సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

తెలుగు కవి, రచయిత, ఉపాధ్యాయుడు

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గ్రామీణ నేపథ్యం, రైతుల కష్టాలను ఇతివృత్తంగా స్వీకరించిన రచయిత[1].

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
జననంసన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
(1963-02-16) ఫిబ్రవరి 16, 1963 (వయస్సు 58)
భారతదేశం బాలరాజుపల్లె గ్రామం, కాశి నాయన మండలం,కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తిఉపాధ్యాయుడు
రచయిత
మతంహిందూ
భార్య / భర్తఇంద్రావతి
పిల్లలుపావని, శ్రావణి, శ్రీనాథ్
తండ్రిసన్నపురెడ్డి లక్ష్మిరెడ్డి
తల్లిచెన్నమ్మ

విశేషాలుసవరించు

ఇతడు 1963, ఫిబ్రవరి 16వ తేదీన సన్నపురెడ్డి చెన్నమ్మ, లక్ష్మిరెడ్డి దంపతులకు కడప జిల్లా, కాశినాయన మండలం బాలరాజుపల్లె గ్రామములో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఇతడు బి.ఎస్సీ, బి.ఈడీ. చదివాడు. 1989నుండి పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 1987 నుండి కథలు, నవలలు, కవితలు వ్రాస్తున్నాడు. ఇతడి నవల చినుకుల సవ్వడి ఇంగ్లీషు భాషలోనికి అనువదించబడింది[2]. కొన్ని కథలు హిందీ, కన్నడ, ఒరియా భాషలలోకి అనువదించబడ్డాయి. ఇతని రచనలపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ద్రావిడ విశ్వవిద్యాలయాలలో పి.హెచ్.డి.స్థాయిలో మూడు పరిశోధనలు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలలో ఎం.ఫిల్. స్థాయిలో రెండు పరిశోధనలు జరిగాయి.

రచనలుసవరించు

నవలలుసవరించు

 1. కాడి
 2. పాండవబీడు
 3. తోలుబొమ్మలాట
 4. చినుకుల సవ్వడి
 5. పాలెగత్తె
 6. ఒక్క వాన చాలు
 7. మబ్బులు వాలని నేల
 8. ఒంటరి
 9. కొండపొలం

కవితా సంపుటిసవరించు

 1. బడి

కథాసంపుటులుసవరించు

 1. బతుకు సేద్యం
 2. కొత్త దుప్పటి

కథలుసవరించు

ఇతని కథలు ఆంధ్రప్రభ,ఆహ్వానం, చినుకు, ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక, ఆంధ్రజ్యోతి, సాహిత్యనేత్రం, ఈనాడు, స్వాతి మాసపత్రిక,వార్త,చతుర,నవ్య,రచన,స్రవంతి మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

 1. అంటు
 2. అమ్మ
 3. అరలు అరలుగా
 4. ఆకలి
 5. ఆకుపచ్చని మాయ
 6. ఆమె చూపు
 7. ఆమె మొలకెత్తిన నేల
 8. ఆశ
 9. ఎంతెంత దూరం
 10. ఏడోకడ్డీ
 11. ఒక్క వాన చాలు
 12. కడితి వేట[3]
 13. కన్నీటి కత్తి
 14. కొక్కొరొకో
 15. కొడుకు-కూతురు
 16. గంపెడు గడ్డి
 17. గిరి గీయొద్దు
 18. చనుబాలు
 19. చినుకుల సవ్వడి
 20. తడి
 21. తమ్ముడి ఉత్తరం
 22. తోలు బొమ్మలాట
 23. దిగంబరం
 24. దెబ్బ
 25. నేను-తను
 26. నేర్చుకో
 27. పట్టుచీర
 28. పాటల బండి
 29. పిట్టపాట
 30. పునాది
 31. పేడదెయ్యం
 32. పేరులేని కథ (రాతిపూజ)
 33. ప్రతిమల మంచం
 34. బతుకు సేద్యం
 35. బురద
 36. బొగ్గులబట్టి
 37. భయం నీడ
 38. ముస్తాబు
 39. రాలిన చింతపండు
 40. వక్రదృష్టి
 41. వసంతం
 42. వాళ్లు మాపార్టీకాదు
 43. వీరనారి
 44. వీరమరణం
 45. సారీ సారీ లిటిల్ స్టార్

