ఎం. సంజయ్
మాకునూరు సంజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున జగిత్యాల శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]
ఎం. సంజయ్ | |||
| |||
పదవీ కాలం 2018- ప్రస్తుతం | |||
ముందు | జీవన్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | జగిత్యాల శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జులై 6, 1962 జగిత్యాల, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | హనుమంతరావు, వత్సల | ||
జీవిత భాగస్వామి | రాధిక | ||
సంతానం | ఒక కుమార్తె | ||
నివాసం | జగిత్యాల, తెలంగాణ |
జననం, విద్య
మార్చుసంజయ్ 1962, జూలై 6న హనుమంతరావు, వత్సల దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల పట్టణంలో జన్మించాడు.[3] 1989లో నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్ పూర్తి చేసాడు. 1992లో కర్ణాటకలోని కువెంపు యూనివర్సిటీ నుండి జెజెఎం మెడికల్ కాలేజీలో ఎంఎస్ (ఆప్తమాలజీ)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసాడు. ఆ తరువాత మెడికల్ ప్రాక్టీషనర్ (డాక్టర్) గా పనిచేశాడు.[4]
వ్యక్తిగత జీవితం
మార్చుసంజయ్ కు రాధికతో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె.
రాజకీయ విశేషాలు
మార్చుతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సంజయ్, 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి చేతిలో 7828 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి పై 61185 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6]
డాక్టర్ సంజయ్ కుమార్ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డిపై 15822 ఓట్ల తేడాతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7] ఆయన 2024 జూన్ 23న టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[8][9]
ఇతర వివరాలు
మార్చుశ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదలైన దేశాలు సందర్శించాడు.
మూలాలు
మార్చు- ↑ admin (2019-01-07). "Jagtial MLA Dr.M.Sanjay Kumar". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-08-26. Retrieved 2021-08-26.
- ↑ "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-08-26.
- ↑ Eenadu (6 November 2023). "నేతల గ్రామం అంతర్గాం". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
- ↑ "Dr. M. Sanjay Kumar | MLA | Jagtial | Telangana | TRS | theLeadersPage". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-25. Retrieved 2021-08-26.
- ↑ Dayashankar, K. M. (2018-12-11). "In Jagtial, popular doctor makes his debut". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-08-26.
- ↑ Eenadu (25 November 2023). "ఓట్లు కొల్లగొట్టారు". Archived from the original on 25 November 2023. Retrieved 25 November 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ TV5 (24 June 2024). "కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్". Archived from the original on 24 June 2024. Retrieved 24 June 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (24 June 2024). "బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మరో ఎమ్మెల్యే". Archived from the original on 24 June 2024. Retrieved 24 June 2024.