వినోదం 1996 లో విడుదలైన ఒక హాస్యభరిత చిత్రం. ఈ సినిమాకు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించగా శ్రీకాంత్, రవళి ప్రధాన పాత్రలు పోషించారు.

వినోదం
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచనదివాకర్ బాబు
నిర్మాతకె. అచ్చిరెడ్డి
తారాగణంశ్రీకాంత్,
రవళి
ఛాయాగ్రహణంటి. శరత్
కూర్పురాంగోపాల్ రెడ్డి
సంగీతంఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1996 ఆగస్టు 2 (1996-08-02)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

రాజా, అతని స్నేహితులు కలిసి చింతామణి అనే ఇంట్లో అద్దెకుంటుంటారు. చింతామణికి అద్దె ఎగ్గొట్టడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అల అని పిలవబడే అష్టలక్ష్మి ధనవంతుడైన బంగారం కూతురు. కూతురు పుట్టాక తనకు బాగా కలిసొచ్చిందని ఆమె ఏదడిగితే అది కాదనకుండా ఇస్తుంటాడు బంగారం. ఈమెకు స్వేచ్ఛగా తిరగడం అంటే ఇష్టం. అలా బయట తిరుగుతున్నపుడు రాజా, అతని మిత్రబృందం తో పరిచయం ఏర్పడుతుంది. రాజా, అష్టలక్ష్మి ఒకరినొకరు ప్రేమించుకుంటారు.

నటీనటులు సవరించు

పాటలు సవరించు

  • హై లైలా ప్రియురాలా
  • మల్లెపూల వాన జల్లుల్లోనా
  • కమ్మగా సాగే స్వరమా
  • చలాకీ కలువ కలువ
  • జింగిలాలో ఏం గింగిరాలో

పురస్కారాలు సవరించు

ఈ సినిమాలో నటనకు గాను బ్రహ్మానందం కు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం లభించింది.[2]

మూలాలు సవరించు

  1. "Vinodam Cast and Crew Review". filmy.today. Filmy Today. Retrieved 18 October 2016.[permanent dead link]
  2. "Nandi awards -1996". awardsandwinners.com. Retrieved 27 March 2018.