వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/పాత చర్చ 2
1, 2, 3 |
తెవికీలో పాలసీలు
మార్చుప్రస్తుతం తెవికీలో చాలా మట్టుకు విధివిధానాలకు, ఆంగ్ల వికీలో ఉన్న ఇప్పటికే ఉన్న విధానాలను ప్రామాణికంగా తీసేసుకుంటున్నారు. దీనివలన తెవికీపై చెడు ప్రాభావం పడుతుందని నా అభిప్రాయం. అందులో మొదటిది, ఆంగ్లవికీలో ఉన్న విధానాలు ఆంగ్లవికీకి అనుగునంగా రాసినవి, వాటిని అక్కడి సభ్యులు బాగా చర్చించుకుని అందరి సలహాలూ తీసుకుని ఆపై మెల్లమెల్లగా నిర్మించుకున్నారు. కానీ అక్కడి పాలసీలను తెలుగు వికీపీడియాకు అన్వయించుకోవడం కష్టం, ఎందుకంటే తెలుగు వికీపీడియా-ఆంగ్ల వికీపీడియా రెండూ సమాన స్థాయిలో లేవు. ఆంగ్ల వికీపీడియా బాగా అభివృద్ది చెందిన వికీపీడియా, బోలెడంత మంది సభ్యులుకల వికీపీడియా కూడా, కాబట్టి అక్కడ ఉన్న పాలసీలను అక్కడ అవసరాలకు సరిపోయేటట్లు తయారవుతుంటాయి. తెలుగు వికీపీడియాలో కూడా మనం సొంతంగా మనకు సరిపోయేటట్లు పాలసీలను తెయారు చేసుకోవాలని, అలా తయారు చేసుకున్న పాలసీలనే ఉపయోగించాలనీ ప్రతిపాదిస్తున్నాను. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 18:00, 28 ఏప్రిల్ 2008 (UTC)
- శివ అభిప్రాయం
నేను ఆంగ్ల వికీ పాలసీలు చదువలేదు. లాజికల్ గా ఆలోచిస్తే, పాలసీలనేవి ఒక కార్యక్రమాన్ని సజావుగా జరుపుకోవటానికి ఏర్పరచబడ్డ నియమాలు మాత్రమే. వికీ అనేది మొదట ఆంగ్ల బాషలో మొదలవటంవల్ల, సహజంగా అక్కడి పాలసీలు, మిగిలిన భాషా వికీలలోకి తీసుకోబడినాయి. అంతమాత్రాన, తెలుగులో వాటిని మనకు అనుగుణంగా మార్చుకోకూడదని లేదుకదా!కొన్ని పాలసీలు తెలుగు వికీకి ప్రత్యేకం(మూడొవ్యక్తి గురించి ఏకవచనంలో వ్రాయటం వంటివి) కాకపోతే సమస్య ఎక్కడ అంటే ఏ పాలసీలని మార్చాలి? మార్చవలసిన పాలసీలను ప్రతిపాదించి, వాటిని మార్చవలసిన అవసరం గురించి చర్చించి, అందరికీ అమోదయోగ్యమయిన మార్పు చేసుకోవటంలో తప్పు లేదనుకుంటాను.--SIVA 02:38, 1 మే 2008 (UTC)
- తేవీకీకి అనుగుణంగా పాలసీలు తయారుచేసుకోవడం సబబే.కానీ పాలసీల విషయంలో నాకు అంతగా అవగాహన లేదు.మీరంతా నిర్ణయించండి చర్చించి మన పాలసీలు మనం నిర్మించుకుందాం.ఇందుకు నా మద్దతు సహకారం ఉంటుంది. --t.sujatha 07:58, 29 ఏప్రిల్ 2008 (UTC)
నిస్సందేహంగా. అయితే అన్ని పనులలాగానే ఇది కూడా చాలా సమయం పడుతుంది. పాలసీలను చర్చించే అంత Mass కూడా మనకు లేదిప్పుడు. కాని కొంత జవాబు పై ప్రతిపాదనలోనే ఉంది (రెండూ సమాన స్థాయిలో లేవు.). ఇప్పటికే అభివృద్ధి చెందిన ఆంగ్లవికీ పాలసీలు మానకు మార్గదర్శకాలుగా ఉండక తప్పదు. అయితే అవి తెలుగు వికీ పాలసీలు కావు అని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనపై చర్చ సాగనివ్వండి. సమాంతరంగా నేను రెండు ప్రారంభ వ్యాసాలు కూర్చి చర్చకు, అంగీకారానికి పెడతాను.
- వికీపీడియా:క్రొత్త సభ్యులు తెలుసుకోవలసిన ముఖ్య నిర్దేశకాలు - ఎందుకంటే చేరివారు చాంతాడంత పాలసీలు చదువుతూ ఉంటే చిరాకొచ్చి వెనక్కెళతారు. సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కాపీరైటు నోటీసు ఎందరు చదువుతారు?
- వికీపీడియా:పాలసీలు విధానం - తెలుగు పాలసీలు ఏమిటి? ఆంగ్ల పాలసీలు ఎంతవరకు మనం పాటించాలి? క్రొత్తపాలసీలు ఎలా వస్తాయి? పాలసీలగురించి విభేదాలు ఎలా పరిష్కరించుకోవాలి? - వగైరా.
