SATYA SAI VISSA
స్వాగతం
మార్చుSATYA SAI VISSA గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Rajasekhar1961 (చర్చ) 12:52, 17 మార్చి 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 23
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Rajasekhar1961 (చర్చ) 12:52, 17 మార్చి 2015 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
తెవికీ గురించి మరింత తెలుసుకోండి
మార్చు@SATYA SAI VISSA గారు, పై స్వాగత సందేశంలో తెవికీగురించి తెలుసుకోవటానికి మంచి లింకులున్నాయి. అవి చదివి, కొన్నాళ్లు ఇప్పటికే వున్న వ్యాసాలను మెరుగు చేయండి. ఆ తరువాత కొత్త వ్యాసాలు ప్రయత్నించవచ్చు. వాడుకరి చర్చాపేజీలో మీరు చేర్చిన వ్యాసం లాంటి వివరం తొలగించాను. అర్జున (చర్చ) 13:18, 17 జనవరి 2022 (UTC)
మీరు రాస్తున్న వ్యాసాలు గురించి.
మార్చుSATYA SAI VISSA గారు ముందుగా వికీపీడియాలో వ్యాసాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు.మీరు రాసిన వ్యాసాలలో మూలాలు పెట్టాలి.మూలాలు లేనిచో నిర్వాహకులు వ్యాసాన్ని తొలగిస్తారు.అలాగే శీర్షికలో విస్సా ఫౌండేషన్ అని పెడుతున్నారు అలా పెట్టకూడదు. వీకి నియమాలకు విరుద్ధం అలా పెట్టకండి. ఏమైనా సహాయం కావాలి అంటే అడగండి చేస్తాను.Ch Maheswara Raju☻ (చర్చ) 12:11, 22 జనవరి 2022 (UTC)
- అయ్యా నమస్కారం మహేశ్వర రాజు గారికి నమస్సులు
- మీరు అభిమానంతో చేసిన సూచనలకు నా హృదయపూర్వక కృతజ్నతలు వ్యాసాలలో మూలాలు పెట్టాలి, మూలాలు లేనిచో నిర్వాహకులు వ్యాసాన్ని తొలగిస్తారు అని రాసారు అది ఏమిటో కొంచెం వివరించగలరు. అలాగే శీర్షికలో విస్సా ఫౌండేషన్ అని పెట్టకూడదు అన్నారు వెంటనే తొలగిస్తాను. దయచేసి ఇకముందు కూడా మీ అమూల్య సలహాలు, సూచనలు అందించమని మనవి SATYA SAI VISSA (చర్చ) 10:21, 23 జనవరి 2022 (UTC)
- సత్యసాయి విస్సా గారూ, వికీలో ఏది రాయాలన్నా దానికి కనీసం రెండు మూడు ప్రామాణిక ఆధారాలు (మూలాలు) ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రముఖమైన అంశాలే ఉంటాయి. ఆ ప్రామాణికతను నిర్ధారించడం కోసం మంచి రచయితలు రాసిన, పేరొందిన ప్రచురణ కర్తలు ప్రచురించిన పుస్తకాలైనా, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి వార్తా పత్రికలైనా, ఇదివరకే ప్రచురించబడ్డ పరిశోధనా పత్రాలైనా ప్రమాణంగా తీసుకుంటారు. అంటే ఇక్కడ కేవలం మీరు ఎక్కడో విన్నవి, కన్నవి రాయకూడదు. దానికి ఆధారాలు చూపించాలి. అవి ప్రముఖమైనవే నని నిర్ధారించాలి. వీటి గురించి వివరంగా తెలియాలంటే మీకు పైన అర్జున గారు చెప్పినట్లు స్వాగత సందేశంలో కొన్ని లింకులు ఉన్నాయి. వాటిని చదివి అర్థం చేసుకుని తర్వాత రాయడం మొదలుపెట్టండి. లేదంటే వికీలో ఇదివరకే ఉన్న వ్యాసాలు ఎలా ఉన్నాయో చూడండి. మీకు ఒక అవగాహన వస్తుంది. - రవిచంద్ర (చర్చ) 13:35, 24 జనవరి 2022 (UTC)
విస్సా వారి వంశ చరిత్ర:
మార్చువిస్సా వారి వంశ చరిత్ర: వ్యాసంలో కింది అనౌచిత్యాలను గమనించాను.
