వికీపీడియా చర్చ:2014 హైదరాబాద్ పుస్తక ప్రదర్శన - తెవికీ స్టాల్
హైదరాబాదు బుక్ ఫెయిర్
మార్చుఈసారి బుక్ ఫెయిర్ డిసెంబర్ 16 నుండి 25 వరకు నెక్లెస్ రోడ్డులో నిర్వహించబడుతోంది. దాన్లో తెవికీని ప్రచారం చేసే అవకాశాలను పరిశీలించాలి. e-తెలుగు సంస్థతో కలిసి ఒక స్టాల్ నిర్వహిస్తే బాగుంటుంది. --స్వరలాసిక (చర్చ) 16:16, 28 నవంబర్ 2014 (UTC)
- e-తెలుగు ప్రస్తుతం కార్యకలాపాలేమీ చెయ్యట్లేదనుకుంటా.. కశ్యప్ గారే దానికి చాన్నాళ్ళ నుంచీ కార్యదర్శి కనుక ఈ విషయాన్ని ఆయనే నిర్ధారించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 16:32, 28 నవంబర్ 2014 (UTC)
- హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో తెవికీ తరఫున ఓ స్టాల్ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రాజెక్టు పేజీని భవిష్యత్తులో ప్రారంభించడం జరుగుతుంది. ఈలోగా సహసభ్యులు తగు సూచనలు చేయాల్సిందిగా మనవి. ఈ కార్యక్రమానికి సిఐఎస్-ఎ2కె వారి సహకారం తీసుకోవాలని ఆశిస్తూ అందుకూ తగ్గ ప్రయత్నాలు చేస్తున్నాము.--పవన్ సంతోష్ (చర్చ) 06:48, 1 డిసెంబరు 2014 (UTC)
- e-తెలుగు ప్రస్తుతం కార్యకలాపాలేమీ చెయ్యట్లేదనుకుంటా.. కశ్యప్ గారే దానికి చాన్నాళ్ళ నుంచీ కార్యదర్శి కనుక ఈ విషయాన్ని ఆయనే నిర్ధారించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 16:32, 28 నవంబర్ 2014 (UTC)
- శుభ సూచకము: ఆ బుక్ ఫెయిర్ లో తెలుగు వికీపీడియా గురించి సమగ్ర సమాచారమున్న ఒక చేతి పుస్తకము తయారు చేసి పంపిణి చేస్తే బాగుంటుందని నా సూచన. Bhaskaranaidu (చర్చ) 06:57, 1 డిసెంబరు 2014 (UTC)
- తెలుగు వికీపీడియా స్వతంత్రంగా స్టాలు నిర్వహిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ,K Chandramohan, Secretary, +91-720 73 79 241 గారిని అడిగి స్టాలు కి ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారో మీకు తెలియ పరుస్తాను మాములుగా 10x9 Feet స్టాలు తొమ్మిదివేలు . నేను నాలుగు సంవత్సరాలు eతెలుగు స్టాలు లో వాంలంటీరుగా చేసాను, మీడియాకు , రచయితలకు ,తెలుగు భాషాభిమానులకు చేరువ కావటానికి ఇది మంచి అవకాశం , వచ్చే నెల విజయవాడ పుస్తక ప్రదర్శన కూడా ఉన్నది కాబట్టి మనకు పెద్ద మొత్తంలో ప్రచార సామాగ్రి అవసరం --కశ్యప్ 16:15, 1 డిసెంబరు 2014 (UTC)
- మన వికీ స్టాలు నిర్వాహణకు నేను అనుకొంటున్న కనీస ఖర్చు మొత్తం : 40000