అన్నట్టు - "పాలసీ"కి సరైన తెలుగు పదం ఏమిటి? "విధివిధానం"? "నియమం"? "నిర్దేశకం"? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:04, 29 ఏప్రిల్ 2008 (UTC)
- నాకు కూడా మనకు మనం సొంతంగా తయారు చేసుకున్న దిశా నిర్దేశాలను పాటించడమే సరైనదని నమ్ముతున్నాను. ఉదాహరణకు మహాత్ముల గురించి వ్యాసాలు రాసేటపుడు గౌరవ వాచకం వాడితే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మనమందరం కలిసి చర్చిస్తే ఇలాంటి విధివిధానాలను ఏర్పాటు చేసుకోవడం కష్టమేమీ కాదు. రవిచంద్ర(చర్చ) 12:05, 29 ఏప్రిల్ 2008 (UTC)
- నా అభిప్రాయం కూడా తెలుగు వికీలో వ్రాసేటప్పుడు, గౌరవసూచకంగా (ఎవరికయినా సరే) 'ఆయన' ('అతను' బదులు) 'ఆవిడ' ('ఆమె'బదులు) 'చెప్పారు/అన్నారు'('చెప్పాడు/అన్నది' బదులుగా)అని వ్రాస్తేనే బాగుంటుంది, చదవటప్పుడు ఎబ్బెట్టుగా అనిపించదు. ఆంగ్ల భాషలో మూడొ వ్యక్తి గురించి వ్రాసేటప్పుడు ఏక/బహు వచనాలను వాడే ఛాయిస్ లేదు, పూర్తిగా బహువచనమే, ఏకవచన ప్రయోగం శతాబ్దాల క్రితంమే మానేశారు. కాబట్టి వికీలో దీనికి సంబంధించిన పాలసీ ని మారెస్తేనే బాగుంటుందని నా సలహా.--SIVA 02
- 38, 1 మే 2008 (UTC)
దీని గురించి ముందొక సారి నేను చెప్పాను. ఆంగ్లవికీ విధి విధానాలను మక్కికి మక్కీ అనుసరించడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేని విషయం. అక్కడ వ్రాస్తూ ఉన్నవారు ఇక్కడ కూడా వ్రాస్తున్నారని నాకు తెలుసు, వారు అక్కడి విధి విధానాలను ఖచ్చితంగా తెవికీలో కూడా అనుసరిరించాలనుకోవడం వలన కొన్ని సమస్యలు వస్తున్నాయి. కేవలం మూలాన్ని మాత్రమే తీసుకొని మిగిలిన భాగాన్ని మనమే మనకణుగుణంగా మార్చుకోవడంలో ఒక విధమైన ఆనందం కూడా ఉంటుంది. నాలాంటి ఆంగ్ల పరిజ్ఞానం తక్కువ కలిగిన వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి నా ఓటెప్పుడూ తెవికీ ఆంగ్ల వికీ చాయల నుండి బయటకొచ్చి ఒక ప్రత్యేకమైన వికీ పిడియాగా మారాలనే వైపే.--విశ్వనాధ్. 12:40, 29 ఏప్రిల్ 2008 (UTC)
- ఆంగ్ల వికీలో ఉన్న నియమాలు కొన్ని వేల కోట్ల చర్చల తరవాత వచ్చినవి. అవన్నీ మనము మళ్ళీ చర్చించాలా? ఫలితం మాత్రం ఒకటే ఉంటుంది. ఎందుకంటే భాష వేరైన మాత్రాన మనుషులు మారిపోరు. మీరు కావాలంటే చర్చించుకోండి. నాకా ఓపిక లేదు. చర్చసాయీరచనలు 14:48, 29 ఏప్రిల్ 2008 (UTC)
- మళ్ళీ మళ్ళీ చర్చింకునే బదులు ఉన్న నియమాలను అనువదించి, సభ్యులకు నియమాలపై అవగాహన కల్పించడం మేలు. చర్చసాయీరచనలు 15:18, 29 ఏప్రిల్ 2008 (UTC)
- విధానాలను రూపొందించడంలో మనం ఎన్వికీని అనుసరించాం, కాదన్ను. కానీ మక్కికి మక్కీగా కాదు. కొన్ని చోట్ల మార్పులు చేసాం. ఈ మార్పులు అవసరమైన చోట్ల కాక, అనివార్యమైన చోట్ల మాత్రమే చేసాం. మనకనుగుణమైన విధానాల కల్పన కోసం గతంలో మనం చర్చించాం. ఈ విషయమై ఇదే పేజీ యొక్క పాత పేజీని చూడవలసినదిగా సభ్యులను కోరుతాను. ప్రదీప్ చెప్పినట్టు, అన్ని విధానాలనూ సమీక్షించడంలో తప్పేం లేదు. మార్పు చేర్పులు అవసరమైన చోట్లను గుర్తించి మనకనుగుణంగా మార్చుకోవడం మంచి ఆలోచనే! దీనికి సంబంధించి నా ఆలోచనలు..
- విధానాలనగానే మనకు కాపీహక్కుల వంటి నియమాలపై దృష్టి పోతుంది. వాటిని కదిలించరాదని నా అభిప్రాయం. విధానాలను మార్చుకోవచ్చు.. నిబంధనలను సవరించడం కూడదు.
- ప్రతీ విధానం యొక్క పేజీనీ పరిశీలించి ఎక్కడ మార్పులు చెయ్యాల్సి ఉందో ఆ పేజీలోనే చర్చించి, తగు మార్పులు చేసుకోవాలి. సభ్యులంతా అక్కడ పాల్గొంటే బాగుంటుంది. మనందరం కలిసి చేసుకోవాల్సిన పనిది.
- విధానాలు చాలా ఉన్నప్పటికీ, నిజానికి సభ్యులు పాటించవల్సిన నియమాలు నాలుగేనని మనకు తెలిసిందే! ఇవి శిలా శాసనాలు. వీటితో పాటు కాపీహక్కుల నియమాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ విధానాల్లో మనక్కావలసిన మార్పులు చేసుకోవడంలో నాకభ్యంతరమేం కనబడలేదు. ::పోతే..
- కాసుబాబు గారు సూచించిన కొత్త పేజీల విషయంలో నాకో అభ్యంతరముంది. కొత్తవారికి తెవికీని పరిచయం చెయ్యడంలో, మాలిమి చెయ్యడంలో మనం సఫలం కాలేకపోయాం. కొత్త సభ్యులకు తెవికీ ఓ కొరకరాని కొయ్య. రాసే విషయంలో ఉన్న నియమాలు, నిబంధనలు, విధానాలకు తోడు, యూజరు ఇంటరుఫేసు కూడా వాడుకరికి తొందరగా కొరుకుడు పడదు. సహాయం, వికీపీడియా నేమ్‌స్పేసుల్లో మనమిప్పటికే అనేకానేక పేజీలు తయారుచేసాం. సభ్యులకు వీలుగా ఉంటుందని ఆశిస్తూ ఈ పని చేసాం. అలా ఆయా పేజీలు బాగా ఎక్కువైపోయి కొత్తవారికి ఏయే పేజీలు చదువుకోవాలనే విషయమై అయోమయం నెలకొన్నది. దీనికి బాధ్యుల్లో నేనూ ఒకణ్ణి. (నేనే ముఖ్య కారణమన్నా నేనేమనుకోను.) ఇప్పుడు మనం చెయ్యాల్సింది తెవికీని మరింత సౌకర్యవంతంగా, మరింత తేలిగ్గా లొంగేలా చెయ్యడం. అందుగ్గాను కొత్త పేజీలను సృష్టించకుండా, ఉన్న పేజీలనే సంబద్ధీకరించాలని నా అభిప్రాయం. ఇక ఆయన సూచించిన రెండో పేజీ గురించి.. ఆ చర్చ కోసం ఈ పేజీ చాలదని అనుకుంటే అలాగే కొత్త పేజీ చెయ్యొచ్చు. దాన్నీ దీనికో అనుబంధ పేజీగా చేద్దాం ఎలాగూ విధానాల సమీక్ష చేద్దామని ప్రతిపాదన వచ్చింది కాబట్టి, దాంతోబాటే కింది పనులూ చేద్దాం.
- కొత్తవారికి సహాయమందించే పేజీలను క్రమబద్ధీకరించడం
- కొంత అలవాటు పడినవారికి సహాయమందించే పేజీలను క్రోడీకరించడం
- తెవికీకి బాగా అలవాటు పడిన వారికి ఉన్నత స్థాయి సహాయం పేజీలు తయారు చెయ్యడం
- దీన్నో ప్రాజెక్టుగా తీసుకుని పని చేద్దాం. నావంతు పని చెయ్యడానికి నేనూ సిద్ధం.