- విషయ ప్రాముఖ్యత లేదు. విస్సా వారి వంశానికి వికీ పేజీ ఉండేంత ప్రాముఖ్యత ఉందని తగు మూలాలతో నిరూపించాలి. వివరాలకు వికీపీడియా:విషయ ప్రాముఖ్యత చూడండి.
- చూసారట, చేసారట వంటి కల్పనలు రాసారు. క్షేత్ర మాహాత్మ్యాలు రాసినట్లుగా రాయకూడదు.. సముచితమైన, నిర్థారించదగ్గ మూలాలతో రాయాలి. అవసరమైతే మూలాల గురించి మరింత చదవండి.
- విదుషీమణి, పుంభావ సరస్వతి వంటి వర్ణనలు రాయకూడదు. వ్యక్తుల కీర్తిగానాన్ని వినిపించరాదు. అది వికీశైలికి విరుద్ధం.
ప్రస్తుతమున్న రూపంలో ఈ వ్యాసాన్ని తక్షణమే తొలగించాల్సి ఉంది. అయితే చర్చించమని మీరు అక్కడ నోటీసు పెట్టారు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. మీకు విషయ ప్రాముఖ్యత గురించి తెలుసని అక్కడ అన్నారు. బహుశా పైన నేను రాసినది అసలు రాయాల్సిన అవసరం లేదేమో తెలీదు. ఏది ఏమైనప్పటికీ, ఆ వ్యాసంలో తగు మార్పులు చెయ్యవలసినదిగా వినతి. __ చదువరి (చర్చ • రచనలు) 07:50, 27 జనవరి 2022 (UTC)
పినపళ్ల (ఆలమూరు) పేజీలో
మార్చుపినపళ్ల (ఆలమూరు) పేజీలో కింది వాక్యాలను ఒక చోట మూలంగా ఉదహరించారు. "ఊరిలో పెద్దవయసు గ్రామ పెద్దలు చెప్పెవారు దాదాపు 1880 సంవత్సరంలో అంటారు, విస్సా వారి కుటుంబం గురించి ఆ గ్రామ ప్రముఖులు, రెటైర్డ్ పొస్ట్ మాస్టర్, సంగీత, సాహిత్య, సాంస్కృతిక కళాప్రియుడు, పర్యాటకుడు, "యాత్ర ప్రియారత్న" శ్రీ కొత్తపల్లి సూర్యానారాయణ గారి స్పందన: ముఖపుస్తక మాధ్యమం 20-03-2019"
- గ్రామ పెద్ద చెప్పేవారు అనేది నిర్ధారించుకోదగ్గ మూలం కాదు.
- ముఖ పుస్తకం వంటి వ్యక్తిగత సమాజిక మాధ్యమాలు మూలాలుగా పనికిరావు.
అలాగే "ఆ నగర సంకీర్తన బృంద సభ్యులతో ఈ వ్యాస రచయిత సత్యసాయి విస్సా ముఖాముఖి వివరాలు ఈ యూట్యూబ్ లింక్ లో చూడవచ్చు " అని ఇంకో చోట మూలంగా రాసారు.
- యూట్యూబు ఇంటర్వ్యూల్లాంటి వాటిని ప్రసిద్ధులు చేసినవైతే కొన్ని సందర్భాల్లో మూలంగా వాడొచ్చు గానీ, ఇతరుల ఇంటర్వ్యూలను మూలంగా తీసుకోలేము సార్.
- సగౌరవంగా ఒక మాటండి.. వ్యాసంలో రచనలు చేసినవాళ్ళు ఇంకా ఉన్నారు.
