వికీపీడియా:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013 తెలుగు వికీపీడియా ప్రణాళిక
ప్రణాళిక పరిచయం
మార్చుసందర్భం
మార్చువికీమీడియా సంస్థ బెంగళూరు లోగల సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (CIS) కు భారతదేశం నందు అందుబాటులో విజ్ఞానం (ఎ2కె) ని విస్తరించుటకు రెండు కోట్ల అరవై లక్షలు రూ.లు యిచ్చుటకు అంగీకరించింది. అందులో ఒకకోటి పది లక్షల రూ.లు మంజూరు చేయబడినవి. ఎ2కె కు ఇచ్చిన ఈ విరాళం భారతీయ భాషా వికీపీడియాల పరిపూర్ణ పెంపుదలకు ఉత్ప్రేరకం కావాలనేది ముఖ్య ఉద్దేశం. ఎ2కె జట్టు భారత వికీమీడియా స్వయం సేవకులతో చేదోడువాదోడుగా పనిచేస్తూ అన్ని భారతీయ భాషలలోనూ వికీపేడియాని స్వేచ్ఛా విజ్ఞాన భాండాగారంగా పెంపొందించడానికి ఈ విరాళం ఉపకరిస్తుంది.
అదనంగా నిధులను భారతదేశ-సంబంధిత వికీమీడియా భారతదేశ ఆంగ్లభాషా ఉచిత విజ్ఞానప్రణాళికల అభివృద్ధి మరియు వికీమీడియా భారతదేశ ఉచిత విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నది.
ఉద్దేశ్యము
మార్చుఈ పత్రం (డాక్యుమెంటు) ప్రధాన ఉద్ధేశ్యం 2013-2014 సంవత్సర కార్యక్రమాల వివరణ సమర్పణ ఫలితాల ప్రదర్శన మరియు ఎ2కె రాబోయే కార్యక్రమాలను వికీపీడియా సమాజానికి తెలియజేయడం. ఎ2కె బృందాల కార్యక్రమాల సమగ్ర వివరణ కొరకు [ http://meta.wikimedia.org/wiki/India_Access_To_Knowledge/Programme_Plan] # ప్రధానాంశాలు చూడండి.
విధి విధానము
మార్చుఏ2కె బృందాలు సంవత్సర ప్రణాళిక ప్రవేశపెట్టి గత రెండుమాసాలుగా వివిధ వికీపీడియన్లను విస్తారంగా ప్రోత్సహిస్తున్నారు. వీరిలో ఏ) కొంతమంది వివిధ భారతీయ భాషల వికీపీడియా సమాజ సభ్యులు; బి) కొంతమంది భారతీయ ఆంగ్లవీకీపీడియన్లు; సి) వికీమీడియా భారతదేశం విభాగం (చాప్టర్) నిర్వహణ బృందం; డి) కొంతమంది శక్తివంతమైన సంస్థల భాగస్వాములు; ఇ) ఉచిత విజ్ఞాన సభ్యులు ఎఫ్) ఎ2కె సలహాదారురాలు డాక్టర్ తేజస్వినీ నిరంజన మరియు కొంతమంది వికీమీడియా ఫౌండేషన్ ఉద్యోగులు.
ప్రతి భాషా రచ్చబండలలో భాషా ప్రణాళిక చిత్తుప్రతిని చేర్చడం. మెయిలింగ్ జాబితాలు; ఈ మెయిల్ మరియు ఫేస్‌బుక్ ద్వారా వివరాలు సేకరించి ప్రణాళికను నిర్ధారించడం.
ఆక్సెస్ టు నాలెడ్జి (అందుబాటులో విజ్ఞానం) వారి పని విధానం
మార్చుఎ2కె ప్రధానంగా వికీమీడియా సమాజము మరియు వికీమీడియా భారతదేశం విభాగం (చాప్టర్) తో మరియు వికీమీడియా భారతదేశం క్రమబద్ధమైన మరియు క్రమబద్ధముకాని బృందాలతో చేతులు కలిపి పనిచేయాలని ఆలోచిస్తుంది. ఎ2కె అధికంగా ప్రత్యేక భాషాపరమైన అభ్యర్ధన ఆధారంగా ప్రేరణ కలిగించే పని చేస్తుంది. ఏ2కె బృందం వికీ సమాజాల కార్యక్రామాలు చురుకుగా అమలుకావడానికి అవసరమైన సహాయం చేస్తుంది.
ఈ ప్రణాళికను ఎలా అర్థం చేసుకోవాలి ?
మార్చుఇది ప్రారంభం చేసి వదిలివేసే కార్యక్రమం కాదు. ప్రతి మూడుమాసాలకు పరిస్థితులను పరిశీలించి సభ్యులందరికీ అందుబాటులో ఉంచడం దీని లక్ష్యం. ఈ కార్యక్రమ ప్రధానోద్దేశ్యం నిరంతర ఉత్తమ రూపకల్పన, మంచి ప్రోత్సాహం ద్వారా గొప్ప విజయాలు మరియు తక్కువ అపజయాలు వంటి మార్పులు తీసుకురావడం. ప్రణాళిక యొక్క విస్తారమైన అంశాలను ఇక్కడ చూడండి.[2]. ఇందువలన ఈ పత్రం ఎ2కె కార్యక్రమాల రూపాన్ని సూక్ష్మాంశాలతో కూడిన ఖచ్చితమైన ఫలితాల గణాంకాలతో కలిపి తెలియజేస్తుంది.
మేము భాషాప్రాతిపదిక ఆధారంగా వార్షిక ప్రణాళికాభివృద్ధికి కృషిచేస్తాము. ఎ2కె భాషావికీపీడియాలలా ఒక మార్గాన్ని మాత్రమే ఎంచుకోదు. ఎ) మేము ఎదురుచూసే నిర్మాణాత్మకమైన శక్తి; బి) మేము అందించే ప్రత్యేక అవసరాలకు తగిన మద్దతు ; సి) ప్రాంతాల వారీగా ఎదురయ్యే సవాళ్ళు, వాటి పరిష్కారం. అందుకని ప్రాంతీయభాషల వారిగా వ్యూహాల పునరావృతం మీరు చూడవచ్చు.
ఎ2కె బృందం మిగిలిన వికిపీడియాలకంటే అధికంగా కొన్ని ప్రాంతీయభాషా వికీపీడియాలకు ప్రణాళికా బద్ధంగా పనిచేస్తుందని మీరు గ్రహించవచ్చు. ప్రధానంగా మీకు తెలియజేసేదేమంటే మేము ముఖ్యంగా 5 ప్రాంతీయభాషా వికీపీడియాల కొరకు ఈ సంవత్సరం పనిచేయాలని అనుకుంటున్నాము. అంటే మిగిలిన ప్రాంతీయభాషా వికీపీడియాలకు మా సహకరం అందించమని అర్ధం కాదు. ప్రోత్సాహం అనేది వికీ అభివృద్ధి కార్యక్రమం కనుక ప్రాంతీయభాషా వికీపీడియా సమాజాల నుండి అందుకునే అభ్యర్ధనల ఆధారంగా మా మద్ధతు అందించడానికి వీలు కలుగుతుంది.
