వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


మూలాలు

వ్యాసానికి మూలాలు తెలియజేయండి.Rajasekhar1961 08:21, 12 సెప్టెంబర్ 2008 (UTC)

రావిపూడి వెంకటాద్రి ,పెన్మెత్స సుబ్బరాజు రాసిన ఆంధ్ర ప్రదేశ్ లో హేతువాద మానవవాద ఉద్యమాల చరిత్ర తెలుగు అకాడమీ 2003 ప్రచురణ చూడండి.మూలాలు ఎలా జతపరచాలో తెలుపండి---Nrahamthulla 10:40, 12 సెప్టెంబర్ 2008 (UTC)
ప్రస్తుతానికి మీరు "మూలాలు" సెక్షనులో ఆ పుస్తకం పేర్కొన్నారు గనుక సరిపోతుంది. అయితే వ్యాసానికి ఉపోద్ఘాతం చాలా తక్కువగా ఉన్నందున మీరు "హేతువాదుల జాబితా"ను ఆ పుస్తకం ఆధారంగా తయారు చేశారని తెలియడం లేదు. "క్రింది జాబితాను ఫలాని పుస్తకంలో పేర్కొన్న పేర్లనుండి సేకరించబడింది" అని వ్రాయవచ్చును. ఎందుకంటే మరొక పుస్తకం లేదా వేదిక లేదా పత్రికా వ్యాసం ఆధారంగా ముందుముందు మరికొన్ని పేర్లు ఈ జాబితాకు చేరవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:11, 12 సెప్టెంబర్ 2008 (UTC)


"హేతువాది"కి ఆంగ్ల పదం "Rationalist" సరైనదేనా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:13, 12 సెప్టెంబర్ 2008 (UTC)


రహమతుల్లాగారూ! మీరు ఇచ్చిన "తెలుగు హేతువాదులు" జాబితా కాలమ్‌లుగా అమర్చాను. ఇది చదవడానికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాను. అలా చూస్తున్నపుడు నాకు అనిపించింది - ఆ జాబితాలో పేర్లను ఎలా ఎన్నుకొన్నారు? సంప్రదాయ సమాజంపై ఎదురు తిరిగినవారంతా హేతువాదులేనా? ఎందుకంటే లిస్టులో అధికంగా వామపక్ష భావాలు లేదా నాస్తిక భావాలు ఉన్న వారి పేర్లను చేర్చినట్లనిపించింది. దయ చేసి వివరించగలరా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:32, 12 సెప్టెంబర్ 2008 (UTC)

 • కాసుబాబు గారూ మంచిపని చేశారు.ఈ రోజు సాక్షి పేపర్లో వార్త: నరసరావుపేట ఆర్డీవో జడ్జి తమ బంగ్లాలలో సెంటిమెంటు కారణంగా నివసించటంలేదని అక్కడ గతంలో ఎవరో ఆకతాయులు నిమ్మకాయలు పసుపు కుంకుమ]] ముగ్గులు వేశారని ఆ భయంతోనే లక్షలాది రూపాయల ఖర్చుతో కట్టిన ఆ భవనాలను పాడుపెట్టారని వార్త.ఇలాంటి సమయాల్లో అది నిష్కారణ భయమని ఋజువు చేసేదే హేతువాదం. "హేతువాది"కి ఆంగ్ల పదం "Rationalist" సరైనదే.బాణామతి చేతబడి వట్టిదేనని హేతువాదులు అధికారులు బాగానే ప్రచారం చేస్తున్నారు.కాకపోతే హేతువాదులు కమ్యూనిస్టులు ఖచ్చితంగా నాస్తికులై ఉంటారని ఉండాలని కొందరు వాదిస్తారు.నాకు తెలిసిన వరకు ఆస్తిక హేతువాదులు దేవుడిని ఒప్పుకుంటారు.మతం పేరుతో జరిగే అహేతుక విషయాలను మూఢాచారాలను ప్రశ్నిస్తూ ఉంటారు.మూఢాచారాలను సంస్కరించాలని చూస్తారు.నాస్తిక హేతువాదులు దేవుడిని పూర్తిగా ఒప్పుకోరు.ప్రతి దానికీ కారణం ఉంటుందని నమ్ముతారు.ఎందుకంటే నేను ఆస్తిక హేతువాది ని . మీరు చెప్పినట్లు వామపక్ష భావాలు లేదా నాస్తిక భావాలు గలవాళ్ళే హేతువాదుల్లో ఎక్కువగా చోటుచేసుకున్నారు.చివరిదశలో ఆధ్యాత్మిక బాట పట్టిన హేతువాదులు కొంతమంది ఉన్నారు.అలాగే నాస్తికులు గా మారిన భక్తులు కూడా ఉన్నారు.ఎవరి కారణాలు వారివి.ముందుముందు ఇంకా కొన్ని పేర్లు ఈ జాబితాకు చేరవచ్చు.అందువలన ఈ జాబితాలో 1. ఆస్తిక హేతువాదులు 2.నాస్తిక హేతువాదులు ఇద్దరూ ఉంటారు . వీళ్ళంతా మన తెలుగు జాతి ముత్యాలే. మన తెలుగు వాళ్ళ ప్రతిభను మనం గుర్తిద్దాం.--Nrahamthulla 02:53, 13 సెప్టెంబర్ 2008 (UTC
 • కమ్యునిస్ట్లు లు ప్రాదమికంగా నాస్థికులు గా వుండాలని కారల్ మార్క్స్ అన్నాడు. కాని నే టి మన సో కాల్డ్ కమ్యునిస్ట్లు లు నాస్థికత్వం ను పట్టిం ఛుకోకుండా ఆ స్తికుల మాదిరిగానే వారి జీవిత ములను వెళ్ళ దీ స్తున్న వైనం

