శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యం

తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, శివ్వారం గ్రామ సమీపంలో ఉన్న వన్యప్రాణుల అభయా
(శివరాం వన్యప్రాణుల అభయారణ్యం నుండి దారిమార్పు చెందింది)

శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, శివ్వారం గ్రామ సమీపంలో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం. ఇది మంథని నుండి 10 కి.మీ., పెద్దపల్లి నుండి 40 కి.మీ., కరీంనగర్ నుండి 80 కి.మీ., గోదావరిఖని నుండి 30 కి.మీ. దూరంలో ఉంది.[1]

శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యం
వన్యప్రాణుల అభయారణ్యం
దేశం భారతదేశం
రాష్ట్రంశివ్వారం, జైపూర్ మండలం, మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
Websiteఆధికారిక వెబ్సైటు

చరిత్ర

మార్చు

కాకతీయుల కాలంనాటి ఈ మడుగు 9 కి.మీ. వెడల్పు, 29 కి.మీ. పొడవు, 20 మీ. లోతులో ఉంటుంది. గోదావరి సజీవధార వల్ల ఇక్కడ బురద నేల మొసళ్లు అధికంగా ఉంటాయి. బురద నేల మొసళ్లను సంరక్షించడానికి 1952లో హైదరాబాదు ఫస్లీ చట్టం ద్వారా శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యం ఏర్పాటు చేయబడింది. ఇది 1978లో వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలోకి తీసుకోబడి, మొసళ్ళ పునరావస కేంద్రంగా ప్రకటించబడింది.[2]

వన్యప్రాణులు

మార్చు

ఈ అడవిలో చిరుతపులులు, ఎలుగుబంట్లు, నీలగై, కృష్ణ జింక, దుప్పి, కొండ చిలువ, కోతి, పులులు,నెమళ్లు, నక్కలు మొదలైన జంతువులు ఉన్నాయి. సహజసిద్ధమైన ఇక్కడి భూభాగం అభయారణ్యం అందాన్ని పెంచుతోంది.[3]

ఇతర వివరాలు

మార్చు
  1. టేకు, టెర్మినాలియా, జిట్రేగి, వెదురు మొదలైన చెట్లతో 36.29 కి.మీ. విస్తరించి ఉన్న ఈ అడవి,[4] గోదావరి నది సజీవధార బురద నేల మొసళ్ళకు నిలయంగా ఉంది.
  2. నదిలో బోటింగ్‌కు వెళ్లి మొసళ్ళను దగ్గరనుండి చూడవచ్చు.
  3. శీతాకాలంలో అభయారణ్యాన్ని సందర్శించడానికి అనువుగా ఉంటుంది.

మూలాలు

మార్చు
  1. సాక్షి, ఎడ్యుకేషన్ (30 August 2016). "వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు". Sakshi. Archived from the original on 22 April 2020. Retrieved 27 April 2020.
  2. Telangana Today, Telangana (13 May 2017). "Shivvaram Sanctuary turns a tourist hub". Archived from the original on 27 April 2020. Retrieved 27 April 2020.
  3. "Sivaram Wildlife Sanctuary". Telangana Forest Department. Archived from the original on 21 May 2012. Retrieved 27 April 2020.
  4. మన తెలంగాణ, ఆఫ్ బీట్ (22 November 2018). "అందాలకు నిలయం ఆదిలాబాద్". www.manatelangana.news. Archived from the original on 27 April 2020. Retrieved 27 April 2020.

ఇతర లంకెలు

మార్చు