అమ్మనబ్రోలు
అమ్మనబ్రోలు ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నాగులుప్పలపాడు నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఒంగోలు నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1983 ఇళ్లతో, 7515 జనాభాతో 3132 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3624, ఆడవారి సంఖ్య 3891. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1873 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 602. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591038[2].
గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంది.
అమ్మనబ్రోలు | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 15°35′13.200″N 80°8′45.600″E / 15.58700000°N 80.14600000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | నాగులుప్పలపాడు |
విస్తీర్ణం | 31.32 కి.మీ2 (12.09 చ. మై) |
జనాభా (2011)[1] | 7,515 |
• జనసాంద్రత | 240/కి.మీ2 (620/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 3,624 |
• స్త్రీలు | 3,891 |
• లింగ నిష్పత్తి | 1,074 |
• నివాసాలు | 1,983 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08592 ) |
పిన్‌కోడ్ | 523180 |
2011 జనగణన కోడ్ | 591038 |
సమీప గ్రామాలు
మార్చుదేవరంపాడు 4 కి.మీ, వినొదరాయునిపాలెము 5 కి.మీ, రాపర్ల 6 కి.మీ, చేజర్ల 6 కి.మీ, తిమ్మసముద్రం 6 కి.మీ.
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.
సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మద్దిరాలపాడులోను, ఇంజనీరింగ్ కళాశాల ఒంగోలులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్ ఒంగోలులోను, మేనేజిమెంటు కళాశాల చేకూరుపాడులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలులో ఉన్నాయి.
సి.ఎస్.ఆర్. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల -ఈ పాఠశాలలో చదువుచున్న ఎం.సతీష్, ఎం.శ్రావణి అను విద్యార్థులు రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికైనారు. వీరు త్వరలో చిత్తూరులో నిర్వహించు రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొంటారు. ఈ పాఠశాల విద్యార్థులు హజర, గౌరీసుజాత తయారు చేసి రాష్ట్రస్థాయి ప్రదర్శించిన, వర్షపు నీటి నిల్వలో తీసుకొనవలసిన జాగ్రత్తలు అను నమూనా రాష్ట్రస్థాయి ప్రదర్శనలో విజయం సాధించి, జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికైనది.ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న కాటూరు బాండుబాబు అను విద్యార్థి, ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొని జట్టు స్వర్ణపతకం సాధించడంలో కీలక పాత్ర వహించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనాడు. 2017, మే-24 నుండి 28 వరకు మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో గల ఛత్రపతి శివాజీ స్టేడియంలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో ఈ విద్యార్థి, మన రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి, జట్టుకు రజతపతకం సాధించడంలో కీలకపాత్ర వహించాడు.
- ఆంధ్ర ప్రదేశ్ బాలికల గురుకుల పాఠశాల
- శ్రీ సాయి విద్యా నికేతన్
- విఙానభారతి ఆంగ్ల మాధ్యమ పాఠశాల
- ఎస్.టి.కాలనీలోనిప్రాథమిక పాఠశాల
వైద్య సౌకర్యం
మార్చుప్రభుత్వ వైద్య సౌకర్యం
మార్చుఅమ్మనబ్రోలులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
మార్చుగ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
మార్చుగ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది. గుడిపూడివారి చెరువు:- ప్రభుత్వం చేపట్టిన నీరు-ప్రగతి పథకంలో భాగంగా, ఈ చెరువులో పూడికతీత పనినీ, చెరువు కట్టలను పటిష్ఠీకరణ పనులను, 2017, జూలై-3న ప్రారంభించారు.
పారిశుధ్యం
మార్చుమురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
మార్చుఅమ్మనబ్రోలులో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
జాతీయ రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
మార్చుగ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
మార్చుగ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
మార్చుగ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
మార్చుఅమ్మనబ్రోలులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 289 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 2842 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 1997 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 844 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
మార్చుఅమ్మనబ్రోలులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- బావులు/బోరు బావులు: 1 హెక్టార్లు
- చెరువులు: 58 హెక్టార్లు
- ఇతర వనరుల ద్వారా: 784 హెక్టార్లు
ఉత్పత్తి
మార్చుఅమ్మనబ్రోలులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
మార్చుమౌలిక సదుపాయాలు
మార్చు- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
- హోమియో వైద్యశాల.