- __చదువరి (చర్చ • రచనలు) 18:08, 29 ఏప్రిల్ 2008 (UTC)
- తెవికీకి ప్రత్యేకంగా పాలసీలు ఉండటం ఎంతయినా అవసరం. మాటిమాటికి ఆంగ్ల వికీ పాలసీలను ఎత్తి చూపడం నాకు అస్సలు నచ్చదు. ఆంగ్ల వికీని మాతృసంస్థగా కాకుండా సోదర సంస్థగా భావిద్దాం. పరిమాణంలోనూ, దిద్దుబాట్ల సంఖ్యలోనూ, సభ్యుల సంఖ్యలోనూ ఆంగ్ల వికీ సముద్రం లాంటిదైతే తెవికీ చెరువు లాంటిది. దానికీ, దీనికి ఇంత తేడా ఉన్నప్పుడు అక్కడి విధానాలే మనం ఆచరించాలనడం సమంజసం కాదు. అంతేకాకుండా ప్రతి సభ్యునికి ఆంగ్ల వికీ పాలసీల పరిజ్ఞానం ఉండకపోవచ్చు. తెలియక చేసిన నేరానికి ఆంగ్ల వికీ నియమం చూపించి శిక్ష విధించడం ఏ మాత్రం సరైనది కాదు. మనమే సొంతంగా పాలసీలను రూపొందించుకొని కొత్తగా చేరే సభ్యులకు కూడా స్వాగతం పలికేటప్పుడే పాలసీలకు సంబంధించిన లింకు కూడా చేరిస్తే ఆ తర్వాత సభ్యులు కూడా నాకు తెలియదు అని తప్పించుకొనే అవకాశం ఉండదు. ఇది ఒక్క రోజులో జరిగే పని కాదు, అయిననూ ప్రారంభిస్తే క్రమక్రమంగా పుంజుకొని మునుముందు సంపూర్ణ రూపం దాల్చవచ్చు. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:16, 3 మే 2008 (UTC)
- విధానాలను రూపొందించడంలో మనం ఎన్వికీని అనుసరించాం, కాదన్ను. కానీ మక్కికి మక్కీగా కాదు. కొన్ని చోట్ల మార్పులు చేసాం. ఈ మార్పులు అవసరమైన చోట్ల కాక, అనివార్యమైన చోట్ల మాత్రమే చేసాం. మనకనుగుణమైన విధానాల కల్పన కోసం గతంలో మనం చర్చించాం. ఈ విషయమై ఇదే పేజీ యొక్క పాత పేజీని చూడవలసినదిగా సభ్యులను కోరుతాను. ప్రదీప్ చెప్పినట్టు, అన్ని విధానాలనూ సమీక్షించడంలో తప్పేం లేదు. మార్పు చేర్పులు అవసరమైన చోట్లను గుర్తించి మనకనుగుణంగా మార్చుకోవడం మంచి ఆలోచనే! దీనికి సంబంధించి నా ఆలోచనలు..
పాతచర్చల నుండి
మార్చునేను ఇందులో పాల్గొనదలచుకోకపోయినా ఎందుకో ఇక్కడ నేను చేయబోయే వ్యాఖ్యలు మున్ముందు తెవికీ వృద్దికే దోహదం చేస్తాయనే నమ్మకంతో వ్రాస్తున్నాను. ఇక్కడ ప్రస్తుతం, నా అభిమతాలు కాకుండా తెలుగు వికీపీడియాలోని ఒక నిర్వాహకుడు మరియు ఒక అధికారి అభిమతాలను పాత చర్చలనుండి గ్రహించి పొందుపరుస్తున్నాను. వీరి అభిమతాలను బట్టి తెలుగు వికీపీడియాలో ఓటింగ్ పద్దతి సార్వజనీయంగా కాకుండా తనదైన శైలిలో ఉండాలని అనుకుంటాను. క్రింద కొన్ని వ్యాఖ్యలు కొంతమందికి వ్యంగ్యంగా అనిపించవచ్చు. నాకు ఇంతకంటే అందంగా వ్రాయడం రాదు. ముందుగానే క్షమాపనలు చెప్పుకుంటున్నాను. ఒక కొత్త సభ్యులు తెలియక తప్పులు చేస్తే కొత్తవారులే అని సమర్థించుకోవచ్చు. మరి అనుభవజ్ఞులైన సభ్యులు తప్పులు చేస్తే ఏమనాలి.
- వోటింగ్ జరుగుతున్నప్పుడు సభ్యులు లేవనెత్తిన వాటికి జవాబులు ఇవ్వకూడదు, మరియు కృతజ్ఞతలు కూడా చెప్పకూడదు. ఓటింగ్ పూర్తిగా ముగుసిన తర్వాత ఏమైనా చేయగలిగితే చేయొచ్చు.
వోటింగ్ పూర్తి కాకుండా వ్యాఖ్యలకు సమాధానాలు చెప్పడం (కృతజ్ఞతలు చెప్పడం కూడా) మంచి పద్ధతి కాదు [1].
- ఓటింగుల్లో సంఖ్యను పట్టించుకోకూడదు. కారణాలను మాత్రమే పట్టించుకోవాలి.
సాధారణంగా వికీపీడియా చర్చలలో ఓటింగ్‌లో ఎంతమంది ఫలానా విషయానికి మద్దతిస్తున్నారు అని చూసే బదులు, ఎంతమంది సరయిన కారణాలతో మద్దతిచ్చారు(లేదా ఇవ్వలేదో) చూస్తారు. దాని వలన వోటు ఎవరేవరు లేదా ఎంతమంది వేశారు అనే దానికన్నా, అలా వోటేస్తున్నందుకు వారిచ్చిన కారణాలకు ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుంది. [2]
- ఓటింగుల్లో సంఖ్యను ఎలాగూ పరిగణలోకి తీసుకోరు, కనుక sockpuppets ఎవరు వాడుతున్నారో తెలుసుకొనవలసిన అవసరం లేదు. [3]
δευ దేవా 11:45, 29 ఏప్రిల్ 2008 (UTC)
- వోటింగ్ పూర్తి కాకుండా వ్యాఖ్యలకు సమాధానాలు చెప్పడం మంచి పద్ధతి కాదు - గురించి - అది నా అభిప్రాయం కనుకనే సభ్యుని చర్చా పేజీలో వ్రాశాను. వికీ నియమాలలో కాదు. వోటింగ్ చేసేవారి ప్రతిమాటకూ స్పందిస్తే అది voting process లో interfere అయినట్లవుతుంది. ఇది వికీ రూల్ కాదు. నా పరిశీలన. ఎన్నో ఫోరమ్‌లలో ఈ నియమాన్ని పాటిస్తారు. అలా కాకపోతే వ్యతిరేకంగా వోట్లు వేసేవాళ్ళకు ముందరికాళ్ళ బంధం వేసినట్లవుతుంది. నెగెటివ్ వోట్ వచ్చినప్పుడల్లా నీవు తప్పుగా వోటు చేశావని సజెస్ట్ చేసినట్లవుతుంది. (ఉదాహరణకు రంగారావు వోటుకు సాయి అదే పేజీలో సమాధానం వెంటనే ఇచ్చేశాడు!). ఆంగ్ల వికీ నియమాలు నేను అంతగా అధ్యయనం చేయలేదు. నా వ్యాఖ్య అభ్యంతరకరమైనదైతే నేను ఉపసంహరించుకొంటాను. నా పట్టు నెరవేర్చుకోవాలనే తపన నాకు లేదని నా రికార్డు చూస్తే గ్రహించగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:23, 29 ఏప్రిల్ 2008 (UTC)
