గృహోపకరణాలు

(సోఫా నుండి దారిమార్పు చెందింది)

ఇంటిలో (గృహంలో) కొన్ని పనులను చేయడానికి ఉపయోగించే విద్యుత్/యాంత్రిక యంత్రాలను, ఇతర పని ముట్లు,లేదా పరకరాలును గృహోపకరణాలు అంటారు. సాధారణంగా నిత్యజీవితంలో ఈ సామానులు వంట చేయడానికి లేక శుభ్రం చేయడానికి ఇతరత్రా ఇలాంటి పనులకు పనులకు ఈ వస్తువులు ఉపయోగపడతాయి. గృహోపకరణాలను ఈ విధంగా వర్గీకరించబడినవి. వాటిని ఈ విధంగా వర్గీకరించబడ్డాయి.సేవను అందించే ప్రదేశాన్ని బట్టి వివిధ రకాల ఉత్పత్తులను వివిధ విభాగాలుగా గుర్తించడం జరుగుతుంది.వీనిలో

గృహోపకరణాలు

పరికరాలు జాబితా, వివరణ

మార్చు

అపక లేదా అబక: దీనిని కొబ్బరి చిప్పతో తయారు చేస్తారు. దీనిని వంటింటి పాత్రలుగా వాడేవారు.కొబ్బరి చిప్పను అంచులు సమాంతరంగా వచ్చేలా అరగదీసి దానికి క్రింది భాగాన సమాంతరంగా రెండు చిన్న రంద్రాలు చేసి దానిలో ఒక వెదురు పుల్లను దూర్చి తయారు చేస్తారు. గరిటె వలె దీనిని ఉపయోగిస్తారు. అవసరాన్ని బట్టి చిన్నది, పెద్దది అపకలు తయారు చేసుకుంటారు. గతంలో వీటి ఉపయోగము ఎక్కువగా వుండేది. ఇవి వంటింటి సామానులలో ఒక భాగము.పొలాల్లో వంటల కొరకు, చిట్టూ, తవుడు దాణా కలుపుటకు వాడేవారు. వులవలు ఉడీకించినపుడు తెడ్డులా కలుపుటకు తీయుటకు వాడుతా

తలుపు

మార్చు

తలుపులు ద్వారానికి బిగిస్తారు. ఇవి కలపతో తయారుచేస్తారు. రక్షణ కోసం వీనికి తాళాలు వేసేందుకు వివిధ రకాలైన ఏర్పాట్లు చేస్తారు.

తువ్వాలు

మార్చు

తువ్వాలు ముఖం, ఒళ్ళు తుడుచుకోవడానికి వాడే బట్ట. వీటిని నీరు పీల్చడానికి అనువుగా నూలు దారాలతో అల్లి తయారుచేస్తారు.

తొట్టి లేదా గాబు

మార్చు

తొట్టి ఆధునిక కాలంలో కొంతమంది స్నానానికి ఈ తొట్టెలను ఉపయోగిస్తున్నారు. దీనిని పెద్దవైన స్నానాల గదిలో బిగించి ఉంచుతారు. తొట్టెను నీటితో నింపి అందులో పడుకొని స్నానం చేసేటందుకు సౌకర్యంగా ఉంటుంది.

 
తక్కెడ

తక్కెడ లేక త్రాసు

మార్చు

తక్కెడ (త్రాసు, తుల, తరాజు) అనేది సరుకుల బరువును తూచేందుకు లేదా నిర్ణయించేందుకు ఉపయోగించే సాధనం. ఒక సమాంతర దండం కర్ర మధ్య చేతిలో పట్టుకొనేందుకు వీలుగా ఒక తాడు ఉండి ఆ దండానికి రెండు చివరల తాళ్ళ సహాయంతో రెండు పళ్ళాలు వేళ్ళాడుతుంటాయి. పళ్ళేలలో ఒక వైపు నిర్ణయాత్మక బరువు కలిగిన రాళ్ళను ఉంచి మరొక వైపు కావలసిన సామాను లేదా సరుకులను ఉంచి బరువు తూస్తారు. వీటిలో సున్నితపు త్రాసు, ఇనుప తక్కెడలు, వెదురు తక్కెడలు అనే రకాలు ఉంటాయి.

