సంబంధిత వికీ policies ను చేపగలిగితే చాల బాగుంటుంది, వీలుఅయితే దానికి సంబంధిత link చూపించగలరు. నేను తెలుగు అంకెలను చేర్చుటకు ఉద్యమము చేయమని ఉచిత సలహా ఇచారు దీనికి కూడా వికి policies ను చేపగలిగితే బాగుండేది, లేని పక్షాన మీ వాదన మరియు మీ బావోద్వేగాలను మీవరకే పరిమితం చేసుకుంటే బాగుంటుంది. ఎల్లయాలు-ప్లుల్లయాలు అన్ని వికి ప్రోజేక్టులోను ఉనారు కానీ ఎవనికి లేని సమస్య తెవికికే వస్తుంది అంటే, నేను నమను. ఈకడ నేను తెవికీని కేవలం వికి సోదర ప్రోజేక్టులతోనే పోల్చగలను, ఎందు కంటే లక్షలు-కోట్ల మంది తెలుగు వారితో కానీ వారి విజ్ఞానము-పరిజ్ఞ్యనముతో పోలుచుట సాధ్యము కాదు, ఎందుకంటే వారిలో ఎందరు తెవికి లేదా అంతర్జాలం(Internet) వాడుతారు, కనీసం కంప్యూటర్ ఎందరు వాడుతారు బహుశా ఈ link చుస్తే అర్తమవుతుంది.
బనువు, చేనువు, అంతర్జాలం లాంటి పదాలు ఎ ఏలయ్యయో-పుల్లయో చేర్చితే తెవికిలోని వ్యాసాల సంఖ్యా ఒకటి పెరుగుతుంది కని నవులపాలు కనేకాదు అది అవాస్తవము. ఇంతకూ ముందు మీరు చూపించిన ఉదాహరణ మీరు మార్పులు చేసిన తరువాత ఈలావుంది, దీనిలో గమనించదగ మార్పులు ఏమీలేవు కాకపోతే ఆంగ్లములో వున C.M ను తెలుగు అక్షరాలతో సి.ఎం. గా దిదుబాటుచేసారు, చాల బాగుంది కాకపోతే అలాగే అ ఆంగ్లములో వున అంకెలను కూడా తెలుగు అంకెలతో దిదుబాతుచేస్తే ఇంకా చాల చాల బాగుంటుంది. పర్వాలేదు ఇపుడు నేను దిదుబాటు చేశ్యను దీనిని మీరు చేసినటే ఆంగ్ల అంకెల స్తానంలో తెలుగు అంకెలు చేర్చాను. నా దృష్టిలో ఇది భాషా సంస్కరణం లేదా ఉద్యమం అతకనా కాదు. దయచేసి ఈ విషయాని మీరు అర్తంచేసుకో గలరు అని ప్రార్థన. ఇంతకూ (usage bias) అనేది తెవికి గని వికి policy కాదు, కాబటి దానిగురించి చర్చించి ఉపయోగం లేదు.--Ranjithsutari 11:11, 22 ఆగష్టు 2010 (UTC)
రంజిత్ గారూ, మీ పాయింటు నిరూపించుకోవటానికి వివిధ వ్యాసాల్లో అంకెలు మార్చేస్తున్నారు. వికీ నిర్వాహకులకు వాటిని రద్దు చేసే వీలుంది. మీరు అనవసరంగా సమయాన్ని వృధా చేస్తుకుంటున్నారు. ముందు ఈ పాలసీ, దీన్ని, దీన్నీ చదవండి. ఇంకా ఇలానే మొండిగా వ్యవహరిస్తే బహిష్కరణకు గురయ్యే అవకాశముంది. ఆ తర్వాత తెలుగు అంకెలు వాడుతుంటే నన్ను తెవికీలో నుండి బహిష్కరించారని చెప్పుకొని తిరుగుతారు. ఈ సినిమా ఇంతకు ముందు చాలాసార్లు చూసిందే. వైజాసత్య 17:18, 22 ఆగష్టు 2010 (UTC)