ఒత్తిడి మరియు ఉపశమనము
మార్చుభారతీయ ప్రాంతీయభాషా వికీపీడియాలపై స్వల్పంగా దృష్టిసారించిన ఫలితంగా తెలుసుకున్న సమాచారం ఏమంటే వికీపీడియా సభ్యుల మరియు క్రియాశీలక సభ్యుల సంఖ్యను పెంచుతూ వ్యాసాలను అభివృద్ధి చేయడానికి. తెలుగు వికీపీడియా సమాజంలో కాని, వికీపీడియా భారతదేశ విభాగం లో కాని, ఎ2కె బృందంలో కాని అవివేకమైన వాదములు ఏమీ లేవు. అదే సమయంలో సరిదిద్దుకోవడానికి, కొత్త వ్యూహాలు రూపొందించుకోవడానికి అవసరమైన కొత్త వ్యూహాలు కానీ, అనుభవాలు కాని, పాఠాలు నేర్చుకోవడం లేక అపజయాలు ఎదురుకాలేదు. గమనించతగిన అతి ముఖ్యమైన విషయం ఏమంటే మనమంతా చేయాలనుకుంటున్నది ఏమిటి ? ఇది చాలా చిన్న విషయం (సభ్యుల సంఖ్య అభివృద్ధి, వ్యాసాల అభివృద్ధి, నాణ్యతా అభివృద్ధి) అయినప్పటికీ అది చాలా క్లిష్టమైనది. అదనంగా భారతీయ వికీపీడియా సభ్యుల సంఖ్య పెంచడం ఈ కింద సూచించిన కారణాల వలన క్లిష్టమైనది.
- భారతీయ భాషల్లో అంతర్జాలంలో సంబంధించిన పరిశోధనాత్మక సమాచారం అందుబాటులో లేకపోవడం.
- భారతీయ భాషల్లో టైపు చేయడము ఒక ప్రధాన సవాలుగా ఉన్నది.
- సంబంధిత నాణ్యత గల సమాచారం డిజిటల్ రూపం లో అందుబాటులో లేకపోవడము లేదా కరువవడము.
- భారతీయభాషా వికీపీడియాలు అనువదించడానికి అనువైన పరిశోధనాత్మక/విద్యాసంబంధిత నాణ్యమైన సమాచారం అందుబాటులో లేకపోవడం.
- వివిధ సాంకేతిక సమస్యలు ఎదురవడం. అనుకూలమైన బ్రౌజర్లు లేకపోవడం, ఫాంట్ ప్రదర్శన మొదలైనవి కొత్త సభ్యులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి.
తప్పక గమనించవలసిన విషయం ఏమిటంటే మేము కొనసాగించ తలచిన కార్యక్రమాలు వికీపీడియాకు మాత్రమే పరిమితం కాదు భాషాపరంగా వికీపీడియన్ల సంఖ్య అధికం చేయడం కూడా దీనిలో అంతర్భాగమే. మనం ఆలోచించవలసినదేమంటే సభ్యుల కార్యక్రమాలను శక్తివంతం చెయ్యడం, అవసరమైన వసతులు కల్పించడం మరియు ప్రాంతీయ భాషా ఆధారిత వాస్తవ సమాజాలు రూపొందించడం. గమనించవలసిన విషయమేమంటే ఈ డిజిటల్ శకం భారతీయ ప్రాంతీయభాషా వికీపీడియన్ల లో ముందుకంటే మీడియా/వేదిక ద్వారా భారతీయ భాషలను డిజిటల్ రూపానికి తీసుకురావడానికి అవసరమైన శక్తి కలిగి ఉన్నది. మనం సమిష్ఠిగా సాధించవలసిన పని ఎంతో ఉంది. ఇందులో అపజయాలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉన్నది. ప్రగతి సాధించడానికి చాలా సమయం కూడా అవసరమవుతుంది. మనం అనుకున్న బాధల డిజిటల్ వలస అన్న లక్ష్యం విజయం సాధించవచ్చు. సమిష్ఠిగా కృషిచేయడం, ఒకరికి ఒకరు సహకరించడం అలాగే ఎప్పుడైతే కిందకు పడతామో అప్పుడే పైకి లేవడానికి ప్రయత్నం చేయడం వంటివి అందరం నేర్చుకుంటాం.
తెలుగు వికీపీడియా ప్రణాళిక 2013-14
మార్చుతెవికీకి వెళ్ళేముందు... ఒక సమీక్ష
మార్చుతెలుగు భాష ప్రధానంగా దక్షిణ భారత రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌లో మాట్లాడతారు. తెలుగు రాష్ట్ర అధికారిక భాష. భారతదేశంలో సుమారు 8 కోట్ల మంది తెలుగు భాష మాట్లాడేవారు ఉన్నారు అని అంచనా. ఇది భారతదేశంలో మూడవ అత్యంత అధికంగా ఎక్కువమంది మాట్లాడే భాష. తెలుగు కూడా, భారత ప్రభుత్వము ద్వారా, ప్రాచీన భాషగా యొక్క గుర్తింపు పొందింది. తెలుగు భాషను మాట్లాడేవారు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిషా మరియు చ్ఛత్తీస్‌ఘడ్ లాంటి పొరుగు రాష్ట్రాల్లో కూడా అనేకమంది ఉన్నారు.
భారతదేశ 2011 గణాంకాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం 67.6%. ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి రాష్ట్రంలో 46 విద్యాసంస్థలు ఉండగా, కళాశాల చదువులకు 4,066 కళాశాలలు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ప్రధమ స్థానంలో ఉండేలా చేసింది. 2007 యు.జి.సి నివేదిక "ఉన్నత విద్యాభ్యాసం మీద ఒక చూపు". http://oldwebsite.ugc.ac.in/pub/HEglance2012.pdf (accessed on 30 March, 2013). అదనంగా 2011-2012 లో ఆంధ్రప్రదేశ్ మొత్తం నుండి వివిధ విద్యాసంస్థలలో ప్రవేశించిన విద్యార్ధుల సంఖ్య 18,47,479. ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌ను 3 వ స్థానంలో ఉండేలా చేసింది. [1] వికీపీడియాలో శక్తివంతంగా వ్రాయడానికి ఇది అనుకకూలమైంది. పరిశోధనలో తేలిన అదనపు సమాచారం ఆంధ్రప్రదేశ్ కుటుంబాల సంఖ్య 2,10,24,534, ఇందులో కంప్యూటర్ల సంఖ్య 17,66,061.[2] దీని ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లోని కుటుంబాలలో 8.4% ప్రజలు కంప్యూటర్లు కలిగి ఉన్నారు. వీరిలో 5,46,638 కుటుంబాలు అంతర్జాల (ఇంటర్నెట్ ) అనుసంధానం కలిగి ఉన్నారు.[3] సుమారు 15 లక్షల మందికి అంతర్జాల సౌకర్యం అందుబాటులో ఉంది. [4] ఇందువలన ఆంధ్రప్రదేశ్‌లో 2.6% కుటుంబాలు మాత్రమే అంతర్జాల సౌకర్యం కలిగి ఉన్నాయి. జాతీయ అంతర్జాల వసతి కలిగిన కుటుంబాల శాతం అయిన 3.1% నికి ఇది కొంచెం సమీపంలో ఉంది. ఈ గణాంకాలు రాష్ట్రం వికీమీడియా ప్రణాళికల అభివృద్ధికి సాధారణంగా మరియు తెలుగు వికీపీడియా ప్రణాళికల అభివృద్ధికి అధికంగా సహకరించడానికి తగినంత శక్తి కలిగి ఉందని తెలియజేస్తున్నాయి.