పురస్కారాలు, సన్మానాలుసవరించు

 • 1984లో ఆంధ్రప్రభ కథలపోటీలో ఒక్కవానచాలు కథకు ద్వితీయ బహుమతి
 • 1990లో సహృదయ సాహితి విశాఖపట్నం నిర్వహించిన రాష్ట్రస్థాయి కవితలపోటీలో శైశవబాల కవితకు ఉత్తమ బహుమతి.
 • 1996లో అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళై ఫౌండేషన్, ఆంధ్రప్రభ సంయుక్తంగా నిర్వహించిన కథలపోటీలో అంతు కథకు ప్రథమ బహుమతి.
 • 1997లో ఢిల్లీ తెలుగు అసోసియేషన్ సత్కారం
 • 1998లో ఆటా నిర్వహించిన అంతర్జాతీయ నవలల పోటీలో తొలినవల కాడికి ద్వితీయ బహుమతి.
 • 1998లో ఉండేల మాలకొండారెడ్డి పురస్కారం
 • 1999లో గౌరు సాహితీ పురస్కారం.
 • 2002లో పాండవ బీడు నవలకు స్వాతి వీక్లీ అవార్డు.
 • 2004, 2006లో అధికార భాషాసంఘం వారి పురస్కారం.
 • 2007లో ఆటా నవలలపోటీలో తోలుబొమ్మలాటకు ప్రథమ బహుమతి.
 • 2007లో స్వాతి వారపత్రిక నిర్వహించిన నవలలపోటీలో పాలెగత్తె నవలకు ప్రథమ బహుమతి.
 • 2007లో చతుర నవలలపోటీలో చినుకుల సవ్వడి నవలకు ప్రథమ బహుమతి.
 • 2009వ సంవత్సరపు ” చాసో ” స్ఫూర్తి పురస్కారం[4].
 • 2009లో కొత్త దుప్పటి కథల సంపుటికి ఎం.వి.తిరుపతయ్య సాహిత్య పురస్కారం.
 • 2009లో కొత్త దుప్పటి కథల సంపుటికి విమలాశాంతి సాహిత్య పురస్కారం.
 • 2010లో కొత్త దుప్పటి కథల సంపుటికి మాడభూషి రంగాచార్య అవార్డు.
 • 2012లో కొత్త దుప్పటి కథల సంపుటికి రాచకొండ రచనా పురస్కారం.
 • 2013లో ఒక్క వాన చాలు నవలకు నవ్య వీక్లీ నవలల పోటీలో ప్రథమ బహుమతి.
 • 2013లో కొత్త దుప్పటి కథల సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం.
 • 2014లో కొత్త దుప్పటి కథల సంపుటికి కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం[5].
 • 2015లో మబ్బువాలని నేల నవలకు సిపియం 21వ అఖిల భారత మహాసభల సందర్భంగా నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయ బహుమతి.
 • 2017లో ఒంటరి నవలకు తానా నవలల పోటీలో బహుమతి.
 • 2017లో ఒక్కవాన చాలు నవలకు కొలకలూరి విశ్రాంతమ్మ సాహితీ పురస్కారం.

మూలాలుసవరించు

 1. ఎం.విజయభాస్కర రెడ్డి. "సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి". ysrకడప. Retrieved 11 March 2015. CS1 maint: discouraged parameter (link)[permanent dead link]
 2. స్వాతి శ్రీపాద. "Sound of Raindrops". కినిగె.కాం. Retrieved 11 March 2015. CS1 maint: discouraged parameter (link)
 3. ఎస్.వెంకట్రామిరెడ్డి (1987-02-06). "కడితివేట". ఆంధ్ర సచిత్రవారపత్రిక. 79 (23): 44–47. Retrieved 11 March 2015. CS1 maint: discouraged parameter (link)
 4. తవ్వా ఓబుల్‌రెడ్డి (2009-01-28). "సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కి ఘనంగా "చాసో స్ఫూర్తి" పురస్కార ప్రదానం". పొద్దు అంతర్జాల పత్రిక. Retrieved 11 March 2015. CS1 maint: discouraged parameter (link)
 5. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284. Check date values in: |date= (help)