కాసు బ్రహ్మానందరెడ్డి మొదటి మంత్రివర్గం

కాసు బ్రహ్మానందరెడ్డి, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడవ ముఖ్యమంత్రి. గవర్నరు భీంసేన్ సచార్ చేత ప్రమాణస్వీకారం చేయించబడిన ఈ మంత్రివర్గం, 1964, ఫిబ్రవరి 29 నుండి 1965లో సార్వత్రిక ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే దాక పదవిలో ఉంది.[1]

కాసు బ్రహ్మానందరెడ్డి మొదటి మంత్రివర్గం

మార్చు
వ.సంఖ్య శాఖ పేరు నియోజకవర్గం పార్టీ
1. ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, సేవారంగం, ప్రణాళిక మరియు భారీ పరిశ్రమలు కాసు బ్రహ్మానందరెడ్డి, ముఖ్యమంత్రి ఫిరంగిపురం కాంగ్రేసు
2. రెవిన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులు, నిర్వాసితుల ఆస్తులు, ఐతియత్, జాగీర్ల పరిపాలన, రుణ వ్యవహారాల బోర్డు, భూసంస్కరణలు, ఉపశమన మరియు పునరావాస కార్యక్రమాలు, వాణిజ్య పన్నులు నూకల రామచంద్రారెడ్డి డోర్నకల్ కాంగ్రేసు
3. విత్త శాఖ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు, స్టేషనరీ మరియు ముద్రణా శాఖ, గనుల శాఖ మర్రి చెన్నారెడ్డి తాండూరు కాంగ్రేసు
4. విద్యా శాఖ పూసపాటి విజయరామ గజపతి రాజు భీమునిపట్నం కాంగ్రేసు
5. నీటిపారుదల, విద్యుచ్ఛక్తి, ప్రజాపనులు, రహదారులు, నౌకాశ్రయాలు ఆనం చెంచుసుబ్బారెడ్డి రాపూరు కాంగ్రేసు
6. గృహ మంత్రి మీర్ అహ్మద్ అలీఖాన్ మలక్‌పేట కాంగ్రేసు
7. ఆరోగ్య శాఖ యార్లగడ్డ శివరామప్రసాద్ అవనిగడ్డ కాంగ్రేసు
8. పంచాయితీలు మరియు చిన్నమొత్తాల పొదుపు ఎం.ఎన్.లక్ష్మీనర్సయ్య ఇబ్రహీంపట్నం కాంగ్రేసు
9. సహకార శాఖ తోట రామస్వామి శాసనసభ నియోజకవర్గం (శాసనమండలి సభ్యుడు) కాంగ్రేసు
10. ఎక్సైజు, మద్యపాన నిషేధం, సాంస్కృతిక వ్యవహారాలు ఎం.ఆర్.అప్పారావు నూజివీడు కాంగ్రేసు
11. న్యాయ శాఖ, కారాగారాలు మరియు శాసన వ్యవహారాలు పి.వి.నరసింహారావు మంథని కాంగ్రేసు
12. నగరపాలన, గృహవసతి, దేవాదాయ శాఖ ఆలపాటి వెంకట్రామయ్య[2] తెనాలి కాంగ్రేసు
13. సామాజిక సంక్షేమం టి.ఎన్.సదాలక్ష్మి ఎల్లారెడ్డి కాంగ్రేసు
14. ఆహారం, వ్యవసాయం, ఉపశమనం, అటవీ శాఖ, మత్స్య శాఖ అద్దూరు బలరామిరెడ్డి కాళహస్తి కాంగ్రేసు
15. శ్రామిక శాఖ, రవాణా, సమాచార శాఖ, పర్యాటక శాఖ బి.వి.గురుమూర్తి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రేసు

మూలాలు

మార్చు
  1. India A Referance Annual 1965. p. 387. Retrieved 31 July 2024.
  2. పదవీకాలం పూర్తికాకుండానే 1965, జూన్ 18న మరణించాడు

వెలుపలి లంకెలు

మార్చు