- ఎస్.టి.కాలనీలోని అంగనవాడీ కేంద్రం.
- సాక్షరతా భారత్ కేంద్రం.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో అజ్జం సరోజిని, సర్పంచిగా ఎన్నికైనారు.
దర్శనీయప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- శ్రీ శ్యామలాంబా సమేత శ్రీ చెన్న మల్లేశ్వరస్వామివారి ఆలయం
- శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం - ఈ ఆలయానికి చదలవాడ గ్రామ రెవెన్యూ పరిధిలో 2.6 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఈ ఆలయంలో, దసరాకు దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు.
- శ్రీ అంకమ్మ తల్లి ఆలయం
- శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి ఆలయం
- శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం
ప్రముఖులు
మార్చు- "ఈదర హరిబాబు", 1989-94 వరకూ అమ్మనబ్రోలు గ్రామ సర్పంచిగా పనిచేశారు. ఆ వెంటనే శాసనసభకు జరిగిన ఎన్నికలలో ఒంగోలు నుండి శాసనసభకు ఎన్నికైనారు.
- ఆకురాతి గోపాలకృష్ణ
- షేక్ పెదమౌలా చినమౌలా సోదరులు 1890 (నాదస్వర విద్వాంసులు)
- మేకల లక్ష్మమ్మ - స్వాతంత్ర్య సమరయోధురాలు. ఈమె 2017, జూలై-1న కాలధర్మం చెందింది.
గ్రామ విశేషాలు
మార్చుఅమ్మనబ్రోలు సీమవిశేషం
మార్చునాడు ఆంధ్రదేశంలో ఉన్న ఈప్రదేశం తూర్పుచాళుక్యుల కాలంలో వేంగి విషయం (దేశం) లోని కమ్మనాడు. రెడ్డి, గజపతి, విజయనగర కాలంలో కొండవీటి రాజ్యంలోని అమ్మనబ్రోలుసీమ. (ప్రకాశంజిల్లా) పూర్వం మద్రాసుప్రెసిడెన్సీలో అమ్మనబ్రోలు శాసనసభ నియోజక కేంద్రం. ఇప్పుడులేదు.
1.అద్దంకి (ప్రకాశంజిల్లా) రాజధానిగా పాలించిన రెడ్డి రాజ్య స్థాపకుడు శ్రీ ప్రోలయవేమారెడ్డి (సా.శ..1335-1353) చిట్టమంచి తిమ్మన బట్లుశాస్త్రులు వారికి సా.శ..1335 నాడు తన రాజ్యంలో, శ్రీశైలభూమి లోని, "అమ్మనబ్రోలుసీమ"లో రామతీర్థం(చీమకుర్తిమండలం) గ్రామం, , అనుబంధ గ్రామాలు చీమకుర్తి(మండలకేంద్రం), భీమేశ్వరం(ఎక్కడో తెలియదు), పులికొండ(చీమకుర్తిమండలం), మైలవరం(చీమకుర్తిమండలం), కొమారపురి (ఎక్కడోతెలియదు) మొత్తం ఆరు అగ్రహార గ్రామాలు స్వతంత్రంగా,వంశ పారంపర్య హక్కుగా దానముచేసారు. అయితే ఈ శాసనం ఆనాటిది కాదని, మరలా అగ్రహారీకులు ఎత్తి రాయించారని మల్లంపల్లి వారి అభిప్రాయం.
ఆధారం,రెడ్డిసంచిక.పుట.452,453.చీమకుర్తి శాసనం.
2.ప్రతాపరుద్రగజపతి(సా.శ..1497-1538) కాకొల్లి తిమ్మ పండితులకు,"అమ్మనబ్రోలు"దండపాట (రాజ్యప్రదేశం) లోని గుండిమడ (గండమాల, కొత్తపట్నం మండలం) గ్రామాన్ని దానముగా ఇచ్చారు. ఈ తామ్ర శాసనసమయంలేదు.
ఆధారం, నెల్లూరుజిల్లాశాసనాలు, 1.భాగం,పుట,185.
