సంతోషిమాత (హిందీ: संतोषी माता) హిందూ దేవత. సంతోషం, సంతృప్తికి సంతోషిమాత అధిదేవతగా పరిగణిస్తారు. ఆమెను ముఖ్యంగా ఉత్తర భారతదేశం, నేపాల్ మహిళలు ఎక్కువగా పూజిస్తారు. స్త్రీలు వరుసగా 16 శుక్రవారాల్లో చేసే సంతోషి మా వ్రతంతో అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.[1]

సంతోషి మాత
సంతృప్తి దేవత
దేవనాగరిसंतोषी माता
అనుబంధందేవి
నివాసంSvānandaloka
మంత్రంఓం శ్రీ సంతోషి మహామాయే గజానంద్ దాయిని శుక్రవార ప్రియే దేవీ నారాయణి నమోస్తుతే
ఆయుధములుకత్తి, బియ్యంతో కూడిన బంగారు కుండ, త్రిశూలం
Dayశుక్రవారం
తోబుట్టువులుశుభ్, లాభ్
వాహనంపులి, ఆవు లేదా కమలం
పాఠ్యగ్రంథాలుజై సంతోషి మా (చిత్రం)
తండ్రివినాయకుడు
తల్లిరిద్ధి, సిద్ధి

ఆమె దుర్గాదేవి అవతారం అని భక్తుల విశ్వాసం. హిందూ సనాతన ధర్మంలో సంతోషిమాత పూజకు విశిష్ట స్థానం ఉంది. దేశంలోని అనేక ప్రాంతాలలోని వారు శుక్రవారం సంతోషిమాతను పూజిస్తారు. పులుపు తినకూడదు అని నియమం ఉంది. 1975లో వచ్చిన జై సంతోషి మా అనే హిందీ సినిమా వల్ల సంతోషి మాత బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సంతోషిమాత వ్రతకథను ఇతివృత్తంగా ఈ సినిమాని చిత్రీకరీంచారు. ఇందులో సత్యవతి అనే భక్తురాలు సంతోషిమాత వ్రతం చేయడం వల్ల సౌభాగ్యాన్ని పొందుతుంది. సంతోషిమాత వినాయకుని మానసపుత్రిక.

దేవాలయాలు మార్చు

భారతదేశం అంతటా, విదేశాలలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఉత్తరాదిన సంతోషిమాతకు విపరీతమైన ఆదరణ ఉన్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ సంతోషిమాత ఆలయాలున్నాయి. కాగా ప్రసిద్ధి చెందిన శ్రీ సంతోషి మాతా మందిరాలు కొన్ని..

తెలుగు రాష్ట్రాలలో మార్చు

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Friday Fasting: సంతోషిమాత వ్రతం పూజ విధానం.. ఉపవాస దీక్ష, ఉద్యాపన గురించి తెలుసుకుందాం.. | Friday Fasting: Who should fast on Fridays and how all about Santhoshi Mata pooja and udyapana vidhanamu | TV9 Telugu". web.archive.org. 2023-03-27. Archived from the original on 2023-03-27. Retrieved 2023-03-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)