సుడిగుండాలు (సినిమా)

తెలుగు సినిమా

సుడిగుండాలు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సుకన్య ప్రధాన పాత్రలలో అక్కినేని, ఆదుర్తి నిర్మించిన తెలుగు చలన చిత్రం. ఆదుర్తి సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు సంయుక్తంగా చక్రవర్తి చిత్ర అనే సంస్ధ స్ధాపించి చిత్రనిర్మాణం సాగించారు. చక్రవర్తి సినిమా నిర్మించిన తొలిసినిమా సుడిగుండాలు. తప్పుదోవ పడుతున్న యువతరంలో నేరప్రవృత్తిని ప్రధానాంశంగా చేసుకుని ఈ చిత్ర కథను రూపొందించారు. ఈ సినిమా కథ, కథనం ప్రముఖ అమెరికన్ చలనచిత్రం కంపల్షన్ నుంచి ప్రేరణ పొందింది.

సుడిగుండాలు
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
సుకన్య
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ చక్రవర్తి చిత్ర
భాష తెలుగు

చిత్రకథ సవరించు

చంద్రశేఖరం (అక్కినేని) ఒక ప్రసిద్ధ న్యాయనిర్ణేత (జడ్జి), సహృదయుడు, దయకలవాడూను. అతని చేతిలో శిక్ష పడ్డ నేరస్తుడి వల్ల ఆ నేరస్తుడి కుటుంబం ఇబ్బందుల పాలవకూడదనే సదుద్దేశంతో వారికి తనకి చేతనయినంతలో సహాయం చేస్తూ ఉండేవాడు. అలా ఓ రోజు విధినిర్వహణలో ఒక ముద్దాయికి మరణ / యావజ్జీవ శిక్ష విధించి న్యాయస్థానం బయటికొస్తూ అతని భార్యను ఓదారుస్తున్న సందార్భంలో ఇంటినించి కబురొస్తుంది గర్భవతీ అయిన తన భార్యకు ప్రసవవేదన పడుతోందని.చంద్రశేఖరం ఆసుపత్రికి వచ్చేసరికి భార్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చి ఆమె తనువు చాలిస్తుంది. ఆ కుర్రాడు రాజా పెరిగి పెద్దవాడవుతున్న తరుణంలో హత్యకు గురి అవుతాడు ఇద్దరు యువత చేతిల్లో.కొన్నాళ్ళకి పోలీసులు వారిని పట్టుకుని జైల్లో పెట్టి చంద్రశేఖరానికి వివరం తెలియచేస్తారు. అతను వారిని చూసి ఆశ్చర్యచకితుడై వారా హత్య ఎందుకుచేసారో తెల్సుకున్నాక విభ్రముడౌతాడు. అప్పుడే అదొక సమస్య అని, అది విషవలయంలా సమాజాన్ని చుట్టుముడుతోందని గ్రహించి ఆ ముద్దాయిల తరపున వాదించడానికి సిద్ధమౌతాడు. తీర్పునిచ్చిన కేసుని తిరిగి తెరిపించి తన వాక్పటిమతో వాదించి మనం వేసే శిక్ష వ్యక్తులకు కాకుండా ఆయా ఆయుధాలకు అంటే ఆ నేరం చెయ్యడానికి పురిగొల్పిన పరిస్థితులకు వెయ్యగలిగితే అదే అసలయిన న్యాయమవుతుందని, ఆ యువత ముఖ్యంగా “సరదాగా” హత్య చెయ్యడానికి అది సమాజంలో వారికి అందుతున్న ఆశ్లీల సాహిత్యం, హింసా ప్రవృత్తిని ప్రేరేపించే సినిమాలు. విశృంఖలమైన ఫాక్షన్, విచ్చలవిడి శృంగారం, వయసు మళ్ళిన వారిపైన పెద్దగా ప్రభావం చూపించక పోవచ్చు కాని విరిసీ విరియని వయసులో తెలిసీ తెలియని జ్ఞానంతో సక్రమమయిన మార్గంలో నడవాల్సిన యువతపై ఇవి కచ్చితంగా దుష్ప్రభావమే చూపించి తీరుతాయి. అందుకు ప్రబల సాక్ష్యం మనం రోజూ చూస్తూ వింటున్న ఏసిడ్ దాడులు, మానభంగాలు, హత్యలు, దోపిడీలు, అకృత్యాలు ఇంకెన్నో ఘోరాలు, ఇతరత్రా కారణాలుగా పేర్కొంటూ వాటి దుష్ప్రభావం వల్లనే వారలా చేసారు తప్ప వారి తప్పు కాదనే మూలసూత్రంతో, యువత అలా పెంచబడడమే కారణమని సూచిస్తూ, వారిని సక్రమమయిన రీతిలో పెంచాల్సిన బాధ్యత వారి వారి తల్లితండ్రులదీ సమాజానిదేనని, అలా సక్రమ మార్గంలో పెరిగినప్పుడు యువత తప్పకుండా ఒక బాధ్యతాయుతమయిన పౌరులుగా తయారవుతారు అని తెలియచేస్తూ చంద్రశేఖరం న్యాయస్థానంలోనే తన ప్రాణాలు విడుస్తాడు.

తారాగణం సవరించు

సిబ్బంది సవరించు

నేపథ్యం సవరించు

వ్యాపారాత్మకంగా విజయవంతమైన అనేక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆదుర్తి సుబ్బారావు కళాకత్మకమైన, సందేశాత్మకమైన చిత్రాలు తీయాలనే సంకల్పంతో ఈ సినిమా రూపొందించారు. సినిమాకు నిర్మాణబాధ్యతలు కూడా ఆయన, నటుడు నాగేశ్వరరావుతో పంచుకున్నారు.
1959లో విడుదలైన అమెరికన్ సినిమా కంపల్షన్ ప్లాట్ సుడిగుండాలు సినిమా స్క్రిప్టుకు ప్రేరణగా నిలుస్తోంది.[1] అమెరికా నేరచరిత్రలో ప్రముఖమైన లియోపాల్డ్, లోబ్ చేసిన హత్య, దాని న్యాయవిచారణను ఆధారం చేసుకుని కంపల్షన్ చిత్రాన్ని రూపొందించారు.[2]

పాటలు సవరించు

  • వినరా సోదరా

అవార్డులు సవరించు

ఈ చిత్రంలో నటించిన మాస్టర్ రాజా, ప్రముఖ నటులైన కాంతారావు కుమారులు. ఈ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధమ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి ఈచిత్రానికి 1967 వ సంవత్సరానికి బంగారు నంది అవార్డు ప్రకటించింది.

సూచనలు సవరించు

మూలాలు సవరించు

  1. వై., రమణ. "సుడిగుండాలు". పిపీలికం. వై.రమణ. Archived from the original on 26 ఆగస్టు 2015. Retrieved 8 July 2015.
  2. Jake Hinkson (October 19, 2012). "Leopold and Loeb Still Fascinate 90 Years Later". criminalelement.com. Retrieved October 23, 2012.

బయటి లింకులు సవరించు

మూస:తెలుగు సినిమా