మనం గమనించవచ్చు.--Nalinimohankumarkalva 07:05, 17 సెప్టెంబర్ 2008 (UTC)

హేతువాదులు

సింగినాదం కాకపోతే ఆస్తిక హేతువాదులు ఏమిటి? అసలు దేవుని ఉనికిని నమ్మడమే హేతువాదానికి విరుద్ధం. ఆస్తిక హేతువాదులు అంటూ హేతువాదానికి అర్థం మార్చే సింగినాదం ఏమిటి? ఇది వ్యక్తిగత అభిప్రాయాల ప్రచార వ్యాసం అనడానికి ఇంత కంటే ఎవిడెన్స్ కావాలా?


 • హేతువాదుల గురించి మీరు చేస్తున్న కృషి చాలా బాగుంది. హేతువాదులందరి గురించి తెలియజేయడం చాలా కష్టమైన పనిగా కనిపిస్తుంది. ఈ వ్యాసాలను వర్గీకరణ చేయలేదు. హేతువాదులు వర్గం క్రింద ఉంచితే సరిపోతుంది. మరికొందరు హేతువాదుల్ని ఈ పనిలో నిమగ్నుల్ని చేయండి. మీ పని సులభమౌతుంది. అలాగే హేతు వాద సంస్థలు జన విజ్ఞాన వేదిక వంటి ప్రముఖ సంస్థలు, ఉన్నత ప్రమాణాలున్న పత్రికలు గురించి కూడా తెలియజేస్తే బాగుంటుందని అనిపిస్తుంది.Rajasekhar1961 13:48, 10 డిసెంబర్ 2008 (UTC)

నేను కూడా గతంలో డా.జయగోపాల్ మరియు పెన్మెత్స సుబ్బరాజు గార్లతో కలిసి తిరిగేవాడ్ని. జయగోపాల్ గారిని అభిమానించే వాడు ఇస్లాం మతాన్ని నమ్ముతాడంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. పాకిస్తాన్ లో సున్నీ-షియాల మధ్య జరిగే హింస గురించి, ఉగాండాలో ఈదీ అమీన్ చేసిన నరమాంస భక్షణ గురించి జయగోపాల్ గారు పార్వతీపురం మీటింగ్ లో భయం పుట్టించే లెక్చర్ ఇచ్చారు. ఇతను క్రైస్తవులు ఉండే వీధిలోనే మీటింగ్ పెట్టించి క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా లెక్చర్లు ఇచ్చారు. చర్చి పాస్టర్ ఇతని పై దాడికి గూండాల్ని పంపించినా ఇతను భయపడలేదు. జార్జ్ బుష్ యహోవాతో మాట్లాడటం గురించి కూడా ఎగతాలి చేస్తూ మాట్లాడారు. ఇస్లాం శాంతి మతం అని చెప్పే రహంతుల్లా గారు డా.జయగోపాల్ గారి మీద ఆర్టికల్ మొదలుపెట్టడం నాకు ఆశ్చర్యం కలిగించింది.