- ఓటింగుల్లో సంఖ్యను పట్టించుకోకూడదు. కారణాలను మాత్రమే పట్టించుకోవాలి. వోటింగ్ అంటేనే అంకెలు కదా. మరి వాటిని పట్టించుకోకూడదంటే ఏంటి అర్థం? చర్చసాయీరచనలు 14:50, 29 ఏప్రిల్ 2008 (UTC)
- "Ultimately it is the weight of argument which wins the vote. Not mere count" - "It is the job of bureaucrats to determine consensus when closing a request for adminship. As RfA is not a straightforward majority vote, there is no precise "pass" or "fail" percentage, and the bureaucrat may discount comments which were made in bad faith or are of questionable validity." ఈ విధానం ఆంగ్ల వికీలో ఒక విధంగా ఉపయోగపడుతుంది. తెలుగు వికీలో మరొక విధంగా. ఆంగ్ల వికీలో - వేల సంఖ్యలో సభ్యులుండటం వల్ల గ్రూపులు సహజం. కనుక evaluators అడిగిన ప్రశ్నలకు అభ్యర్ధి ఇచ్చిన సమాధానాలు చాలా ముఖ్యం. షుమారు 70% అనుకూల వోట్లు ఉంటేనే అభ్యర్ధి నిర్వాహకుడయ్యే అవకాశం ఎక్కువ. ఇక తెలుగు వికీలో - అటు 3 ఇటు 2 వోట్లు వస్తే ఆ తేడాకు మెజారిటీ అంటగట్టడం అసమంజసం. కనుక వోటర్లు ఇచ్చిన వివరణకు మరింత ప్రాముఖ్యత ఏర్పడుతుంది. అప్పుడే సంశయాత్మకంగా ఉన్న వోట్లను తృణీకరించే అవకాశం కూడా ఉంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:57, 29 ఏప్రిల్ 2008 (UTC)
నేను సభ్యుల అభ్యంతరాలకు వివరణలను క్రింద పాయింట్లుగా వ్రాస్తున్నాను. ఇక్కడ సంఖ్య కంటే వివరణ ఎంత పెద్దగా ఇచ్చారన్నదే ముఖ్యం కదా. క్రింద ఇవ్వబడిన వివరాలను కాస్త ఓపికతో చదవండి. (గమనించవలసిన ముఖ్య విషయం, ఇది ఏ ఒక్క సభ్యుడికో ఇస్తున్న వివరణ కాదు. క్రింద చెప్పబడిన విషయాలు ఎవరెవరికి వర్తిస్తాయో వారందరికీ.)
- ఎప్పుడైనా రూల్స్ అనేవి ఎవరైనా సమాజానికి విరుద్దంగా నడిచినప్పుడో, అందరూ కలసి కొంతమందిని అణగదొక్కాలని ప్రయత్నించినప్పుడో అవసరమవుతాయి. అందరూ సరిగ్గా ఉంటే రూల్స్ అవసరం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే. తప్పు అని తెలిసాక ఒప్పుకుంటే మంచిది. దాన్ని సాగదీస్తేనే వివాదాలు పెరుగుతాయి. (ఏంటి నేను చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను. :))
- మొట్టమొదటి విషయం మీరు ఆంగ్ల వికీలో ఉన్న నియమాలను మీకు నచ్చిన విధంగా వాడుకుంటున్నారు. వాడితే మొత్తంగా వాడండి లేదా మిగతా సభ్యులను మీరు గౌరవిస్తే అందరికీ నచ్చిన విషయాలను మాత్రమే వాడుకోండి. ఎంత మంది సభ్యులు అభ్యంతరం చెప్పుతున్నారని కాకుండా ఎంత గొప్పగా అభ్యంతరం చెప్పుతున్నారన్నది (మీ వివరణకు అనుగుణంగా) ముఖ్యమనుకుంటా. (మీరు ఇది కూడా మార్చవచ్చు మీకు నచ్చకపోతే.
- అక్కడ జరిగిన చర్చ మళ్ళీ ఇక్కడ జరగాలనుకోవడం సభ్యుల సమయాన్ని వృధా చేసుకోవడమే!
- ఏదైనా తప్పనిపిస్తే దాన్ని మొగ్గలోనే తుంచి వేయడం మంచిది. మానయ్యాక మనకు లొంగకపోవచ్చు.[4]
- ముందు సభ్యులు ఏయే విషయాలు ఆంగ్ల వికీకి, తెలుగు వికీకి తేడాగా రాయాలో ఆలోచించుకోవాలి. అంటే ముందు ఒక చిట్టా తయారుచేసుకోవాలి.
- ఒకవేళ అటు మూడు ఇటు రెండు ఓట్లు వస్తే మీరు కొత్తగా ఒకటి లేదా మీకు నచ్చినన్ని అకౌంట్లు క్రియేట్ చేసుకుని మీకు నచ్చిన విధంగా మార్చుకోండి. (మీరు sockpuppets ఉండడాన్ని సమర్థిస్తారు కదా!)
- ఎవరైనా సభ్యులు తన వాదన సరైనదని నిరూపించుకోవడానికి వాదించవచ్చు. ఇందులో తప్పేమీ లేదు. కాకపోతే ఇతర సభ్యులను నొప్పించకుండా ఉంటే సరిపోతుంది (సభ్యులు చేసిన వ్యాఖ్యలను ఎవరైనా వ్యతిరేకిస్తే వారి వాదన ఎంతవరకు సమంజసం అని చూడండి, అంతే కానీ మీరు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేఖంగా ఉంటే అది మిమ్మల్ని నొప్పించినట్లు కాదు!).
- ఇంతకుముందు ఓటింగ్ జరిగేటప్పుడు కృతజ్ఞతలు చెప్పితే ఎవరూ అభ్యంతరాలు తెలుపలేదు [5], కానీ ఇప్పుడెందుకు తెలుపుతున్నారో తెలుపగలరా?
- కొత్త సభ్యులెవరూ ప్రస్తుతం sockpuppets వాడడం లేదు. కానీ మీరు కొత్త సభుల గురించి చాలా తీవ్రంగా ఆలోచించి మరీ వారు భయపడతారేమోనన్న అనుమానంతో ఉన్న సభ్యులు తమ పంతం నెగ్గించుకోవడానికి, sockpuppets వాడుకోవచ్చని ప్రతిపాదిస్తున్నారు.[6]
- ఏదైనా నియమావళి రచిస్తే అది ఫూల్‌ప్రూఫ్‌గా ఉండాలి. ఓటింగుల్లో సంఖ్య పనికిరాదనేది, ఏ విధంగా ఫూల్‌ప్రూఫ్ అయ్యింది?
