ఎన్‌కౌంటర్
ఎన్‌కౌంటర్ 1997లో విడుదలైన తెలుగు సినిమా. పద్మాలయా స్టుడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఘట్టమనేని హనుమంతరావు నిర్మించిన ఈ సినిమాకు ఎన్.శంకర్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, రమేష్ బాబు, వినోద్ కుమార్, రోజా, రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]
ఎన్‌కౌంటర్ (1997 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎన్.శంకర్ |
తారాగణం | కృష్ణ, రోజా |
నిర్మాణ సంస్థ | పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ |
భాష | తెలుగు |
కథ మార్చు
భారత స్వాంతంత్ర్య కోసం పోరాడి అమరులైన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి మహామహులని దేశ స్వాతంత్ర్యానంతరం అమరవీరులుగా ఎలా కీర్తిస్తున్నామో అదే విధంగా ఈ రోజున పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని దళితులని, బలహీన వర్గాలని నానా అగచాట్లకు గురిచేస్తున్న ఈ నల్ల దొరల నుండి విముక్తి కోసం అసువులు బాసిన ఉగ్రవాదులు కూడా రేపు సమసమాజ స్థాపన జరిగితే వారినీ అమరవీరులుగానే కీర్తిస్తారన్న సిద్ధాంతాని ప్రతిపాదించిన చిత్రం ఇది.[2]
తారాగణం మార్చు
- ఘట్టమనేని కృష్ణ
- ఘట్టమనేని రమేష్ బాబు
- వినోద్ కుమార్
- రోజా
- రాధిక శరత్‌కుమార్
- రుచిత
- ప్రసాద్
- కోట శ్రీనివాసరావు
- బాబూమోహన్
- జీవా
- మహర్షి
- బాలాజీ
- కాకరాల
- మదన్ మోహన్
- ప్రసాద్ బాబు
- శకుంతల
- రాధా ప్రశాంతి
- రత్నసాగర్
- తెనాలి శకుంతల
- సుబ్బరాయశర్మ
- చంద్రమోహన్
- రాజా రవీంద్ర
- శివాజీరాజా
- వల్లభనేని జనార్థన్
- పి.ఎల్.నారాయణ
సాంకేతిక వర్గం మార్చు
- కథ, చిత్రానువాదం, దర్శకుడు: ఎన్.శంకర్
- నిర్మాత: ఘట్టమనేని హనుమంతరావు
- విడుదల తేదీ: 1997 ఆగస్టు 14
- మాటలు: ఎం.వి.ఎస్.హరనాథరావు
- పాటలు: భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, గుండవర్పు సుబ్బారావు, ఎన్.శంకర్, గోరటి వెంకన్న
- ఛాయాగ్రహణం: హరి అనుమోలు
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
మూలాలు మార్చు
- ↑ "Encounter (1997)". Indiancine.ma. Retrieved 2020-08-20.
- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-20.