ఒక చిన్నమాట

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం

ఒక చిన్నమాట 1997, మే 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బి. శివరామకృష్ణ నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, ఇంద్రజ జంటగా నటించగా, రమణీ భరద్వాజ్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధించింది.[1][2] రవీంద్రనాథ్ టాగూర్ 1906లో రాసిన నౌకదుబి నవల ఆధారంగా 1956లో రూపొందించబడిన చరణదాసి సినిమా ప్రేరణతో ఈ చిత్రం తీయబడింది.[3]

ఒక చిన్నమాట
ఒక చిన్నమాట సినిమా పోస్టర్
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
రచనదివాకర్ బాబు (మూటలు)
స్క్రీన్ ప్లేముత్యాల సుబ్బయ్య
కథభూపతి రాజా
దీనిపై ఆధారితంచరణ దాసి (1956)
ది వ్రెక్ (నవల)
నిర్మాతబి. శివరామకృష్ణ
తారాగణంజగపతి బాబు,
ఇంద్రజ
ఛాయాగ్రహణంవి. శ్రీనివాస రెడ్డి
కూర్పుకోలా భాస్కర్
సంగీతంరమణీ భరద్వాజ్
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్
విడుదల తేదీ
1997 మే 27 (1997-05-27)
సినిమా నిడివి
148 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం మార్చు

ఒక యువకుడు రైలులో ఒక అందమైన అమ్మాయిని కలుస్తాడు. తనకు కవల సోదరుడు ఉన్నాడని ఆమెకు చెప్తాడు. ఆ అమ్మాయి అతని ప్రేమలో పడుతుంది. కాని, అమ్మాయి ప్రేమను గెలవడంకోసం తన సొంత సోదరుడిగా నటించాడని అమెకి తెలుస్తుంది. తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

 • చిత్రానువాదం, దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
 • నిర్మాత: బి. శివరామకృష్ణ
 • మాటలు: దివాకర్ బాబు
 • కథ: భూపతి రాజా
 • ఆధారం: చరణ దాసి (1956), ది వ్రెక్ (నవల)
 • సంగీతం: రమణీ భరద్వాజ్
 • ఛాయాగ్రహణం: వి. శ్రీనివాస రెడ్డి
 • కూర్పు: కోలా భాస్కర్
 • నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్

పాటలు మార్చు

ఒక చిన్నమాట
పాటలు by
రమణీ భరద్వాజ్
Released1997
Recorded1997
Genreపాటలు
Length29:24
Labelసుప్రీమ్ మ్యూజిక్
Producerరమణీ భరద్వాజ్
రమణీ భరద్వాజ్ chronology
దొంగాట
(1996)
ఒక చిన్నమాట
(1997)
కాదల్ మన్నన్
(1998)

ఈ చిత్రానికి రమణీ భరద్వాజ్ సంగీతం అందించాడు. సుప్రీమ్ మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఓ మనసా తొందర (రచన: భువనచంద్ర)"భువనచంద్రఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర5:00
2."కుర్రకారు పూజించే (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర5:07
3."అబ్బో ఓయబ్బో (రచన: భువనచంద్ర)"భువనచంద్రమనో, ఎం.ఎం. శ్రీలేఖ5:06
4."మధురము కాదా (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రికె.ఎస్. చిత్ర4:07
5."ప్రతి ఒక్కరి తొలి వలపున (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర5:09
6."ఎవరిని చూస్తూ ఉన్నా (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:55
Total length:29:24

మూలాలు మార్చు

 1. https://www.imdb.com/title/tt1579844/fullcredits?ref_=tt_ov_st_sm
 2. "Archived copy". Archived from the original on 6 October 2014. Retrieved 14 August 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 3. "Heading". IQLIK MOVIES.

ఇతర లంకెలు మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఒక చిన్నమాట