తలగడ లేదా దిండు

మార్చు

తలగడ దిండు లేదా ఒక మెత్తని వస్తువు. వీటిని పరుపు మీద గాని నేలమీద గాని పడుకొనేటప్పుడు తల క్రింద సుఖంగా నిద్రపోవడానికి ఉపయోగిస్తారు. దీని మధ్యలో దూది లేదా పత్తి ఉండి చుట్టూ వివిధ రకాల గుడ్డతో కుట్టి తయారుచేస్తారు.

ద్వారం

మార్చు

ద్వారం ఇళ్ళు మొదలైన కట్టడాల లోపలికి ప్రవేశించడానికి అనువుగా గోడలలో అమర్చినవి. ఇవి కలపతో తయారుచేస్తారు. రక్షణ కోసం వీనికి తలుపులు బిగిస్తారు.

చట్టి

మార్చు

చట్టి అనగా మట్టితోచేసిన ఒక పాత్ర. గతంలో వీటిని పల్లెవాసులు ఎక్కువగా వాడే వారు. దీని మూతి వెడల్పుగా వుంటుంది. వీటిని వంటలకు మాత్రమే ఉపయోగిస్తారు. పాలచట్టి, కూర చట్టి, సంగటిచట్టి, ఇలా దేనికది వేరువేరుగా వుంటాయి. ప్రస్తుతం ఇవి వాడుకలో లేకున్నా ఈ మట్టి పాత్రలలో చేసిన వంట రుచిగా వుంటుందని, ఆరోగ్యానికి కూడ మంచిదని ఇప్పుడంటున్నారు. పెద్ద హోటళ్ళలో వంటలను ఈ మట్టి పాత్రలలో చేసి వడ్డిస్తున్నారు. ఆ విదంగానైనా వాటి వునికిని కాపాడుతున్నారు.

చుట్ట కుదురు

మార్చు

దీనిని తాటాకు లేదా గడ్డితో చక్రంలాగ తయారు చేస్తారు. తాటి ఆకులతో కూడ తయారు చేస్తారు. మట్టికుండల, మట్టి చట్టి ఇల ఏ మట్టి పాత్రలకు అడుగు భాగము చదునుగా వుండదు, కనుక నేలమీద పెడితే అవి నిలబడవు. అందుకని ఈ చుట్టకుదురులని వాటి కొరకు వాడతారు. కుండలు కుదురుగా కూర్చోవడానికే కాక వాటికి మెత్తదనాన్నిచ్చి అవి పగిలిపోకుండా కాపాడతాయి.

గరిటె లేదా గరిట

మార్చు

గరిటె లేదా గరిట అనేది పులుసు, పెరుగు వంటి ద్రవ ఆహార పదార్థాలు వడ్డన కొరకు ఉపయోగించబడే ఒక చెంచా. ముందు భాగం ఆహరం నిలపడానికి గిన్నెలాగా, వెనుక భాగం పట్టుకోవడానికి పొడువగా ఒక తెడ్డు పోల్చిన ఆకారం కలిగి ఉంటుంది.సాధారణంగా మిగిలిన వంటపాత్రల వలె ఇనుప, ఇత్తడి, స్టీలు, ఇతర లోహపు మిశ్రమాలతో ఇవి తయారు చేయబడతాయి. అవిగాక కొన్ని సార్లు ప్లాస్టిక్, కలప లేక వెదురు రకాలు కూడా తయారు అవుతాయి. వాడుకావసరాలు బట్టి ఇవి 5 అంగుళాలు నుండి 15 అంగుళాల వరకు పరిమాణం కలిగి ఉండగలవు.

పరుపు

మార్చు

పరుపు మంచం మీద వత్తిడి కలుగకుండా మెత్తగా ఉండటానికి వేసుకునేదానిని పరుపు అంటారు. ఇవి మామూలు పత్తి లేదా బూరుగుదూదితో తయారుచేస్తారు. ఆధునిక కాలంలో ఇవి రబ్బరు లేదా యు-ఫోమ్ తో చేస్తున్నారు. కొబ్బరిపీచు, ఫోమ్ లతో కలిపి తయారుచేసిన పరుపులు చాలాకాలం మన్నికగా ఉంటాయి.దీనిని పరుపును నేల మీద వేసుకుని పరుండటానికి,కూర్చోటానికి ఉపయోగిస్తారు.ఇందులో పత్తిదూది పరుపు,బూరుగుదూది పరుపు,జిల్లేడుదూది పరుపు, జమ్ముదూది పరుపు అనే వివిధ రకాల పరుపులు ఉంటాయి.