స్టాలు : 10000 బానర్లు : 2000 కరపత్రాలు : 10,000 వాలంటీర్ల , ఖర్చు : నిర్వాహణ : 8000 నేను రెండు లాప్టాపులు,ఒక ప్రోజక్టర్లలను తీసుకురావటానికి ప్రయత్నం చేయగలను --కశ్యప్ (చర్చ) 17:42, 2 డిసెంబరు 2014 (UTC)
- ముందుగా బుక్ ఫెయిర్‌లో స్టాల్ పెట్టడానికి సలహా అందించిన మురళీమోహన్ (స్వరలాసిక) గారికి కృతజ్నతలు. అంత మొత్తం సరిపోవు అనుకుంటూన్నాను - CIS ను మరోసారి సంప్రదించిన మిదట 70 నుండి 80 వేల వరకూ ఖర్చులు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసారు. అందుకు విష్ణు, రహ్మానుద్దీన్ గార్లకు కృతజ్నతలు. నేను ఖర్చులకై కశ్యప్ను సంప్రదించి ఒక డాక్యుమెంట్‌లో రాసి నా దగ్గర ఐడిలు ఉన్నంత వరకూ అందరికీ షేర్ చేసాను. దయచేసి మార్పులు చేర్పులు సూచిస్తే. దీనిపై ఒక పేజీ ప్రారంబించవచ్చు...విశ్వనాధ్ (చర్చ) 12:33, 3 డిసెంబరు 2014 (UTC)
స్వరలాసిక, Bhaskaranaidu , విష్ణు, రహ్మానుద్దీన్, విశ్వనాధ్, కశ్యప్, పవన్ సంతోష్ లకు ధన్యవాదాలు. బుక్ ఫెయిర్ కి ఎంతో సమయం లేదు. కనుక సహ సభ్యులంతా స్పందించి... విశ్వనాధ్ గారు తయారుచేసిన డాక్యుమెంట్ ను పరిశీలించి తగిన సూచనలు అందించగలరు. Pranayraj1985 (చర్చ) 12:51, 6 డిసెంబరు 2014 (UTC)
- ^విశ్వనాధ్ గారు CIS-A2K మన వికీ సముదాయ సేవలో ఉంది. కాబట్టి కృతజ్ఞతలు అనవసరం.
- తెవికీ సభ్యులు వీలైనంత త్వరగా చర్చించి మెటాలో ఇక్కడ రిక్వెస్ట్ పెట్టగలరు. ఖర్చుల నిర్వహణ బాధ్యత ఎవరు తీసుకుంటారో వారి బ్యాంకు ఖాతా వివరాలు మెయిల్ ద్వారా పంపగలరు. --విష్ణు (చర్చ)14:00, 8 డిసెంబరు 2014 (UTC)
హైదరాబాద్ బుక్ ఫెయిర్ కోసం వికీపీడియా:హైదరాబాద్ పుస్తక ప్రదర్శన - తెవికీ స్టాల్ పేజీలో సహ సభ్యులు తమ సూచనలు, సలహాలు ఇవ్వగలరు..విశ్వనాధ్ (చర్చ) 06:50, 9 డిసెంబరు 2014 (UTC)
మెటా వికీ పేజిలో బడ్జెట్ రిక్వెస్ట్ కు మద్దతు తెలుపుటకు ఇక్కడ చూడగలరు. Pranayraj1985 (చర్చ) 11:16, 9 డిసెంబరు 2014 (UTC)
ఒక శుభవార్త : ఈ సారి పుస్తక ప్రదర్శనలో e తెలుగు కి స్టాలు ఉచితంగా ఇవ్వటానికి నిర్వాహకులకు అంగీకరించారు. .. కరపత్రాలలు , బానర్లు చేయాలి --కశ్యప్ (చర్చ) 12:38, 14 డిసెంబరు 2014 (UTC)
- మంచి వార్త - కరపత్రాల తయారీ మేటర్ కొరకు అందరూ తలో చేయూ వేస్తే బావుండు....విశ్వనాధ్ (చర్చ) 14:00, 14 డిసెంబరు 2014 (UTC)
;హైదరాబాదు బుక్ పెయిర్ లో తెలుగు వికిపీడియా నిర్వహణ గురించి ఒక నివేదిక
మార్చు1. మన తెలుగు వికీపీడియా స్టాలు లో బ్యానర్ల అలంకరణ చాల బాగున్నది.