 • 121.245.24.100 మీరూ ఒకరేనా?మీ పేరు వెల్లడించరెందుకని? ఒక మతంలో బాగా పాతుకుపోయిన విశ్వాసాలకు భిన్నమైన విశ్వాసాలను అపవిశ్వాసాలు అంటారు.అవి మంచివికూడా కావచ్చు.పుట్టుక, ప్రాంతం ఆధారంగా నమ్మకాలు, ఆచారాలని పాటించే సంకుచిత భావాల నుంచి మీరు ఎలా బయట పడ్డారో చెప్పి హేతువాదం బలపడేలా చేయండి.వ్యక్తిగత విమర్శలు వద్దు.

అసలు నాకునేనే ఒక ఆశ్చర్యాన్ని.నాకు కూడా కొన్ని అపవిశ్వాసాలు ఉన్నాయి.బక్రీదులో బలులివ్వటం మాని రంజాన్ లో ఉపవాసాలే చేయమంటాను.ఇస్లామ్ అంటే శాంతి కాబట్టి ఆ మతాన్ని అవలంబించే ముస్లిములు ఇడీఅమీన్ ,బిన్ లాడెన్ లాగా కాకుండా శాంతికాముకులై ఉండాలని కోరుకుంటాను.తెలుగులో నమాజు చెయ్యనివ్వాలని అంటాను.నాస్తికుణ్ణి కాదుకానీ ఎందుకో హేతువాదుల్ని అభిమానిస్తాను.నా అంతిమ లక్ష్యం మానవతావాదమే కాబట్టి నా జీవితప్రయాణం మంచివైపేసాగాలని కోరుకుంటాను.--Nrahamthulla 06:17, 13 డిసెంబర్ 2008 (UTC)

 • రహంతుల్లా గారు, మీ జీవితగమ్యాన్ని తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి గొప్పవారు ప్రతీ మతంలోనూ ఉన్నారు. మీలాంటి నిజమైన హేతువాదుల్ని అందరం గుర్తించాలి. అభినందనలు.Rajasekhar1961 07:41, 13 డిసెంబర్ 2008 (UTC)

పట్టణాలలో ఉండే ముస్లింలలో ఎక్కువ మంది అరబ్ జాతీయులు. గ్రామాలలోని ముస్లింలలో ఎక్కువ మంది మతం మార్చుకున్న స్థానికులు. మదీనాలోని యూదులేమయ్యరో అలీ సీనా గారు వ్రాశారు. అరబ్బీయులు సెమిటిక్ జాతీయులే, యూదులు కూడా సెమిటిక్ జాతీయులే. అరబ్బీయులకి, యూదులకి మధ్య పడనప్పుడు మన రాష్ట్రంలోని పట్టణాలలో ఉండే అరబ్ ముస్లింలు సెమిటిక్ భాషలతో ఎంతో తేడా ఉన్న ద్రవిడ భాష అయిన తెలుగులో నమాజ్ చెయ్యడానికి ఎలా అనుమతిస్తారు?