పైన వైజాసత్య గారు ఇచ్చిన వివరణకు పూర్తిగా ఏకీభవిస్తున్నాను. గత కొన్ని రోజులుగా ఈ సభ్యుడి ఏకపక్ష ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెవికీని వృద్ధి చేయాలనే అభిప్రాయం ఆ సభ్యుడికి ఏ కోశాన ఉన్నట్టు లేదు. వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, అతను కొత్తగా చేర్చినది ఒకేఒక్క వ్యాసం, అదీ పట్టిక రూపంలో, దాన్ని కూడా సొంతంగా వ్రాసాడా అంటే లేదు, అసెంబ్లీ వెబ్‌సైట్‌నుంచి కాపీ చేసి ఎక్కడో తర్జుమా చేసి ఇక్కడ అతికించాడు. పట్టికను చేర్చడానికి ప్రధాన ఉద్దేశ్యం తెలుగు సంఖ్యలు చేర్చాలనేదే కావచ్చు. మరో విషయం ఇతనికి తెవికీపై కంటె సోదర వికీ ప్రాజెక్టులపైనే మంచి అభిప్రాయం ఉన్నట్టుంది. అలాంటప్పుడు అతను ఇక్కడ ఏ ఉద్దేశ్యంతో వచ్చాడో క్రమక్రమంగా స్పష్టంగా అర్థమౌతోంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 17:48, 22 ఆగష్టు 2010 (UTC)
 • ఈ చర్చ ఇంతటితో ముగించడం మేలు. అనవసరంగా సమయం వృధా. భవిష్యత్తులో తెలుగు అంకెలు వాడే రోజొస్తుందని ఆశిద్దాం. చివరకు వ్యక్తిగత దూషణలకు దిగుపోతున్నారు. ఇరు పక్షాలు సంయమనం పాటించాలి. తెలుగు అంకెలు వాడకపోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ముందు భాష కోసం కృషి చేద్దాం. లేకపోతే దాని పరిస్థితి కూడా ఇలానే అయిపోతుంది. రంజిత్ గారు, కొంత పట్టువిడుపులు ఉండాలి. మిగిలిన వారికి కూడా అధికార గర్వం తగదు. మిగిలిన నిర్వాహకులు కూడా స్పందిచివుంటే ఏదో ఒక వాదనకు బలం చేకూరేది. త్వరగా చర్చ పూర్తైయ్యేది. తెవికీ వాతావరణం దెబ్బతింటే రోజూ వచ్చే వాడుకరులు కూడా రారు. అలా జరగకుండా చూసుకునే బాధ్యత అందిరి మీదా ఉంది. --శశికాంత్ 05:35, 23 ఆగష్టు 2010 (UTC)
ఇక్కడ నా ఉద్దేశ్యము తపుగా చిత్రీకరించారు, మీరు ఎమి అనుకునప్పటికి నాకు మాత్రం "అత్యంత నైపుణ్యము గల విశ్వకోశాన్ని నిర్మించి తెవికీని సొంత భాషలో అందించాలి" అనేదే నా ఉద్దేశ్యం. నా మట్టుకు నేను వ్యాసాలను నిర్మిస్తూవుంటే తెవికిలో కేవలం ఆంగ్ల అంకెలను మాత్రమే వాడమని మొండి వైకరిని చూపుతూ నేను గందరగోళం సృష్టిస్తునాను కాబటి బహిస్కరిస్తాము అని ఇభందికి గురి చేసేస్తునారు. నాకు ఇతర వికీ సోదర ప్రాజెక్టులపై వున అభిప్రాయమే తెవికీపై కూడా వుంది. Wikipedia is first and foremost an effort to create and distribute a free encyclopedia of the highest possible quality to every single person on the planet in their own language అన్న జీమ్మీ వేల్స్ వాక్యాలకు నేను ఎప్పటికి కటుపడి వుంటాను, అదే ప్రయత్నిస్తాను. ఈ చర్చలో మిగిలిన నిర్వాహకులు మరియు సబ్యులు కూడా స్పందిస్తారు అని ఆశిస్తునాను.--Ranjithsutari 11:24, 23 ఆగష్టు 2010 (UTC)
చాలా చర్చ జరిగింది. నేను చెప్పటీనికి ఇహ ఏమీ మిగల లేదు. రంజిత్ గారు మీరు ఈ అంకెల మీద మంకు పట్టు వదిలేసి వ్యాసాల సంఖ్య పెంచటానికి కృషి చేస్తారని ఆశిస్తాను. Chavakiran 04:15, 24 ఆగష్టు 2010 (UTC)

