కె.ఎం.మార్తాండ్
కె.ఎం.మార్తాండ్ తొలి తరం తెలుగు సినిమా ఎడిటర్. ఇతడు ప్రముఖ చలనచిత్ర దర్శకుడు బి.ఎ.సుబ్బారావుకు సమీప బంధువు. బి.ఎ.సుబ్బారావు నుండి ప్రేరణ పొంది ఇతడు సినిమా రంగంలోనికి ప్రవేశించాడు. నందమూరి తారకరామారావు ఇతనికి ఎడిటర్‌గా తొలి అవకాశం ఇచ్చాడు. ఇతడు సుమారు 300కు పైగా తెలుగు సినిమాలకు ఎడిటర్‌గా వ్యవహరించాడు. ఇతని కుమారుడు మార్తాండ్ కె.వెంకటేష్ కూడా సినిమా ఎడిటర్‌గా రాణించాడు.[1]
ఫిల్మోగ్రఫీ
మార్చు- చెంచులక్ష్మి - 1958
- భీష్మ - 1962
- అడుగు జాడలు - 1966
- బందిపోటు దొంగలు - 1969
- బొమ్మలు చెప్పిన కథ - 1969
- సిపాయి చిన్నయ్య - 1969
- ముహూర్త బలం - 1969
- బంగారుతల్లి - 1971
- ఎర్రకోట వీరుడు - 1973
- కోడెనాగు - 1974
- దొరబాబు - 1974
- రామ్ రహీం -1975
- రామయ తండ్రి - 1975
- దొరలు దొంగలు - 1976
- మొరటోడు - 1977
- ఎంకి నాయుడు బావ - 1978
- చిలిపి కృష్ణుడు - 1978
- నాయుడుబావ - 1978
- సింహబలుడు - 1978
- అత్తగారి పెత్తనం - 1981
- అగ్గిరాజు - 1985
- తలంబ్రాలు - 1986
- దొరబాబు - 1995
- బొంబాయి ప్రియుడు - 1996
- సాహసవీరుడు - సాగరకన్య - 1996