3.శ్రీ కృష్ణ దేవరాయలు (సా.శ..1509-1529) పాలనలో మహామంత్రి సాళువ తిమ్మరుసు సా.శ..1511 నాడు కొండవీటి రాజ్యంలోని "అమ్మనబోలుసీమ"ను సురానాయిని "అబ్బానాయని"కి ఇచ్చారు.సదరు అబ్బానాయిని గారు "అమ్మనబ్రోలుసీమ"నుండి కొచ్చర్లకోట (దొనకొండమండలం) కటక సాలుంగపట్టున (వెళ్లే మార్గాన) తన సీమకు చెందిన గోనుగుంట (చీమకుర్తిమండలం) గ్రామ శ్రీ అమరేశ్వర దేవరకు సాళువ తిమ్మరసు పుణ్యంగా, ఆ ఊర్లోనే కొంత భూమిని ఇచ్చారు.
ఆధారం, నెల్లూరుజిల్లాశాసనాలు, రెండోభాగం.పుట.975.గోనుగుంట శాసనం.
4.శ్రీ కృష్ణ దేవరాయలు (సా.శ..1509-1529) పాత గుంటూరు జిల్లాలోని ఎనిమిది దుర్గాలు జయించి, తన ఇద్దరు భార్యలు చిన్నాదేవి,తిరుమలదేవి తో సా.శ..1515 నాడు అమరావతి (గుంటూరుజిల్లా) శ్రీ అమరేశ్వర దర్శించి, తులాపురుష దానం (ఆభరణాలతో నిలువుదోపిడి) చేసి, తన తల్లిదండ్రులు నాగదేవి, నరసరాయలు పుణ్యంగాను"అమ్మనబ్రోలుసీమ" లోని వల్లూరు (టంగుటూరుమండలం) గ్రామాన్ని, తమ పురోహితులైన రంగనాథ దీక్షితులు వారికి ఇచ్చారు. అలాగే"అమ్మనబ్రోలు సీమ"లోని కొత్తపల్లి (మద్దిపాడు మండలం), తోగుంట (త్రోవగుంట, ఒంగోలుమండలం) గ్రామాలను శివా దీక్షితులు వారికి ఇచ్చారు.
ఆధారం, దక్షిణభారతశాసనాలు, ఆరోభాగం. శాసననంబరు, 248. అమరావతిశాసనం.
5.శ్రీకృష్ణదేవరాయలు (సా.శ..1509-1529) ప్రభుత్వంలో సా.శ..1528 నాడు "అమ్మనబోలు సీమ"లోని దొడ్డారం (దొడ్డవరం, మద్దిపాడుమండలం) గ్రామంలోని శ్రీ మల్లికార్జున దేవరకు ఆ ఊర్లోనే కొంత భూమిని ఇచ్చారు. ఇచ్చిన వారెవరో శాసనంలో చెప్పబడలేదు.
ఆధారం,నెల్లూరుజిల్లాశాసనాలు, రెండోభాగం.పుట,969.దొడ్డవరంశాసనం.
6.శ్రీ అచ్యుతదేవరాయలు (సా.శ..1530-1542) పాలనలో కొండవీటి రాజ్య పాలకుడు బయకార రామప్పయ్య (రాయసం కొండమరుసయ్యఅన్న, రామయభాస్కరుడు (బాచరసు) అన్న పెద్ద తిమ్మయ్య కుమారుడు) సా.శ..1538 నాడు తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారికి "అమ్మనబ్రోలుసీమ" లోని కొప్పోలు (ఒంగోలుమండలం) గ్రామాన్ని దానంగా ఇచ్చారు.
ఆధారం, t.t.d. శాసననివేదిక.పుట.251,252.
7.శ్రీ సదాశివరాయలు (సా.శ..1542-1576) పాలనలో కొండవీటి రాజ్యపాలకుడు, అళియ రామరాయల మేనల్లుడు, సిద్ది రాజుతిమ్మరాజు (సా.శ..1554-1561) పుణ్యంగాను స్థానికపాలకుడు (అమ్మనబోలు సీమ?) మందపాటి అప్పళరాజు సా.శ..1558 నాడు "అమ్మనబోలుసీమ" లోని చదలవాడ (నాగులుప్పలపాడు మండలం) శ్రీ రఘునాయక స్వామివారి స్థలం (సంత) లోకి అద్దంకిసీమ, "అమ్మనబోలుసీమ"ల నుండి తెచ్చి అమ్ముకునే ధాన్యాలు,పదార్థాలు మొదలగు వాటిపై వచ్చే పన్ను స్థానిక చదలవాడ శ్రీ రఘునాయక స్వామి వారికి సమర్పించారు.