నా అభ్యర్ధన కూడా అదే. రంజిత్ గారూ. ఇది ఇప్పటిలో తేలదు మరియు ఈ చర్చ క్రొత్త కాదు. అధిక సభ్యుల అభిప్రాయాన్ని మీరు గ్రహించే ఉంటారు. దయ చేసి తెలుగు అంకెల వాడకం విషయం కొంత కాలం వాయిదా వేయండి. "బహిష్కరణ" అనే మాట రావడం పొరపాటు. అయితే వైజాసత్య పాత విషయాలను దృష్టిలో ఉంచుకొని ఆ మాట అన్నాడు. ఆ ప్రస్తావనను వెనుకకు తీసుకోమని వైజాసత్యను కోరుతున్నాను. --కాసుబాబు 16:05, 3 సెప్టెంబర్ 2010 (UTC)

బహిష్కరణ అన్నమాట వ్రాసిన తర్వాత చాలాసార్లు చింతించాను. ఇదివరకే వ్యక్తిగతంగా ఈమెయిల్లో రంజిత్ గారికి క్షమాపణ చెప్పాను. సభాముఖంగా ఆ మాటను వెనక్కితీసుకుంటున్నాను. నిష్పక్షపాతదృష్టితో పరిశీలించి అభిప్రాయం వెలిబుచ్చినందుకు కాసుబాబు గారికి ధన్యవాదాలు --వైజాసత్య 16:27, 3 సెప్టెంబర్ 2010 (UTC)

ప్రతిపాదన మార్చు

తెవికిలో అధిక సబ్యులు తెలుగు అంకెలకు వ్యతిరేకంకాదు, కానీ ప్రస్తుతం ఉన్న పర్రిస్తితుల వలన వాటికీ దురం వున్నారు. ప్రస్తుతం ఆంగ్ల అంకెలనే పూర్తి స్థాయిలో వాడుతూ, తెవికిలో తెలుగు అంకెలు వాడే రోజు వస్తుంది అని ఆశిస్తున్నారు. సమాజం పరిస్థితులు ఎలావున్నా తెవికి ఆవిర్భావం నుంచి పూర్తి స్థాయిలో ఆంగ్ల అంకెలు వాడటం వలన ఇక భావిష్యతులో తెలుగు అంకెలు వాడే రోజు వస్తుంది అనుకుంటే అది యాదృచికమే. ఆంగ్ల అంకెలు వాడటము వలన ఎలాంటి నష్టములేదు కాబట్టి అద్దె ఎల్లప్పట్టికి కొనసాగుతుంది, భావిష్యతులో తెలుగు అంకెలు వాడుటకు ఏకాగ్రివం ఎనాట్టికి కుదరదు. ఇక భావిష్యతులో Simple English లాంటి తెలుగు వికిపిడియా శ్రుష్టించడం అనివార్యం అవుతుంది, అంతటితో ఆగిపోతుంది అనుకుంటే పోరాప్పాటే, హింది ఉరుదు బాషలతో ప్రాభల్యం చెందిన తెలంగాణా వికిపిడియా, ఆంగ్ల బాషలతో ప్రాభల్యం చెందిన ఆంధ్ర వికిపిడియా అవిర్భావంచెందినా ఆశ్చర్య పోవలసిన అవసరంలేదు. భావిష్యతులో ఏది ఏమైనా ప్ర్రస్తుతం ఉన్న పరిస్తితుల దృశ్య ఆంగ్ల అంకెలను పూర్తిస్థాయిలో నేను వాడలేను, కావున తెలుగు అంకెలను కేవలం పట్టికలకు మాత్రమే పరిమితం చేస్తున్నాను. పట్టికలో ఒకటి నుంచి మొదాలుకొని అన్ని అంకెలు వుంట్టాయి కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. తెవికిలో పూర్తిస్థాయిలో ఆంగ్ల అంకెలను మాత్రమే వాడకుండా తెలుగు అంకెలను కూడా వాడినవారిమి అవుతాము. అభినందనలతో--Ranjithsutari 08:44, 4 సెప్టెంబర్ 2010 (UTC)

ఏకరూప్యత (consistency) , సమిష్థి కృషికి తోడ్పాటు అనేవి నా దృక్పధంలో ముఖ్యమైన విషయాలు. మీ ప్రతిపాదన దీనికి వ్యతిరేకము కాబట్టి నేను మద్దతు ఇవ్వలేను. మీరు దీనిగురించి భావసారూప్యత కలిగిన ఇతర సముదాయలలో ప్రతిపాదించటం మంచిది. --అర్జున 13:06, 4 సెప్టెంబర్ 2010 (UTC)