ఆక్యుపంక్చర్

(ఆక్యుపంచర్ నుండి దారిమార్పు చెందింది)

ఆక్యుపంక్చర్ (Acupuncture) చైనా దేశములో బహుళ ప్రఖ్యాతగాంచిన వైద్యవిధానాలలో ఒక రకము. శరీరంలో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో సన్నటి సూదులను గుచ్చడం ద్వారా నొప్పిని తగ్గించడం, చికిత్స చేయడం దీని ప్రధాన ఉద్దేశం. చైనీయుల సాంప్రదాయ వైద్య విధానం ప్రకారం ప్రత్యేకమైన ప్రదేశాలు శరీరం లోకి జీవశక్తి ప్రవేశించే మార్గంలో అమరి ఉంటాయి. శరీర ధర్మ శాస్త్రం ప్రకారం కానీ, కణజాల శాస్త్రం ప్రకారంగానీ ఈ ప్రదేశాల గురించి ఎటువంటి ఆధారాలూ లేవు.[1] శరీరంలో జీవశక్తి ప్రవహిస్తుంటుందని చైనీయుల నమ్మకం. ఈ శరీరంలో జీవశక్తి ప్రవహించే మార్గాలను మెరిడియన్ అని పిలిచారు. ఇవి నిలువుగానూ, అడ్డంగానూ పయనిస్తుంటాయని, శరీరం పై భాగంలో ఇవి కలిసే చోట్లు 365 ఉన్నాయని నమ్మారు. ఆక్యుపంక్చర్ వైద్యంలో రోగ నిర్ణయానికి నాడి చూడడం ఒక పద్ధతిగా వస్తున్నది.

ఆక్యుపెంచర్ విధానం
ఆక్యుపంక్చర్ చార్టు, హువా షౌ (fl. 1340, మింగ్ సామ్రాజ్యం) . 1716 నాటి టోక్యో లోని సుహారయా హైసుకి, క్యోహో లోని ఈ చిత్రంలో షి సి జింగ్ ఫా హుఇ (14 మెరీడియన్ల ప్రకటన).

చరిత్ర

మార్చు

చైనాలో రాతి యుగం నుంచే ఈ విధానం వాడుకలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానంలో వారు పదునైన రాయితో చేసిన సూదులను వాడేవారు. క్రీ.పూ 3000 సంవత్సరానికి చెందిన అలాంటి రాళ్ళను కొంతమంది పురాతత్వ శాస్త్రవేత్తలు మంగోలియా ప్రాంతంలో కనుగొనడం జరిగింది.[2][3] ఇది ఆవిర్భవించింది చైనాలో కానీ జపాన్, టిబెట్, వియత్నాం, కొరియా లలో కూడా ఈ విధానాన్ని అవలంభించేవారూ, బోధించేవారు ఉన్నారు.

ఇటీవల ఓట్జీ (Ötzi) అనే ప్రాంతంలో ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో 5000 సంవత్సరాలనాటి ఒక మమ్మీని కనుగొన్నారు. దాని మీద సుమారు 50 ప్రదేశాల్లో పచ్చబొట్లు కనుగొన్నారు. అవి ఉన్న ప్రదేశాలన్నీ ఇప్పుడు ఆక్యుపంక్చర్ విధానంలో కొన్ని రోగాల నివారణకు సూదులు గుచ్చడానికి గుర్తించిన ప్రదేశాలే.