ఆధారం, నెల్లూరుజిల్లా శాసనాలు, రెండోభాగం.పుట.953,954. చదలవాడశాసనం.
8.శ్రీ సదాశివరాయలు (సా.శ..1542-1576) పాలనలో సిద్ది రాజు రంగప్పరాజయ్యదేవ సా.శ..1565 నాడు కొండవీటి రాజ్యంలోని అద్దంకి,"అమ్మనబోలుసీమ" లోని చదలవాడ (నాగులుప్పలపాడు మండలం) శ్రీ రఘునాయక స్వామి వారికి తమ పూర్వుల పుణ్యం గాను చదలవాడ, జనకవరం పంగులూరుమండలంలోని చిన్న మల్లవరం, అలవలపాడు గ్రామాల సుంకాన్ని సమర్పించారు.
ఆధారం, నెల్లూరు జిల్లాశాసనాలు, రెండోభాగం.పుట.948. చదలవాడ శాసనం.
9.శ్రీ వీరప్రతాప (3) శ్రీరంగరాయలు (సా.శ..1642-1680) పాలనలో సా.శ..1643 నాడు దావండ కూరి ఆజ్ఞ. (పూర్వం?) మాకుండ ఇమ్మడి శీతాజుహివ ఓడయలు రాసిచ్చిన దాన పత్రం ప్రకారం? "అమ్మనబోలుసీమ"లోని చదలవాడ (నాగులుప్పలపాడు మండలం) స్థలం పోలయరెడ్డి, దేవరాయలు సమర్పించిన తామ్ర శాసనం. ఈ శాసనం పూర్వ రాజుల ఆజ్ఞ మరల పునరుద్ధరణ అనిపిస్తుంది.
ఆధారం,నెల్లూరు జిల్లా శాసనాలు, రెండోభాగం.పుట,957.చదలవాడ శాసనం.
10.శ్రీ ఎర్రం దేవరాజయ్య ద్వారా "అమ్మనబోలుసీమ"లోని చిన్న చేజర్ల(ఒంగోలుమండలం) గ్రామాన్నిపొందిన రామానాయుని గారు చేజర్ల శ్రీ చెన్నకేశవ దేవరకు ఆ వూరి నైరుతి భాగంలో కొంత భూమి సమర్పించారు.శాసన సమయం లేదు.
ఆధారం, నెల్లూరు జిల్లా శాసనాలు. రెండోభాగం.పుట,959.చేజర్ల శాసనం.
11.శ్రీ "అమ్మనబోలు సీమ"లోని నూతలపాడు చెన్నకేశవదేవరకు తిమ్మప్ప (ఎప్పటి పాలకుడో?) నూతలపాటి పరిసరాలలో కొంత భూమి దానంగా ఇచ్చారు. ఈ దాన శాసనం స్పష్టంగా లేదు. శాసనం సమయం లేదు.
అథారం,నెల్లూరుజిల్లాశాసనాలు, మూడోభాగం.పుట,1120. సంతనూతలపాడు శాసనం.
అమ్మనబ్రోలు సీమపాలకులు
మార్చు1.శ్రీ పురుషోత్తమగజపతి (సా.శ..1466-1497) ప్రభుత్వంలో సర్వేపల్లితిమ్మారెడ్డి (సా.శ..1582-1596) కలడు .ఇతని తండ్రి పేరు కూడా తిమ్మారెడ్డి. ఇతనికి హిందూరావు సూరథాణి అని బిరుదు కలదు. ఇదే బిరుదు కొద్ది మార్పుతో హిందూరాయ సురత్రాణ అని సంగమ వంశీయుడు 1.వీర దేవరాయలు (సా.శ..1378-1422) కూడా కలదు. సర్వేపల్లి తిమ్మారెడ్డి శాసనములు, అమ్మనబ్రోలు సీమలోని చదలవాడ(నాగులుప్పలపాడు మండలం), సంతరావూరు (చిన్నగంజాంమండలం) ఉండుటవలన "అమ్మనబ్రోలుసీమపాలకుడు"గా భావించారు.
