చాముండి
చాముండి | |
దేవనాగరి: | चामुण्डा |
తెలుగు: | చాముండేశ్వరి |
నివాసం: | శ్మశానం |
మంత్రం: | ఓం ఐం హ్రీం క్లీం చాముణ్డాయై విచ్ఛే |
ఆయుధం: | త్రిశూలం, ఖడ్గం |
వాహనం: | గుడ్లగూబ లేదా శవం |
చాముండి, చాముండ లేదా చాముండేశ్వరి, హిందూ దేవత పార్వతీ దేవి ఉగ్ర అవతారం. ఈమె సప్తమాతృకలు లో ఒకరు. దుర్గాదేవి సైన్యంలోని 81-మంది తాంత్రిక దేవతలలో ఒక ముఖ్యమైన యోగిని. [1] చాముండ పేరు ఆమె సంహరించిన చండ, ముండ అనే ఇద్దరు రాక్షసుల కలయికతో ఏర్పడింది. ఈమెను కాళికాదేవి కి దగ్గరగా పోలుస్తారు.[2] ఈమెను కొన్నిసార్లు పార్వతి దేవిగా కొలుస్తారు. కొంతమంది జంతుబలిని ఇచ్చి, మద్యంతో సహా రావి/మర్రి చెట్టు మూలంలో పూజిస్తారు. ఈమె ప్రాథమికంగా ఆదిమవాసుల దేవతగా ప్రాచీనకాలం నుండి భక్తుల పూజలందుకుంటుంది. చాముండి మధ్య భారతదేశంలోని వింధ్య పర్వతాలలో నివసించే ముండ ప్రజల ఆరాధ్య దేవత.
సప్తమాతృకలు సవరించు
సప్తమాతృకలు లేదా ఏడుగురు తల్లులు లో ఒకరుగా మహాభారతం (వన పర్వం), దేవీ పురాణం, విష్ణుధర్మోత్తర పురాణం మొదలైన హిందూ గ్రంథాలలో ప్రస్థావించబడింది. సప్తమాతృకల శిల్పాలలో ఈమెను ఎల్లోరా, ఎలిఫెంటా గుహలలో చూడవచ్చును. ఈమెను ఏడుగురికి అధిపతిగా కుడివైపు చివరగా ఉంటుంది.[3] మాతృకలలో మిగిలిన వారిని వారివారి భర్తల శక్తి స్వరూపాలుగా కొలువగా ఒక్క చాముండిని మాత్రం ప్రత్యేకంగా కొలుస్తారు.[4] దేవీ పురాణంలో మాతృకలు రాక్షస సంహారంలో వినాయకునికి సహాయం చేసినట్లు పేర్కొంది.[5] మాండవ్య మహాముని పంచమాతృకలో ఒకరిగా చాముండిని పూజించాడు. వీరిని బ్రహ్మ హరిశ్చంద్రుడు పడుతున్న కష్టాలను చూచి వాటినుండి అతనిని రక్షించడానికి సృష్టించాడని చెబుతారు.[6]
దేవాలయాలు సవరించు
- మధ్యప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా లో పాలంపూర్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దేవి రుద్ర చాముండగా కొలువబడుతుంది.
- కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో చాముండేశ్వరి కొండ మీద చాముండేశ్వరి దేవాలయం ప్రసిద్ధిచెందింది. ఇది మైసూర్ రాజ్యం వంశీకుల కులదేవతగా పూజలందుకుంది.
- తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా లో జోగిపేట వైపు నుండి 5 కిలోమీటర్ల దూరంలోను, మెదక్ వైపు నుండి 30 కిలోమీటర్ల దూరంలోను చిటుకుల అనే గ్రామంలో ఉంది. ఇక్కడ చాముండేశ్వరి దేవిగా కొలువబడుతుంది.
గ్యాలరీ సవరించు
-
చాముండి ప్రాచీన విగ్రహం, వైఎస్ఆర్ రాష్ట్ర పురావస్తు మ్యూజియం
-
చాముండా విగ్రహం, బ్రిటిష్ మ్యూజియం. ఒరిస్సా, (సా.శ. 8వ - సా.శ. 9వ శతాబ్దం నాటిది) భారతదేశం.
-
శ్రీ చాముండా-కాంగ్రా జీ ఆలయం
-
శ్రీ చాముండా-కాంగ్రా జీ ఆలయ ప్రధన ద్వారం
-
శ్రీ చాముండా దేవీ
మూలాలు సవరించు
బయటి లింకులు సవరించు
- Organization promoting Chamunda Mantras
- Chamunda-Devi: An Eastern Teacher to the West by Dr. Chandra Alexandre
- Shri Sachchiyay Mataji (Shri Osiya Mataji) A form (avatar) of Chamunda Devi Archived 2015-04-26 at the Wayback Machine
- Chamunda Devi Temple (Chamunda Nandikeshwar Dham), Himachal Pradesh
- http://chamundi.org/