δευ దేవా 19:48, 29 ఏప్రిల్ 2008 (UTC)
- మూలాలు
- ↑ కాసుబాబు గారి వ్యాఖ్య -- సభ్యులపై చర్చ:Sai2020/క్రితం చర్చ 2#వోటింగ్
- ↑ ప్రదీప్ గారి వ్యాఖ్య --సభ్యులపై చర్చ:Sai2020/క్రితం చర్చ 2#Meta CheckUser
- ↑ ప్రదీప్ గారి వ్యాఖ్య -- సభ్యులపై చర్చ:Sai2020/క్రితం చర్చ 2#Meta CheckUser
- ↑ ప్రస్తుతానికి వోటింగులో అనామక సభ్యుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవచ్చనే అనుకుంటున్నాను, కానీ ఈ విషయమై నేను ఇతర సభ్యుల అభిప్రాయాల కోసం కూడా వేచి చూస్తాను. అలాగే ఒక సభ్యుడి ఖాతా sockpuppet అనే అనుమానం వచ్చిన తరువాత, ఆ sockpuppet ఎవరిదో కనుక్కోవడాన్ని కూడా ప్రస్తుతానికి నేను వ్యతిరేకిస్తున్నాను. అలా కనుక్కోవడం వలన వికీసమాజానికి జరిగే మేలుకంటే కీడే ఎక్కువని నా అభిప్రాయం. - ప్రదీప్ గారు సభ్యులపై చర్చ:రవిచంద్ర పేజీలో.
- ↑ సుజాతగారి చర్చా పేజీల్లో దేవా, చంద్రకాంత్ గారు, ప్రదీప్ గారు ఓటింగ్ ముగియకముందే కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక్క రెఫరెన్సు మాత్రమే, ఇలా చాలా ఉన్నాయి.
- ↑ ప్రస్తుతానికి వోటింగులో అనామక సభ్యుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవచ్చనే అనుకుంటున్నాను, కానీ ఈ విషయమై నేను ఇతర సభ్యుల అభిప్రాయాల కోసం కూడా వేచి చూస్తాను. అలాగే ఒక సభ్యుడి ఖాతా sockpuppet అనే అనుమానం వచ్చిన తరువాత, ఆ sockpuppet ఎవరిదో కనుక్కోవడాన్ని కూడా ప్రస్తుతానికి నేను వ్యతిరేకిస్తున్నాను. అలా కనుక్కోవడం వలన వికీసమాజానికి జరిగే మేలుకంటే కీడే ఎక్కువని నా అభిప్రాయం. - ప్రదీప్ గారు సభ్యులపై చర్చ:రవిచంద్ర పేజీలో.
దేవా గారూ, వ్యాఖ్యలను, చర్చలనూ వ్యక్తిగతంగా తీసుకోకండి. మీరు లేవనెత్తిన పాయింట్ల గురించి నా ఆలోచనలు (మాత్రమే!) ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే చర్చకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. 1. ఒక సముదాయాన్ని నిర్మిస్తున్నామని గుర్తుంచుకోవాలి. ఆ సాకుపప్పెట్ అంటే ఏంటి? అలా చెయ్యకూడదు అని తెలియని సభ్యుడు చేసిన తప్పుకు మొదటిసారే అంత పెద్ద శిక్షకు గురిచెయ్యటం సబుబుగా అనిపించలేదు. నాకు, మీకు, సాయిగారికి ఆంగ్లవికీలో పనిచేసిన అనుభవమున్నందువళ్ళ మనకా విషయాలు తెలుసు. మరి అందరికీ ఎన్వికీలో అనుభవం ఉండదు కదా (అదీ కాకా నియమాల గురించి పట్టూ విడూపూ ఉండాలని చివరిమాటగా ఆంగ్లవికీలో కూడా చెప్పారుగా
2.నియమాలు ఒక వికీతో పాటే ఎదుగుతాయి. తెలుగు వికీ సముదాయానికి అలాంటి నియమాలు చేసుకోనే అధికారం లేకుండా చేయటం తెలుగు వికీకి పరిపక్వతా దశతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళ నియమాలు రుద్దటం సరికాదు. పైనుండి అన్ని నియమాలను ఎన్ఫోర్సు చెయ్యాలని జిమ్మీ వేల్స్ కూడా కలగనలేదు ..అందుకే ఐదుమూల స్థంబాలు తప్ప మిగిలిన శిలాశాసనాలు లేవని చెప్పారు. చాలామటుకు ఆంగ్లవికీ చర్చల అనుభవసారాన్ని యధాతధంగా గ్రహించాము. చదువరి అన్నట్టు చాలా అవసరమైన చోట్లనే తగుమార్పులు చేసుకున్నాము. క్రియాశీలకంగా, సొంత ఆలోచన కలిగిన వైబ్రంట్ సముదాయం లేని తెలుగు వికీపీడియా జీవఛ్ఛవమే! ఇక్కడి వ్యాసాలన్ని ఎత్తుకుపోయి ఎవరో ఆకాశరామన్న కూడా ఒక తెలుగు విజ్ఞాన సర్వస్వము ఏర్పాటు చేయగలడు.
3. ఎవరి సమయం వృధా..చర్చించాలనుకున్న వాళ్ళకు చర్చించే హక్కులేదా? చర్చ కేవలం ఆంగ్ల భాషా వికీపీడియన్ల గుత్త హక్కు కాదు కదా. పైగా ఆంగ్ల వికీలో అంతర్గతంగా ఐరోపా-అమెరికా ధృక్కోణం ఉంటుంది (ఉదాహరణకి ఆంగ్ల వికీలో చాంతాడంత చర్చ జరిగింది కదాని అమెరికా వ్యాసానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అని ఇక్కడా పేరు మార్చలేదు కదా..ఆ చర్చా పేజీలు చూడండి)
4.అంగీకరిస్తాను
5.అలా చిట్టా చేయటం ఎంతవరకు సాధ్యమౌతుందో మరింత సమాలోచన చెయ్యాలి
6. మీరు పొరబడుతున్నారు. సాక్ పప్పెట్లని ఏవిధంగాను సమర్ధించడంలేదు.
7,8,9 -> మళ్ళీ రాస్తాను
10. ఫూల్ ప్రూఫు నియమాలా? ఆంగ్ల వికీలోని నియమాలు ఆమాటకి విస్తత భారత రాజ్యాంగము పూల్ప్రూఫా? అదీ పరిపూర్ణతలాగే జరిగేపని కాదు. --వైజాసత్య 02:31, 2 మే 2008 (UTC)
దేవా గారు రాసిన పాయింట్లపై నా స్పందన:
- అందరూ కలిసి కొంతమందిని అణగదొక్కాలనుకోవడం - ఇది చాలా పెద్దమాట. ఏదేమైనా.. తప్పు చేసినవారు ఆ తప్పును ఒప్పుకుని క్షమించమనడం ఎప్పుడో జరిగింది. ఇక, సాగదీయడం ఎక్కడ? ఆ తప్పు క్షమించదగినదా కాదా అనేది మీ చర్చాంశమైతే.., అది వివరంగా రాయండి.
- నియమాలను ఎవరో వాడేదేంటసలు? మీరూ, నేనూ మనమందరం ఈ వ్యవస్థలో భాగమే. ఎవరో ఒకరో ఇద్దరో వాడేవి కాదుగదా ఈ నియమాలు. అందరికీ వర్తిస్తాయి.