పిడక ఆవు లేదా గేదె పేడతో తయారుచేసే ఒక వస్తువు. దీనిని గ్రామాలలో వంట చెరుకుగా వాడుతారు. పేడను గోడకేసి అచ్చులుగా కొట్టి దానిని ఆరబెడతారు. గట్టిపడిన తరువాత దీనిని పొయ్యిలో పెడతారు. పిడకపై తెలుగు భాషలో కొన్న సామెతలు కూడా ఉన్నాయి.రామాయాణంలో పిడకల వేట అనే సామెత ఉంది.

దుప్పటి - బెడ్ షీట్

మార్చు

దుప్పటిని ఆంగ్లంలో బెడ్ షీట్ అంటారు. దుప్పటి దారముతో నేసిన దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఒక వస్త్రం. దీనిని మంచం లేదా పరుపుని కప్పి ఉంచడానికి ఉపయోగిస్తారు. ఈ దుప్పటి మంచం లేదా పరుపు మాసి పోకుండా ఉపయోగపడుతుంది. ఈ దుప్పటిపై నిద్రించు వారు మరొక దుప్పటిని చలికి రక్షణగా కప్పుకుంటారు. చలికి రక్షణగా కప్పుకునే దుప్పటిని ఆంగ్లంలో బ్లాంకెట్ అంటారు. బెడ్ షీట్ అనే పదాన్ని మొదటిసారి ఆంగ్లంలో 15వ శతాబ్దంలో ఉపయోగించారు.

సోఫా,ఇది ఆధునిక ఇండ్లలోని అందమైన గృహోపకరణం. ఇది కుర్చీ మాదిరిగా వెనుక భాగంతో చేతులు పెట్టుకోడానికి సౌకర్యంగా ఉంటుంది. అయితే వీనికి మెత్తగా దూది లేదా స్పాంజితో పైన అందమైన వస్త్రం లేదా చర్మంతో కప్పబడి కూర్చోడానికి సౌకర్యంగా ఉంటుంది.వాటిలో చెక్క సోపాలు,ఇనుప సోపాలు,తోలు సోపాలు ఇలా వివిధ రకాలు ఉంటాయి.

బెంచి లేదా బల్ల

మార్చు

బెంచి ఒకరి కంటే ఎక్కువ మంది కూర్చోవడానికి ఉపయోగించే వస్తువు.ఇవి సాధారణంగా కలపతో తయారుచేస్తారు. కుర్చీల మాదిరిగా వీటికి కూడా వెనుక భాగంతో, చేతులు పెట్టుకోడానికి సౌకర్యంగా ఉండవచ్చును.ఇవి గృహాలలోనే కాకుండా ఉద్యానవనాలు, బీచ్ లు, పాఠశాలలు,కార్యాలయాలలో కూడా ఉపయోగిస్తారు.

మూకుడు లేదా బాణలి

మార్చు

మూకుడు అనేది ఒక వంట పాత్ర. దీనిని నూనె ద్వారా వండే వంటలకు వాడుతారు. దీనికి రెండువైపులా రింగులు ఉంటాయి.దీని తయారీకి వివిధ లోహాలు వాడుతారు. వీటిలో మిఠాయిల తయారీ కొరకు ప్రత్యేకంగా పెద్దగా క్రింద రాగి పైన ఇత్తడితో చేయిస్తారు. ఇళ్ళలో వాడు వాటికి అల్యూమినియం, ఇనుము, రాగి లోహాలతో చేసిన వాటిని వాడుతారు. ప్రస్తుతం మాడురాకుండా ఉండుటకు నాన్‌స్టిక్ వాడుతున్నారు.మట్టితో కుండమీద మూసే వస్తువును కూడా మూకుడు అని అంటారు.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు