వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/అనువాదయంత్రంపై ఉన్న మానవీయ అనువాదపరిమితి ఆంక్ష 30% నుండి 25% కి తగ్గించుట

ప్రతిపాదన ఆమోదం పొందింది

మానవిక అనువాడ శాతాన్ని 30% నుండి 25% కి తగ్గించాలని నిర్ణయించారు (It is decided to reduce the manual translation limit to 25%

కింది చర్చ ముగిసింది. ఇక దానిలో మార్పుచేర్పులు చెయ్యకండి. ఇకపై చెయ్యదలచిన వ్యాఖ్యానాలను సముచితమైన చర్చ పేజీలో చెయ్యాలి.

అనువాదయంత్రం ద్వారా ఆంగ్ల వికీనుండి వ్యాసాలు అనువదించటానికి తప్పనిసరిగా మానవీయ అనువాదం 30% పరిమితి ఆంక్ష ఉన్నట్లు మనందరికీ తెలుసు.2020 ఫిబ్రవరి 24న వికీలో యాంత్రిక అనువాద స్థాయి 70 శాతం కంటే తక్కువ వుంటేనే ప్రచురణకు అనుమతించేటట్లుగా నిర్ణయం అమలులోకి వచ్చింది.వ్యాసాల అనువాద నాణ్యతను దృష్టిలో పెట్టుకుని ఆ పరిమితిని రచ్చబండ చర్చలో జరిగిన సముదాయ నిర్ణయం మేరకు అమలులోకి వచ్చింది.అయితే ఇది అమలులోకి వచ్చిన కొద్దికాలానికే 2020 సెప్టెంబరులో యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతాన్ని పూర్తిగా ఎత్తివేయాలి అనే ప్రతిపాదనలు ప్రవేశపెట్టటం, దానిమీద త్రీవస్థాయిలో చర్చలు జరగటం, చివరకు ఒటింగ్ ప్రక్రియదాకా వెళ్లటం, వీగిపోవటం ఇవన్నీ మనందరకు తెలుసు.ఆరోజు ఆ ప్రతిపాదన అర్థం మానవీయ అనువాద పరిమితిఆంక్ష 30% పూర్తిగా తీసివెయ్యాలని ప్రతిపాదించుట జరిగింది.

అయితే గతంలో నాటికి, ఇప్పటికి అనువాదయంత్రాన్ని ఎక్కువ మంది తెవికీ వాడుకరులు ఉపయోగించటాన దాని నాణ్యత కొంతవరకు పెరిగింది.అనువాదంలో వాక్యనిర్మాణం గాని, ఆంగ్ల పదాలకు సరియైన తెలుగు అర్థాలను సూచించటంలో గాని గణనీయంగా అభివృద్ది చెందింది. సంవత్సరం క్రిందట అనువాదయంత్రం ద్వారా అనువదించటానికి, ఈరోజున అనువదించటానికి చాలా తారతమ్యం ఉంది.ఇప్పటి పరిస్థితులలో గతంలో కష్టపడవలసినంత అవసరం లేదు.అలా అని పూర్తిగా అనువాదయంత్రమే అనువదిస్తుందని కాదు.కొంత మెరుగుపండిందని దాని అర్థం. కావున ఈ పరిస్థితులలో ప్రస్తుతం మానవీయ అనువాద పరిమితిఆంక్ష 30% నుండి 25% తగ్గించటానికి ప్రతిపాదిస్తున్నాను.అయితే 25% తగ్గించినా కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంది.

