శ్రీమంతుడు (2015 సినిమా)

2015 సినిమా

శ్రీమంతుడు 2015 ఆగస్టు 7న విడుదలైన తెలుగు సినిమా.

శ్రీమంతుడు
సినిమా పోస్టర్
దర్శకత్వంకొరటాల శివ
రచనకొరటాల శివ
నిర్మాతవై. నవీన్
వై. రవిశంకర్
సి. వి. మోహన్
ఘట్టమనేని మహేశ్ ‌బాబు
తారాగణంఘట్టమనేని మహేశ్ ‌బాబు
శృతి హాసన్
ఛాయాగ్రహణంఆర్. మధి
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతందేవిశ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థలు
పంపిణీదార్లుఈరోస్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
2015 ఆగస్టు 7 (2015-08-07)
దేశంభారత్
భాషతెలుగు
బడ్జెట్400—700 million[lower-alpha 1]

కథ సవరించు

పల్లెమీద కోపంతో పట్టణానికి వలసొచ్చి ఆగర్భ శ్రీమంతుడిగా ఎదిగిన తండ్రి. పల్లెలో తన మూలాలు వెతుక్కునేందుకు పట్టణం వదిలిపెట్టిన కొడుకు. ఈ రెండు జీవితాల మధ్య సామాజిక లింకు -ఊరు దత్తత.

హర్షవర్ధన్ (మహేష్ బాబు) తండ్రి రవి ( జగపతి బాబు) బిజినెస్ టైకూన్. రవి కి వ్యాపారమే ముఖ్యం . హర్ష కు ఈ వ్యాపార దుగ్ధ ఉండదు . తండ్రి వ్యాపార బాధ్యతలు చూసుకొమ్మంటే వాయిదా వేస్తాడు. స్నేహితుని కూతుర్ని పెళ్లి చేసుకోమంటే తిరస్కరిస్తాడు. ఆఫీస్ లో ఉద్యోగి కుమార్తె పెళ్లి కి లక్షలకొద్దీ ధన సహాయం చేస్తాడు . ఉత్తరాంధ్ర లోని దేవరాపల్లి నుండి సిటీ కి వచ్చి రూరల్ డెవలప్ మెంట్ కోర్సు చదువుతూఉంటుంది చారుశీల. చారుశీల ( శృతి హాసన్ ) ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె తో పరిచయం ప్రేమ గా మారే సమయానికి హర్ష , రవికాంత్ కొడుకని తెలిసి అతని ప్రేమను చారు తిరస్కరిస్తుంది. నీ తండ్రి ఊరేదో తెలుసా? దేవరాపల్లి ని నీ తండ్రి పట్టించుకోలేదు , అందుకే నీకూ, నాకూ కుదరదని చెప్తుంది. దాంతో పల్లె మూలాలు వెతుక్కోవడానికి బయలుదేరుతాడు హర్షవర్ధన్ (మహేష్). ఆ వూరి లో MP తమ్ముడు శశి అరాచకాలు చేస్తూవుంటాడు. హర్ష ఊరిని బాగుచేస్తాడు. చారు మనసు గెలుచుకొంటాడు. అతని మీద హత్యాప్రయత్నం జరుగుతుంది . అయినా సరే తండ్రి అనుమతి తీసుకుని ఊరికి తిరిగి వచ్చి MPని, శశిని అంతం చేసి ఊరికి పట్టిన పీడను వదిలిస్తాడు.

మహేష్ ఒక శ్రీమంతుడు గా తన ఊరికోసం పడే తపనను ప్రదర్శించడంలో ఒప్పించగలిగాడు. హీరోయిన్ శృతిహాసన్, తండ్రిగా జగపతిబాబు, తల్లిగా సుకన్య, ఊరి బాగుకోరే పెద్దగా రాజేంద్రప్రసాద్, విలన్లుగా సంపత్, ముఖేష్.. సపోర్టింగ్ కాస్ట్ తమవంతు సహకారాన్ని అందించారు. వెవెన్నెల కిషోర్, అలీ ద్వయం సీరియస్ టోన్‌లో ఉన్న సినిమాకు కాస్త సరదా అందించారు.

ముఖ్యంగా ఈ సినిమా తరువాత మహేష్ , KTR etc వంటివారు పల్లెలను దత్తత తీసుకోవడం మంచి పరిణామం

సాంకేతిక బృందం సవరించు

  • పోరాటాలు: ఎఎన్‌ఎల్ అరసు
  • కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు
  • ఛాయాగ్రహణం: ఆర్. మధి
  • బ్యానర్: మైత్రీ మూవీస్ మేకర్స్,
  • మహేష్ ప్రొడక్షన్స్
  • నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, మోహన్
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ

తారాగణం సవరించు

సాంకేతికవర్గం సవరించు

పురస్కారాలు సవరించు

సైమా అవార్డులు సవరించు

2015 సైమా అవార్డులు

  1. ఉత్తమ నటుడు
  2. ఉత్తమ నటి
  3. ఉత్తమ సంగీత దర్శకుడు
  4. ఉత్తమ సహాయనటుడు (రాజేంద్రప్రసాద్)
  5. ఉత్తమ నేపథ్య గాయకుడు (సాగర్ - జత కలిసే)

నోట్సు సవరించు

  1. International Business Times India claims the film's budget as 400 మిలియను (US$5.0 million),[1] whereas IANS claims it as 700 మిలియను (US$8.8 million).[2]

మూలాలు సవరించు

  1. H. Hooli, Shekhar (27 May 2015). "Mahesh Babu's 'Srimanthudu' Theatrical Rights Bought at Record Price". International Business Times India. Archived from the original on 9 జూన్ 2015. Retrieved 9 June 2015.
  2. IANS (25 July 2015). "Mahesh Babu's 'Srimanthudu' to release as 'Selvandhan' in Tamil". The Indian Express. Archived from the original on 25 జూలై 2015. Retrieved 25 July 2015.

బయటి లంకెలు సవరించు