ఈ దత్తాంశం వివరాలు, వికీపీడియా ప్రణాళికల దత్తాంశం లను బేరీజు వేసి చూసినప్పుడు మనం ఎక్కడ ఉన్నామో, విస్తరణ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవడానికి సహకరిస్తాయి. తెలుగు వికీపీడియా 2003 డిసెంబర్ 3 వ తారీఖున రూపుదిద్దుకున్నది. ఈమధ్యనే 9 వ సాంవత్సరిక ఉత్సవాలను కూడా జరుపుకున్నాము. ఆంధ్రప్రదేశ్‌లో 5,46,638 కుటుంబాలు కంప్యూటర్ మరియు అంతర్జాల వసతి కలిగి ఉండగా (రాష్ట్రంలో సుమారు 20 లక్షల విద్యార్ధులు ఉన్నతవిద్య అధ్యయనానికి ప్రవేశించగా 555 మంది తెలుగు వికీపీడియా సభ్యులు. వ్యాసాల సంఖ్య 50 వేలకు చేరుకున్నది.) 1) ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వికీపీడియా అభివృద్ధి వెనుక బడడానికి తగినంత అప్రమత్తత లేకపోవడమే కారణం అని అర్ధం ఔతున్నది. 2) ఉన్నతవిద్యా రంగం నుండి అత్యధికంగా విద్యార్ధులను తెలుగు వికీపీడియాలో కొత్త సభ్యులుగా (కంప్యూటర్ మరియు అంతర్జాలం) చేర్చడానికి విస్తారమైన అవకాశాలు ఉన్నాయి. 3) ఉన్నత విద్యా రంగంలోని యువతను తెలుగు వికీపీడియాకు తీసుకు రావడం ప్రధాన అవకాశంగా ఉన్నప్పటికీ అందుకు గొప్ప ప్రయత్నం తోడు కావాలి. ఈ కార్యక్రమ ప్రణాళిక ఆ మార్గంలో పయనించడానికి మంచి అవకాశం కలిగించ కలదు. తిరిగి వికీమీడియా ప్రాజెక్టుల సంగతికి వచ్చేసరికి, తెలుగులో విక్షనరీ, వికీసోర్స్, వికీకోట్ మరియు వికీబుక్స్ అనే ప్రాజెక్టులు ఇప్పటికీ అన్నీ సజీవముగానే ఉన్నాయి. ఈ క్రింద సూచించిన వాస్తవపత్రం (ఫ్యాక్ట్ షీట్) శీఘ్ర వీక్షణం ప్రకారం అందుబాటులో ఉన్న వివిధ వికీమీడియా ప్రాజెక్టులలోని తెలుగు తళుకుల్లోని ముఖ్య సమాచారం అందిస్తుంది.
వాస్తవ పత్రం
మార్చువికీమీడియా ప్రాజెక్టు | సభ్యుల జాబితా (2011-12) | సభ్యుల జాబితా
(2012-13) |
క్రియాశీల వాడుకరుల జాబితా
(2011-12) |
క్రియాశీల వాడుకరుల జాబితా
(2012-13) |
విషయపు పేజీలు
(2011-12) |
విషయపు పేజీలు
(2012-13) |
నెలకు పేజీ వీక్షణల సంఖ్య |
వికీపీడియా | 478 | 555 | 31 | 31 | 49,670 | 50,970 | 19,00,160 |
విక్షనరీ | 40 | 47 | 3 | 5 | 43,000 | 73,000 | 3,61,102 |
వికీసోర్స్ | 34 | 39 | 2 | 2 | 6,200 | 6,425 | 78,974 |
వికీకోట్ | 7 | 9 | 1 | 1 | 201 | 283 | 35,122 |
వికీబుక్స్ | సమాచారము లేదు | 1159 | సమాచారము లేదు | 7 | సమాచారము లేదు | 54 | 19,388 |
పైన ఉదహరించిన వాస్తవ పత్రం ప్రకారం తెలుగులో వికీపీడియా చాలా చురుకుగా ఉన్న వికీమీడియా ప్రాజెక్టు. అంతేకాక బహుకొద్ది మంది సభ్యుల తోడ్పాటుతో విక్షనరీలో కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగినది. కమ్యూనిటీతో చర్చల ఫలితంగా CIS-A2K దృష్టి అంతా ప్రధానంగా ముందుగా తెలుగు వికీపీడియా కమ్యూనిటీ యొక్క అభివృద్ధి మరియు విస్తరణకు సహాయ పడవలెనని నిర్ణయించడ మైనది.
మన తెలుగు వికీ అవసర విశ్లేషణ
మార్చురెండు నెలల క్రితం (జనవరి-ఫిబ్రవరి,2013), A2K జట్టు సిబ్బంది చురుకుగా ఉండే కొంతమంది తెలుగు వికిపీడియన్లను కలిసి తెలుగు వికీపీడియా యొక్క స్థితి గురించి చర్చించడానికి రెండు సార్లు హైదరాబాద్ సందర్శించారు. ఈ చర్చా సమావేశాలలో తెలుగు వికీపీడియా ఎలా ఏ విధంగా ప్రధానంగా విస్తరించాలి, ఎదగాలి వంటి అనేక వివిధ ఆలోచనలు ఉత్పన్నమయ్యాయి. వీటికి అదనంగా, తెలుగు SIGతో సహా కొంతమంది తెలుగు వికీపీడియా నిర్వాహకులతో చర్చా సమావేశాలు కూడా కొన్ని జరిగాయి. అదే సమయంలో తెలుగు వికీపీడియా "రచ్చబండ" (VillagePump)పై తెలుగు వికీపీడియా సమాజం (కమ్యూనిటీ) చర్చలు ఒక డెస్క్ సమీక్ష చేపట్టారు. ఈ పై చర్చల ఆధారంగా A2K జట్టు ఈ క్రింది సూచనల పరంగా జతగా వచ్చి వద్ద చేరింది.
సముదాయం
మార్చుప్రస్తుతం అత్యధికంగా (మెజారిటీ) చురుకుగా ఉన్న తెలుగు వికిపీడియన్స్ హైదరాబాద్ వెలుపలి వారే మిగిలిన వారు బెంగుళూర్ మరియు చెన్నై వంటి ఇతర మహానగరాల లోని వారు. నిశిత పరిశీలనలో తేలిన విషయమేమిటంటే 2009 నుండి అనేక మంది క్రియాశీలక సభ్యులు అధిక మార్పులు లేకుండా నిలిచి పనిచేస్తున్నారు. ఉదాహరణగా తెలుగు వికీపీడియన్ల ఈ పరిశీలనలు [5] వాస్తవంగా ప్రస్థుత తెలుగు వికీపీడియన్ల క్రియాశీలక జట్టు వారి తెలుగు వికీపీడియా మీద ఉన్న ఆరాధనను కొనసాగిస్తూ 3-4 సంవత్సరాల నుండి పని చేస్తున్నారు. అయినప్పటికీ అనుభవ సభ్యులలో రగులుతున్న ఈ ఆరాధానాగ్ని క్రమంగా చల్లారుతూ అలసిపోయి ( ఉదాహరణగా కొంత మంది క్రియాశీలక సభ్యులు వ్యక్తిగత కారణాల వలన ఇప్పటికే వారి కృషిని వదలడం లేక తగ్గించడం వంటివి చేస్తున్న సూచన కనిపిస్తున్నది) క్రియాశీలక సభ్యులు క్రమంగా తగ్గడానికి అవకాశం ఉన్నది. దాదాపు క్రియాశీలక సభ్యులందరూ ఔట్ రీచ్ ప్రోగ్రాముల " ద్వారా విభిన్నత మార్పులు కోరుతూ ఉన్నారు. వికీపీడియా సమాజం ఇలాంటి కార్యక్రమాలు రాబోయే సంవత్సరంలో క్రియాశీలక సభ్యుల సంఖ్యను రెండింతలు చేయగలవని విశ్వసిస్తున్నారు. కనుక వికీసమాజం చక్కగా రూపొందించబడిన ఔట్ రీచ్ కార్యక్రమాలు మాత్రమే మిగిలిఉన్న వికీసమాజపు క్రియాశీలక సభ్యులకు నాణ్యత కలిగిన వ్యాసాలను అధిక సంఖ్యలో అందించడానికి చాలవు. ఒక వైపు ఇప్పటికే తెలుగు వికీపీడియా కాలానుగతంగా క్రమమైన కొత్త సభ్యుల ప్రవేశం (షుమారుగా ప్రతి మాసానికి 6-8 మంది కొత్త సభ్యులు)జరుగుతూనే ఉంది. కనుక కొత్త సభ్యులకు పాతసభ్యులతో సంభాషించడానికి వికీపీడియా గురించి తెలుసుకోవడానికి అవకాశం కల్పించవలసిన అవసరం ఎంతో ఉంది.
