హైదరాబాదులో క్రీడలు

హైదరాబాదులో క్రీడలు అనగానే క్రికెట్, బాడ్మింటన్, ఫుట్‌బాల్, హాకీ లాంటి ఆధునిక క్రీడలే కాకుండా భారతీయ సాంప్రదాయ కుస్తీ లాంటివి కూడా ప్రసిద్ధి చెందినవే.

హైదరాబాద్ రేస్ కోర్స్, C. 1880
1870ల్లో హైదరాబాదీ పహెల్వాన్లు కుస్తీకి సిద్ధమవుతున్న దృశ్యం

చరిత్ర

మార్చు

అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్, ఫుట్‌బాల్[1] క్రీడలకు హైదరాబాదు నగరం జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించింది.[2] భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఒలింపియన్ ఫుట్‌బాల్ క్రీడాకారులను ఈ నగరం తయారు చేసింది. ఫీల్డ్ హాకీ, క్రికెట్ ప్రస్తుత తరంలో ప్రసిద్ధి చెందాయి. ఆధునిక క్రీడలు కాకుండా భారతీయ సాంప్రదాయ క్రడ అయిన కుస్తీ (పెహ్ల్వాని) కూడా హైదరాబాదులో విశేషమైనది.

నిజాం పాలనలో హైదరాబాదులో క్రీడలకు మంచి ఆదరణ ఉండేది. ఆరవ నిజాం (అసఫ్ జా VI) గుర్రపు పందాలను ఇష్టపడి 1868లో హైదరాబాద్ రేస్ క్లబ్‌ను స్థాపించాడు. మొయిన్ ఉద్-దౌలా 1930లో మొయిన్-ఉద్-దౌలా గోల్డ్ కప్ టోర్నమెంట్‌ను స్థాపించాడు. 1950 - 1970 ల మధ్య రెండు దశాబ్దాల పాటు ఫుట్‌బాల్ హైదరాబాదులో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా మారింది. ఈ "గోల్డెన్ పీరియడ్"లో హైదరాబాదుకు చెందిన ఆటగాళ్లు భారత ఫుట్‌బాల్ జట్టుకు ప్రముఖ క్రీడాకారులుగా ఏర్పడ్డారు.[3] ఈ ఆటగాళ్లలో సయ్యద్ అబ్దుల్ రహీమ్, పీటర్ తంగరాజ్, షబ్బీర్ అలీ ఉన్నారు.

వేడుకలు

మార్చు

హైదరాబాదు మహానగరంలో 2002 నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా, 2003 ఆఫ్రో-ఆసియన్ గేమ్స్,, 2004 ఏపి పర్యాటకం హైదరాబాద్ ఓపెన్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్, 2007 మిలిటరీ వరల్డ్ గేమ్స్, 2009 ప్రపంచ బ్యాడ్మింటన్, 2009 IBSF ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లు వంటి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు. హైదరాబాదులో మొయిన్-ఉద్-దౌలా గోల్డ్ కప్ టోర్నమెంట్, డెక్కన్ డెర్బీలు సర్వ సాధారణమైన కార్యక్రమాలుగా చెప్పవచ్చు.

అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు

మార్చు

క్రికెట్ క్రీడాకారులు: గులాం అహ్మద్, ఎం. ఎల్. జైసింహ, మహేశ్ దేవనాని, మహమ్మద్ అజారుద్దీన్, వి. వి. ఎస్. లక్ష్మణ్, వెంకటపతి రాజు, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, సయ్యద్ అబిద్ అలీ, మిథాలీ రాజ్, నోయెల్ డేవిడ్

ఫుట్‌బాల్ క్రీడాకారులు: సయ్యద్ అబ్దుల్ రహీమ్, సయ్యద్ ఖాజా మొయినుద్దీన్, సయ్యద్ నయీముద్దీన్, షబ్బీర్ అలీ

టెన్నిస్ క్రీడాకారిణి: సానియా మీర్జా

బ్యాడ్మింటన్ క్రీడాకారులు: ఎస్. ఎమ్. ఆరిఫ్, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, పి. వి. సింధు, జ్వాలా గుత్తా, చేతన్ ఆనంద్

హాకీ క్రీడాకారులు: సయ్యద్ మహ్మద్ హది, ముఖేష్ కుమార్

రైఫిల్ షూటర్లు: గగన్ నారంగ్, అషెర్ నోరియా

బాడీబిల్డర్: మీర్ మొహతేషామ్ అలీ ఖాన్

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. Kapadia, Novy (2001). "Triumphs and disaster: the story of Indian football, 1889–2000" (PDF). Soccer and Society. 2 (2): 19. doi:10.1080/714004851. S2CID 145561706. Archived from the original (PDF) on 13 ఆగస్టు 2012. Retrieved 3 April 2012.
  2. "7 famous sports stars from Hyderabad that were not born in the City of Nizams". The Hans India.
  3. "Where is football in Hyderabad?". DNA India. 31 July 2008. Retrieved 30 November 2016.