ఆధారం, దక్షిణ భారతదేశ శాసనాలు.10 వ భాగం.శాసన నెంబరు,731.నెల్లూరుజిల్లా శాసనాలు.రెండో భాగం.పుట,951.
2.శ్రీ కృష్ణ దేవరాయలు (సా.శ..1509-1529) ప్రభుత్వంలో సూరనాయిణి "అబ్బానాయిణి" సా.శ..1511 నాడు "అమ్మనబోలుసీమ పాలకులు"గా ఉన్నారు. సా.శ. 1511 సమయాన్ని శ్రీకృష్ణదేవరాయలు తొలి కళింగ దండయాత్ర గా అనుకోవాలి. మరలా గజపతులు చేతుల్లోకి ఈ ప్రాంతం వెళ్ళిపోయింది. గోనుగుంట (చీమకుర్తిమండలం) శాసనం ఆధారం.
ఆధారం,నెల్లూరుజిల్లాశాసనాలు. రెండోభాగం.పుట,975.
3.శ్రీ కృష్ణ దేవరాయలు (సా.శ..1509-1529) గజపతులపై తన మలి కళింగ దండయాత్ర లో భాగంగా సా.శ..1514 నాడు ఉదయగిరి రాజ్యాన్ని జయించాడు.తరువాత సా.శ..15 15 నాడు పాత గుంటూరు జిల్లాలోని అమ్మనబ్రోలు సీమ, అద్దంకి సీమ, వినుకొండ సీమ, నాగార్జునకొండ సీమ, తంగెడ సీమ, బెల్లంకొండ సీమ, కేతవరం సీమ, చివరగా "కొండవీటి"దుర్గాన్ని జయించాడు.అయితే శ్రీకృష్ణదేవరాయలు జయించిన దుర్గాలు వాటి పాలకులు పేర్లు వరుస క్రమంలో కాకుండా శాసనంలో గజిబిజిగా ఉన్నాయి. వాటిలో "అమ్మనబ్రోలు సీమ" పాలకుడు పేరు చెప్పటం కష్టమే? శ్రీ కృష్ణ దేవరాయలు ఈ ప్రాంతం జయించే సమయానికి గజపతుల పాలనలో పాత గుంటూరు జిల్లాలోని ఎనిమిది దుర్గాలలో పాలకులు ఎవరు ఉన్నారు అనేది ఒక అంచనా! రాయలు ఉదయగిరి చేయించాక వీరభద్రగజపతి కొండవీడు వచ్చాడు కనుక.
1.వీరభద్రగజపతి "కొండవీడుసీమ"పాలకుడు.అనేది అర్థం అవుతుంది.
2."నాగార్జునకొండ సీమ"పాలకుడు శ్రీనాధరాజులక్ష్మిపతిరాజు అని భావించవచ్చు?. ఎందుకంటే సా.శ.. 1491,నాగార్జునకొండశాసనం, సా.శ..1508 గురజాలశాసనంలో శ్రీనాధరాజు వంశీయులు ఆసీమకు పాలకులుగా ఉన్నారు.
3."కేతవరంసీమ" పాలకుడు పూసపాటి రాచిరాజు అనేది అనేక కావ్యాల్లో రుజువైంది.
4.కుమార హంవీరమహాపాత్రుని కొడుకు నరహరిపాత్రులు.
5.రాచూరిమల్లవాఖానుడు.
6.ఉద్దండఖానుడు.
7.జన్యువులకసవాపాత్రుడు.
8.పశ్చిమబాలచంద్రమహాపాత్రుడు
పైన ముగ్గురు పాలకులు ఏ సీమను పాలించే వారో విషయం తెలిసింది.మిగిలిన చివరి ఐదుగురు పాలకులు గజపతులపాలనలో (అద్దంకిసీమ, అమ్మనబ్రోలుసీమ, వినుకొండసీమ, తంగెడసీమ, బెల్లంకొండసీమ.) ఏ సీమకు పాలకులులో తెలియడం లేదు.