మొత్తమ్మీద.. మీరు చెప్పేవేవీ అసత్యాలని నేను అనడం లేదండి. అవన్నీ నిజాలనే నేను నమ్ముతున్నాను. కానీ వికీలో కావలసినది మన నమ్మకాలు, మనకు మాత్రమే తెలిసిన విషయాలు కాదు. తగు ఆధారాలను - ఇతరులు కూడా నిర్థరించుకోగలిగే ఆధారాలను - చూపించగలిగే వాస్తవాలనే వికీలో రాయాలి. అది గమనించగలరు. పోతే, ఏకవచనంలో రాయడమనేది వికీ విధానం. ఇది చూడండి. __ చదువరి (చర్చ • రచనలు) 08:10, 27 జనవరి 2022 (UTC)
- అయ్యా నమస్కారం! మీ అమీల్య సూచనలు సలహాలు తప్పకుండా పాటించి వాటి కనుగుణంగా నా వ్యాసాల సవరిస్తాను.
- కొంచెం సమయం ఇస్తే వాటి మూలాలు కూడా ఇచ్ఛే ప్రయ త్నం చేస్తాను దానికి కొంచెం సమయం కావాలి.
- భవదీయుడు SATYA SAI VISSA (చర్చ) 10:07, 29 జనవరి 2022 (UTC)
విస్సా వారి వంశ చరిత్ర: వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చువిస్సా వారి వంశ చరిత్ర: వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- దాదాపు 5 నెలల కిందట పేజీని సృష్టించినపుడు వ్యాసకర్త ఇలా ట్యాగు పెట్టారు: "దీని రచయితకు వికీపీడియా యొక్క inclusion guidelinesతో అవగాహన ఉన్నది. ఈ వ్యాసాన్ని సదుద్దేశంతోనే సృష్టించారు. బహుశా వికీపీడియా ప్రమాణాలకు తగిన విధంగా దిద్దటానికి ఇంకా కొంత కృషిచేయాలి. అప్పటి దాకా దయచేసి తొందరపడి తొలగించాలని ప్రతిపాదించవద్దు." అప్పుడూ ఈ పేజీ గురించి ఆ వాడుకరి చర్చ పేజీలో ఇలా రాసాను.
"విషయ ప్రాముఖ్యత లేదు. విస్సా వారి వంశానికి వికీ పేజీ ఉండేంత ప్రాముఖ్యత ఉందని తగు మూలాలతో నిరూపించాలి. వివరాలకు వికీపీడియా:విషయ ప్రాముఖ్యత చూడండి. చూసారట, చేసారట వంటి కల్పనలు రాసారు. క్షేత్ర మాహాత్మ్యాలు రాసినట్లుగా రాయకూడదు.. సముచితమైన, నిర్థారించదగ్గ మూలాలతో రాయాలి. అవసరమైతే మూలాల గురించి మరింత చదవండి. విదుషీమణి, పుంభావ సరస్వతి వంటి వర్ణనలు రాయకూడదు. వ్యక్తుల కీర్తిగానాన్ని వినిపించరాదు. అది వికీశైలికి విరుద్ధం. ప్రస్తుతమున్న రూపంలో ఈ వ్యాసాన్ని తక్షణమే తొలగించాల్సి ఉంది. అయితే చర్చించమని మీరు అక్కడ నోటీసు పెట్టారు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. మీకు విషయ ప్రాముఖ్యత గురించి తెలుసని అక్కడ అన్నారు. బహుశా పైన నేను రాసినది అసలు రాయాల్సిన అవసరం లేదేమో తెలీదు. ఏది ఏమైనప్పటికీ, ఆ వ్యాసంలో తగు మార్పులు చెయ్యవలసినదిగా వినతి." అయితే ఆ తరువాత వ్యాసంలో ఏ మార్పూ జరగలేదు. మరొక్క వారంలో విషయ ప్రాముఖ్యతను నిరూపించకపోతే, వ్యాసాన్ని తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/విస్సా వారి వంశ చరిత్ర: పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చ • రచనలు) 17:12, 19 జూన్ 2022 (UTC) చదువరి (చర్చ • రచనలు) 17:12, 19 జూన్ 2022 (UTC)