2. 17 డిసెంబరు 2014 నుండి 26 డిసెంబరు 2014 ( 10 రోజులు) వరకు జరిగిన బుక్ పెయిర్ మన స్టాలు కొచ్చిన సందర్శకుల సంఖ్య అధికంగా వున్నది. అందరికి కర పత్రాలు పంచి వికీ పీడియా గురించి అవగాహన కలిగించ గలిగాము. ఒకరిద్దరి చేత అప్పటికప్పుడు వారి పేరును కూడ నామోదు చేయించ గలిగాము. సందర్శకులలో ముఖ్యంగా విధ్యార్తులు, ఉపాద్యాయులు, రచయితలు, ఇతర ప్రముఖులు వున్నారు. వచ్చిన వారికి కర ప్రత్రాలను ఇచ్చి అవగాహన కల్పించడముతో బాటు, ఇతర సాంకేతిక పరిజ్ఞానము కొరకు 28.12.2014 న ఆదివారము గోల్డెన్ త్రెష్ హోల్డ్ లో జరగ బోవు హాకదాన్ లో సాయంకాలము 3.00 గంటలనుండి పాల్గొని మరింతే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకో వలసినదిగా కోరడమైనది. అటు వంటి వారి పేరు, పోన్ నెంబరు కూడ మొదలగు వివరాలు కూడ నామోదు చేయడమైనది. సందర్శకుల స్పంధనను బట్టి చూస్తే ఆదివారం నాడు చాల మంది ఔత్సాహికులు వచ్చె అవకాశమున్నది. కనుక వారి అవసరార్థము తగు ఏర్పాట్లు చేయ వలసి వున్నది. ముఖ్యంగా బుక్ పెయిర్ చివరి రోజైన 26 డిసెంబరు నాడు సందర్శకుల సందడి అనూహ్యంగా వుండినది. వచ్చిన వారిలో..... తెలుగు భాషాశాస్త్ర విధ్యార్థులు, ఉపాద్యాయులు, ఎక్కువగా వచ్చారు. వారిలో కొంతమంది సివిల్సు/ గ్రూప్ పోటీపరీక్షలో 'తెలుగు సాహిత్యము ' ప్రధానాంశముగా తీసుకొన్న వారు వున్నారు. వికీపీడియాలో వారికి కావలసిన సమగ్ర సమాచార మున్నదని దాని అవగాహన కొరకు మరియు వారికి తెలిసిన సమాచారము వికీపీడియాలో వ్రాయలనే ఉత్సాహముతో మన అవగాహన సదస్సుకు వస్తామన్నారు. అటు వంటి వారికి వికీపీడియా గురించి పూర్తి అవగాహన కలిగించి వారిని ఉత్సాహ పరచ వలసిన అవసరమెంతో వున్నది. అటు వంటి వారి వలన వికీపీడియాకు, వికీపీడియా వలన వారికి చాల ఉపయోగ పడే అవకాశమున్నది. కనుక ఆవగాహన సదస్సులో వీరికి కావలసిన పరికరాలను అందుబాటులో వుంచ వలసి వున్నది. చివరి రోజున పంచడానికి కర పత్రాలు అయిపోగా ....... బ్యానర్లను పోటో తీసుకెళ్ళిన ఔత్సాహికు లెందరో వున్నారు.
3.ఒక వేళ సందర్శకులు ఎక్కువైతే .... వారిని గ్రూపులుగా విభజించి ఒక్కో గ్రూపుకు ఒక వికీపీడియన్ కేటాయించి వారికి అవగాహన కలిగించి, వారిచే అప్పటికప్పుడు వారి పేరును నామోదు చేయించి..... వికీలో వారు మార్పులు చేర్పులు చేయించేటట్లు కర్యోన్ముఖులను చేయ వలసి వున్నది. ఇంత వరకు జరిగిన వికీపీడియా అవగాహన సదస్సుల వల్లనైతేనేమి లేదా వాడుకరులు వారంతట వారే పేరు నామోదు చేసుకున్నవారు ఐతేనేమి సంఖ్యా పరంగా అటువంటి వారు చాల ఎక్కువగానే వున్నారు. అటు వంటి వారు అక్కడితోనే ఆగి పోతున్నారు. మార్పులు చేర్పులు ఏమాత్రము చేయడములేదు. కనీసము వారి వారి వాడుకరి పుటనును కూడ ప్రారంబించని వారు వేల సంఖ్యలో వున్నారు. (కొత్త వాడుకరుల గణాంకాలను చూడు) ఆ విషయాన్ని దృష్టిలో వుంచుకొని ప్రతిఒక్కరు పేరు నామోదు తర్వాత........ వారి వాడుకరి పుటను కూడ సృష్టించేటట్లు చేయాలి.