 • మతానికి హేతువాదానికి మధ్య ఏమాత్రం పొంతన కుదరదు. నేను హిందూ కుటుంబంలో పుట్టాను. పల్లె ప్రాంతాలలో కొంత మంది హిందువులు భర్త చనిపోయిన స్త్రీలకి గుండు గియ్యించి తెల్ల చీర కడతారు. ముస్లింలు స్త్రీల చేత బురఖాలు వెయ్యించడం కూడా అలాంటిదే. ముహమ్మదే తన భార్యల చేత బురఖాలు వెయ్యించినప్పుడు ఇక సాధారణ ముస్లిం భక్తుడు బురఖాల విషయంలో సంస్కరణలు తెస్తాను అని అంటే అతను ముహమ్మద్ గురించి, ఇస్లాం గురించి తెలియని వాడనుకోవాలి. ఉత్తర అమెరికాలో క్రైస్తవులు స్త్రీల హక్కుల్ని ఎలా అణచి వేశారో డా.జయగోపాల్ గారు చెప్పినప్పుడు నేను క్రైస్తవ మతం పైన కూడా ద్వేషం పెంచుకున్నాను. బైబిల్ లో స్త్రీల గురించి ఎంత నీచంగా వ్రాసుందో కూడా చదివాను. ప్రపంచంలో అన్ని మతాలు భూస్వామ్య మూలాల నుంచి పుట్టిన మతాలే. మీరు పుట్టింది పెట్టుబడిదారి సమాజంలో. మీరు నమ్మేది మాత్రం బురఖా, తెల్ల చీర లాంటి భూస్వామ్య సంప్రదాయాల్ని ప్రోత్సహించే మతాల్ని. హిందూ, ఇస్లాం, క్రస్తవ మతాలు పుట్టిన రోజుల్లో పెట్టుబడిదారి వ్యవస్థ గానీ సోషలిస్టు రాజ్యాలు గానీ లేవు. కేవలం భూస్వామ్య రాజ్యాలు మాత్రమే ఉండేవి. భూస్వామ్య సంస్కృతి అనేది పెట్టుబడిదారి సంస్కృతిలో ఇమడడం కష్టం. సోషలిజంలో ఆ సంస్కృతి అస్సలు ఇమడదు. నేను పెట్టుబడిదారి సంస్కృతి గురించి చదివిన తరువాత భూస్వామ్య సంస్కృతిని పూర్తిగా వదిలిపెట్టాను. మార్క్సిజం చదివిన తరువాత ఆ రెండు సంస్కృతులనీ తిరస్కరించాను. ఒకే వోరలో దూరని రెండు మూడు కత్తులని పట్టుకున్నట్టు నేను ఇంకా ఆ సంస్కృతులని పట్టుకోవడం లేదు. తొక్కిపెట్టబడిన బైబిల్ గ్రంథములు, ఖురాన్ పుట్టుక మరియు పరిణామం వంటి సబ్జెక్ట్స్ ని పరిశీలిస్తే గతంలో కథలని సేకరించి మత గ్రంథాలని కూర్చేవారని, ఆ కథలలో మార్పులు చేర్పులు కూడా జరిగాయని తెలుస్తుంది. కేవలం మానవ కల్పితమైన మతాలు ప్రభోదించే నియమాలు శాస్వతమని అనుకోకూడదు.
 • కుమారశర్మ గారూ నా జీవితగమ్యం తెలిసి రాజశేఖర్ గారు సంతోషిస్తుంటే మీరు నా అజ్ఞానాన్ని ప్రశ్నిస్తున్నారు.నిజమే నాకు ఇస్లాం గురించి పెద్దగా తెలియదు.బురఖాల విషయంలో సంస్కరణలు తెస్తాను అని నేను చెప్పలేదు.ముస్లిం స్త్రీలు బురఖాలు వెయ్యటం కూడా హిందూ విధవరాళ్ళ గుండు,తెల్లచీరతో సమానమని మీ అంతట మీరే వ్యాఖ్యానించారు.ఎవరి నమ్మకం వారిది.నేను ఏమతంలోనూ పూర్తిగా ఇమడలేని స్వతంత్రుడిని.మీలాంటి విజ్ఞులనుండి ఇంకా మంచి విషయాలు తెలిస్తే అభిప్రాయాలూ ఎప్పటికప్పుడు మార్చుకునే స్వేచ్చావాదిని.ఈ చర్చ మతము,హేతువాదం,మార్క్సిజం లాంటివ్యాసాలలో జరిగితే బాగుంటుంది.--Nrahamthulla 10:03, 13 డిసెంబర్ 2008 (UTC)

నేను కూడా జయగోపాల్ గారు పెట్టిన మీటింగులకి వెళ్ళాను. బ్రాహ్మణులు మరియు ముస్లింలు పై జయగోపాల్ గారి విమర్శలు చాలా బాగుంటాయి. అతని విమర్శలకి మతోన్మాదులు నోరువిప్పి సమాధానం చెప్పలేరు.

కన్ఫ్యూజన్

ఈ వ్యాసం, అనేక దారి మళ్ళింపు పేజీగా వున్నది. ఇదో పెద్ద అయోమయ విషయం. మన హేతువాదులు, ఈ వ్యాసం తయారీలో తగిన హేతువులు లేకుండానే ఈ పేజీ తయారు చేశారు. ఇందులో ఆస్తిక హేతువాదులు, నాస్తిక హేతువాదులు అనే రెండు విభాగాలు చూపించారు. తెలుగు హేతువాదుల జాబితా ఇచ్చారు, కానీ వీరు ఆస్తిక హేతువాదులా లేక నాస్తిక హేతువాదులా? పేర్కొనలేదు, (బహుశా ఈ విభజన మన హేతువాదుల చేతకాదేమో! నిజంగానే ఇదో పెద్ద విషయం, కానీ ఎవరూ దృష్టి సారించలేదు, కారణం క్లిష్టమైన విషయం కావచ్చు). ఈ వ్యాసంలో ఇలాంటి హేతువులు (Ration) కొరవడింది. ఉత్సాహవంతులు సరిదిద్దగలరు. నిసార్ అహ్మద్ 07:01, 14 డిసెంబర్ 2008 (UTC)

హేతుజ్ఞానం అంటే ఏమిటో మూఢ భక్తులకి కూడా తెలుసు. ప్రభాకర్ సాంజ్గిరి అనే మార్క్సిస్ట్ రచయిత వ్రాసిన "మనిషి కథ" అనే పుస్తకం చదివాను. బాగా చదువుకున్న డాక్టర్లు, సైంటిస్టులు కూడా తమ శాస్త్ర జ్ఞానానికి విరుద్ధంగా దేవున్ని, ఆత్మల్ని నమ్ముతారు. కానీ దేవుని దగ్గరకి (స్వర్గానికి) వెళ్ళడానికి నిప్పులోనో గంగలోనో దూకు చావమంటే ఆ సాహసం ఎవరూ చెయ్యరు. ఎందుకంటే అలాంటివి నిజంగా ఉండటం అసంభవం అనే డౌట్ వాళ్ళకి కూడా వస్తుంది. దీన్ని కనిష్ట హేతుజ్ఞానం అంటారు. ఈ మాత్రం కనిష్ట హేతుజ్ఞానం లేనంత మూర్ఖులు ఎవరూ ఉండరు. ఈ నమ్మకాల్ని పూర్తిగా వదులుకోవడాన్ని విస్తృత హేతుజ్ఞానం అంటారు.

వ్యాసం పునర్వ్యవస్థీకరణ

అనేక వ్యాసాలకు ఈ వ్యాసం పుట్టినిల్లుగా ఉన్నది. వాటిలో చాలా వరకు self redirect వ్యాసాలు (ఉదా - ఆస్తిక హేతివాదులు, నాస్తిక హేతువాదులు). అయితే వివిధ వ్యాసాలలో ఉన్న సమాచారాన్ని పరిశీలించిన తరువాత వ్యాసాలను ఇలా పునర్వ్యవస్థీకరిస్తే బాగుంటుందనుకొంటున్నాను.

 • హేతువాదం - ఇది en:Rationalism అనే ఆంగ్ల వ్యాసానికి సమాంతరంగా ఉంటుంది. అయితే భారతదేశంలోను, ఆంధ్రప్రదేశ్‌లోను హేతువాదానికి సంబంధీంచిన విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. ఆస్తిక హేతువాదులు, నాస్తిక హేతువాదులు అనేవి వేరే వ్యాసాల పేర్లుగా ఉండనక్కరలేదు (ఇప్పటికి ఉన్న సమాచారాన్ని బట్టి). అవి ఈ వ్యాసంలోనే విభాగాలుగా ఉండవచ్చును.
 • హేతువాది - అనగా Rationalist - "హేతువాదం" అనే సబ్జెక్టులో ఉండే విషయం కాకుండా "హేతువాది" గా ఉండే వ్యక్తుల గురించి generalized elaboration - హేతువాది ప్రత్యేకతలు ఏమిటి? ఆ మార్గాన్ని వారెందుకు ఎంచుకొంటారు? వారు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి? - వంటి విషయాలు వ్రాస్తే గనుక అది వేరే వ్యాసంగా చెల్లుతుంది. కాని పక్షంలో అది హేతువాదం వ్యాసానికి దారి మళ్ళింపు పేజీగా సరిపోతుంది. (పనిలో పనిగా "హేతువాది" అనే పత్రిక గురించి కూడా ఇందులోనే వ్రాయొచ్చును.)
 • హేతువాదుల జాబితా - ఇందులో "ప్రపంచంలో", "భారత దేశంలో", "ఆంధ్ర ప్రదేశ్‌లో" అనే మూడు విభాగాలు ఉంచవచ్చును. ఆంధ్ర ప్రదేశ్ విభాగంలో ఇప్పుడున్న పేర్లు వ్రాయొచ్చును.
 • ఒక్కో వ్యక్తి గురించిన వ్యాసాలు - ఒక పేరా (ఆరు లైన్లు) సమాచారం దాటినట్లయితే వారి గురించి ప్రత్యేకమైన వ్యాసాలు ఉంచవచ్చును. అంతకు తక్కువ సమాచారం ఉంటే గనుక ఆ సమాచారాన్ని హేతువాదుల జాబితాలో కలిపేయవచ్చును. ఇలాగయితే ఉన్న సమాచారాన్ని కోల్పోయే అవకాశం లేదు. ఒక వ్యక్తి గురించిన మరింత సమాచారం అందుబాటులో ఉన్నపుడు ఆ వ్యక్తి గురించి ప్రత్యేక వ్యాసం నిరభ్యంతరంగా మొదలుపెట్టొచ్చు.


సభ్యుల అభిప్రాయాలను కోరుతున్నాను. సభ్యులకు, ప్రత్యేకించి రహమతుల్లా గారికి గమనిక - ఉత్సాహంగా మొదలు పెట్టిన అనేక వ్యాసాలు పొడిగించడానికి ఎవరికైనా సమయం, శక్తీ కూడా పరిమితమేనని నా స్వానుభవంతో గ్రహించాను. కనుక ఒకరు సృష్టించిన మొలకలు వారే పెంచాలన్న presuure తగదు. అలాగయితే అవి గుదిబండలులా తయారై వికీపట్ల ఉత్సాహాన్ని తగ్గిస్తాయి. ఆడుతూ, పాడుతూ, సరదాగా, సాధ్యమైనంతవరకు వ్యాస రచన కొనసాగించండి.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:02, 30 డిసెంబర్ 2008 (UTC)

హేతువాదుల పట్ల వ్యాసాలు సృష్టించడం ఎవరికీ అభ్యంతరం లేదు. అదే సమయంలో క్రింది విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
 1. ఒకరిపై వ్యాసం ప్రారంభించాలంటే అతడు హేతువాది కావడం ఒక్కటే అర్హత కాకూడదు.
 2. కొత్త వ్యాసానికి ఆరేడు లైన్ల సమాచారం అర్హత కంటే సమాచారం నాణ్యత ముఖ్యం.
 3. వ్యాసం అనేది ఎప్పుడూ వాక్యంతోనే ప్రారంభం కావాలి కాని ఒక పదంతో కాదు.
 4. కేవలం ఒక పుస్తకం వ్రాసినంత మాత్రాన అతడిని ప్రముఖ వ్యక్తి అని పరిగణించలేము.
 5. హేతువాది అనేది అతడి వ్యక్తిగత విషయం. వ్యాసంలో దాన్ని వ్రాసే అవసరం లేదు. మహా అయితే వర్గంలో చేర్చవచ్చు.
 6. వ్యాసం అనేది కేవలం మన వాదాన్ని వినిపించేటట్లుగా కాకుండా పదిమందికి ప్రయోజనకరంగా ఉండాలి.
 7. వ్యాసంలో ఎలాంటి వివాదాస్పద వాక్యాలు లేకున్నా సరే, ఆ వ్యాసం ఎవరికీ ప్రయోజనం చేకూర్చనట్లయితే అది అనవసరం.
 8. వ్యాసంలోని వ్యక్తిపై మనకు ఎంత అభిమానమున్నా వికీ నియమాల ప్రకారం బహువచనం వాడరాదు.
 9. (పై పాయింట్లు ప్రస్తుతం వ్యాసాలలో ఉన్నాయా లేవా అని కాకుండా ఇలా ఉండరాదని మాత్రమే నా అభిప్రాయం. ప్రత్యేకంగా ఎవరినీ దృష్టిలో పెట్టుకొని వ్రాయలేదు. నేను మొదటి నుంచీ చిన్న వ్యాసాలపై వ్యతిరేకత వ్యక్తపరుస్తూనే ఉన్నాను) -- C.Chandra Kanth Rao(చర్చ) 14:49, 30 డిసెంబర్ 2008 (UTC)
హేతువాదులు అని ఒక వర్గం సృష్టిస్తే బాగుంటుంది. ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక అస్తిత్వం హేతువాది అని చెప్పుకోవటం నుండే వస్తే మొదటి ఫంక్తిలోనే ఈయన హేతువాది అని పరిచయం చేయటంలో తప్పులేదు. హేతువాదం వ్యక్తిగతం అవునో కాదో నేను నిర్ణయించలేను కానీ నేను హేతువాదిని బహిరంగంగా చాటించుకొని హేతువాద పుస్తకాలు, పత్రికా రచనలను చేసినవాళ్ళను హేతువాదులుగా వర్గీకరించడం సబబే (చంద్రకాంతరావు గారి 5 పాయింటుతో నేను అంగీకరించలేను). ఒక పుస్తకం వ్రాసినంత మాత్రాన హేతువాది అవుతాడో లేదో కానీ, ఆ వ్యక్తికి వికీలో వ్యాసం ఉండగల విషయ ప్రాముఖ్యత ఉన్నదనటం సందేహాస్పదం. ఇలా పెద్ద సంఖ్యలో ఒక విషయంపై మొలకలు సృష్టించడం వళ్ళ మొత్తం సముదాయపు వనరులను అటువైపు మళ్ళించే ప్రయత్నం జరుగుతుంది. (ఉదాహరణకు నాలాంటి వాళ్లు మొలకలుగా ఉన్నాయని బలవంతంగా విస్తరించే ప్రయత్నం చేయవచ్చు) కానీ మరీ మొలకల జోరు ఎక్కువైతే టెంకాయ అనే సభ్యుడు సినిమా తారల పేజీలు సృష్టిస్తున్నప్పుడు వదిలేసినట్టే ఆయన పనిని ఆయనను చేసుకోనిచ్చి ఆ తర్వాత కాలంలో ఆ మొలకలను మొత్తం తొలగించేస్తారు. అందుకే మొలకలు సృష్టించినా వారానికి రెండు లేదా మూడు సృష్టిస్తే అందరికీ అవి విస్తరించే అవకాశం రావచ్చు. అందరికీ తమకు ఇష్టమైన వ్యాసాలపై పనిచెయ్యాలనే ఆశ ఉంటుంది. దయచేసి అర్ధం చేసుకోగలరు --వైజాసత్య 15:36, 30 డిసెంబర్ 2008 (UTC)
అసలు విషయం, వ్యాసం గురించి హేతువాదులు, హేతువాదం రెండింటినీ విభజించడం చాలా కృత్తిమంగా ఉంటుందేమో అని నా ఆలోచన. హేతువాదులు వ్యాసాన్ని హేతువాదం కు దారిమార్పుగా చేసి మొత్తం వాదం, వాదులు గురించి అందులోనే వ్రాస్తే సరిపోతుంది. జాబితాను హేతువాదుల జాబితా అనే ఒక వ్యాసంలో ఉంచి, హేతువాదులు అన్న వర్గం సృష్టించాలి. ఆస్తిక, నాస్తికలకు ప్రత్యేక వ్యాసాలు ప్రస్తుతానికి అవసరం లేదు. ఆ విభాగాలు పెద్దవయితే అప్పుడు చూద్దాం. (ఆస్తిక, నాస్తిక అనే విభజన వికీపీడియాలో సృష్టించిన మన సొంత విభజన కాదని మొదట నిర్ధారించుకోవాలి) --వైజాసత్య 15:46, 30 డిసెంబర్ 2008 (UTC)