- సమయం వృథా -- ఖచ్చితంగా కాదు. పరిస్థితులకనుగుణంగా, అవసరాలకనుగుణంగా విధానాల సమీక్ష జరగాల్సిందే. తప్పులేదందులో.
- సరైనమాట!
- అవును, చర్చతో మొదలుపెట్టి, అప్పుడు తేల్చుకోవాలి - ఏమేం మార్చాలో. ఈ చర్చ ఏదో ప్రత్యేక పేజీలో కాక, ప్రతీ విధానపు పేజీలోనూ జరగాలి. ఆ చర్చ అక్కడ కలకాలం నిలిచిపోతుంది.
- ఈ ఆరోపణ ఎవరి మీద? ఎవరినో దృష్టిలో పెట్టుకుని రాసినట్టుంది. అలాంటప్పుడు ఈ వ్యాఖ్యలు సదరు సభ్యుని చర్చాపేజీలో రాసి ఉండాల్సింది.
- అవును వాదన లోని విషయాన్ని, భావాన్నే చూడాలే గానీ, వ్యతిరేకిస్తున్నారా, సమర్ధిస్తున్నారా అని కాదు. అదే సమయంలో భాష పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి.
- ఈ విషయమై సదరు సభ్యుడు తన అభిప్రాయాన్ని సభ్యుని చర్చాపేజీలో రాసారు. "నా వ్యాఖ్య అభ్యంతరకరమైనదైతే నేను ఉపసంహరించుకొంటాను." అని కూడా ఈ పేజీలో రాసారు. మీ అభ్యంతరం దేనిపైనో వివరించగలరు.
- సాక్ పపెట్లే కాదు.. అసలు ఐపీ అడ్రసుల నుండి వచ్చే వ్యాఖ్యల పట్ల కూడా మనం మరింత జాగరూకతతో, వివేచనతో వ్యవహరించాలని నా ఉద్దేశ్యం.
- ఆరో పాయింటుతో పోలిస్తే ఈ పాయింటులో వైరుధ్యం ధ్వనిస్తోంది. వైజాసత్య చెప్పినట్లు నియమాలు ఫూల్‌ప్రూఫైనవేమీ కావు. కాలానుగుణంగా మార్పు చేర్పులు జరుగుతూనే ఉంటాయి.
__చదువరి (చర్చ • రచనలు) 05:20, 3 మే 2008 (UTC)
దెవా గారు చెప్పినదే నేను చెప్పాలనుకుంటున్నాను. చర్చసాయీరచనలు 01:15, 30 ఏప్రిల్ 2008 (UTC)
వోటంగ్ జరుగుతున్నపుడు వ్యాఖ్యల గురించి
మార్చుకృతజ్ఞతలు చెప్పడం గురించి దేవా గారు ఇంత తీవ్రంగా స్పందించడం నాకు ఆశ్చర్యంగా ఉంది.
- వోటింగ్ పూర్తి కాకుండా వ్యాఖ్యలకు సమాధానాలు చెప్పడం (కృతజ్ఞతలు చెప్పడం కూడా) మంచి పద్ధతి కాదు - నేను ఈ సూచన చేయడానికి కారణాలు పైన వివరించాననే అనుకొంటున్నాను. వ్యతిరేకంగా వోట్ చేసిన వారికి ఏమీ తెలియదని వోటింగ్ పేజీలో వ్రాయవద్దు - అనే నా సూచన అర్ధం చేసుకోవడం సాయీకి కష్టం కాదు. నెగేటివ్ వోట్‌కు అలా వోటింగ్ పేజిలో స్పందిస్తూ వుంటే అదే కారణాల వల్ల వ్యతిరేకంగా వోట్ చేయాలనుకొన్న ఇతర సభ్యులకు అది ఎర్ర జెండా అవుతుంది. వారు వాద ప్రతివాదాలకు సిద్ధంగా ఉండకపోవచ్చును. తగవులాడుకోవడం కోసం వారు వికీలో పనిచేయడంలేదు గదా?
- ఇంతకుముందు ఓటింగ్ జరిగేటప్పుడు కృతజ్ఞతలు చెప్పితే ఎవరూ అభ్యంతరాలు తెలుపలేదు, కానీ ఇప్పుడెందుకు తెలుపుతున్నారో తెలుపగలరా? - కృతజ్ఞతలు చెప్పడం వల్ల ఇబ్బంది లేకున్నా నా పై సూచనకు అది corollary అవుతుంది గనుక బ్రాకెట్లలో వ్రాశాను. అసలు విషయం వదిలేసి కృతజ్ఞతల గురించే చాలా పరిశోధన, రచ్చ జరిగింది. కృతజ్ఞతలు చెప్పడానికి తెలుగు వికీ నియమాలు ఒప్పుకోవడం లేదు అన్న నింద సభ్యుల స్పందనలో ఉంది. ఇది వికీ నియమం కాదు, నా అభిప్రాయం - అని నేను స్పష్టం చేసినా గాని.
- అందరూ కలసి కొంతమందిని అణగదొక్కాలని .. ... తప్పు ఎవరు చేసినా తప్పే. తప్పు అని తెలిసాక ఒప్పుకుంటే మంచిది. - నిస్సందేహంగా. ఇక్కడ ఎవరిని అణగదొక్కడం జరిగింది? అణగదొక్కడమంటే - ఒకరి నిర్వాహక అభ్యర్ధిత్వానికి తగినంత మద్దతు రాకపోవడమా? క్షమాపణ చెబితే తప్పు ఒప్పుకొన్నట్లు కాదా? నాలాంటి ఒక్కరు చేసిన వ్యాఖ్యలు తెలుగు వికీ పాలసీలుగా భావించి, నిష్క్రమించడం న్యాయమా?