విషయము
మార్చుభారతీయ భాషలలో తెలుగు వికీపీడియా మూడవ స్థానంలో ఉంది. దీనిలో 50,000 కంటే ఎక్కువ వ్యాసాలు ఉన్నాయి. అయితే, ఈ వ్యాసాల నాణ్యత ఒక ప్రధాన సమస్యగా చెప్పవచ్చు. ఇందులోని వ్యాసాలు 70% కంటే ఎక్కువ మోడు (మొలక) నాణ్యత కలిగి ఉన్నాయి. అందునా 37,000 కంటే అధికంగా మొలక స్థాయి లోనివి. మరోవిధంగా ఒక సమీక్షకుడి సమీక్షలో "తెలుగు వికీపీడియా ఇది కేవలం ఒకటి లేదా రెండు వాక్యాలు కథనాలు ఉన్నాయి" [6]అని ప్రస్తావించారు. తెలుగు వికీపీడియాలోని అన్ని వ్యాసాల మొలకల జాబితా ఇక్కడ చూడవచ్చు. ఇతర వికీపీడియాలతో పోల్చి చూసినప్పుడు తెలుగు వికీపీడియా కంటే ఇతర భాషా వికీపీడియాలు అధిక ఫలితాలను ఇచ్చాయి. అవి ఈ లింకులో [7] అయినప్పటికీ తెలుగు వికీపీడియాలో మొలక వ్యాసాల గురించిన ఉద్రేకపూతితమైన చర్చలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఇంకా ఏకగ్రీవమైన నిర్ణయం జరగ లేదు. ఒక వైపు మొలక వ్యాసాల తొలగింపుకు బలమైన అభ్యంతరాకు వెలిబుచ్చుతున్నా క్రియాశీలక సభ్యులు కొందరు మొలక వ్యాసాల తొలగింపుకు ఆదరణ తెలియజేస్తున్నారు. ఇది ఇప్పుడే ప్రవేశించిన సభ్యులను నిరుత్సాహపరచడానికి ఇది ఒక కారణం ఔతుంది. అందువలన ఈ మార్పులు అవసరమౌతాయని తేలింది. ఎ) తెలుగు వికీసమాజానికి మొలకల సృష్టిని తగ్గించడానికి ఏకగ్రీవ నిర్ణయం చేయడానికి సహకారం కావాలి. బి) మొలక వ్యాసాలను అభివృద్ధి చేసి ఆరంభదశ వ్యాసాలుగా మార్చడానికి కావలసిన మార్గాలు అంవేషించాలి. సి) ఒకేసారి అధికసంఖ్యలో నాణ్యమైన సమగ్రమైన కొత్తవ్యాసాల సృష్టి కొరకు ప్రయత్నం ప్రారంభించడం.
ఇతర అవసరాలు
మార్చుఈ క్రింద సూచించిన కావలసిన అవసరాలు తెలుగు వికీపీడియా సంఘంతో A2K జట్లు పరస్పర చర్చా చర్యల సమయంలో గమనించి గుర్తించారు.
- జతచేసినవి
- తెలుగు వికీపీడియా కోసం అవగాహన దృష్టి లేదా గోచరత ప్రజలలో లేకపోవడం. తెలుగు వికీపీడియా అభివృద్ధి కోసం ప్రధానంగా మీడియా పాత్ర/కవరేజ్ పొందవలసిన అత్యధిక అవసరం ఉంది.
- తెలుగు వికీ యొక్క చర్యలు సాపేక్షంగా సోషల్ "మీడియా"లో చాలా తక్కువగా ఉండటం వలన వారి మద్దతు అవసరం ఉంది.
- క్రియాశీలకముగా మరీయు వరిష్ట లేదా బాగా అనుభవమున్న వికీపీడియన్ల చేసిన కృషిని గుర్తించ వలసిన అవసరము ఉన్నది.
- ఓపెన్ సోర్స్ సంస్కృతి లేకపోవడం: ఓపెన్ సోర్స్ మెథడాలజీ అనేది విద్యా, మీడియా పరిశ్రమ మరియు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ సంస్థలు అంతటా చాలా తక్కువగా (ఉన్నది) ఉండటం గమనించవచ్చును. చాలా ఉత్పత్తి అయిన "జ్ఞానం" వనరులు డిజిటల్ కాలేదు మరియు ఎక్కువగా వ్యక్తిగతంగా కాపీరైట్‌లో ఉంటాయి కనుక ఫలితంగా జ్ఞానం వనరులు పరిమిత పంపిణీలో ఉంటాయి. నిజానికి ఎక్కువ తెలుగు మూలం మొత్తం లోని వ్యక్తిగత ప్రచురణ కర్తల వారివి ప్రచురణ జరిగిన దాని మీద ఏ లాభాలను అంతగా వారు ఆశించరు. క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ గురించి అటువంటి వ్యక్తులు మరియు సంస్థలకు తెలియజేయ వలసిన అవసరము ఎంతైనా ఉంది. అదే సమయంలో వ్యక్తిగత ప్రచురణ కర్తలకు మరియు సంస్థలకు, వారు వికీబుక్స్, వికీపీడియాలను జ్ఞానం ఉత్పత్తి మరియు వ్యాప్తి కోసం ఏ విధముగా ఉచిత వేదికగా వాడుకొన వచ్చునో ప్రదర్శన ద్వారా తెలియ జెప్పవల్సిన అవసరము ఉంది.
సాంకేతిక సహాయము
మార్చుతరచుగా తెలుగు వికీపీడియా కమ్యూనిటీ సభ్యులు సమర్థవంతమైన బగ్ స్పష్టత ఉండాలి అని వ్యక్తం చేస్తున్నారు. బగ్ రిపోర్టింగ్ మరియు స్పష్టత సులభతరం కావలసిన అవసరం ఉంది.
