వేణు సంకోజు
వేణు సంకోజు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు.[1] 1972 నుంచి కవితలు, కథలు, వ్యాసాలు, గ్రంథ రచనలు చేస్తున్నాడు. 1984లో నల్లగొండలో జయమిత్ర సాంస్కృతిక సాహిత్య వేదిక స్థాపించి వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు.[2] 12 పుస్తకాలు రాసిన వేణు, 2022లో తెలంగాణ ప్రభుత్వ దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నాడు.[3]
వేణు సంకోజు | |
---|---|
జననం | చండూరు, చండూరు మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ | 1951 జనవరి 1
వృత్తి | విశ్రాంత అధ్యాపకుడు |
ప్రసిద్ధి | కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు |
తండ్రి | వీరబ్రహ్మం |
జననం, విద్య
మార్చువేణు 1951, జనవరి 1న తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, చండూరు మండలంలోని చండూరు గ్రామంలో జన్మించాడు. తండ్రిపేరు వీరబ్రహ్మం. వేణు రాజనీతి శాస్త్రంలో ఎంఏ, ఎంఫిల్, పీజీడీసీఈ, జర్నలిజంలో పీజీడీ సాధించాడు. 2008లో తెలుగులో కథా సాహిత్య పరిశోధన అనే అంశంమీద పరిశోధన చేసి ఎంఫిల్ పట్టాను పొందాడు.
ఉద్యోగం
మార్చునల్లగొండ ప్రభుత్వ మహిళా కళాశాలలో పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడిగా పనిచేశాడు.
సాహిత్యరంగం
మార్చుకళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న సమయంలో 1982లో వేణు రచించిన మనిషిగా పూచే మట్టి అనే తొలి కవితా సంపుటిని 1995లో కాళోజీ నారాయణరావు ఆవిష్కరించాడు.[4] 2001లో మనం అనే కవితా సంపుటి , 2008లో నేలకల, ప్రాణప్రదమైన అనేకవితా సంపుటిలను, 2008లో స్పర్ష కథల సంపుటిని ప్రచురించాడు.[5] విద్యార్థినుల రచనలతో చలనం (ప్రయోగాత్మక సంపుటి), ప్రతిజ్ఞ (శ్రీశ్రీ సాహిత్య విశేష సంచిక)లను కూడా ప్రచురించాడు. జయమిత్ర సాంస్కృతిక సాహిత్య వేదిక ద్వారా 100పైగా రచనలు ప్రచురించాడు, 150 పుస్తకాలు ఆవిష్కరించాడు.
2001లో తెలంగాణ రచయితల వేదికను స్థాపించి 2007 వరకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాడు. 2005 సంవత్సరానికి ఇంటర్మీడియట్ పౌర శాస్త్ర పాఠ్యప్రణాళికా సభ్యునిగా, రచయితగా బాధ్యతలు నిర్వర్తించాడు. 2005లో సుద్దాల హనుమంతు మోనోగ్రాఫ్ నిర్మాణంలో తెలుగు అకాడమీలో కీలకపాత్ర పోషించాడు. ఈ పుస్తకం కేంద్ర సాహిత్య అకాడమీ నుండి భారతీయ సాహిత్య నిర్మాతలు సుద్దాల హనుమంతు అనే పేరుతో తెలుగు, ఆంగ్ల భాషలలో ప్రచురించబడింది.[6] తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2 నుండి 10వ తరగతి పాఠ్య పుస్తకాల సిలబస్ రచన కమిటీలో సభ్యునిగా పనిచేశాడు.
ఉద్యమాలలో
మార్చు1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ప్రసంగాలు, కవితా పఠనాలు, పత్ర సమర్పణలు చేశాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో నల్లగొండ జిల్లా జేఏసీలో కీలకబాధ్యతలు నిర్వర్తించాడు.[7] ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ వంటి నాయకులతో కలిసి సభలు, సమావేశాల్లో పాల్గొన్నాడు. తెలంగాణ జాగృతి ఉమ్మడి నల్లగొండ జిల్లా మొట్టమొదటి కన్వీనర్ గా కూడా పనిచేశాడు.
పురస్కారాలు
మార్చు- తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం (మనం కవితా సంపుటి, 2001)
- కాళోజీ కళావేదిక పురస్కారం (రామన్నపేట, 2002)
- అక్షర భారతి పురస్కారం (చౌటుప్పల్, 2004)
- ప్రజాభారతి పురస్కారం (భువనగిరి, 2006)
- వచన కవితా పురస్కారం (నెలవంక– నెమలీక సాహిత్య మాస పత్రిక, 2012)
- తేజస్విని సంస్థ పక్షాన జీవన సాఫల్య పురస్కారం (నల్లగొండ, 2012)
- ముదిగంటి వెంకటనర్సింహారెడ్డి రాష్ట్రస్థాయి పురస్కారం (2014)
- సాహితీ సేవ పురస్కారం (తెలంగాణ అమెరికా ఎన్నారైల సంఘం, 2014)
- శాతవాహన విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి పురస్కారం (కరీంనగర్)
- జిల్లా స్థాయి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం (నల్లగొండ, 2016 జూన్ 2)
- తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ ప్రతిభా పురస్కారం (2018)
- కాళోజీ సాహితీ పురస్కారం (కాళోజీ ఫౌండేషన్, వాగ్దేవి కళాశాల, హన్మకొండ, 2019)[8]
- దాశరథి సాహితీ పురస్కారం - తెలంగాణ ప్రభుత్వం (రవీంద్రభారతి, హైదరాబాదు, 2022 జూలై 22)[9]
మూలాలు
మార్చు- ↑ "ఉద్యమ కలానికి పట్టం". EENADU. 2022-07-21. Archived from the original on 2022-07-23. Retrieved 2022-07-23.
- ↑ "వేణు సంకోజుకు కాళోజీ పురస్కారం". Sakshi. 2019-11-13. Archived from the original on 2019-11-13. Retrieved 2022-07-20.
- ↑ telugu, NT News (2022-07-23). "కవులు, రచయితలు తెలంగాణకు రెండు కండ్లు". Namasthe Telangana. Archived from the original on 2022-07-23. Retrieved 2022-07-23.
- ↑ telugu, NT News (2022-07-21). "సాహిత్యానికి సముచిత గౌరవం". Namasthe Telangana. Archived from the original on 2022-07-20. Retrieved 2022-07-20.
- ↑ "Telangana: Poet Venu Sankoju awarded for outstanding work in Telugu literature". The Siasat Daily. 2022-07-20. Archived from the original on 2022-07-20. Retrieved 2022-07-20.
- ↑ "Bharateeya sahitya Nirmathalu Suddhala Hanumanthu, భారతీయ సాహిత్య నిర్మాతలు సుద్దాల హనుమంతు". www.telugubooks.in (in ఇంగ్లీష్). Archived from the original on 2022-07-20. Retrieved 2022-07-20.
- ↑ India, The Hans (2022-07-20). "Noted poet Venu Sankoju selected for Dasarathi Award -2022". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-07-20. Retrieved 2022-07-20.
- ↑ "కవి వేణు సంకోజుకు కాళోజీ పురస్కారం". lit.andhrajyothy.com. Archived from the original on 2022-07-20. Retrieved 2022-07-20.
- ↑ "కవి వేణు సంకోజుకు దాశరథి అవార్డు". web.archive.org. 2022-07-21. Archived from the original on 2022-07-21. Retrieved 2022-07-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)