రమేష్ రాథోడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు లంబాడీ సామాజిక వర్గం.తెలుగు దేశం పార్టీ ఖానాపూర్ శాసన సభ నియోజక వర్గం నుండి (1999-2004) శాసన సభ్యుడిగా ఆదిలాబాద్ లోకసభ నియోజక వర్గం నుండి(2009-2014) 15వ పార్లమెంటు సభ్యుడిగా ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ (2006-2009) పని చేశాడు.ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ లో కోనసాగుతున్నాడు.[1]

రమేష్ రాథోడ్ - 2021 నుండి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు

బాల్యము మార్చు

రమేష్ రాథోడ్,తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ కు చెందిన లంబాడీ గిరిజన దంపతులైన మోహన్ రాథోడ్, కమలబాయ్ లకు 20 అక్టోబరు 1966 లో జన్మించారు.

విద్య మార్చు

ప్రాథమిక విద్య తన స్వంత గ్రామం నార్నూర్ మండలంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల డిహడప్నూర్ లో గురువు లక్ష్మీకాంతం వద్ద చదువు కున్నాడు.[2] వీరి విద్యాభ్యాసం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉట్నూర్ ఆదిలాబాదు జిల్లా లో ఇంటర్మిడియట్ పూర్తి చేసి,ప్రభుత్వ డిగ్రీ కళశాల ఆదిలాబాద్ లో బి.ఎ.డిగ్రీ చదివారు.

కుటుంబము మార్చు

వీరిది వ్యవసాయ కుటుంబము.సుమన్ బాయితో వివాహాం జరిగింది.సమన్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మెల్యే సేవాలందించారు.వీరికి ఒక కూతురు పేరు సోనాలి ఇద్దురు కుమారులు పెద్దా కొడుకు పేరు రితేష్ రాథోడ్ బిటెక్ చదివి ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. చిన్న కొడుకు పేరు డా.రాహుల్ రాథోడ్ యంబిబిఎస్ పూర్తి చేసి యుపిఎస్సి ద్వారా అఖిల భారతీయ సర్వీస్ లో ఆదిలాబాద్ జిల్లా నుండి ఎంపికైన తొలి లంబాడీ గిరిజన యువకుడు.ఇతను న్యూ ఢిల్లీలో అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉప పాలనాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. [3]

రాజకీయ ప్రస్థానము మార్చు

రమేశ్ రాథోడ్ తొలి సారిగా తెలుగు దేశం పార్టీ నుండి నార్నూర్ జడ్పీటిసి గా ఎన్నికయ్యారు.ఖానాపూర్ (ఎస్టీ రిజర్వడ)శాసన సభ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నుండి రెండు సార్లు శాసన సభ్యునిగా సేవాలందించారు. రమేష్ రాథోడ్ 1999 - 2004 మద్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభ్యునిగా ఉన్నారు. 2006 నుండి 2009 వరకు అదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. 2009 లో 15 వ లోక్ సభకు పోటీచేసి పార్లమెంటు సభ్యుని గా పనిచేసారు.[4]అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరినాడు.కొన్ని నెలలో తర్వత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెష్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. [5]ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లో చేరి ఖానాపూర్ శాసన సభకు, ఆదిలాబాద్ పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు.ఆనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలగి 2021లో భారతీయ జనతా పార్టీ లో చేరినాడు.[6] 2023లో ఖానాపూర్ శాసన సభ భారతీయ జనతా పార్టీ నుండి పోటి చేసి ఓడిపోయాడు. లో[7]

[8][9]

మూలాలు మార్చు

  1. "Lok Sabha". web.archive.org. 2013-03-13. Archived from the original on 2013-03-13. Retrieved 2024-04-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Service, Express News (2021-06-15). "Telangana: Ex-Adilabad MP Ramesh Rathod joins BJP". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-04-12.
  3. Eenadu (15 November 2023). "అనుభవం.. అనుబంధం అడుగులుగా". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  4. "టీడీపీకి రమేశ్‌ రాంరాం". Sakshi. 2017-05-28. Retrieved 2024-04-12.
  5. "టీఆర్ఎస్‌కు గుడ్ బై.. కాంగ్రెస్‌లో చేరిన రమేష్ రాథోడ్". Samayam Telugu. Retrieved 2024-04-12.
  6. ABN (2021-06-12). "బీజేపీలోకి రమేష్ రాథోడ్..?". Andhrajyothy Telugu News. Retrieved 2024-04-12.
  7. News, India TV. "Ramesh Rathod Profile, News, Photos & Political Career From Khanapur St, Nirmal, Telangana Assembly Elections 2023". India TV News (in ఇంగ్లీష్). Retrieved 2024-04-12. {{cite web}}: |last= has generic name (help)
  8. ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 ఏప్రిల్ 2020. Retrieved 18 April 2020.
  9. "Who Is Ramesh Rathod? BJP Candidate Running From Khanapur In Telangana Elections 2023". TimesNow (in ఇంగ్లీష్). 2023-11-23. Retrieved 2024-04-12.