నేను వెలిబుచ్చిన ఈ చిన్న అభిప్రాయం ఇద్దరు విలువైన సభ్యుల తోడ్పాటును తెలుగు వికీకి దూరం చేయడం నాకు చాలా విపరీతంగా ఉంది. అది వారి ఇష్టం. ఇది నా స్వంత ఇల్లు కాదు గనుక ఇతరులను రమ్మనడానికీ, పొమ్మనడానికీ కూడా నాకు హక్కు లేదు. ప్రస్తుతం సాయి, దేవా సభ్యుల చర్చా పేజీలు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు నాకు అనిపించడంలేదు. కనుక (కృతజ్ఞతలకు సంబంధించిన) నా వ్యాఖ్యలను ఇక్కడ ఉపసంహరించుకొంటున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:43, 3 మే 2008 (UTC)
- వికీలో రాయడం రాయకపోవడం అనేది వ్యక్తుల స్వంత నిర్ణయం - దానిపై వ్యాఖ్యానించడం నా ఉద్దేశ్యం కాదు. ఆ నిర్ణయాలకు తామే బాధ్యులమని కాసుబాబు గారు గానీ, మరొకరు గానీ అనుకోవాల్సిన అవసరం లేదు. నామటుకు నేనైతే అలా అనుకోవడం లేదు. కాసుబాబు గారు తన అభిప్రాయం చెప్పారు. దానిపై వివరణ కూడా ఇచ్చారు. అయిపోయింది. __చదువరి (చర్చ • రచనలు) 09:08, 3 మే 2008 (UTC)
ఓటింగ్‌లో పాయింట్ల విధానం
మార్చుఓటింగ్లో అందరికీ అవకాశముండలనే ప్రజాస్వామ్య నియమాన్ని పాటించడం నేను సమర్థిస్తాను. అదే సమయంలో అందరూ సమానులే అనే దానికి అంగీకరించను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతుల ఓటింగులలో సభ్యుల ఓటింగు విలువలో తేడా ఉండడాన్ని మనం గమనించాల్సిన విషయం. లోకసభ సభ్యునికి, శాసన సభ్యునికీ మధ్య, ఒక రాష్ట్ర శాసనసభ్యునికి మరో రాష్ట్ర శాసనసభ్యుని మధ్య ఓటింగు విలువలో తేడాలు ఉన్నట్లే తెవికీ సభ్యులలో కూడా ఓటింగు విలువలో తేడాలు ఉండాలి. 4 సంవత్సరాల నుంచి తెవికీకి కృషి చేస్తున్న 20వేల దిద్దుబాట్లు పూర్తి చేసుకున్న అధికారికీ, నిన్న మొన్న చేరిన కొత్త సభ్యునికీ సమానంగా ఒకే విలువ ఉండటాన్ని ఎలా సమర్థించగలం. నా అభిప్రాయం ప్రకారం ప్రతి వెయ్యి దిద్దుబాట్లకు 1 పాయింటు చొప్పున, నిర్వాహకులకు, అధికారులకు 5, 10 చొప్పున బోనస్ పాయింట్లు ఉండాలి. అప్పుడే అనామక సభ్యుల ఓటింగును ఎదుర్కొనే శక్తి సీనియర్ సభ్యులకు ఉంటుంది. అంతేకాకుండా ఓటింగు వేయాలంటే కసీనం 50 లేదా 100 దిద్దుబాట్లు 2 లేదా 4 వారాల అనుభవం నియమం పెడితే ఆశామాషీ ఓటర్లను అరికట్టవచ్చు. సాధారణ ఎన్నికలలో కూడా ఓటు హక్కుకు కొంత కాలం స్థానిక నివాసం ఉండాలనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:34, 3 మే 2008 (UTC)
- ఇలా పాయింట్లు, లెక్కలు, గణనలు, సీనియారిటీలు ఇవన్నీ సమస్యను సులభతరం చేయటం కంటే పెద్ద కంటక వ్యవస్థను తయారుచేస్తాయి. సీనియారిటిలతో పాటే ఈగోలు ఇంకా గోలంతా వస్తుంది. అందుకనే విచక్షణ ఉపయోగించమన్నారు. వికీలో అందరికీ దాదాపు సమాన హక్కులున్నాయి. సాయీ నిర్వాహకహోదా అభ్యర్ధన నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. ఒక కొత్త సభ్యుడు సాయీని "ఈయన చేసినవన్నీ తన సభ్యుని పేజీని తీర్చడానికి చేసిన మార్పులే" అన్న అర్ధంతో ఒక వ్యాఖ్య చేశారు కదా...అందులో కొత్తసభ్యునికి అలా వ్యాఖ్య చేసే హక్కుంది, తనకు అనిపించిన దాన్నిబట్టి వ్యతిరేక ఓటు వేసే హక్కు కూడా ఉంది. కానీ నిజానిజాలు పరిశీలించిన సభ్యులెవరికైనా ఆ విషయంలో నిజం లేదని తెలుస్తుంది. అప్పుడు కేవలం గుడ్డిగా ఓట్లను గణించి నిర్ణయించడంలో ఆ సభ్యుని ఓటును కూడా గణించాలా? అలా చెయ్యటం సబబైన పనికాదు. అందుకే సంఖ్యకంటే తుది పరిశీలనలో వ్యాఖ్యలు మరియు వాటిలో నిజానిజాలకే ఎక్కువ బలమున్నది అని అన్నది. కేవలం సంఖ్యా నిర్ణయాలతో బయటి ప్రపంచంలో జరిగినట్టు అవకతవకలు వీలైనంతగా నివారించడానికే వికీ ప్రజాస్వామ్య ప్రయోగం కాదని అన్నది. అలా అని నిర్వాహకులు చాలామంది సభ్యుల నిర్ణయాన్ని తులనాడి సొంత నిర్ణయాలు చేస్తారని కూడా కాదు. ఓటింగు డిఫాల్టు ప్రక్రియ కాదు చివరి మజిలీ మాత్రమే అని ఆంగ్ల వికీపీడియా ఘోషించి చెబుతోంది. పాయింట్లు పెట్టకపోయినా కాస్త అనుభవం, సముదాయంలో సభ్యుల నమ్మకాన్ని చురగొన్న సభ్యుల అభిప్రాయాలను ఎప్పుడూ వికీపీడియా ఇలాంటి వ్యవహారాలు తేల్చటంలో ప్రాధాన్యత ఇస్తూనే వచ్చింది --వైజాసత్య 18:31, 3 మే 2008 (UTC)
ఓటింగు జరిగేటప్పుడు వ్యాఖ్యల గురించి
మార్చుఓటింగు జరిగే దశలో సభ్యుల ఓటింగులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పడం సరికాదేమోనని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. నా నిర్వాహకహోదా ఓటింగు సమయంలో నేను కూడా ఓటింగు సమయంలోనే సభ్యులకు ఓటు వేసిన వెంబడే వ్యాఖ్యలు చేశాను. కాని ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. మొన్నటి వరకు ఓటింగులో ఎవరికీ వ్యతిరేక ఓట్లు రాకపోవడంతో ఈ విధానాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కాని ప్రస్తుతం రెండు రకాలైన ఓట్లు పోలౌతున్నాయి కాబట్టి వ్యతిరేక ఓట్లు వేసిన సభ్యునికి పంపే వ్యాఖ్యల ప్రభావం తదుపరి ఓటర్లపై చూపి ఓటింగు ప్రక్రియ మందగిచ్చవచ్చు. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:00, 3 మే 2008 (UTC)
కులాన్ని కించ పరిచే సామెతలు
మార్చుకట్టేవి కాషాయాలు - చేసేవి దొమ్మరి పనులు అనే సామెత గురించి వ్రాసేటప్పుడు సభ్యులు:వికటకవి గారు దొమ్మరి వారి ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించలేదు. అందుకే నేను ఆ పేజి ఎడిట్ చేశాను. దొమ్మరి కులస్తులు పేదరికం - ఆకలి వల్ల వ్యభిచారం చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని చోట్లే వారు ఆ వృత్తిలో ఉన్నారు. ఒరిస్సా, మహరాష్ట్రలలో దోంబో మరియు దోంబర్ అని పిలవబడే వీరు అక్కడ వ్యభిచారం చెయ్యరు. "దొమ్మరి పని" అని వ్రాయకూడదు. ఎందుకంటే అది నిజంగా వారి కులవృత్తి కాదు కాబట్టి. అందుకే నేను టైటిల్ కూడా ఎడిట్ చేసాను. తెలుగులో స్త్రీలని కించపరిచే సామెతలు కూడా అనేకం ఉన్నాయి. చేతికి గాజులు తొడుక్కున్నాడు, మొగున్ని కొట్టి మొగసాలకెక్కింది వగైరా. ఇలాంటి సామెతలు ఇక్కడ వ్రాస్తే ఇది కూడా కుళ్ళు జోకుల వేదిక అయిపోతుంది. సభ్యులు:Kumarsarma (11/12/2008)
- మీరు కూడా తెవికీని సెన్సారు చేస్తున్నారా? సామెత ప్రజల్లో ఉన్నప్పుడు ఒక్కడ వ్రాయటం తప్పేమీ కాదు. అదేపనిగా కించపరుస్తూ కొత్త సామెతలను సృష్టించడం లేదు కదా --వైజాసత్య 12:57, 11 డిసెంబర్ 2008 (UTC)
తెలుగు వారు రండాపుత్ర:(ఈ సంస్కృత పదానికి తెలుగు అనువాదం నేను నా నోటితో చెప్పదలచుకోలేదు) లాంటి వినకూడని తిట్లు కూడా వాడుతారు. ఇలాంటివి కూడా ఇక్కడ వ్రాయమంటారా? ఇవి కూడా కొత్త కాదని చెపుతారా?