ఆక్యుపెంచర్ విధానం

మార్చు

చైనీయులు శరీరంలో జీవశక్తి ప్రవహించే మార్గాలను మెరిడియన్ అని పిలిచారు. ఇవి నిలువుగానూ, అడ్డంగానూ పయనిస్తుంటాయి. యివి శరీరం పై భాగంలో కలిసే చోట్లు 365 ఉంటాయి. ఆక్యుపంక్చర్ వైద్యంలో రోగ నిర్ణయానికి నాడి చూడడం ఒక పద్ధతిగా వస్తున్నది. మెరిడియన్ గుర్తించిన చోట్లు రెండు వేల వరకూ పెరిగాయి. శరీరంలో రెండురకాల శక్తులు ఉన్నాయి.వాటిలో స్త్రీ శక్తిని "ఇన్" అంటారు. పురుష శక్తిని "యంగ్" అంటారు. శరీరంలో ఈ శక్తులు తులనాత్మకంగా ఉండటానికి అనువుగా సూదులు గుచ్చి ప్రకోపింప చేసి సరైన పద్ధతిలో పెట్టవచ్చు.. ఋతువులూ, వాతావరణం రోజులో సమయం, నాడి ఆధారంగా రోగ లక్షణాలను నిర్దారిస్తారు. దేహంలోని అంగాలకు ప్రాతినిధ్యం వహిస్తూ మణికట్టు వద్ద నాడి ఆరు విధాలుగా ఆడుతుంది. ప్రతినాడీ ప్రకంపనానికి 25 లక్షణాలున్నాయి. చికిత్స ప్రారంభించేముందు రోగి నాడిని ఆధారంగా 300 నాడీ ప్రకంపనాలను పరిశీలిస్తారు. సూదులను ఆయా శరీర భాగాలలో గుచ్చి ఎంతసేపు ఉంచవలసిందీ రోగి లక్షణాలను బట్టి నిర్ణయిస్తారు. ఈ సూదులు 6 అంగుళాల నుండి 12 అంగుళాల వరకూ ఉంటాయి. ఒక మూలికను ఆయా శరీర భాగాల మీదగానీ, పుండు పడిన చోట గానీ ఉంచి వేడి చేస్తారు. ఏ రోగానికైనా ఈ సూది మందులు పనిచేస్తాయని నమ్మారు. రోగనిర్ధారణలో నాలుకను కూడా పరిశీలిస్తారు. ప్రాచీన చైనాలో శరీరాన్ని కోసి చూడటం నిషిద్ధం. ఆక్యుపంక్చర్ విరోచనాలకు, కంటిజబ్బులకు, ముక్కు దిబ్బడలకు, గొంతు నొప్పికి, ఉబ్బసానికీ, కీళ్ళ వాతానికీ, శరీరంలో పుండ్లకు పనిచేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీనికి శాస్ర్తీయ ఆధారాలు చూపలేకపోయింది. ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులకు, తలనొప్పి, మలబద్ధకం, లైంగిక వ్యాధులూ, అలసట వంటి లక్షణాలకు ఆక్యుపంక్చర్ పనిచేస్తుందని జోసఫ్ హెల్మ్ ప్రకటించారు. ఇందుకు ఆధారాలు శాస్త్రీయంగా చూపమన్నప్పుడు అందుకు నిలబడలేకపోయారు. ప్రస్తుతం ఆక్యుపంక్చర్ పనిచేస్తుందని జోసెఫ్ హెల్మ్ ప్రకటించారు. ఇందుకు ఆధారాలు శాస్త్రీయంగా చూపమన్నప్పుడు అందుకు నిలబడ లేకపోయారు. ప్రస్తుతం ఆక్యుపంక్చర్ అమెరికా, ఇండియా తదితర దేశాలలో ప్రచారంలో ఉంది. దీనిని ఆచరించేవారు ఆధునిక వైద్య విధానాలను జోడించటానికి ప్రయత్నిస్తున్నారు. కాని శాస్త్రీయ పరిశోధనలలో ఇంతవరకూ ఆక్యుపంక్చర్ ఏ ఒక్క సిద్ధాంతాన్నీ రుజువుపరచలేకపోయింది.

బ్లాక్‌ను ఛేధించే గుణం

మార్చు

ఆక్యుపంక్చర్ పాయింట్స్‌ని ఉత్తేజ పరచడం ద్వారా, వివిధ కారణాల వల్ల ఏర్పడిన మెరిడియన్ లోని బ్లాక్స్‌ని తొలగించవచ్చు. అంటే ఆటంకాలను తొలగించి ప్రాణ శక్తిని పునరావృతం చేయవచ్చు. బ్లాక్స్ వల్ల ప్రాణ శక్తి సరిగా అందక ఆ మెరిడియన్స్‌కి సంబంధించిన అవయవాల్లో ఏర్పడే రుగ్మతలను నయం చేయడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే దుష్ప్రభావాలను కూడా అరికట్టవచ్చు. మెరిడియన్ బ్లాక్స్‌ని తొలగించడం ద్వారా ఎన్నో రుగ్మతలను వేళ్లతో సహా తీసివేయవచ్చు.