ప్రణాళిక అమలు
మార్చుకొత్త సంపాదకుల కోసం కృషి
మార్చుసంస్థాగత భాగస్వామ్యం (ఉన్నత విద్య)
మార్చుప్రాథమిక పరిశోధన ఆధారంగా ఎ2కె మండలి (జట్టు) దగ్గర (అనుబంధం 1 చూడండి) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాసంస్థలు సమితి యొక్క సుదీర్ఘ జాబితా ఉంది. ఈ సుదీర్ఘ జాబితాలో ఎ2కె మండలి (జట్టు) ఈ క్రింది జాబితా సంస్థల యొక్క భాగస్వామ్యాన్ని అన్వేషిస్తాయి. ఈ చిన్న జాబితాతో కలిసి/కలిపి చూస్తూ క్రింది (ప్రమాణాలకు ఉపయోగిస్తారు) ప్రమాణాలు పాటిస్తారు. 1)
క్రమ సంఖ్య | విశ్వ విద్యాలయము/విద్యాలయము యొక్క పేరు | పరిచయస్తులు |
1 | ఇంగ్లీషు మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయము, హైదరాబాదు | డా. ఉమ భృగుబంద; డా. కె. సత్యనారాయణ; డా. సతీష్ పోడ్వాల్; ప్రొ. మాధవ ప్రసాద్. |
2 | హైదరాబాదు విశ్వవిద్యాలయము, హైదరాబాదు. | ప్రొ. అనంతకృష్ణన్; శ్రీ.రాజీవ్ వెలిచేటి; ప్రొ. వినోద్ పవరాల; డా. అల్లాడి ఉమ. |
3 | పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు. | డా. రామారావు. |
4 | గీతం విశ్వవిద్యాలయం, విశాఖపట్నం. | డా. కె.బి.ఎస్. కృష్ణ. |
5 | కాకతీయ విశ్వవిద్యాలయము, వరంగల్. | అన్వేషణ |
6 | ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | అన్వేషణ |
7 | శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయము | అన్వేషణ |
8 | టి.ఐ.ఎస్.ఎస్., హైదరాబాదు. | అన్వేషణ |
9 | మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయము, హైదరాబాదు. | డా. గోవిందయ్య; డా. శిల్ప. |
పై జాబితా నుండి చూసిన విధంగా అయితే, ఈ సంస్థలు ఎక్కువగా హైదరాబాదు లోనే ఉన్నాయి. ఈ సంస్థలు విభిన్న విషయాలు మరియు భాషలు యొక్క ప్రత్యేకత కలిగి ఉన్నాయి. వీటిలో కొన్ని సంస్థలు క్రమపద్ధతిలో అంతేకాక నిర్దిష్ట రీతిలో సాధారణంగా తెలుగు వికీపీడియా మరియు ఇతర భాష వికీపీడియాల కోసం శక్తివంతమైన భాగస్వామి సంస్థలుగా (గుర్తించి అన్వేషణ) చేయవచ్చు.
ప్రణాళిక ఉన్నత విద్యాసంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకొని కనీసం రెండు నేపథ్యాల మీద ప్రణాళిక రూపొందించి విద్యావేత్తలు చురుకుగా వికీపీడియాను తమ బోధనలో భాగంగా చేసేలా చేయడం. తరువాత దీనిని పై జాబితాలోని కనీసం 5 విద్యాసంస్థల వరకు విస్తరించేలా చూసి అలాగే అప్రమత్తతను వ్యాప్తి చేస్తూ, అలాగే విద్యాసంస్థలతో దీర్ఘకాల సంబంధాలను నిలిపి ఉంచడానికి కావలసిన అవకాశాలను పెంచుకుంటూ వికీఅకాడమీలు నిర్వహించడం.
(కార్య) నిర్వహణ
- పై జాబితాలో ఉన్న శక్తివంతమైన భాగస్వాములైన 15 ఉన్నత విద్యాసంస్థల విద్యాబోధకులతో ప్రాధమిక స్థాయి సమావేశాలు నిర్వహించడం. పై జాబితా నుండి ఎ2కె బృందం రెండు వారాల నుండి చర్చలు ప్రారంభించింది. ఏ) యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాదు బి) ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్శిటీ సి) పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ.
- షార్ట్ లిస్ట్ భాగస్వాములైన విద్యాసంస్థలను చేరడం.
- ఉత్సాహవంతులైన బోధకులతో అంచనాలు, ప్రోత్సాహకాలు, ప్రణాళిక రూపకల్పన గురించి వివరణాత్మకమైన ఫ్రేంవర్క్ తయారు చేయడం, విద్యాసంస్థలు మరియు వికీపీడియన్ల కొరకు ప్రయోజనాత్మకమైన ఫలితాల సాధన కొరకు ప్రయత్నించడం.
- షార్ట్ లిస్టెడ్ విద్యాసంస్థలతో కీలక స్థానంలో ఉన్న వికీపీడియన్లను పరిచయం చేసి కలసి పనిచేసేలా చేయడం.
- Arrive at a clear ToR for the partnership between the Institution and A2K.
- కీలక తెలుగు వికీపీడుయన్ల సహకారంతో రూపొందించబడిన వర్క్‌షాపులను మరియు శిక్షణా శిక్షణా కార్యక్రమాల నిర్వహణ.
- కొత్త సభ్యులు కీలక తెలుగు వికీపీడియన్ల సహకారంతో ప్రణాళిక కింద తయారుచేసిన వ్యాసాలకు నిరంతర మార్గదర్శకత్వం, పర్యవేక్షణ మరియు అంచనా/సమీక్ష అందించడం.
- ఈ ప్రణాళికలు అందరి దృష్టిలో ఉంచడం కొరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం తయారు చేసి అలాగే అవసరమైన సాంకేఏతిక మరియు అంతర్జాల మద్దతు అందించడం. ఉపాధ్యాయులను లేక విద్యార్ధులను స్వంత బ్లాగ్ మెయింటైన్ చేసేలా చేయడం.
- Constant liaison with the anchor faculty/department.
- ప్రణాళిక అభివృద్ధిని పీరియాడిక్ గా ప్రధాన వికీపీడియన్ల పర్యవేక్షణ ద్వారా పరిశీలించడం.
భవిష్యత్తు అంచనా
- 100-150 మంది సభ్యులు నూతనంగా తెలుగు వికీపీడియా ప్రవేశం చెయ్యడం. వారి నుండి కనీసం 15-20 మందిని క్రియాశీలక సభ్యులుగా మార్చడం.
- భవిష్యత్తు అభివృద్ధికి మార్గదర్శకం కాగలిగిన నాణ్యమైన 200 వ్యాసాలను తయారు చెయ్యడం.
- 400 మొలక వ్యాసాల విస్తరణ మరియు నాణ్యత వృద్ధి చేయడం.
- అందరికీ అందుబాటులో ఉండేలా ఉచిత పాఠ్యాంశాల సమాచారం కలిగిన వ్యాసాలను తెలుగు వికీపీడియాలో చేర్చి వాటిని ఇతర ఉన్నత విద్యాసంస్థలకు ఉపకరించేలా చేయడం.
- యు.జి.సి దృష్టిని ఆకర్షించి యు.జి.సి వారు వికీపీడియా ఉపయోగం అర్ధం చేసుకొనేలా చేయడానికి తెలుగు వికీపీడియాను మార్గదర్శకంగా చేయడం.
చిన్న నగరంలో వ్యాప్తి చేయటం (చురుకుగానున్న కమ్యూనిటీ సహకారంతో)
మార్చుప్రణాళిక: అంతర్జాలం (ఇంటర్నెట్) వ్యాప్తి ఎక్కువగా ఉన్న చిన్న నగరాల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా చురుకుగా తెలుగు వికీపీడియా గురించి అవగాహన వ్యాప్తి.
కార్యాచరణ:
- ఆంధ్రప్రదేశ్‌లోని చిన్ననగరాలను పరిశీలన చేసి ఈ కింది సూచించిన విషాయాల వివరణాత్మకమైన డేట తయారు చెయ్యడం. ఏ) ప్రాంతీయ సాంస్కృతిక సంఘాలు లేక కిన్‌షిప్ బృందాల జాబితా తయారు చెయ్యడం; బి) విద్యాసంస్థలు మరుయు గ్రంధాలయాలు; సి) అంతర్జాల వసతి, అంతర్జాల కేంద్రాలు, బ్రాడ్‌బాండ్ కనెక్షన్లు మొదలైన వివరాలు; డి) సాంఘిక సంఘాలు ( ఫేస్ బుక్ సమాజాలు, బ్లాగర్లు, వెబ్‌సైట్స్; ఇ) విలేఖరులు, లెక్చరర్లు, రచయితలు మరియు ఇతర ప్రాంతీయ మేధావులు.
