విజయనగరం రైల్వే స్టేషను

(విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)

విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషను (Vizianagaram railway station), భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక రైల్వే స్టేషను.

Vizianagaram Junction
విజయనగరం జంక్షన్
विजयनगरम जंक्शन
భారతీయ రైల్వే Junction Station
విజయనగరం రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationవిజయనగరం, ఆంధ్ర ప్రదేశ్
 India
Coordinates18°06′43″N 83°23′46″E / 18.112°N 83.396°E / 18.112; 83.396
Elevation74 మీ. (243 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుఖుర్దా రోడ్ - విశాఖపట్నం రైలు మార్గము of హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము and Jharsuguda-Vizianagaram line
ఫ్లాట్ ఫారాలు5
పట్టాలుBroad gauge 1,676 mm (5 ft 6 in)
నిర్మాణం
నిర్మాణ రకంStandard (on ground station)
పార్కింగ్Available
ఇతర సమాచారం
StatusFunctioning
స్టేషను కోడుVZM
జోన్లు తూర్పు తీర రైల్వే
డివిజన్లు వాల్తేరు
History
Opened1900
Previous namesబెంగాల్ నాగపూరు రైల్వే
ప్రయాణికులు
ప్రయాణీకులు ()150,000+
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు

ప్రధాన మార్గము

మార్చు

1893 - 1896 సంవత్సరాల మధ్య, 1,288 కి.మీ. (800 మై.) of the తూర్పు తీర స్టేట్ రైల్వే ప్రజల కోసం తెరవబడింది. 1898-99 మధ్య, బెంగాల్ నాగపూర్ రైల్వే దీనికి లింకు చేయబడింది.[1] విజయనగరం రైల్వే స్టేషను ఈ మధ్యకాలంలో ప్రారంభించబడింది. విజయనగరం రైల్వే స్టేషను వద్ద నుండి రైల్వేను హౌరా, రాయపూర్ విడీపోతుంది.విజయనగరం జిల్లాలో ప్రధాన రైల్వే స్టేషను కావడం వల్ల చాల మంది ఈ రైల్వే స్టేషను గుండా ప్రయాణాలు చేస్తారు. దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి వేగవంత రైళ్ళూ ఇక్కడ ఆగుతాయి. వాల్థ్రర్ డీవీజన్ లో ఈ రైల్వే స్టేషనును మొదటీ తరగతి రైల్వే స్టేషను వర్ఘికరించారు. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఉండటం వల్ల ఆ మార్గంలో ప్రయాణం చెయూ ప్రధాన రైలు బళ్ళూ ఆగుతాయ్.

బ్రాంచి లైను

మార్చు

79 కి.మీ. (49 మై.) విజయనగరం - పార్వతీపురం బ్రాంచి లైను 1908-09 సంవత్సరంలో ప్రారంభించబడింది.[1]

రైల్వేల పునర్వవస్థీకరణ

మార్చు

బెంగాల్ నాగపూర్ రైల్వే 1944లో జాతీయం చేయబడింది.[2] ఈస్ట్ ఇండియా రైల్వే కంపెనీ, బెంగాల్ నాగపూర్ రైల్వే లలోని కొన్ని భాగాలతో తూర్పు రైల్వే తేదీ 1952 ఏప్రిల్ 14 న ప్రారంభించబడింది.[3] తూర్పు రైల్వేలోని కొన్ని భాగాలతో ఆగ్నేయ రైల్వే 1955 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఇందులోని ఎక్కువ ప్రాంతాలు పూర్వపు బెంగాల్ నాగపూర్ రైల్వేకు చెందినవే.[3][4] ఏప్రిల్ 2003 సంవత్సరంలో ఆగ్నేయ రైల్వే నుండి తూర్పు తీర రైల్వే, ఆగ్నేయ మధ్య రైల్వే లను ఏర్పాటుచేయబడ్డాయి.[3]

విద్యుదీకరణ

మార్చు

పలాస-తిలారు, శ్రీకాకుళం రోడ్డు-చీపురుపల్లి, చీపురుపల్లి-అలమండ రైలుమార్గాలు1998-99 మధ్యన విద్యుదీకరణ చేయబడ్డాయి. శ్రీకాకుళం-తిరాలు రైలుమార్గం మాత్రం 1999-2000 మధ్యన విద్యుదీకరించబడింది.[5]

వసతులు

మార్చు

ఈ రైల్వే స్టేషన్లో రెండు డబుల్ బెడ్డున్న నాన్-ఏ.సి. విశ్రాంతి గదులు, ఒక 8-పడకల డార్మిటరీ సౌకర్యాలు ఉన్నాయి.[6]

ప్రయాణీకులు

మార్చు

విజయనగరం రైల్వే స్టేషను ప్రతీ రోజూ సుమారు 153,000 ప్రయాణీకులకు సేవలను అందిస్తుంది.[7]

విజయనగరం రైల్వే స్టేషను మీదుగా పోవు
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ , ఎక్స్‌ప్రెస్ రైళ్లు

మార్చు
రైలుబండి నంబరు. రైలుబండి పేరు వివరము బయలుదేరు స్థలం/నివాసస్థానం చేరుకొను స్థలం/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ
12703/04 ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషను హౌరా ప్రతిరోజూ
12839/40 "హౌరా చెన్నై మెయిల్" సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా చెన్నై సెంట్రల్ ప్రతిరోజూ
12863/64 హౌరా - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా యశ్వంతపూర్ ప్రతిరోజూ
17015/16 విశాఖ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ సికింద్రాబాద్ రైల్వేస్టేషను ప్రతిరోజూ
11019/20 కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ లోకమాన్య తిలక్ టెర్మినస్ ప్రతిరోజూ
18645/46 ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ హౌరా హైదరాబాద్ ప్రతిరోజూ
18463/64 ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ బెంగుళూరు ప్రతిరోజూ
18189/90 టాటానగర్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ టాటానగర్ అలప్పుఝ ప్రతిరోజూ
13351/52 ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ ధన్‌బాద్ జంక్షన్ అలప్పుఝ ప్రతిరోజూ
18517/18 కోర్బా - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ కోర్బా విశాఖపట్నం ప్రతిరోజూ
18047 అమరావతి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ హౌరా వాస్కోడ-గామా ఆది,మంగళ,బుధ,శుక్రవారాలు

గ్యాలరీ

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2012-11-10.
  2. "IR History: Part - III (1900 - 1947)". IRFCA. Retrieved 2012-11-21.
  3. 3.0 3.1 3.2 "Geography – Railway Zones". IRFCA. Retrieved 2012-11-21.
  4. "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.
  5. "History of Electrification". IRFCA. Retrieved 12 July 2013.
  6. "East Coast Railway Amenities at Stations (as in 2008)". Archived from the original on 6 జనవరి 2014. Retrieved 13 July 2013.
  7. "Vizianagaram (VZM)". India Rail Enquiry. Retrieved 12 July 2013.

బయటి లింకులు

మార్చు