సంస్కృతం అర్థంకాని వారి కోసం తెలుగులో వ్రాస్తున్నాను. రండ అంటే లంజ అని అర్థం. కొందరు ఆ మాటని నోటితో పలకడానికే సిగ్గు పడతారు. అయినా ఇలాంటి మాటలు ఆడే వారు కూడా కనిపిస్తుంటారు కదా అని ఈ భాషలో కూడా ఇక్కడ వ్రాయాలా? 121.245.24.100
- ప్రతి వేదికకు ఒక సభా మర్యాద ఉంటుంది. బూతు కోసం బూతు వ్రాస్తే తొలగించాల్సి వస్తుంది. "రాజును రండకొడుకన్నట్లు" (ఎంతటివారినైనా కించపరిచేవాళ్ళుంటారనే అర్ధంలో మా తెలంగాణ గడ్డలో ఉపయోగిస్తారు) వంటివి వ్రాయటానికి అభ్యంతరం లేదు. --వైజాసత్య 16:45, 11 డిసెంబర్ 2008 (UTC)
రాజునైనా రిక్షావాలానైనా రండకొడుకు అనండం తప్పే. అతన్ని అమ్మ పేరుతో తిట్టడం ఎందుకు? ఆ భాష వాడే వారు కొందరు ఉంటారు. అయినా తెలిసి తెలిసి వారిని ఇమిటేట్ చెయ్యడం అంటే తెలిసి తెలిసి గడ్డి తినడమే. వరవరరావు గారు ఒక కవితలో రంకు, కొజ్జా లాంటి పదాలు వాడినప్పుడు రంగనాయకమ్మ గారు అతన్ని విమర్శిస్తూ ఒక వ్యాసం వ్రాశారు. వరవరరావు గారు తప్పు ఒప్పుకున్నారు కానీ ఒక వైజాగ్ వాసి మాత్రం ఇది గాంధేయ ఆదర్శవాదం లాగ ఉందంటూ విమర్శించాడు. నీతిగా బతకడం వ్యక్తిగత ఆదర్శం అనుకుంటే సమాజంలో ఎవరూ నీతిగా బతకరు. నీతిగా బతకడం బాధ్యత అతని అర్థమైన వాళ్ళకే నీతిని ఆచరించడం చేతనవుతుంది. నా ఆఫీస్ పక్కన మురికివాడలో ఉండే దుంపల బడి విధ్యార్థులు కూడా ఈ భాష వింటే సిగ్గు పడతారు. ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదువుకున్న మన లాంటి వాళ్ళకి ఈ భాష వింటే ఎంత సిగ్గు అనిపించాలి? ఇంగ్లిష్ మీడియం చదువులు కూడా జీవితానికి పనికి రావని అనిపిస్తుంది.
- అయ్యా ఇలాంటి చర్చలు ఇక్కడ అనవసరం. ప్రపంచానికి నీతి బోధించడమో, బుద్ధిచెప్పడమో, సన్మార్గం బోధించడమో, కళ్ళు తెరిపించేట్టు బోధనలు చెయ్యటం, పొగడటం, తెగడటం తెవికీ లక్ష్యం కాదు. వ్యక్తిగతంగా నేను మీ అభిప్రాయాలతో అంగీకరిస్తాను. నేను మన సాంస్కృతిక వారసత్వంగా వస్తున్న ఒక తెలుగు సామెత అని మాత్రమే దాన్ని ఉదహరించాను. ఇదీ మన సంస్కృతేనా అనికూడా మీరు నీతిబోధ చేయవచ్చు. మతం గురించి కన్నాలు వెతికిమరి వ్రాసిన మీరు ఈ విషయంలో ఇలా స్పందించడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. అంతే --వైజాసత్య 05:08, 12 డిసెంబర్ 2008 (UTC)
నేను వ్రాసింది మీకు అర్థమైనట్టు లేదు. నా ఆఫీస్ పక్కన మురికివాడలో ఉండే దుంపల బడి విధ్యార్థులు కూడా ఈ భాష వింటే సిగ్గు పడతారు. ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదువుకున్న మన లాంటి వాళ్ళకి ఈ భాష వింటే ఎంత సిగ్గు అనిపించాలి? ఇంగ్లిష్ మీడియం చదువులు కూడా జీవితానికి పనికి రావని అనిపిస్తుంది. ఇంత చదువు చదువుకుని దుంపల బడి విధ్యార్థులకున్న సంస్కారం కూడా మనం నేర్చుకోలేక పోవడం నాకు బాధ కలిగిస్తోంది. నేనేమీ కన్నాలు వెతకడం లేదు. హిందువులు పవిత్రంగా భావించే మనుస్మృతి పూర్తి అనువాదం నేను చదివాను. అందులో స్త్రీలు మరియు శూద్రుల గురించి ఎంత ఘోరంగా వ్రాసి ఉందో నాకు తెలుసు. ఖురాన్ తెలుగు అనువాదం కూడా చదివాను. హదీస్ ఆంగ్లంలో చదివాను. ఆ గ్రంథాలలో ఎన్ని పొంతన లేని విషయాలు ఉన్నాయో నాకు తెలుసు. కానీ నేను ఆ విషయాలు ఇక్కడ వ్రాయలేదు. నేను వ్యాపార పనులలో మునిగిపోయి ఉండడమే అందుకు కారణం. నా Facebook మిత్రులతో కూడా నేను చర్చించాల్సిన ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. అందుకే నేను మతం గురించి నాకు తెలిసినవన్నీ ఇక్కడ వ్రాయదలచుకోలేదు.
- మీరు చెప్పేది నాకర్ధమైంది. కానీ ఈ విషయాల గురించి వ్యక్తిగత చర్చలు చేయటానికి ఇది వేదిక కాదనే నేను చెబుతున్నది. పైన మీరు ఇది చదవలేదా? వ్యక్తిగతంగా నేను మీ అభిప్రాయాలతో అంగీకరిస్తాను --వైజాసత్య 05:54, 12 డిసెంబర్ 2008 (UTC)