- శక్తివంతమైన 3 నగరాల జాబితా తయారు చేసి ప్రత్యేక శ్రద్ధ కేందీకేతం చేసి వికీసమాజంతో పరస్పర సంభాషణకు అవకాశం కల్పించడం.
- ప్రాంతీయ ఆతిధ్య సంస్థలతో సంత్సంభంధాలను నెలకొల్పడం.
- శిక్షకులకు-శిక్షణ: ఆసక్తి కలిగిన వికీపీడియన్లకు ఔట్‌రీచ్ కార్యక్రమాల నిర్వహణకు తగిన శిక్షణ ఇవ్వడం.
- ఈ నగరాలలో వికీపీడియా శిక్షణ గురించి కార్యక్రమ రూపకల్పన చెయ్యడం.
- మేము - మా ఊరు లాంటి చిన్న ప్రణాళిక కింద పనిచేయడం వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం వంటి కార్యక్రమాలలో కొత్త సభ్యులు చురుకుగా పాల్గొనడం మీద దృష్టి కేంద్రీకరించడం.
- ప్రాంతీయ పరస్పర సంభంధ సంస్థలు మరియు మరియు భవిష్య కార్యక్రమ నిర్వహణకు ప్రణాళిక రూపకల్పన, 3-4 కార్యక్రమాల తరువాత చెప్తాం.
ముందుచూపు:
- తెలుగు వికీపీడియాలో 60-80 మంది కొత్త సభ్యుల చేరిక. ఈ ప్రయత్నం వలన 8-12 క్రియాశీలక సభ్యులను తయారుచెయ్యడం.
- తెలుగు వికీపీడియా గురించిన వివరాలను మహానగరం అంతటా వ్యాపింప చేయడం.
- ప్రధానంగా దృష్ఠి సారించిన 3 మార్గదర్శక విద్యాసంస్థలలో తెలుగు వికీపీడియా సమాజం సహజసిద్ధంగా అభివృద్ధి చెందుతుంది.
- ఫలితంగా 100 కొత్త వ్యాసాలు తయారు చెయ్యబడతాయి.
- ఫలితంగా గ్రామఆధారిత వ్యాసాల నాణ్యత మెరుగౌతుంది.
ఆసక్తి సభ్యుల జట్టు (యూజర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్) (UIG)
మార్చుప్రణాళిక: ప్రస్థుతం ఉన్న బృందాలను చేర్చుకుని వారిని తెలుగు వికీపీడియాను వేదికగా చేసుకునేలా చేయాలి. ఈ సంవత్సరం ఎ2కె బృందం కనీసం 4 ఆసక్తి సభ్యుల జట్లను అయినా పోషించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నది.
కార్యాచరణ:
- ఆసక్తి సభ్యుల జట్టును గుర్తించడం. ఎ2కె బృందం ఇప్పటికే క్రియాశీలక తెలుగు వికీడియా సభ్యుడి సహాయంతో విశాలాంధ్ర వార్తాపత్రికలో పనిచేస్తున్న 30 మంది జర్నలిస్టుల బృందాన్ని గుర్తించింది. ఎ2కె బృందం ఇప్పటికే 10 మంది తెలుగు దియేటర్ మరియు సాహిత్యం అందు ఆసక్తి కలిగిన బృందాన్ని గుర్తించింది.
- ఈ బృందాలు మరియు ఉత్సాహవంతులైన తెలుగు వికీపీడియా సమాజం మద్య సత్సంబంధాలను పటిష్ఠం చెయ్యాలి.
- తెలుగు వికీపీడియా సమాజం సహకారంతో వికీపీడియా తెలుగు శిక్షణా కార్యక్రమాలను రూపొందించాలి.
- శిక్షణ తరువాత కార్యక్రమాలు అమలుచేయాలి.
- రంగస్థలం, సాహిత్యం, రాజకీయాలు మరియు ప్రస్థుత సంఘటనల వంటి చిన్న నేపధ్యం కలిగిన ప్రణాళికలను పరిచయం చెయ్యాలి.
- కొత్తసభ్యుల వ్యాసరచనకు అవసరమైన సౌకర్యం మద్దతు మరియు నియంత్రణ తెలుగు వికీపీడియన్ల చేత చేయించి క్రియాశీలక సభ్యులను తయారు చెయ్యడం.
ముందుచూపు:
- అంచనా ప్రకారం 50-60 కొత్త సభ్యులను తెలుగువికీలో ప్రవేశించేలా చెయ్యడం. ఈ ప్రయత్నం 6-10 క్రియాశీలక సభ్యులుగాబ్మార్చవచ్చు.
- ఫలితంగా ప్రత్యేక నేపధ్యం కలిగిన తెలుగు వికీపీడియా వ్యాసాల నాణ్యతను వైధ్యంగా కనిపించేలా మెరుగుపరచవచ్చు.
ప్రస్తుత కమ్యూనిటీ బలోపేతం
మార్చుసమావేశములకు ప్రయత్న సామర్ధ్యము
మార్చుప్రణాళిక: వికీ సమాజ సభ్యుల నడుమ ఉన్నతస్థాయి అవగాహన కలిగించడానికి ప్రత్యేక లక్ష్యంతో పని చేయడం. ఏ) కొత్త ప్రణాళికా వ్యూహాల పరిరక్షణ ; బి)సమస్యాత్మకమైన వివాదాలపై కాలానుగత పరిశీలన ; సి) తెలుగు వికీపీడియా విస్తరణ గురించి సమిష్ఠి పరిశీలన పరిరక్షణ.
కార్యాచరణ:
- రాబోయే ఒక సంవత్సరంలో 3 ముఖాకుఖి సమావేశాలు/ప్రత్యేక సందర్భాలు ఏర్పాటు చెయ్యడం. అలాగే ఈ ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఎడిట్-ఎ-తాన్ నిర్వహించడం.
ఎ2కె తెలుగు వికీపీడియా సమాజంతో కొత్తసంవత్సర ఆరంభమైన ఉగాది రోజున తెలుగు వికీపీడియన్ల సమావేశం నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి చురుకుగా చర్చలు కొనసాగిస్తున్నది.
- గూహుల్ హేంగ్ ఔట్స్/స్కైప్ కాల్స్ కొరకు నిర్వహణ/అనుకూలత కలిగించడం. మేము రాబోయే సంవత్సర కాలంలో పై సమావేశం కాక కనీసం 3 సమావేశాల నిర్వహణ/అనుకూలత లక్ష్యంగా చేసుకున్నాము.
- హైదరాబాదు లోని విద్యాసంస్థ/సేవాసంస్థ ఒప్పందం చేసుకుని వికీపీడియా సమాజానికి క్రమానుగత సమావేశాల కొరకు కార్యాలయ ప్రదేశం మరియు అంతర్జాల అనుసంధానం మొదలైన ఏర్పాట్లు చేయడం. ఎ2కె గోల్డెన్ త్రెషోల్డ్ లో ఉన్న థియేటర్ ఔట్రీచ్ యూనిట్ వారితో చురుకుగా సంభాషణలు జరుపుతున్నది. ఇప్పటికే తెలుగు వికీపీడియా వారి చిన్న సమావేశానికి అవకాశం కలిగించింది.