ఆధారం, దక్షిణభారతదేశ శాసనాలు.నాలుగోభాగం.శాసన నెంబరు,248.అమరావతి శాసనం
4.శ్రీ సదాశివరాయలు (సా.శ..1542-1576) ప్రభుత్వంలో అరవీటి జగ్గరాజయ్యదేవ (అళియ రామరాయలుచిన్నాన్న శ్రీరంగరాజుకుమారుడు) గారిని సా.శ..1556 సంతరావూరు (చిన్నగంజాం మండలం) శాసనం ద్వారా "అమ్మనబోలుసీమ" పాలకుడిగా భావించారు.
ఆధారం, దక్షిణదేశ శాసనాలు.16 వ భాగం.శాసననెంబరు,208.
5.శ్రీ సదాశివరాయలు (సా.శ..1542-1576) ప్రభుత్వంలో మందపాటి అప్పళరాజు "అమ్మనబ్రోలుసీమపాలకుడు"గా ఉన్నాడని సా.శ..1558 నాటి చదలవాడ (నాగులుప్పలపాడు మండలం) శాసనం ఆధారంగా కనిపిస్తుంది.మందపాటి వంశీయులు, పూర్వం ఒంగోలు, ఎండ్లూరు (సంతనూతలపాడు మండలం) రాజులుగా ఉన్నారు.
ఆధారం, నెల్లూరుజిల్లాశాసనాలు. రెండోభాగం.పుట.953,954.
6.శ్రీ సదాశివరాయలు ( సా.శ..1542-1576) ప్రభుత్వంలో సిద్ధి రాజురంగప్పరాజయ్యదేవ సా.శ..1565 నాడు అద్దంకిసీమ, "అమ్మనబ్రోలుసీమ"రెంటికీ పాలకుడుగా ఉన్నట్టు చదలవాడ ( నాగులుప్పలపాడు మండలం) శాసనం ద్వారా తెలుస్తోంది.అళియ రామరాయలుమేనల్లుడు, కొండవీటిరాజ్యపాలకుడు సిద్ది తిమ్మరాజు (సా.శ..1554-1561) ఈ సిద్దిరాజురంగప్పరాజయ్యదేవకు తండ్రి. అలాగే సిద్ధిరాజువెంకట రాజయదేవ అనే కుమారుడు కూడా సిద్ధరాజు తిమ్మరాజుకు కలడు. ఇంకా వీరి దాయాది ఒకరు సిద్దిరాజు తిరుమలదేవరాజు సా.శ.. 1564 నాడు కొండవీడు సీమ పాలకుడిగా ఉన్నాడు.
ఆధారం, నెల్లూరుజిల్లాశాసనాలు. రెండోభాగం.పుట,948.
7.శ్రీ యరం దేవరాజయ్య ఇతని శాసన సమయం లేదు. "అమ్మనబ్రోలుసీమ"లోని చేజర్ల శాసనం సుమారుగా సా.శ..1552, కాని, సా.శ..1612 ప్రాంతము అని భావించవచ్చు.
ఆధారం, నెల్లూరుజిల్లాశాసనాలు. రెండోభాగం. పుట, 659.
8.అమ్మనబ్రోలు లాంటి చిన్న సీమ పాలకులు ఆధారాలు లభించుట చాలా కష్టం.ఇప్పటి వరకు దొరికిన పాలకులు విషయాలు చెప్పాము.ఒక్కోసారి కొండవీటి రాజ్య పాలకులులే అమ్మనబ్రోలుసీమ పాలకులుగా ఉంటారు. అమ్మనబ్రోలు సీమపై ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళం అను పుస్తకంలో తొలిసారిగా చిన్న వ్యాసం ఉంది. ఇంతకు పూర్వం ఎప్పుడు అమ్మనబ్రోలుసీమ పై ఎవరైనా ప్రత్యేక వ్యాసం రాసినట్లు, దృష్టికి రాలేదు.
గణాంకాలు
మార్చు2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,529. ఇందులో పురుషుల సంఖ్య 3,618, మహిళల సంఖ్య 3,911, గ్రామంలో నివాస గృహాలు 1,742 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 3,132 హెక్టారులు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".