కోట (రాజస్థాన్)

రాజస్థాన్‌ రాష్ట్రం లోని ఒక నగరం

కోటా, ఉత్తర భారత రాష్ట్రమైన రాజస్థాన్‌కు ఆగ్నేయంలో ఉన్న ఒక నగరం.ఇది రాష్ట్ర రాజధాని జైపూర్‌కు దక్షిణాన 240 కిలోమీటర్ల (149 మైళ్ళు) దూరంలో చంబల్ నది ఒడ్డున ఉంది.2011 భారత జనాభా లెక్కలు ప్రకారం దీని జనాభా 1.2 మిలియన్లకు పైగా ఉంది.ఇది జైపూర్, జోధ్‌పూర్ తరువాత రాజస్థాన్ రాష్ట్రంలో మూడవ అత్యధిక జనాభా కలిగిన నగరంగా, భారతదేశం స్థాయిలో 46 వ అత్యధిక జనాభా కలిగిన నగరగా, 53 వ అత్యధిక జనాభా కలిగిన పట్టణ సముదాయంగా ఉంది.ఇది కోటా జిల్లాకు, కోట విభాగానికి ప్రధాన పరిపాలనా కార్యాలయం కోట నగరం, దేశంలోని అన్ని రకాల పోటీ పరీక్షల సన్నాహాలకు ప్రధాన కోచింగ్ కేంద్రం.నగరంలో అనేక ఇంజనీరింగ్, వైద్య కోచింగ్ సంస్థలు ఉన్నాయి.

కోట
కోట is located in Rajasthan
కోట
కోట
కోట is located in India
కోట
కోట
Coordinates: 25°0′0″N 76°10′0″E / 25.00000°N 76.16667°E / 25.00000; 76.16667
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాకోట
విభాగంకోట (హడోటి రీజియన్)
Named forకోటియా భిల్
Government
 • Typeమునిసిపల్ కౌన్సిల్
 • Bodyకోట నగరపాలక సంస్థ
 • మేయర్
  • రాజీవ్ అగర్వాల్ (సౌత్ కోట) ,
  • మంజు మెహ్రా (నార్త్ కోట) , (కాంగ్రెస్)
 • పార్లమెంటు సభ్యుడు , కోట-బుందిఓం బిర్లా , బిజెపి
 • శాసనసభ్యుడు , సౌత్ కోటసందీప్ శర్మ , బిజెపి
 • శాసనసభ్యుడు , నార్త్ కోటశాంతి కుమార్ ధారివాల్ , (కాంగ్రెస్)
Area
 • Total570.36 km2 (220.22 sq mi)
Elevation
271 మీ (889 అ.)
Population
 (2011)[2][3]
 • Total10,01,694
 • Rank46 వ ర్యాంకు
 • Density1,800/km2 (4,500/sq mi)
భాషలు
 • అధికారికహిందీ, ఆంగ్లం
 • స్థానిక భాషరాజస్థానీ, హరౌటీ
Time zoneUTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
324001 టు 324011 , 324022
ప్రాంతీయ ఫోన్‌కోడ్0744
ISO 3166 codeఐఎస్ఒ 3166-2:ఐఎన్
Vehicle registrationRJ-20
లింగ నిష్పత్తిపురుషులు 1000:895 స్త్రీలు

చరిత్ర మార్చు

కోట నగరం ఒకప్పుడు పూర్వపు రాజ్‌పుత్ రాజ్యమైన బుందిలో ఒక భాగంగా ఉండేది. ఇది 17 వ శతాబ్దంలో ప్రత్యేక రాచరిక రాజ్యంగా మారింది. పట్టణ కీర్తిని ప్రతిబింబించే అనేక స్మారక చిహ్నాలు కాకుండా, కోట ప్యాలెస్ ఉద్యానవనాలుతో నిండిఉంది.[4][5]