ముందుచూపు: ఈ వికీపీడియా సమాజ భవన ప్రత్యత్నాలు వికీపీడియా సమాజానికి మరింత బలాన్ని మరుయు తెలుగు వికీపీడియన్ల మద్య స్పూర్తిని కలిగిస్తాయి. ఇందువలన వికీసమాజం కలిసికట్టుగా వ్యూహాత్మక అభివృద్ధి చేయడానికి వికీపీడియా ప్రణాళికాకు శక్తి వంతమైన వేగానికి ఉపకరిస్తుంది.
అధునాతన వాడుకరి శిక్షణ
మార్చుప్రస్తుత సభ్యులు ఆధునిక లక్షణాలను ఉపయోగించి వికీపీడియాలో ఒక వ్యాసం, ఒక వర్గం జోడించడం, పట్టికలు, మ్యాప్‌లను తయారు చేయడం వంటివి లేదా కామన్స్‌లో ఫోటో సృష్టించడం మొదలైన వాటి అవసరమైన "శిక్షణ" కోసం అనేక మంది ఉన్నారు. A2K జట్టు ఈ నైపుణ్యాలు వచ్చేలా హైదరాబాదులో తెలుగు వికిపీడియన్స్ అత్యధికంగా ఉండే ప్రదేశ ఆధారంగా 2-3 శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి సులభతరం చేస్తుంది. ఇతర చిన్న నగరాల నుండి ఏమైనా అవసరము (డిమాండ్) ఉండి ఉన్నట్లయితే మరికొన్ని శిక్షణా కార్యకలాపాలు కూడా నిర్వహించి సులభతరం చేస్తుంది.
విషయవ్యాప్తీకరణం
మార్చుతెలుగు వికీపీడియా వ్యాసములలో నాణ్యత వృద్ధి
మార్చుప్రణాళిక: వ్యాసాల అభివృద్ధి దృష్టిలో భాగంగా మొలక వ్యాసాలను ప్రారంభ తరగతి వ్యాసాలుగా రూపొందించి మార్చడానికి తెలుగు వికీపీడియా వర్గమునకు మద్దతు. కార్యాచరణ:
- తెలుగు వికీపీడియాలో అనేక గ్రామ వ్యాసాలు బాట్లు ద్వారా సృష్టించ బడ్డాయి. కొంతమంది కమ్యూనిటీ సభ్యులు గ్రామాలు గురించిన ఈ కథనాలను బహిరంగంగా అందుబాటులో ఉండే డేటా సహాయముతో (జనాభా, భౌగోళిక ప్రాంతం, తదితర మయినటు వంటివి) చురుకుగా విస్తరించేందుకు ప్రతిపాదించారు.
- ఎ2కె బృందం ఇందుకు సంబంధించిన డేటాను ఆర్.టి.ఐ మరియు ఇతర మార్గాలలో సేకరించి ఈ వ్యాసాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం.
- గ్రామాల వ్యాసాల నాణ్యత అభివృద్ధి కొరకు ఒక్కో వ్యాసంలో కనీసం 2-3 దిద్దుబాట్లు జరిగేలా వసతులు అందుబాటులో ఉంచడం.
భవిష్యత్తు అంచనా : 4,000 మొలక స్థాయి గ్రామాల వ్యాసాలను శక్తివంతంగా అభివృద్ధి చేయడం.
పబ్లిక్ డొమైన్‌లో తెలుగు విషయములను సులభతరం చేయడం మేకింగ్
మార్చుప్రణాళిక: పబ్లిక్ డోమియన్‌లో లభించే డిజిటలైజ్ సమాచారాన్ని తెలుగు వికీపీడియా సమాజానికి అందుబాటులో ఉంచడానికి సహకరించడం.
కార్యాచరణ:
- పబ్లిక్ డోమియన్‌లో లభించే సమాచారాన్ని (పుస్తకాలు మరియు ఇతర ఆధారాలు) అధార పరిశోధన నిర్వహించడం. ప్రస్థుతానికి దాదాపు 23,000 తెలుగు పుస్తకాలు భారతీయ డిజిటల్ గ్రంధాలయంలో లభ్యమౌతున్నాయి.
- పూర్తి జాబితాను ప్రధాన తెలుగు పదాలతో శోధన రూపానికి మార్చడం.
- తెలుగు వికీసమాజం సలహా సంప్రదింపులతో పూర్తిగా ప్రధానమైన పుస్తకాలను గుర్తించి తెలుగు వికీపీడియా ప్రణాళికలకు అనుకూలంగా డిజిటల్ రూపంలోకి తీసుకురావడం.
- పుస్తకాలు మరియు ఇతర ఆధారాల లింకులను వివిధ వికీ-ప్రణాళికల కొరకు అందించడం.
- వికీ సమాజం సహకారంతో ప్రత్యేక నేపథ్యం కలిగిన ప్రణాళికలను రూపకల్పన అభివృద్ధి చేసి నిర్వహించడం.
- వ్యాసాల నాణ్యత మరియు కొత్త వ్యాసాల అభివృద్ధి కొరకు ప్రత్యేక నేపధ్యం కలిగిన సమాచారంతో ఎడిట్-ఎ-తాన్ నిర్వహించడానికి అవకాశం కలిగించడం.
ముందుచూపు: 500 మొలక వ్యాసాల నాణ్యతను అబివృద్ధిచేసి అలాగే 200 నాణ్యమైన వ్యాసాలను తయారు చెయ్యడం.
విరాళాల విషయం
మార్చుఆలోచన: Channelize encyclopaedic content into Public Domain or license it under Creative Commons
అమలు:
- పబ్లిక్ డొమైన్‌లో డేటా/అంశాలను గుర్తించటం.
- డిజిటల్ కంటెంట్ ఉన్న విషయములు మరియు డిజిటైజేషన్ లోనికి వచ్చిన ప్రభుత్వ సంస్థలను గుర్తించడము.
- ఇప్పటివరకు జరిగిన అన్ని డిజిటైజేషన్ ప్రయత్నాలను అధ్యయనం చేయడం.
- క్రియేటివ్ కామన్‌ల్లోని (సం)ఘటనలను నిర్మించడానికి సంబంధించిన సంస్థల దృష్టికోణం లోనికి తీసుకురావడం.
- CC events with special groups (Jurnos, activists, NGOs like Anveshi Womens Research Centre). గత కొన్ని వారాలుగా ఏ2కె బృందం తెలుగు దియేటర్ మాగజిన్ యాజమాన్యంతో సాగించిన చర్చల ఫలితంగా " తెలుగు దియేటర్ మాగజిన్" ను డిజిటల్ రూపంలో 'తీసుకురావడానికి అలాగే క్రియేటివ్ కామన్స్‌లో చేర్చి ఉచిత వాడకం అనుమతి తీసుకోవడానికి చేసిన కృషి ఫలించినది. ఇందువలన కాఫీ హక్కు దారుని ఉన్నత ప్రమాణం కలిగిన వివిధ అంశాలపై వ్రాయబడిన వైవిధ్యం కలిగిన మొత్తం 50 తెలుగు దియేటర్ మాగజిన్ వ్యాసాలను క్రియేటివ్ కామన్స్ అనుమతించండం జరిగింది.
ముందుచూపు ప్రదర్శన:
- కనీసం 3 వేర్వేరు రకాల సర్వశాస్త్ర సముచ్చయములతో అక్షరక్రమ నిఘంటువు గ్రంధములను క్రియేటివ్ కామన్‌ల్లోకి అందుబాటులోకి తీసుకు వచ్చినట్లయితే వాటిని డిజిటలైజ్ చేసి ఆ తదుపరి తెలుగు వికీసోర్స్ లోనికి చేర్చ వచ్చును.
