ఈడోరకం ఆడోరకం 2016 ఏప్రిల్ 14వ తేదీన విడుదలైన తెలుగు హాస్య చిత్రం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై.లి. పతాకంపై నిర్మించిన ఈ సినిమా "క్యారీ ఆన్‌ జట్టా" అనే పంజాబీ చిత్రానికి పునఃనిర్మాణం[1].ఈ చిత్రప్రసార హక్కులు జెమినీ టీవీ కొనుగోలు చేసింది.

ఈడోరకం ఆడోరకం
(2016 తెలుగు సినిమా)
దస్త్రం:Eedo Rakam Aado Rakam.jpg
గోడ ప్రచార పత్రిక
దర్శకత్వం జి.నాగేశ్వరరెడ్డి
నిర్మాణం రామబ్రహ్మం సుంకర
తారాగణం మంచు విష్ణు
రాజ్ తరుణ్
రాజేంద్ర ప్రసాద్
పోసాని కృష్ణమురళి
సోనారిక భాడోరియా
హెబ్బా పటేల్
సంగీతం సాయి కార్తీక్
సంభాషణలు డైమండ్ రత్నబాబు
ఛాయాగ్రహణం సిద్ధార్థ్
కూర్పు ఎం.ఆర్.వర్మ
నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై లిమిటెడ్
విడుదల తేదీ 2016 ఏప్రిల్ 14 (2016-04-14)
దేశం భారతదేశం
భాష తెలుగు

చిత్ర కథ మార్చు

అడ్వకేట్ నారాయణ (రాజేంద్రప్రసాద్) కొడుకు అర్జున్ (విష్ణు), ఎస్.ఐ. కోటేశ్వరరావు (పోసాని కృష్ణమురళి) కొడుకు అశ్విన్ (రాజ్ తరుణ్) స్నేహితులు. పనీపాటా లేకుండా తిరిగే వీరికి ఓ స్నేహితుడి పెళ్ళిలో నీలవేణి (సోనారిక), సుప్రియ (హెబ్బా పటేల్) లతో పరిచయం జరుగుతుంది. అనాథనే పెళ్ళి చేసుకోవాలన్నది నీలవేణి అభిప్రాయమైతే, కుటుంబం వున్న ఓ ఆస్తిపరుడిని పెళ్ళాడాలన్నది సుప్రియ కోరిక. నీలవేణి పడేసేందుకు అనాథగా డ్రామా మొదలెట్టి ఆమెను సొంతం చేసుకుంటాడు అర్జున్. అంతలోనే సడెన్‌గా వీరి పెళ్ళయిపోతుంది. వేరు కాపురం పెట్టేందుకు అర్జున్ వాళ్ళ ఇంటిలోనే అద్దెకు దిగుతుంది నీలవేణి. ఈ విషయం తెలిసినా అర్జున్ ఏం చేయలేని పరిస్థితి. తన కుటుంబం విషయం నీలవేణికి తెలీకుండా, తన పెళ్ళి విషయం కుటుంబానికి తెలీకుండా అశ్విన్‌ని నీలవేణి భర్తగా తన ఇంటివారికి పరిచయం చేస్తాడు అర్జున్. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే అశ్విన్, సుప్రియలు పెళ్ళి జరుగుతుంది. అనుకోని పరిస్థితులలో ఆ ఇంట్లో అర్జున్ భార్యగా సుప్రియ పరిచయం అవుతుంది. చివరికి ఈ కన్ఫ్యూజన్ డ్రామా ఎలా ముగిసింది అన్నదే సినిమా.[2]

తారాగణం మార్చు

పాటలు మార్చు

  • ఓ నీలవేణి, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.రంజిత్
  • పట్టుకో నన్ను పట్టుకో, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.సాయి చరణ్ , అపర్ణ
  • కో కో కోడి , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.బాబా సెహగల్ , రేవంత్ , కృష్ణ చైతన్య, దివిజ, కార్తీక్, రోల్ రిడ
  • ఈడో రకం, ఆడో రకం, రచన: భాస్కర భట్ల, గానం. దీపు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం = నాగేశ్
  • నిర్మాత = సుంకర
  • మాటలు = రత్నం
  • సంగీతం = కార్తీక్
  • ఛాయాగ్రహణం = సిద్ధార్థ్
  • ఎడిటర్ = వర్మ

మూలాలు మార్చు

  1. "గ్రేట్ ఆంధ్ర.కామ్‌లో సినిమా విశేషాలు". Archived from the original on 2016-04-16. Retrieved 2016-04-15.
  2. "ఆంధ్రజ్యోతిలో సినిమారివ్య్యూ". Archived from the original on 2016-04-16. Retrieved 2016-04-15.
  3. సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.

బయటి లంకెలు మార్చు