సా.శ. 12 వ శతాబ్దానికి చెందిన, హడా వంశానికి చెందిన చౌహాన్ రాజ్‌పుత్ అధిపతి రావు దేవా ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకుని బుంది, హడోటిలను స్థాపించాడు. తరువాత, 17 వ శతాబ్దం ప్రారంభంలో, మొఘల్ చక్రవర్తి జహంగీర్ పాలనలో, బుంది పాలకుడు - రావు రతన్ సింగ్, కోట చిన్న రాజ్యాన్ని తన కుమారుడు మాధో సింగ్కు ఇచ్చాడు. అప్పటి నుండి కోట రాజ్‌పుత్ ధైర్యం, సంస్కృతి ముఖ్య లక్షణంగా మారింది.[6]

1631 లో మొఘల్ చక్రవర్తి జహంగీర్ చేత బుంది రావు రతన్ రెండవ కుమారుడు రావు మాధో సింగ్ ను పాలకుడిగా నియమించినప్పుడు కోట స్వతంత్ర రాష్ట్రంగా పరిగణించబడింది.[7]

జనాభా మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం కోటా నగరం జనాభా మొత్తం 1,001,694 కాగా, అందులో పురుషులు 528,601 మంది కాగా, స్త్రీలు 473,093 మంది ఉన్నారు[3][8] కోట నగరం పట్టణ సముదాయం పరిధిలో ఉంది.[8][9] నగర జనాభా మొత్తంలో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 895 మంది స్త్రీలను కలిగి ఉంది.నగర జనాభాలో ఆరు సంవత్సరాల లోపు పిల్లల జనాభా మొత్తంలో 12.14% మంది ఉన్నారు.నగర జనాభా అక్షరాస్యత రేటు 82.80%గా ఉంది. పురుషులు అక్షరాస్యత రేటు 89.49%గా, స్త్రీల అక్షరాస్యత రేటు 75.33%గా ఉంది.[8]

హడోటి, రాజస్థానీ మాండలికం కోటాలో హిందీ, మార్వారీ, ఆంగ్లం భాషలతోపాటు ఇతర భాషలతో విస్తృతంగా మాట్లాడతారు.[10]

కోట రాష్ట్రంలో (జైపూర్ తరువాత) 50 నగరాల్లో రెండవ అత్యంత నివాసయోగ్యమైన నగరంగా, దేశంలో నలభైఒకటవ స్థానంలో నిలిచింది.[11] 2015 లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్మార్ట్ సిటీస్ మిషన్ కోసం ఈ నగరం 98 భారతీయ నగరాలలో చేర్చబడింది. మొదటి రౌండ్ ఫలితాలు విడుదలైన తరువాత 67 వ స్థానంలో నిలిచింది.

మతాలు వారిగా జనాభా మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో 80.5% మంది నగరంలో హిందూవులు ఎక్కువుగా ఉన్నారు. ముస్లింలు పెద్ద మైనారిటీలగా 15.9% మంది, జైనులు 2.2% మంది, సిక్కులు 0.9% మంది, క్రైస్తవులు 0.4% మంది ఉన్నారు.[12]

రవాణా సౌకర్యాలు మార్చు

త్రోవ ద్వారా మార్చు

కోట నగరం రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలకు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి.[13] జాతీయ రహదారి నెం 12 (జైపూర్ - జబల్పూర్), జాతీయ రహదారి నెం. 76 కోట నగరం గుండా వెళుతాయి.జాతీయ రహదారి 76 తూర్పు-పడమర కారిడార్‌లో ఒక భాగం.[14]

రైల్వే ద్వారా మార్చు

 
కోట రైల్వే స్టేషన్ ప్రవేశం ఫోటో

కోటా రైలుతో భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. పశ్చిమ మధ్య రైల్వేలోని విభాగాలలో కోటా జంక్షన్ ఒకటి.న్యూ ఢిల్లీ-ముంబై ప్రధాన మార్గంలో ఇది ఒక స్టేషన్.[15] కోట లోపల, దాని సమీపంలో నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. దక్షిణ కోట నగరంలోని మరో సబర్బన్ స్టేషన్ దకానియా తలవ్ రైల్వే స్టేషన్. ఇక్కడ అవధ్ ఎక్స్‌ప్రెస్, డెహ్రాడూన్, రణతంబోర్ ఎక్స్‌ప్రెస్‌లు ఇక్కడ ఆగుతాయి.

ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్, ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్, ముంబై న్యూ ఢిల్లీ దురోంటో ఎక్స్‌ప్రెస్, ఇండోర్-జైపూర్ ఎక్స్‌ప్రెస్, ఉదయపూర్ సూపర్‌ఫాస్ట్ (ఢిల్లీ - ఉదయపూర్ సిటీ ఎక్స్‌ప్రెస్), దయోదయ ఎక్స్‌ప్రెస్ (జైపూర్ - జబల్పూర్ ఎక్స్‌ప్రెస్ / అజ్మీర్) సహా 150 కి పైగా రైళ్లకు ఈ నగరంలో ఆగుతాయి[16] జోధ్పూర్ - భోపాల్ ఎక్స్‌ప్రెస్.ఢిల్లీ - ముంబై రైల్వే మార్గం కోటా జంక్షన్ గుండా వెళుతుంది.

వాయు మార్గం మార్చు

కోటా విమానాశ్రయానికి 1999 నుండి షెడ్యూల్ సేవలు లేవు.[17] కోటా నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి సమీప అంతర్జాతీయ విమానాశ్రయం.

మూలాలు మార్చు

  1. "Kota District Census 2011 Handbook: VILLAGE AND TOWN WISE PRIMARY CENSUS ABSTRACT (PCA)" (PDF). Census of India. p. 29 (pdf) Urban Section. Archived (PDF) from the original on 27 April 2018. Retrieved 19 April 2016.
  2. "2011 census: Kota Municipal Corporation Demographics". Censusofindia.gov.in. Retrieved 2016-04-07.
  3. 3.0 3.1 "Kota (Kota, Rajasthan, India) – Population Statistics and Location in Maps and Charts – City Population". Citypopulation. de. Archived from the original on 20 August 2016. Retrieved 20 July 2016.
  4. "Tours to Kota". Indian Horizons. Archived from the original on 17 August 2016. Retrieved 2016-06-05.
  5. "Lakes and Gardens in Kota". Indian Horizons. Archived from the original on 17 August 2016. Retrieved 2016-06-05.
  6. "Kota India - Kota Rajasthan - Kota Travel - Kota City - Kota Tourism". web.archive.org. 2016-09-08. Archived from the original on 2016-09-08. Retrieved 2021-02-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "History of Kota". web.archive.org. 2016-08-08. Archived from the original on 2016-08-08. Retrieved 2021-02-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. 8.0 8.1 8.2 Kota City Census report Archived 9 ఫిబ్రవరి 2013 at the Wayback Machine census 2011
  9. Kota District Demographics, Census 2011 Archived 10 జూలై 2015 at the Wayback Machine census India 2011
  10. "Languages of Rajasthan". Rajasthan Tourism. Archived from the original on 9 June 2016. Retrieved 24 May 2016.
  11. "Liveability Index: The Best Cities in India" (PDF). Competitiveness.in. p. 22. Archived from the original (PDF) on 25 March 2016. Retrieved 2 July 2016.
  12. "Kota City Population Census 2011 - Rajasthan". web.archive.org. 2015-12-22. Archived from the original on 2015-12-22. Retrieved 2021-02-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  13. "Titan Aviation Air Charter Service". Titan Aviation India. Archived from the original on 13 May 2016. Retrieved 24 May 2016.
  14. "National highways and their length" (PDF). National Highway Authority of India. p. 2(NH12), 7(NH76). Archived from the original (PDF) on 20 January 2013. Retrieved 2016-05-08.
  15. "West Central Railway". Maps of India. Archived from the original on 20 May 2016. Retrieved 2016-06-05.
  16. "Arrivals at Kota Junction". RunningStatus.IN. Archived from the original on 31 August 2018. Retrieved 2018-08-31.
  17. "Airports fail to lure airlines". The Times of India. 9 October 2011. Archived from the original on 9 October 2011. Retrieved 4 February 2012.

వెలుపలి లంకెలు మార్చు