విక్రమ్ 1986 లో వచ్చిన తెలుగు రొమాంటిక్ యాక్షన్ చిత్రం. వి. మధుసూదనరావు దర్శకత్వం వహించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని వెంకట్ నిర్మించాడు. అక్కినేని నాగార్జున, శోభనా ప్రధాన పాత్రలలో నటించగా, సంగీతాన్ని చక్రవర్తి అందించాడు. ఈ చిత్రం హిందీ సినిమా హీరో (1983) కు రీమేక్. ఇది అక్కినేని నాగార్జున హీరోగా నటించిన మొదటి చిత్రం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్టైంది.[1]

విక్రం
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
నిర్మాణం అక్కినేని వెంకట్
కథ సుభాష్ ఘాయ్
చిత్రానువాదం వి.మధుసూదనరావు
తారాగణం అక్కినేని నాగార్జున ,
శోభన,
చంద్రమోహన్
కైకాల సత్యనారాయణ
సంగీతం ఇళయరాజా
సంభాషణలు సత్యానంద్
ఛాయాగ్రహణం పి.ఎన్.సుందరం
కూర్పు టి కృష్ణ
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్
భాష తెలుగు

సర్దార్‌ను జైలుకు తీసుకెళ్లడంతో సినిమా మొదలవుతుంది. ఆ పరిస్థితి నుండి బయటపడటానికి, అతను తనవద్ద ఉన్న అత్యుత్తమ అనుచరుడు విక్రమ్‌కు రాస్తాడు. విక్రమ్ ఆనందరావు వద్దకు వెళ్లి హెచ్చరిస్తాడు. అనంతరం ఆనందరావు కుమార్తె రాధను కిడ్నాప్ చేస్తాడు. తానొక పోలీసు అధికారినని ఆమెకు చెబుతడు. ఆమె అతడితో ప్రేమలో పడుతుంది. అయితే, అతడొక గూండా అని ఆమె తెలుసుకుంటుంది. అయినప్పటికీ, ఆమె అతన్ని విడిచిపెట్టదు, కానీ అతణ్ణి లొంగిపొమ్మని అడుగుతుంది. నిజమైన ప్రేమతో పరివర్తన చెందిన విక్రమ్ పోలీసులకు లొంగిపోయి రెండేళ్లపాటు జైలు శిక్ష అనుభవిస్తాడు.

రాధ తన సోదరుడు రాంబాబుకు మొత్తం నిజం చెబుతుంది. రాధ వేరొకరిని పెళ్ళి చేసుకోకుండా ఉండటానికి, రాధా, టామీలు ప్రేమించుకుంటున్నట్లు నటించమని తన స్నేహితుడూ టామీని పిలుస్తాడు. టామీ పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకుని నిజంగానే రాధతో ప్రేమలో పడతాడు. విక్రమ్ తిరిగి వచ్చాక, ఓ గ్యారేజీలో పనిచేయడం మొదలుపెట్టి, మారిపోడానికి ప్రయత్నిస్తాడు. ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ, ఆనందరావు అతనిని తన జీవితం నుండి తరిమివేస్తాడు. చాలా రోజుల, చాలా సంఘటనల తరువాత, టామీ ఒక స్మగ్లర్ అని రాంబాబు తెలుసుకుంటాడు. జైలు నుండి విడుదలయ్యాక సర్దార్, ఆనందరావు విక్రమ్ ఇద్దరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అతను రాధ, ఆనందరావు, రాంబాబులను కిడ్నాప్ చేస్తాడు. విక్రమ్ చివరి క్షణంలో వచ్చి వారందరినీ విడిపించుకుంటాడు. రాధా విక్రమ్‌ల పెళ్ళికి ఆనందరావు అనుమతించడంతో కథ సుఖాంతమౌతుంది..

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు
సం. పాట గాయనీ గాయకులు నిడివి
1 "కొండా కోనల్లో" పి. సుశీలా 5:22
2 "డింగ్ డాంగ్" ఎస్పీ బాలు, పి.సుశీలా, మనో, రమేష్ 4:25
3 "ఓ కాలమా" కెజె యేసుదాస్ 4:39
4 "నీవే రాగం" ఎస్పీ బాలు, పి.సుశీలా 4:45
5 "నీ ప్రేమే నా ప్రాణం" ఎస్పీ బాలు, పి.సుశీలా 5:44
6 "సలామిధిగో" ఎస్పీ బాలు, ఎస్.జానకి 3:50

మూలాలు

మార్చు
  1. http://www.idlebrain.com/celeb/starhomes/nagarjuna/index.html