వై.వి. రావు

సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత

యెర్రగుడిపాటి వరదరావు (వై.వి.రావు) (మే 30, 1903 - ఫిబ్రవరి 14, 1973)[1] తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు.[2]

యెర్రగుడిపాటి వరదరావు
Yvrao.jpg
వై.వి.రావు
జననంయెర్రగుడిపాటి వరదరావు
(1903-05-30) 1903 మే 30
నెల్లూరు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా.
మరణం1973 ఫిబ్రవరి 13 (1973-02-13)(వయసు 69)
వృత్తినిర్మాత
దర్శకుడు
నటుడు
డిస్ట్రిబ్యూటర్
ఎడిటర్
క్రియాశీలక సంవత్సరాలు1930–1968
బంధువులురాజం (మాజీ భార్య)
రుక్మిణి(భార్య)
లక్ష్మి (కుమార్తె)
ఐశ్వర్య(నటి) (మనుమరాలు)

జీవిత విశేషాలుEdit

వై.వి.రావు 1903 మే 30న నెల్లూరులో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయములో వైద్యవిద్యను వదిలి సినిమాలలో నటించాలనే కోరికతో బొంబాయి వెళ్లాడు. బొంబాయిలో మణీలాల్ జోషీని కలిసి, మెప్పించి మూకీ చిత్రాలలో నటించే అవకాశము పొందాడు. ఈయన కొన్ని రోజులు అర్దేషిర్ ఇరానీ యొక్క రాయల్ ఆర్ట్ స్టూడియోలో కూడా పనిచేశాడు. ఆ తరువాత మద్రాసులోని జనరల్ పిక్చర్స్ లో కళాదర్శకునిగా, నటునిగా చేరాడు. ఈయన ఆర్.ఎస్.ప్రకాష్ యొక్క కొన్ని మూకీ చిత్రాలలో కూడా నటించాడు. వై.వి.రావు 1939లో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన చింతామణి పిక్చర్స్ను స్థాపించాడు. 1950లో శ్రీవరుణ ఫిలంస్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు. అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని (ఏడు) భాషల చిత్రాలలో పనిచేసిన ఘనత ఈయనకే దక్కినది. వై.వి.రావు పశ్చిమ మరియు దక్షిణ భారతదేశములలోని ప్రముఖ చిత్రనిర్మాణ కేంద్రాలైన బొంబాయి, కొల్హాపూర్, మద్రాసు మరియు మైసూరులలో పనిచేశాడు. తొలి కన్నడ టాకీ చలనచిత్రము, ఎం.వి.సుబ్బయ్య నాయుడు మరియు ఆర్.నాగేంద్రరావు నటించిన సతీ సులోచన ఈయనే నిర్మించాడు.

1946లో వై.వి.రావు, నర్తకి నుంగంబాక్కం జానకి కుమార్తె మరియు తమిళ సినిమా నటీమణి అయిన కుమారి రుక్మిణిని వివాహమాడినాడు. తెలుగు సినీనటి లక్ష్మి (జీన్స్ చిత్రములో బామ్మ) ఈయన కూతురే.[3]

చిత్ర సమాహారంEdit

మూలాలుEdit

  1. "Y. V. Rao profile". kannadamoviesinfo.com. Retrieved 31 March 2014. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
  2. The Hindu : A revolutionary filmmaker
  3. "The Hindu : A revolutionary filmmaker". మూలం నుండి 2009-06-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-04-04. Cite web requires |website= (help)
  • వినాయకరావు రచించిన నవ్య వీక్లి 2008 డిసెంబరు 31 లో ప్రచురించబడిన వైవిధ్య చిత్రాల సృష్ఠికర్త వై.వి.రావు వ్యాసం నుండి.

బయటి లింకులుEdit