జాగ్రత్తలు లేదా సూచనలు

మార్చు
  • 25% తగ్గించినా ఒక్కో సందర్బంలో కొన్ని పదాలకు, కొన్ని వాక్యాలకు అర్థాలు అగమ్యగోచరంగా ఉంటాయి. అటువంటి సందర్బాలు క్షుణ్ణంగా పరిశీలించి సవరించాల్సిన అవసరం ఉంది.
    • దానికి ఉదాహరణ:The mouth of the Palar river, seen from the air - పలార్ నది యొక్క నోరు, గాలి నుండి కనిపిస్తుంది అని అనువదిస్తుంది.ఇది పూర్తిగా 100% తెలుగులోకి అనువదించింది.కానీ వాక్యం అగమ్యగోచరంగా ఉంది.అనువదించేటప్పుడు పూర్తిగా ఆంగ్ల వాక్యాలుతో తెలుగు వాక్యాలు సరిపోల్చుకుని సవరించాలి. ఆ వాక్యం "పాలారు నది ఉద్బవించిన ప్రదేశం విహంగ వీక్షణ దృశ్య చిత్రం" అని ఉండాలి. వ్యాసం ప్రచురించిన తరువాత కూడా పూర్తిగా చదివి ఇలాంటి వాక్యాలు ఏమైనా ఉంటే సవరించాలి.
  • కొన్ని ఆంగ్లపదాలకు అక్కడ సూచించిన తెలుగు పదం ఏరకంగానైనా పొందిక కాని సందర్బాలలో ఆంగ్ల పదాలకు సరియైన తెలుగు పదాలు ఆంధ్రభారతి నిఘంటువులో అనేక అర్థాలను సూచిస్తుంది. అటువంటి సందర్బాలలో ఆ వాక్యానికి తగిన తెలుగు పదం ఉపయోగించాలి. ఒకవేళ సరియైన తెలుగు పదం గోచరించని సందర్బంలో ఆంగ్లపదం (తెలుగులో) ఉండుట తప్పదు.కానీ ఆంగ్లపదాలు (ఆంగ్లంలో) ఉపయోగించరాదు.
    • దానికి ఉదాహరణలు:Database - దీనికి డేటాబేస్ అని గానీ డాటాబేస్ అని సూచిస్తుంది.అలాగే Presidency - దీనిని ప్రెసిడెన్సీ అనే చూపుతుంది.అయితే ఆంధ్రభారతి నిఘంటువులో అధ్యక్షపదవి అని సూచిస్తుంది. ఇలాంటి సందర్బాలలో అక్కడి వాక్యానికి తగినట్లుగా ఉపయోగించాలి.
  • కొన్ని ఆంగ్ల పదాలు తెలుగులో అనువదించినప్పుడు ఆంగ్ల భాషలోనే చూపే పదాలు ఉన్నవి.అవి అలా రాస్తేనే వాక్య నిర్మాణం బాగుంటుంది.అలాంటి పదాలుకు ఉదాహరణ lathi charged దీనికి లాఠీ చార్జి చేశారు అనే అర్థం చూపుతుంది.ఇది పూర్తి తెలుగులో రాస్తే దుడ్డుకర్రతో బాదారు అని రాయాలి.కానీ లాఠీ చార్జి చేశారు అనే పదం వాడుకకు అలవాటు పడ్డాం.ఇంకా ఇలాంటి కొన్ని పదాలు ఉన్నవి. Youth league - యువజన లీగ్ United Front ఐక్య ఫ్రంట్ junior, Senior అనే ఇలాంటి పదాలు విషయంలో వాక్య నిర్మాణానికి సరిపోయే విధంగా రాయవలసిఉంటుంది.

ఒక్కోసారి అంతా అనువదించినా ఇంకా అనువదించవలసిన శాతం ఉందని చూపుతుంది,అక్కడ పైన తెలిపిన కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగు పదాలు గోచరించవు. కావున ఈ పరిస్థితులలో ప్రస్తుతం మానవీయ అనువాద పరిమితిఆంక్ష 30% నుండి 25% తగ్గించటానికి ప్రతిపాదిస్తున్నాను.

ప్రతిపాదన

మార్చు
  • అనువాద యంత్ర ప్రస్తుత మానవీయ పరిమితి ఆంక్ష 30% నుండి 25% తగ్గించటం

దీనిమీద గౌరవ వాడుకరులు వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలుపవలసిందిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 14:25, 6 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

  • ప్రతిపాదనకు అంగీకరించినవారు
  1. నేను అంగీకరిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 14:51, 6 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  2. యర్రా రామారావు గారు, మీరు చెప్పినది నూటికి నూరు పాళ్ళు నిజం SATYA SAI VISSA (చర్చ) 11:28, 19 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  3. నేను అంగీకరిస్తున్నాను 20 శాతానికి తగ్గిస్తే ఇంకా సులువు అవుతుంది. ఒకసారి ప్రచురించ బడ్డాక అవసరం అయిన నాణ్యత,ఇతర మార్పులు చేయవచ్చు --Kasyap (చర్చ) 05:56, 24 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  4. నేను అంగీకరిస్తున్నాను. --ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:07, 21 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  5. అంగీకరిస్తున్నాను. రెండున్నరేళ్ళ కిందట నేను దీన్ని పరిశీలించినపుడు అనువాదాల్లో మానవిక శాతాలు ఎలా ఉన్నాయో కింది చర్చ విభాగంలో రాసాను. అప్పటినుండి ఇప్పటికి, నేను చేస్తున్న అనువాదాల ద్వారా గ్రహించినది - యాంత్రిక అనువాదాల నాణ్యత ఇంకా మెరుగుపడింది, మెరుగు పడుతోంది. ఎక్కువగా కనిపించే అనువాద దోషాలైన - మరియు ప్రయోగాలు, కర్మణి వాక్యాలు, సంయుక్త వాక్యాలు, తేదీ ఆకృతులు మొదలైనవాటిని సవరించాక కూడా మానవిక అనువాదం 30 శాతానికి చేరడం లేదు. సైన్సేతర వ్యాసాల అనువాదాల్లో దాదాపు 90% వ్యాసాలకు మానవిక అనువాద శాతాన్ని తగ్గించాల్సిన అవసరం నాకు కనిపించింది. అంచేత ఈ శాతాన్ని ఇప్పటి 30% నుండి 25% కి తగ్గించాలని నా అభిప్రాయం. దీన్ని ఇంకా తగ్గించాలని అనిపిస్తే ఆరు నెలలలో మళ్ళీ దీన్ని సమీక్షించవచ్చు. __చదువరి (చర్చరచనలు) 06:07, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  6. నాకు అంగీకారమేనండి. ప్రచురించిన తరువాత నాకు వ్యాసాన్ని తప్పనిసరిగా సరిదిద్దవలసి ఉంటుంది.--''వి.జె.సుశీల'' (చర్చ) 15:50, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  7. ప్రతిపాదనకు నేను అంగీకరిస్తున్నాను. ఉదయ్ కిరణ్ (చర్చ) 11:11, 26 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  8. నేను అంగీకరిస్తున్నాను. గతంలో తగ్గింపు విషయములో నానా యాగి జరిగింది. ఇప్పుడు అనువాద యంత్రం ఎంత అనువాదం చేసిన 30 శాతం కాలేదు అంటుంది కాబట్టి 20% పెడితే బాగానే ఉంటుంది.ప్రభాకర్ గౌడ్చర్చ 09:41, 28 మే 2024 (UTC).[ప్రత్యుత్తరం]
  9. నేను అంగీకరిస్తున్నాను. అయితే, కొంతకాలం వరకు ఇది పరిశీలనలో పెట్టి మరింత తగ్గించవచ్చునేమో ఆలోచించాలి.Muralikrishna m (చర్చ) 03:02, 2 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • ప్రతిపాదనకు వ్యతిరేకించినవారు


  • ప్రతిపాదనకు తటస్థతంగా ఉన్నవారు

ఇలాంటి ప్రతిపాదన గతంలో వచ్చి వీగిపోయింది. నాణ్యత ఏమైపోయినా పర్లేదు, ఈ పరిమితిని తొలగించాల్సిందే అన్నది అప్పటి ప్రతిపాదన. సహజం గానే అది వీగిపోయింది. అనువాద పరికరం పనితీరుకు ఒక కొలత అంటూ ఏదైనా ఉంటే, ఆ కొలతను చూపించి పరిమితిని తగ్గించాలని ప్రతిపాదించి ఉంటే దానిపై బహుశా అంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. ప్రస్తుత ప్రతిపాదన ఆ లోపాన్ని అధిగమించింది అని నా అభిప్రాయం.

