ప్రశాంతి ఎక్స్‌ప్రెస్
బెంగుళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది బెంగుళూరు రైల్వే స్టేషను, భువనేశ్వర్ రైల్వే స్టేషను మధ్య నడిచే రోజువారి ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు 18463 నెంబరుతో భుబనేశ్వర్లో ఉదయం 05 గంటల 30 నిమిషాలకు బయలుదేరి, తరువాతి రోజు మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు క్రాంతివిరా సంగోలి రాయ్నా బెంగళూరు (ksr) స్టేషన్ కు చేరుకుంటుంది.
![]() Bhubaneswar bound Prashanti Express at Pithapuram | |||||
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ | ||||
స్థానికత | ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక | ||||
తొలి సేవ | 22nd నవంబర్ 2000 | ||||
ప్రస్తుతం నడిపేవారు | తూర్పు తీర రైల్వే జోన్ | ||||
మార్గం | |||||
మొదలు | భుబనేశ్వర్ | ||||
ఆగే స్టేషనులు | 43 | ||||
గమ్యం | బెంగుళూరు | ||||
ప్రయాణ దూరం | 1,547 kమీ. (5,075,000 అ.) | ||||
సగటు ప్రయాణ సమయం | 30గంటల 35నిమిషాలు | ||||
రైలు నడిచే విధం | రోజు | ||||
రైలు సంఖ్య(లు) | 18463 / 18464 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | స్లీపర్,రెండవ తరగతి ఎ.సి,ముడవ తరగతి ఎ.సి,సాధారణ భోగీలు | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | కలదు | ||||
పడుకునేందుకు సదుపాయాలు | కలదు | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం | 50 km/h (31 mph) average with halts | ||||
|
చరిత్ర
మార్చుప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ను 2000 నవంబర్ 22న విశాఖపట్నం, బెంగళూరు రైల్వే స్టేషన్ల మద్య ప్రారంభించారు. అయితే కొన్ని రాజకీయ కారణాల వల్ల ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ను భుబనేశ్వర్ వరకు 2007 ఫిబ్రవరి 20 నుండి పొడిగించారు.
మార్గం
మార్చుబెంగుళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ భుబనేశ్వర్ నుండి బయలుదేరి ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్టాల్లో ముఖ్య పట్టణాలైన బరంపురం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను, గుంటూరు, నంద్యాల, గుంతకల్లు, గుత్తి, అనంతపురం, హిందూపురం, శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం, పెనుగొండ, యెలహంక ల మీదుగా బెంగళూరు చేరుకుంటుంది. బెంగుళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ గుంతకల్లు, విశాఖపట్నం రైల్వే స్టేషను ల వద్ద తన ప్రయాణదిశను మార్చుకుంటుంది.
వేగం
మార్చుప్రశాంతి ఎక్స్‌ప్రెస్ భుబనేశ్వర్, బెంగళూరు ల మద్య 1548 కిలో మీటర్ల దూరాన్ని 3 గంటల 35నిమిషాల ప్రయాణసమయంతో సగటున గంటకు 51 కిలోమీటర్ల వేగంతో అధిగమిస్తుంది.
ట్రాక్షన్
మార్చుభువనేశ్వర్ - బెంగుళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ భుబనేశ్వర్ నుండి విశాఖపట్నం వరుకు విశాఖపట్నం లోకో షెడ్ అధారిత WAP-4 లేదా WAP-7 లోకోమోటివ్ ను, అక్కడినుండి గుంతకల్లు వరుకు లాల్ గుడ లేదా విజయవాడ లోకోషెడ్ ఆధారిత WAP-4 లోకోమోటివ్ ను, గుంతకల్లు నుండి బెంగుళూరు వరకు లాల్ గుడ లేదా విజయవాడ అధారిత WAP-4 లేదా WAP-7 లోకోమోటివ్ లను ఉపయోగిస్తున్నారు.
భోగీల అమరిక
మార్చుబెంగుళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ లో ఒక మొదటి తరగతి ఎ.సి, 4 మూడవ తరగతి ఎ.సి భోగీలు,11 స్లీపర్ భోగీలు, 4 సాధరణ భోగీలతో కలిపి మొత్తం 23 భోగీలుంటాయి.
Loco | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | UR | UR | S1 | S2 | S3 | S4 | S5 | S6 | S7 | S8 | S9 | PC | S10 | S11 | B1 | B2 | B3 | B4 | A1 | UR | UR | SLR |
సంఘటనలు
మార్చుఆగస్టు 29 2015 లో బెంగుళూరు సిటి రైల్వే స్టేషన్ వద్ద ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ యొక్క ఇంజన్, రెండు భోగీల పట్టాలు తప్పాయి.అయితే ప్రయాణికులకు ఎటువంటి హాని కలుగలేదు.