వియ్యాలవారి కయ్యాలు (1979 సినిమా)

వియ్యాలవారి కయ్యాలు కట్టా సుబ్బారావు దర్శకత్వంలో విష్ణుప్రియ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కృష్ణ, జయప్రద ప్రధాన తారాగణంగా నిర్మించబడిన తెలుగు సినిమా. ఇది 1979, ఫిబ్రవరి 24వ తేదీన విడుదలయ్యింది. [1]

వియ్యాలవారి కయ్యాలు
(1979 తెలుగు సినిమా)

సినిమా పాటలపుస్తకం ముఖచిత్రం
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం కృష్ణ,
జయప్రద
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ విష్ణుప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు సవరించు

సాంకేతికవర్గం సవరించు

పాటలు సవరించు

ఈ చిత్రంలోని పాటలను వేటూరి సుందరరామమూర్తి వ్రాయగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్ని సమకూర్చాడు.[2]

  • బోడిగుండు బొప్పరాయి గుండు బోల్తా కొట్టింది - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • ఈ కలలోని ఊర్వశీ కలకాని ప్రేయసీ వచ్చాను వలపే నీవనీ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  • గుటకాయస్వాహా సర్వం గుటకాయ స్వాహా అత్త సొత్తుకే అల్లుడి దానం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  • పాలు పొంగే వయసే నీది పంచదార మనసే నాది కలుపుకుంటే కమ్మగుంటదిలే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  • పున్నాగ తోటల్లో సన్నాయి పాడింది సన్నాయి పాటల్లో అమ్మాయి ఆడింది - పి.సుశీల
  • లోకాలేలే నూకాలమ్మా మేలుకో మమ్మేలుకో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

కథా సంగ్రహం సవరించు

శారద ఇంటర్ విద్యార్థిని. శేఖర్ బి.ఎ.విద్యార్థి. టేబుల్ టెన్నిస్ ఛాంపియన్. అతడిని టేబుల్ టెన్నిస్ ఆటలో శారద ఓడిస్తుంది. ఓ రోజు శారదను ఓ ఆకతాయి ఏడిపిస్తుండగా శేఖర్ అడ్డుపడతాడు. తత్ఫలితంగా ఇద్దరి మనసులు కలుస్తాయి. శారద తల్లిదండ్రులు దుర్గమ్మ, హరిప్రసాదరావులు పల్లెటూరిలో ఉంటారు. శేఖర్ పట్నంలోని లాయర్ మాధవరావు, భాగ్యలక్ష్మిల ముద్దుల కొడుకు. దుర్గమ్మ వంశంలో గత ఆరు తరాలుగా ఇల్లరికం రావడం ఆనవాయితీగా ఉంది. ఆ కారణంతో శారదకు ఓ ఇల్లరికపుటల్లుణ్ణి తెమ్మని హరిప్రసాదరావును పోరి పట్నం పంపిస్తుంది.

మూలాలు సవరించు

  1. web master. "Viyyalavaari Kaiyalu". indiancine.ma. Retrieved 30 June 2021.
  2. జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (1979). వియ్యాల వారి కయ్యాలు పాటలపుస్తకం. p. 12. Retrieved 30 June 2021.

బయటిలింకులు సవరించు