అనువాద పరికరపు పనిలో నాణ్యత పెరిగింది, అంచేత ఈ పరిమితిని తగ్గించాలి అని ఈ ప్రతిపాదన అంటోంది. నాణ్యతకు కొలమానం ఏంటి అనేది మనం ఆలోచించాలి. అందుకు రెండు అంశాలను పరిశీలించాలి..

  1. అనువాదాలు చేస్తున్నవారు గత కొద్దికాలంగా ఏం గమనిస్తున్నారు, వారి అనుభవం ఏంటి అనేది. ప్రసురించే ముందు మానవిక అనువాద శాతం 30% పరిమితికి లోబడి ఉంది, మరింత మానవిక అనువాదం చెయ్యండి అనే సందేశం ఎన్నిసార్లు మనకు ఎదురైంది అనే అంశాన్ని మనం తలపుకు తెచ్చుకోవాలి. ఈ సందేశం గతంలో ఎంత తరచుగా వచ్చేది ఇప్పుడు ఎంత తరచుగా వస్తోంది అనేది ఆలొచించాలి. ఈ విషయమై అనువాదకులు తమతమ అనుభవాలను ఇక్కడ చెబితే బాగుంటుంది.
  2. ఈ మధ్య కాలంలో చేసిన అనువాదాల శాతాలు ఎలా ఉన్నాయి అనేది రెండో అంశం. ఒక వంద ఇటీవలి అనువాదాలను తీసుకుని వాటి అనువాద శాతం ఎంత ఉందో పరిశీలించాలి. 30% కి లోబడి ఈ శాతం వస్తే పరికరం దాన్ని ప్రచురించదు కాబట్టి, మరిన్ని మార్పు చేర్పులు చేసి దాన్ని 30% దాటించి ప్రచురణ చేస్తూంటాం గదా.. అంటే అలాంటి వ్యాసాల శాతం 30 కి బాగా దగ్గరగా ఉంటుందని కూడా మనం భావించవచ్చు. అందుచేత నా ఉద్దేశంలో ఈ వంద అనువాదాల సగటు శాతం 30 - 35% మధ్య ఉంటే ఈ పరిమితిని 25% కు తగ్గించవచ్చు అనిపిస్తోంది.

__చదువరి (చర్చరచనలు) 04:41, 14 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇవ్వాళ ప్రచురించిన ప్రియాంక్_పంచాల్ తో మొదలుపెట్టి వెనక్కి 100 వ్యాసాల్లో మానవిక అనువాద శాతాలను పరిశీలిస్తే కింది ఫలితాలు కనిపించాయి.
  • మానవిక అనువాదం 30-33% మధ్య ఉన్న వ్యాసాల సంఖ్య: 39
  • మానవిక అనువాదం 33-35% మధ్య ఉన్న వ్యాసాల సంఖ్య: 10
  • మానవిక అనువాదం 35-40% మధ్య ఉన్న వ్యాసాల సంఖ్య: 24
  • మానవిక అనువాదం 40% పైన ఉన్న వ్యాసాల సంఖ్య: 27
100 వ్యాసాల్లో 49 వ్యాసాలు 35% లోపు ఉన్నాయి. 51 వ్యాసాలు దానికి పైన ఉన్నాయి. వాడుకరులు తమతమ అభిప్రాయాలు చెప్పేందుకు ఈ అంకెలు కొంత పనికిరావచ్చు. పరిశీలించవలసినది.__ చదువరి (చర్చరచనలు) 09:55, 14 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు ప్రస్తావించినట్టుగా... అనువాదయంత్రాన్ని ఎక్కువమంది వాడుకరులు ఉపయోగించినందువల్ల దాని నాణ్యత కొంతవరకు పెరిగింది అనేమాట వాస్తవం. గతంలో అనువాద ఉపకరణం సరైన అనువాదాన్ని ఇవ్వకపోవడం వల్ల అనువాద పాఠ్యంలో ఎక్కువ మార్పులు చేసేవాళ్ళం. దాంతో అది 30% మానవిక అనువాద స్థాయి దాటిపోయి, వ్యాసం ప్రచురితమయ్యేది. కానీ, గతంలోకంటే ప్రస్తుతం అనువాద ఉపకరణం దాదాపుగా సరైన అనువాదాన్నే అందిస్తోంది. ఆ అనువాదాన్ని కొంచెం మార్పులు చేస్తే సరిపోతుంది. అయితే, అనువాద పాఠ్యాన్ని వీలైనంత మార్చినాకూడా 30% నిబంధన వల్ల వ్యాసాన్ని ప్రచురించలేకపోతున్నాం. కాబట్టి, మానవీయ అనువాద పరిమితిఆంక్ష 30% నుండి 25%కి తగ్గిస్తే మంచిదని నా అభిప్రాయం.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:25, 21 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

