1799
1799 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1796 1797 1798 - 1799 - 1800 1801 1802 |
దశాబ్దాలు: | 1770లు 1780లు - 1790లు - 1800లు 1810లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జనవరి: కాశీరావు హోల్కరు స్థానంలో ఖండే రావు హోల్కరు ఇండోర్ రాజయ్యాడు
- మే 4: శ్రీరంగపట్నం యుద్ధంలో బ్రిటిషు వారు టిపు సుల్తాన్ను ఓడించారు. ఆ యుద్ధంలో అతడు మరణించాడు
- జూన్ 30: మూడవ కృష్ణరాజ ఒడయార్ మైసూరు సింహాసనమెక్కాడు.
- జూలై 12: రంజిత్ సింగ్ లాహోరును వశపరచుకున్నాడు. సిక్కు సామ్రాజ్య స్థాపనలో ఇది కీలకమైన అడుగు.
- జూలై 25: నెపోలియన్, ముస్తఫా కెమాల్ పాషాకు చెందిన 10,000 మంది ఓట్టోమన్ సేనను ఓడించాడు.
- అక్టోబరు 16: వీరపాండ్య కట్టబొమ్మన్‌ను ఉరితీసారు
- అక్టోబరు 16: స్పానిషు పట్టణం విగోకు సమీపంలో 5.4 కోట్ల పౌండ్ల సంపదతో వెళ్తున్న స్పెయిను ఓడను బ్రిటిషు రాయల్ నేవీ పట్టుకుంది.
- డిసెంబరు 10: ఫ్రాన్సు పొడవుకు కొలమానంగా మీటరును అధికారికంగా స్వీకరించింది.
- డిసెంబరు 31: డచ్చి ఈస్టిండియా కంపెనీని మూసేసారు
- తేదీ తెలియదు: కొంగు నాడు, ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో టిప్పు సుల్తాన్ ఓటమి తరువాత, మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసింది.
- తేదీ తెలియదు: 1799-1800 లో పొనుగుపాడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించారు
- తేదీ తెలియదు: కాన్రాడ్ జాన్ రీడ్ అనే అతను నార్త్ కరోలినాలో కాబరస్ కౌంటీలో దొరికిన పసుపు రంగు రాయిని తెచ్చి తన ఇంటి తలుపుకు స్టాపరుగా పెట్టుకున్నాడు. అది రాయి కాదు, బంగారపు ముద్ద అని 1802 లో అతడి తండ్రి కనుక్కున్నాడు
- తేదీ తెలియదు: బెల్జియంలో విలియం కాకరిల్ కాటన్ స్పిన్నింగు యంత్రాన్ని తయారు చెయ్యడం మొదలుపెట్టాడు.
జననాలు
మార్చు- జనవరి: ఖండే రావు హోల్కరు ఇండోర్ మహారాజు (మ. 1807)
- మే 20: బాల్జాక్, ఫ్రెంచి రచయిత (మ. 1850)
- మే 21: మేరీ అన్నింగ్ శిలాజ సేకర్త, శాస్త్రవేత్త. (మ. 1847)
- జూన్ 6: అలెగ్జాండర్ పుష్కిన్ (మ. 1837)
మరణాలు
మార్చు- మే 4: టిప్పు సుల్తాన్, మైసూరు రాజు. (జ.1750)
- డిసెంబరు 14: జార్జి వాషింగ్టన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1732)