2014 నంది పురస్కారాలు
2014 సంవత్సరానికి గాను నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే 2017, నవంబర్ 14 తేదీన ప్రకటించబడ్డాయి.[1][2][3] నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ ఉత్తమ చిత్రంగా బంగారునందిని గెలుచుకుంది. అక్కినేని నాగార్జున నటించిన మనం వెండినంది గెలుచుకున్నాయి. లెజెండ్ సినిమాలోని అధ్భుత నటనకు నందమూరి బాలకృష్ణ ఉత్తమ నటుడిగా, గీతాంజలి సినిమాలలోని నటనకు అంజలికి ఉత్తమ నటీమణి అవార్డు లభించింది. కృష్ణంరాజు రఘుపతి వెంకయ్య అవార్డు, ఆర్. నారాయణమూర్తి నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ పురస్కారం, ఎస్.ఎస్. రాజమౌళి బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు.
జాబితా
మార్చువిభాగం | విజేత | సినిమా | నంది రకం |
---|---|---|---|
ఉత్తమ చిత్రం | లెజెండ్ | లెజెండ్ | బంగారు |
ద్వితీయ ఉత్తమ చిత్రం | మనం | మనం | వెండి |
తృతీయ ఉత్తమ చిత్రం | హితుడు | హితుడు | తామ్ర |
ఉత్తమ నిర్మాత | ఆచంట రామబ్రహ్మం | లెజెండ్ | |
ద్వితీయ ఉత్తమ నిర్మాత | అక్కినేని నాగార్జున | మనం | |
తృతీయ ఉత్తమ నిర్మాత | కేఎస్వీ నరసింహులు | హితుడు | |
ఉత్తమ దర్శకుడు | బోయపాటి శ్రీను | లెజెండ్ | వెండి |
ద్వితీయ ఉత్తమ దర్శకుడు | విక్రమ్ కె కుమార్ | మనం | |
తృతీయ ఉత్తమ దర్శకుడు | విప్లవ్ | హితుడు | |
ఉత్తమ నటుడు | నందమూరి బాలకృష్ణ | లెజెండ్ | వెండి |
ద్వితీయ ఉత్తమ నటుడు | అక్కినేని నాగేశ్వరరావు | లెజెండ్ | |
తృతీయ ఉత్తమ నటుడు | జగపతిబాబు | హితుడు | |
ఉత్తమ నటి | అంజలి | గీతాంజలి | వెండి |
ద్వితీయ ఉత్తమ నటి | సమంత | మనం | తామ్ర |
తృతీయ ఉత్తమ నటి | మీరా నందా | హితుడు | తామ్ర |
ఉత్తమ ప్రతినాయకుడు | జగపతిబాబు | లెజెండ్ | తామ్ర |
ఉత్తమ సహాయ నటుడు | నాగ చైతన్య | మనం | తామ్ర |
ఉత్తమ సహాయ నటి | మంచు లక్ష్మి | చందమామ కథలు | తామ్ర |
ఉత్తమ క్యారెక్టర్ నటుడు | రాజేంద్రప్రసాద్ | టామీ | తామ్ర |
ఉత్తమ హాస్యనటుడు | బ్రహ్మానందం | రేసుగుర్రం | తామ్ర |
ఉత్తమ హాస్యనటి | విద్యుల్లేక రామన్ | రన్ రాజా రన్ | తామ్ర |
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత | ఎ.ఎస్. రవికుమార్ చౌదరి | పిల్లా నువ్వు లేని జీవితం | తామ్ర |
ఉత్తమ కథా రచయిత | కృష్ణవంశీ | గోవిందుడు అందరివాడేలే | తామ్ర |
ఉత్తమ మాటల రచయిత | ఎం.రత్నం | లెజెండ్ | తామ్ర |
ఉత్తమ సంగీత దర్శకుడు | అనూప్ రూబెన్స్ | మనం | తామ్ర |
ఉత్తమ గాయకుడు | విజయ్ ఏసుదాసు | లెజెండ్ | తామ్ర |
ఉత్తమ గాయని | కె. ఎస్. చిత్ర | ముకుంద | తామ్ర |
ఉత్తమ ఎడిటర్ | కోటగిరి వెంకటేశ్వరరావు | లెజెండ్ | తామ్ర |
ఉత్తమ పాటల రచయిత | చైతన్య ప్రసాద్ | బ్రోకర్ 2 | తామ్ర |
ఉత్తమ ఆర్ట్ | విజయ్ కృష్ణ | తామ్ర | |
ఎన్టీఆర్ జాతీయ అవార్డు | కమల్ హాసన్ | ||
ఉత్తమ ప్రజాదరణ చిత్రం | లౌక్యం | తామ్ర | |
ఉత్తమ కథా చిత్రం | టామీ | తామ్ర | |
స్పెషల్ జూరీ అవార్డు | సుద్దాల అశోక్ తేజ | తామ్ర | |
ఉత్తమ బాలలచిత్రం | ఆత్రేయ | తామ్ర | |
ఉత్తమ బాలనటి | అనూహ్య | ఆత్రేయ | తామ్ర |
ఉత్తమ బాలనటుడు | గౌతమ్ కృష్ణ | 1 - నేనొక్కడినే | తామ్ర |
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు | చందు మొండేటి | కార్తికేయ | తామ్ర |
ఉత్తమ ఛాయాగ్రాహకుడు | సాయిశ్రీ రామ్ | అలా ఎలా? | తామ్ర |
ఉత్తమ కొరియోగ్రాఫర్ | ప్రేమ్ రక్షిత్ | తామ్ర | |
ఉత్తమ ఫైట్‌మాస్టర్ | రామ్ లక్ష్మణ్ | లెజెండ్ | తామ్ర |
ఉత్తమ ఆడియోగ్రాఫర్ | రాధాకృష్ణ | తామ్ర | |
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉద్దండు | తామ్ర | |
ప్రత్యేక బహుమతి | అవసరాల శ్రీనివాస్ | ఊహలు గుసగుసలాడే | తామ్ర |
ప్రత్యేక బహుమతి | మేకా రామకృష్ణ | మళ్లీ రాదోయ్ లైఫ్ | తామ్ర |
ప్రత్యేక బహుమతి | కృష్ణారావు | అడవి కాచిన వెన్నెల | తామ్ర |
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు (14 November 2017). "2014 నంది అవార్డులు". Archived from the original on 17 నవంబరు 2017. Retrieved 15 November 2017.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ సాక్షి, సినిమా (15 November 2017). "నంది అవార్డ్స్ విజేతల అభిప్రాయాలు". Retrieved 15 November 2017.
- ↑ నమస్తే తెలంగాణ, FEATURED NEWS (14 November 2017). "2014,2015,2016 నంది అవార్డులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం". Retrieved 15 November 2017.[permanent dead link]