యిన్, యాంగ్ సమన్వయ లోపాన్ని సరిదిద్దేగుణం

మార్చు

యిన్, యాంగ్ కపుల్ ఆర్గాన్స్‌లో మోతాదు మించిన హెచ్చు తగ్గుల వల్ల సమస్యలు రావచ్చు. అంటే వీటిని సమన్వయంగా ఉండేట్టు చేస్తే ఆరోగ్యం కుదురుగా ఉంటుంది. యిన్, యాంగ్ మెరిడియన్స్‌లియోకనెక్టింగ్ పాయింట్స్ ద్వారా కలిపి ఉంటాయి. లియో కనెక్టింగ్ పాయింట్స్‌ను ఉత్తేజపరచడం ద్వారా వీటిలోని ప్రాణ శక్తిని సమన్వయ పరిచి తద్వారా ఎన్నో రోగాల బారి నుంచి కాపాడవచ్చు.

రోగ నిరోధక శక్తి వృద్ధి

మార్చు

రోగనిరోధక శక్తిని పెంపొందించే గుణం ద్వారా ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని పెంపొందించవచ్చు. హోమియో స్టెసిన్ మెకానిజం ద్వారా బీపీ, నాడీ వేగం, ఇన్సులిన్ ఉత్పత్తి, ఎంజైముల సమసతుల్యం మీద ప్రభావం చూపి వీటన్నింటిని సమన్వయ పరుస్తుంది. మధుమేహం, థైరాయిడ్, బీపీ వంటి సమస్యపూన్నింటినో అదుపులో పెట్టవచ్చు. రాకుండా నివారించవచ్చు. బెస్ట్ టోనిఫికేషన్ పాయింట్ ద్వారా శరీరంలోని అన్ని జీవక్షికియలను టోనిఫై చేయవచ్చు. అంటే ఎటువంటి మందులు, టానిక్కులు లేకండా మన శరీరంలోని శక్తిని చలన పరచుకొని ఎన్నొ రోగాలను తరిమికొట్ట వచ్చు.

మోటార్ రికవరీ యాక్షన్

మార్చు

ప్రతి మెరిడియన్‌లోఒక మోటార్ పాయింట్‌ని గుర్తించారు. ఈ మోటార్ పాయింట్స్ ద్వారా పక్షవాతం, బెల్స్ పాల్సి, ఫుట్ డ్రాప్, వ్రిస్ట్ డ్రాప్ బెల్స్ పాల్సి, పారప్లీజియ, క్వాడ్రిప్లీజియతో బాధపడుతున్న వారికి చక్కటి ఉపశమనం కలుగుతుంది. అందుకే పక్షవాతంలో ఇంత చక్కటి రిజల్ట్స్ అక్యుపంక్చర్ అందించగలుగుతుంది.

అనప్జూసిక్ యాక్షన్

మార్చు

ఆక్యుపంక్చర్ అనగానే ముందుగా నొప్పి తగ్గించే గుణం గుర్తుకొస్తుంది అందరికి. ఎలాంటి నొప్పినైనా సరే తలనొప్పి, మైగ్రేన్ నుంచి మెడనొప్పి, భుజంనొప్పి, తుంటినొప్పి, మోకాలునొప్పి, కీళ్లనొప్పులు, భుజంనొప్పి, నడుమునొప్పి, మడిమనొప్పి మాత్రమే కాదు క్యాన్సర్‌వల్ల వచ్చే నొప్పి కూడా తగ్గించే గుణం ఆక్యుపంక్చర్‌కు ఉంది. దీనికి కారణం శరీరంలోని ఆక్యుపంక్చర్ పాయింట్స్‌కు నొప్పిని నివారించే గుణం ఉంది. ఈ అనల్జిక్ యాక్షన్‌ను ఉపయోగించుకొని చైనీయులు ఆక్యుపంక్చర్ అనస్థీషియాను అభివృద్ధి పరిచారు. కొన్ని పాయింట్స్‌ని ఉత్తేజ పరిచి, ఎటువంటి మత్తు అవసరం లేకుండానే ఎటువంటి దుష్ఫ్రభావాలు లేకుండా పెద్దపెద్ద సర్జరీలు చేయగలుగుతున్నారు.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Felix Mann. Chinese Medicine Times Archived 2009-01-22 at the Wayback Machine, vol 1 issue 4, Aug. 2006, "The Final Days of Traditional Beliefs? - Part One"
  2. "MoonDragon's Health & Wellness Therapy: Acupuncture". Archived from the original on 2017-11-07. Retrieved 2009-07-03.
  3. "Acupuncture". Archived from the original on 2016-02-21. Retrieved 2009-07-03.