- దొర్లిన అపశృతులు
- ముందు ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు
1.మొదటి రెండు రోజులు.... కరపత్రాలు అందుబాటులో లేనందున కొంత ఇబ్బంది కలిగినది. అదే విధంగా చివరి రోజైన 26 డిసెంబరు నాటికి అప్పటివరకు అందుబాటులో వుండిన కరపత్రాలన్ని సా. 5.00 గంటలకే అయిపోయాయి. సాధారణంగా సందర్శకుల ప్రవాహం ఐదు గంటల తర్వాతనే ఎక్కువ. చివరి రోజున మరీ ఎక్కువ. కరపత్రాల లేమి వలన చాల ఇబ్బంది పడవలసి వచ్చినది.
2. వికీపీడియా కార్యక్రమాలంటే ఏ ఒక్కరిదో స్వంత భాద్యత కాకూడదు. స్థానికంగా వున్నవారందరూ కలసికట్టుగా పనిచేయాలి. ప్రతి ఒక్కరికి వారి వారి ముఖ్యమైన వ్వక్తిగత పనులుంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని, మాట్లాడుకొని వారి తీరిక సమయంలో వికీపీడియాకు సహరించేటట్లు ముందస్తు అవగాహన చేసుకుంటే...... వికీపీడియా కార్య క్రమాలకు ఆటంకముండదు. అలాకాకుండా..... ఎవరికి వారే ఆ పని వారు చూసుకుంటారులే అని అనుకుంటే ...... ఎవరూ రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ బుక్ పెయిర్ విషయంలో జరిగిందదే...... కరపత్రాలను ముద్రించడము, బ్యానర్లను తయారు చేయించడము, వాటిని బుక్ పెయిర్ స్టాలుకు తీసుక రావడము, బ్యానర్లను అలంకరించడము, బుక్ పెయిర్ అయిపోయిన తర్వాత బానర్లను విప్పడము, వాటిని జాగ్రత్త పరచడము మొదలగు పనులన్ని ఒక్కడిమీదనే వేయబడినది. హైదరాబాదులో స్థానికంగా వున్న సహ వికీపీడియన్లు కూడ సమయానికొచ్చి ఆ ఒక్కడికి సహకరించక పోవడము విచారకరము. ఎక్కడ వికీపీడియా కార్యక్రమము జరిగినా..... అక్కడి సహ వికీ పీడియనులు ఆ కార్యక్రమంలో స్వచ్చందంగా సహకారం అందించేటట్లు వుండాలి.
3. మనం చేసేది ముఖ్యంగా వికీపీడియా అవగాహన సదస్సులే..... ఇందులో ఒక్కసారిగా పది మందితో మాట్లాడవలసి వుంటుంది. అటువంటి సందర్బంలో మనకు అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకొని దాన్ని వాడితే ఫలితము మరింత మెరుగ్గ వుంటుంది. ఈ బుక్ పెయిర్ లో కంప్యూటర్లను పెట్టాలనుకున్నాం, ప్రొజెక్టరును పెట్టాలనుకున్నాము. కాని........... ఇవేవి అందు బాటులో పెట్టలేదు. కేవలము నోటి మాటలతోనే పని కానిచ్చామని పించుకోవలసి వచ్చినది. వచ్చిన సందర్శకులు చాలమంది..... కంప్యూటర్ పెట్టలేదెందుకని, డెమో ఇచ్చుంటే బాగుండేదని..... అన్నప్పుడు ....... ?????.
4. వికీపీడియా అంటేనే కంప్యూటర్ తో పని. అలాంటప్పుడు కంప్యూటర్ లేకుండ..... పేపర్లతోను, నోటి మాటలతోను పని కానివ్వాలనుకుంటే........ హాస్యాస్పదంగా వుంటుంది... ముందు ముందు జరగబోవు కార్యక్రమాలలో జాగ్రత్త వహించాలి.
5. సహ వికీపీడియన్లు మీ అభిప్రాయాన్ని వ్రాయండి.