వైజాసత్య గారు చెప్పినట్లు టెంకాయ "తారల" సమస్య మనకు అనుభమైంది కాబట్టి ఇక నుంచి ఇలాంటి చిన్న వ్యాసాల సృష్టిపై మొదట్లోనే దృష్టిపెట్టాలి. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:57, 30 డిసెంబర్ 2008 (UTC)
 • వ్యాసాలను ఎలా పునర్వ్యవస్థీకరించినా నాకు అభ్యంతరం లేదు.విత్తనాలను మంగలంలో వేయించినా ,సర్ఫ్ లో బాగా శుభ్రంచేశాకే నాటినా ,కారంలో పొర్లించినా,వాటికి చుట్టూ మట్టీ మశానం లేకుండా చేసినా మొలవవు.ఒకరు సృష్టించిన మొలకలు వారే పెంచనక్కరలేదు.మొలకలకు నీళ్ళు ఎరువు ఎవరిచ్చినా తీసుకుని పిలకలు వేస్తాయి.అసలు ఇవి మొలకెత్త కూడని విత్తనాలేమో మొదటే చెబితే నాకూ పని తగ్గుతుంది.ఆగిపోతాను.--Nrahamthulla 03:14, 31 డిసెంబర్ 2008 (UTC)
రహంతుల్లా గారూ, మీరు పని ఆపవద్దు. మొలకలే వేస్తుంటే వారానికి రెండు, మూడు చొప్పున వేస్తే అవి అలా వదిలెయ్యకుండా పెంచి ఒక స్థాయికి అందరూ కలిసి తెచ్చే అవకాశముందని చెప్పటమే నా ఉద్దేశం. --వైజాసత్య 05:47, 31 డిసెంబర్ 2008 (UTC)
 • హేతువాదుల వ్యాసాలు రెహమతుల్లాగారు, గురిజాల సీతారామయ్య, వి.బ్రహ్మారెడ్డి, సి.ఎల్.ఎన్.గాంధీ లాంటి వ్యాసాలలో వారిని "హేతువాది", అని ఒక్క పదంతో చెప్పేసి ఊరుకున్నారు. SMSల మాదిరిగా వాక్యనిర్మాణాన్ని చేసే బదులుగా వివరణాత్మకంగా తెలుపండి. అలాగే వీరిని హేతువాదులు అని ఎందుకు అంటున్నారో కూడా తెలుపండి. తెలుగు వికీపీడియా ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే సంభందించినది కాదు, యావత్ప్రపంచంలో తెలుగు నేర్చుకున్నవారు ఎవరయినా ఇక్కడి విషయాలను చదువవచ్చు. అందుకని వ్యక్తులను ప్రముఖులు అని పేర్కొన్నప్పుడు వారు ఎక్కడ ప్రముఖులు? ఎందుకు ప్రముఖులు? లాంటి వివరాలను కుడా పేర్కొంటే మంచిది. మన జిల్లాలో ప్రముఖులు అయిన వారు పక్క జిల్లాల్లో ఉంటున్న వారికి అసలు తెలిసుండకపోవచ్చు!. చివరిగా హేతువాదుల మీద ఇన్నిన్ని మొలకలను సృష్టించడం, హేతువాద ఉద్యమానికి ప్రాపగండా కోసమే చేస్తునట్లుగా అనిపిస్తుంది. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 03:18, 2 జనవరి 2009 (UTC)
 • వారు ఎక్కడ ప్రముఖులు? ఎందుకు ప్రముఖులు? లాంటి వివరాలను కుడా తప్పని సరిగా తెలియజేయాలి.ఈ మొలకలు ఇకచాలు అనుకుంటున్నాను.మొలకలను సృష్టించడం, హేతువాద ఉద్యమానికి ప్రాపగాండా అనిపిస్తే ఇప్పటివరకు చేర్చిన ప్రముఖుల వివరాలతో తెలుగు హేతువాదుల వ్యాసం ముగిద్దాము.అనవసరం అనిపించిన వ్యాసాలను తొలిగించండి.ఏమీ అనుకోను.--Nrahamthulla 03:42, 2 జనవరి 2009 (UTC)
గురిజాల సీతారామయ్య వ్యాసంలో తన కుటుంబం మొత్తాన్నీ ఉద్యమాభిమానులుగా మార్చాడు.గుంటూరు జిల్లా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచాడు. అనే వాక్యాలు ఉండటం వలన నాకు ఈ వ్యాసాలన్నీ ప్రాపగాండా వ్యాసాలుగా అనిపించాయి. __మాకినేని ప్రదీపు (+/-మా) 03:53, 2 జనవరి 2009 (UTC)
Return to "హేతువాదులు" page.