చర్టపై నిర్ణయం ప్రకటించుట గురించి

మార్చు

ఈ చర్చను మొదలపెట్టి సంవత్సరం పైబడిననూ తాజాగా మరికొంతమంది అనువాదయంత్రంపై ఉన్న మానవీయ అనువాద పరిమితిఆంక్ష 30% నుండి 25%కి తగ్గిస్తే మంచిదని అభిప్రాయాలు వెల్లడించారు.పెప్రతిపాదనకు వ్యతిరేకించినవారు ఎవ్వరూలేరు. ప్రస్తుతం వికీపీడియాలో వ్యాసాల సంఖ్య 95,825 ఉన్నవి.తెవికీపండగ-2025 (నవంబరు లేదా డిసెంబరు) నాటికి లక్ష వ్యాసాల టార్గెటుకు చేరుకోవాలిసి ఉంది.ఎక్కవ మంది వాడుకరులు దీని మీద ఉత్సాహంగా పనిచేయాలంటే దీనిమీద సత్వర తదుపరి చర్యలు తీసుకోవలసిన అవసరముంది. కావున పై ప్రతిపాదనల చర్చలో పాల్గొనని రవిచంద్ర గారు గాని,లేదా వెంకటరమణ గారు గానీ చర్చపై నిర్ణయం ప్రకటించవలసినదిగా కేరుచున్నాను.చర్చలో పాల్గొనిన అందరికీ ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 07:56, 1 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం

మార్చు

మానవిక అనువాద పరిమితి ప్రస్తుతం ఉన్న 30% నుంచి 25% ని తగ్గించాలనే ఈ ప్రతిపాదనకు ఎవరూ వ్యతిరేకత చూపించలేదు. చర్చను మొదలు పెట్టిన తర్వాత అనువాద పరికరం నాణ్యత కొద్దిగా పెరిగినట్లు యాధృచ్చిక వ్యాసాల పరిశీలన ద్వారా తెలుస్తోంది. ఇంకా పైన ఒక చర్చలో యాంత్రిక అనువాదాల్లో మానవిక అనువాదం సుమారు 30% మేర ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది మనం విధించుకున్న 30% నిబంధనను ఎలాగోలా ఫుల్‌ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా భావిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో మానవిక అనువాద పరిమితిని 25% కి తగ్గించడం సబబైన నిర్ణయమే. ఈ నిర్ణయాన్ని అమలు పరిచిన తర్వాత కూడా ఒక నెల రోజుల పాటు వ్యాసాల నాణ్యతను పరిశీలించాలి. తర్వాత అవసరమైతే పునఃపరిశిలీంచుకోవచ్చు. - రవిచంద్ర (చర్చ) 16:30, 1 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

English summary of the decision

మార్చు

There is no opposition to the proposal to reduce the manual translation limit. Hence it is decided to reduce the limit from 30% to 25%. (చదువరి (చర్చరచనలు) 00:23, 2 జూన్ 2024 (UTC))[ప్రత్యుత్తరం]

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.