ఎల్లంకి (చర్చ) 07:13, 27 డిసెంబరు 2014 (UTC)
1.కొత్త కరపత్రాల ముద్రణ కు కొంచెం సమయం పట్టినది, అంత వరకు మొదటి ఈతెలుగు కరపత్రము వాడాము. 26 డిసెంబరు నాడు రెండు వేల కరప్రతాలు అందువబాటులొ ఉన్నవి, అవి అయిపొయిన విషయం నాకు స్టాలుకు వచ్చిన తరువాత తెలిసినది. అప్పటికి ఒక గంట మాత్రమే వ్యవది ఉండటంతో నేను అంద చేయలేక పోయాను.
2. కొన్ని ఇతర కార్యకమాల వలన స్వచ్చందంగా వచ్చే వాలంతీర్ల సంఖ్య తగ్గినంది , సాయంత్రాలు సెలవు రొజులలొ స్టాలులో కనీసం ముగ్గురు వాలంటీర్లు వున్నారు. బానర్లు , కరపత్రాలు నాకు అలవాటు అయిన పనే కాక పొతే కొన్ని సాంకేతిక సమస్యాల వలన ఆలస్యం అయినది. మనం ఈ ముద్రణ పనులు మనం వారం ముందే పూర్థి చేసుకొని ఉండవలసినది. సిక్కర్లు కూడా చేయలేక పోయాము.
3. సాయంత్రం 5.30 దాకా వెలుగు ఎక్కువగా ఉండటం వలన కంప్యూటర్ లొ సరిగా చూపించ లేక పోయము, ఆదివారం ,శనివారం ఇంకా ప్రతి సాయంత్రం మనం అడిగిన వారికి కంప్యూటర్ లొ చూపించాము, ఒక లాప్టాప్ దీనికోసమే బాడుగకు తీసుకొన్నాము. స్టాలు వెనుక వైపు , కరపత్రంలో మొదటి పేజి తెరపట్టును ప్రదర్శించాము. ఆసక్తి చూపిన సందర్శకుల వివరాలు సేకరించాము, వీరి కొసమే 28 ఆదివారం సాయంత్రం ఒక అవగాహన సదస్సు తలపెట్టి 300లకు పైన చిరునమా స్లిప్పులు అందచేసాము
4. తెలుగు వికీపీడియా స్టాలు ఒక ప్రాధమిక అవగాహన కొరకు ఎర్పాటు చెయ్యబడినది అన్ని వందల స్టాళ్ళ మద్య సందర్శకులు నిలబడి కెటాయించే ఒక నిమిషమ్ం సమయంలొ వికీపీడియా గురించి వివరింప వీలు కాదు, వికీపీడియా అవగాహన సదస్సుల వలన మనం పూర్తి అవగాహాన కల్పించవచ్చు .
5. సహ వికీపీడియన్లు మీ అభిప్రాయాన్ని వ్రాయండి.--కశ్యప్ (చర్చ) 11:37, 28 డిసెంబరు 2014 (UTC)
మరో సారి ఇలాంటి కార్యక్రమం చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు
మార్చు- ముందుగా ప్రణాలిక పూర్తి కాకపోయినా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు.
- ఖచ్చితంగా పాల్గొనే వాలంటీర్లు లేనపుడు ఇలాంటి ప్రదర్శనల జోలికి పోరాదు.
- అద్దెకు కార్యకర్తలను తీసుకొని ఇలాంటివి నిర్వహించాలి.
- ముందుగా ప్రచారం కల్పించకూడదు....విశ్వనాధ్ (చర్చ) 12:59, 18 డిసెంబరు 2014 (UTC)
- విశ్లేషణ అందించిన ఎల్లంకి ,కశ్యప్ ,వాడుకరి:విశ్వనాధ్.బి.కె. గార్లకు ధన్యవాదాలు. దీనికై తయారైన కరపత్రాలు, స్టికర్లు, వాటి మూలరూపాలు, ఫోటోలు కూడా చేర్చి మునుముందు మరింత బాగా చేయటానికి తోడ్పడండి.--అర్జున (చర్చ) 04:02, 20 ఏప్రిల్ 2015 (UTC)