- తెలుగు వికీపీడియాలో దీనివల్ల 150 నాణ్యతా వ్యాసాలు అదనంగా పెరుగుదలకు కారణం కావచ్చు.
ప్రణాళిక లక్ష్యాలు
మార్చుA2K టీమ్ కింద తెలిపిన లక్ష్యాల సాధనకై కట్టుబడి ఉంది:
- తెలుగు వికీపీడియా వ్యాప్తికై పరిశీలన
- గత 2-3 యేళ్ళగా తెలుగు వికీ సంఘపు వృద్ధి
- ప్రాథమికావసరాల అంచనా
ఇవి తెలుగు వికీ సంఘం మరియు వికీమీడియా భారతదేశ చాప్టర్ల సహకారంతో ఎక్కడ సాధ్యమయితే అక్కడ సాధించబడతాయి. కానీ, కొన్ని ప్రత్యేక అవసరాలకనుగుణంగా A2K వారు లక్ష్యసాధనకు విశేష ప్రాజెక్టులను ఇంకా చొరవ తీసుకొని కొన్ని కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తుంది. ఈ లక్ష్యాలను 1. ఉద్దిష్ట, ఏవయితే A2K తప్పనిసరిగా సాధించాలనుకుంటుందో, ఇంకా 2. ఆశించినవి, ఇవి A2K టీం యొక్క స్వాప్నిక లక్ష్యాలు.
పరామితులు | ఉద్దిష్ట లక్ష్యం ( మార్చి 31, 2014 నాటికి) | ఆశించిన లక్ష్యం (మార్చి 31, 2014 నాటికి) |
ఎడిటర్ల సంఖ్య | 755 | 905 |
కొత్త ఎడిటర్ల సంఖ్య | 200 | 350 |
క్రియాశీల ఎడిటర్ల సంఖ్య | 55 | 65 |
వ్యాసాల సంఖ్య | 54,000 | 55,000 |
2KB ఆపై పరిమాణం గల వ్యాసాల శాతం | 33% (దాదాపు 17,800 వ్యాసాలు) | 35% (దాదాపు 19,250 వ్యాసాలు) |
ఔట్‍రీచ్ కార్యక్రమాల సంఖ్య | 12 | 18 |
కార్యాచరణ వారీగా విభాగముల లక్ష్యాలు
మార్చుకార్యాచరణ | కొత్త వ్యాసముల సంఖ్య | అభివృద్ధి చేయబడ్డ ప్రస్తుత వ్యాసముల సంఖ్య | కొత్త సంపాదకుల సంఖ్య | చురుకుగా ఉన్న కొత్త సంపాదకుల సంఖ్య | సమావేశముల సంఖ్య | భాగస్వామ్యముల సంఖ్య (సంస్థలు/సమూహములు) |
సంస్థాగత భాగస్వామ్యం | 200 | 200-250 | 100-150 | 12-18 | 9-12 | 3 |
చిన్న నగరంలో వ్యాప్తి చేయటం (చురుకుగానున్న కమ్యూనిటీ సహకారంతో) | 100 | 200-250 | 60-100 | 8-12 | 3-4 | 3 |
వాడుకరి ఆసక్తి సమూహములు(UIG) | 50-100 | 100-150 | 50-100 | 5-10 | 3-4 | 4 |
సమావేశములకు భవన సామర్ధ్యము | 100-200 | 3 | 1 | |||
అధునాతన వాడుకరి శిక్షణ | 2 | |||||
తెలుగు వికీపీడియా విలేజ్ ప్రాజెక్ట్ | 4000-4500 | 3 | ||||
తెలుగు విషయము తయారీ పబ్లిక్ డొమైన్‌లో లభ్యత
|
500 | 200 | 3 | |||
విరాళముల విషయము | 150 | 3 | ||||
మొత్తము | 1,000 to 1,050 | 4,800 to 5,900 | 210-350 | 25-40 | 29-34 | 11 |
అనుబంధం (1)
మార్చుక్రమ సంఖ్య | విశ్వ విద్యాలయము/విద్యాలయము యొక్క పేరు | గతంలో చేపట్టిన వికీమీడియా చర్యలు గురించిన వివరము |
1 | ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, హైదరాబాదు | లేదు |
2 | ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయము, రాజమండ్రి | లేదు |
3 | ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం | లేదు |
4 | బిట్స్ పిలానీ (BITS పిలానీ), హైదరాబాదు | లేదు (CIS-A2K organized a Hackthon) |
5 | ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము, విజయవాడ | లేదు |
6 | ద్రవిడ విశ్వవిద్యాలయము, కుప్పం. | తెలుగు వికిపీడియన్స్ ఒక బహుళ భాషా వికీపీడియా అకాడెమీ నిర్వహించారు. |
7 | ఇంగ్లీషు మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయము, హైదరాబాదు | లేదు |
8 | గీతం విశ్వవిద్యాలయం, విశాఖపట్నం. | లేదు |
9 | హైదరాబాదు విశ్వవిద్యాలయము, హైదరాబాదు. | లేదు |
10 | ICFAI విశ్వవిద్యాలయం, హైదరాబాదు. | లేదు |
11 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, హైదరాబాదు. | లేదు |
12 | ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ | లేదు |
13 | ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్, హైదరాబాదు. | లేదు |
14 | అంతర్జాతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్ (IIIT) | లేదు |
15 | జవహర్ లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయము (JNTU), అనంతపూర్ | లేదు |
16 | జవహర్ లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు [8] | బిట్స్ పిలానీ (BITS పిలానీ), హైదరాబాదు విద్యార్థులు కొంతమంది "హాక్‌థాన్"లో పాల్గొన్నారు. |
17 | జవహర్ లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయము (JNTU), కాకినాడ. | లేదు |
18 | కాకతీయ విశ్వవిద్యాలయము, వరంగల్. | లేదు |
19 | ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు. | లేదు |
20 | నల్సార్ న్యాయశాస్త్రాల విశ్వవిద్యాలయం, హైదరాబాదు. | లేదు |
21 | నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ | లేదు |
22 | ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | లేదు |
23 | పాలమూరు విశ్వవిద్యాలయము, మహబూబ్ నగర్ పట్టణం. | లేదు |
24 | పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు. | లేదు |
25 | స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ. | లేదు |
26 | శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం, అనంతపూర్. | లేదు |
27 | శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం | లేదు |
28 | శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం తిరుపతి. | లేదు |
29 | టి.ఐ.ఎస్.ఎస్. (TISS), హైదరాబాదు. | లేదు |
30 | మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ విశ్వ విద్యాలయం హైదరాబాదు. | లేదు |
మూలాలు
మార్చు- ↑ Higher Education at a Glance 2012 by UGC (p.7). http://oldwebsite.ugc.ac.in/pub/HEglance2012.pdf (accessed on 30 March, 2013).
- ↑ http://updateox.com/india/state-wise-internet-users-in-india-census-2011/ (accessed on 22 March, 2013).
- ↑ http://updateox.com/india/state-wise-internet-users-in-india-census-2011/ (accessed on 22 March, 2013)
- ↑ It is assumed that 1 household would provide internet access on a computer to at least 3 people on an average.
- ↑ http://geohacker.github.com/indicwiki/projects#active_editors
- ↑ http://shijualex.in/analysis-of-the-indic-language-statistical-report-2012/
- ↑ http://shijualex.in/analysis-of-the-indic-language-statistical-report-2012/
- ↑ [1]