సీతారామరాజు
సీతారామరాజు 1999 లో వై. వి. ఎస్. చౌదరి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ, సంఘవి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను నాగార్జున, డి. శివప్రసాద్ రెడ్డి కలిసి గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించారు. పోసాని కృష్ణ మురళి సంభాషణలు అందించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు.[1]
సీతారామరాజు | |
---|---|
దర్శకత్వం | వై.వి.ఎస్. చౌదరి |
రచన | పోసాని కృష్ణ మురళి |
నిర్మాత | డి. శివప్రసాద్ రెడ్డి |
తారాగణం | అక్కినేని నాగార్జున , నందమూరి హరికృష్ణ , సంఘవి |
ఛాయాగ్రహణం | కె.రాజేంద్రప్రసాద్ |
కూర్పు | శంకర్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థలు | |
విడుదల తేదీ | ఫిబ్రవరి 5, 1999 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఇద్దరి అన్నదమ్ముల మధ్య అనుబంధం, వారిద్దరికీ ఒక చెల్లి. ఆమె గురించి వారిమధ్య భేదాభిప్రాయాలు లాంటి వాటి చుట్టూ కథ ఉంటుంది.
ఉత్తమ సహాయ నటి , నిర్మలమ్మ . నంది అవార్డు
ఉత్తమ మేకప్ మాన్ , రామచంద్ర రావు.నంది అవార్డు.
తారాగణం
మార్చు- సీతయ్యగా నందమూరి హరికృష్ణ
- రామరాజుగా అక్కినేని నాగార్జున
- గౌరిగా సంఘవి
- సత్యగా సాక్షి శివానంద్
- బసవరాజుగా కోట శ్రీనివాసరావు
- బసవరాజు బామ్మగా నిర్మలమ్మ
- శీనుగా రవితేజ
- లక్ష్మిగా కల్పన
- రాఘవరాజుగా చంద్రమోహన్
- ఆహుతి ప్రసాద్
- ప్రసాద్ గా ప్రసాద్ బాబు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్
- చిన్నాగా సత్యప్రకాష్
- చందుగా బ్రహ్మాజీ
- ప్రభాకర్ గా బెనర్జీ, ఎస్. ఐ
- శివాజీ
- సూరిగా సమీర్
- రజిత
- అపూర్వ
- అపర్ణ
- సంతోషిణి
- సుమగా మాన్య
- నానిగా మాస్టర్ రఘుచైతన్య
- కుమార్ గా వివేక్ వాసు
నిర్మాణం
మార్చుఅభివృద్ధి
మార్చుఈ సినిమాలో నాగార్జున, హరికృష్ణ అన్నదమ్ములుగా కనిపిస్తారు.
సాంకేతిక వర్గం
మార్చు- మాటలు: పోసాని కృష్ణమురళి
- పాటలు: సీతారామశాస్త్రి
- నృత్యాలు: బృందా, శంకర్
- పోరాటాలు: రాజు
- కూర్పు: శంకర్
- డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: కె.రాజేంద్రప్రసాద్
- సంగీతం: కీరవాణి
- నిర్మాతలు: నాగార్జున అక్కినేని, డి. శివప్రసాద రెడ్డి
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వై.వి.యస్.చౌదరి.
పాటలు
మార్చుఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు.
చాంగురే చాంగురే , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎం ఎం కీరవాణి, రాధిక, శారద,
శ్రీవారు దొరగారు , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
కుందనపు బొమ్మ , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఎం ఎం కీరవాణి , ఎస్ పి శైలజ
ఉయ్యాల ఉయ్యాల , ఎం ఎం కీరవాణి
ఏకసెక తత్త , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎం ఎం కీరవాణి , సుజాత
ఎక్స్టేసీ ప్రైవసీ , ఎం ఎం కీరవాణి , కె ఎస్ చిత్ర
వినుడు వినుడు , నాగార్జున అక్కినేని , ఎం ఎం శ్రీవల్లి .
మూలాలు
మార్చు- ↑ "'సీతారామరాజు'కి 21 ఏళ్లు". సితార. Archived from the original on 2020-07-14. Retrieved 2020-07-14.