సురాపానం (సినిమా)

2022 తెలుగు సినిమా

సురాపానం (ఆంగ్లం: Suraapanam, ట్యాగ్‌లైన్: కిక్ అండ్ ఫన్), 2022 జూన్ 10న విడుదలయిన తెలుగు సినిమా. అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మట్ట మధు యాదవ్ నిర్మాణ సారథ్యంలో సంపత్ కుమార్ దర్శకత్వం వహించి, నటించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్, కామెడీ ఎంటర్టైనర్ సినిమాకు భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించాడు. ప్రగ్యా నయన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అజయ్ ఘోష్, సూర్య, ఫిష్ వెంకట్, లక్ష్మణ్ మీసాల, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.[1][2]

సురాపానం
సురాపానం సినిమా పోస్టర్
దర్శకత్వంసంపత్ కుమార్
రచనసంపత్ కుమార్ (కథ)
రాజేంద్రప్రసాద్ చిరుత (మాటలు)
నిర్మాతమట్ట మధు యాదవ్
తారాగణంసంపత్ కుమార్, ప్రగ్యా నయన్, అజయ్ ఘోష్, సూర్య, ఫిష్ వెంకట్, లక్ష్మణ్ మీసాల, చమ్మక్ చంద్ర
ఛాయాగ్రహణంవిజయ్ ఠాగూర్
కూర్పుజెపి
సంగీతంభీమ్స్ సెసిరోలియో
నిర్మాణ
సంస్థ
అఖిల్ భవ్య క్రియేషన్స్
విడుదల తేదీ
2022 జూన్ 10 (2022-06-10)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథానేపథ్యం సవరించు

గ్రామంలోని తన స్నేహితులతో కలిసి చిన్నచిన్న దొంగతనాలు చేసే హీరో, ఒకరోజు చేసిన ఒక పొరపాటు వల్ల జరిగిన పరిణామాలను ఎలా ఎదుర్కున్నాడు అనే కథాంశంలో రూపొందిన సినిమా.

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

  • సంగీతం: భీమ్స్ సెసిరోలియో
  • సినిమాటోగ్రఫీ: విజయ్ ఠాగూర్
  • ఎడిటింగ్: జెపి
  • పబ్లిసిటీ డిజైన్స్: ధని ఏలె
  • మాటలు: రాజేంద్రప్రసాద్ చిరుత
  • పాటలు: సురేష్ గంగుల, అలరాజు, దేవ్ పవర్
  • ఆర్ట్: భూపతి యాదగిరి
  • కొరియోగ్రఫీ: సురేష్ కనకం
  • కో-డైరెక్టర్: శ్రీనివాస్ రాయి
  • పి.ఆర్.ఓ: మాడూరి మధు
  • నిర్మాత: మట్ట మధు యాదవ్
  • కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంపత్ కుమార్.

పాటలు సవరించు

భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.

క్రమసంఖ్య పాటపేరు రచన గానం నిడివి
1 పిల్లా నాలో నిండిపోయావే సురేష్ గంగుల భీమ్స్ సిసిరోలియో 3:59
2 డిజె సాంగ్ దేవ్ పవర్ గీతామాధురి, శ్రీకృష్ణ 4:50
3 అమ్మంటే అంతా సంతోషం అలరాజు రఘురాం 3:39

ప్రచారం సవరించు

విడుదల, స్పందన సవరించు

ఈ సినిమా 2022 జూన్ 10న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 30 థియేటర్లలో విడుదలయింది. 'విభిన్నమైన కథనం, నటీనటుల ఫెర్ఫార్మెన్స్ లతో సినిమా ఆకట్టుకుంది' అని సాక్షి పోస్ట్, తెలుగు ఫిల్మీబీట్ లు పేర్కొన్నాయి.[9][10]

మూలాలు సవరించు

  1. telugu, NT News (2022-05-18). "Surapanam Movie : జూన్ 10 న విడుదలవుతున్న "సురాపానం"". Namasthe Telangana. Archived from the original on 2022-05-18. Retrieved 2022-05-18.
  2. Telugu, ntv (2022-05-18). "Kick n Fun: 'సురాపానం'కు డేట్‌ లాక్!". NTV. Archived from the original on 2022-05-18. Retrieved 2022-05-18.
  3. "'సురాపానం' టైటిల్‌ లోగో విడుదల". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2021-02-14. Archived from the original on 2021-02-14. Retrieved 2022-05-18.
  4. "'సురాపానం' మూవీ ఫస్ట్ లుక్ విడుదల". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2021-08-06. Archived from the original on 2022-05-18. Retrieved 2022-05-18.
  5. "'సురాపానం' టీజర్ వదిలిన 'భీమ్లా నాయక్' డైరెక్టర్". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-21. Archived from the original on 2022-05-18. Retrieved 2022-05-18.
  6. ""సురాపానం" చిత్రం ఫాంటసీ థ్రిల్లర్…కంప్లీట్ కామెడి ఎంటర్టైనర్ – డైరెక్టర్ సంపత్ కుమార్ |". www.123telugu.com. 2022-04-21. Archived from the original on 2022-05-18. Retrieved 2022-05-18.
  7. telugu, NT News (2022-06-07). "ఫాంటసీ థ్రిల్లర్‌గా". Namasthe Telangana. Archived from the original on 2022-06-07. Retrieved 2022-06-07.
  8. "కిక్‌ ఇచ్చే 'సురాపానం'". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-06-07. Archived from the original on 2022-06-07. Retrieved 2022-06-07.
  9. "Surapanam Movie Review". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-06-11. Archived from the original on 2022-06-15. Retrieved 2022-06-15.
  10. A, Rajababu (2022-06-12). "Surapanam movie Review ఆకట్టుకొనే శివలింగం మిస్పింగ్ డ్రామా". www.telugu.filmibeat.com. Archived from the original on 2022-06-15. Retrieved 2022-06-15.

బయటి లింకులు సవరించు