చినకళ్ళేపల్లి
చినకళ్ళేపల్లి, కృష్ణా జిల్లా, ఘంటసాల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 132., ఎస్.టి.డి.కోడ్ = 08671.
చినకళ్ళేపల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | ఘంటసాల |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీ గుత్తికొండ రామారావు గారు (రాము) |
జనాభా (2011) | |
- మొత్తం | 1,244 |
- పురుషులు | 616 |
- స్త్రీలు | 628 |
- గృహాల సంఖ్య | 394 |
పిన్ కోడ్ | 521132 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ చరిత్రసవరించు
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
ఘంటసాల మండలంసవరించు
ఘంటసాల మండలం తెలుగురావుపాలెం, కొడాలి, కొత్తపల్లె, చినకళ్ళేపల్లి, చిట్టూర్పు, ఘంటసాల, బొల్లపాడు, దేవరకోట, తాడేపల్లి, వెల్లిమల్లి, రుద్రవరం, వేములపల్లె, శ్రీకాకుళం గ్రామాలు ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు
గ్రామ భౌగోళికంసవరించు
[2] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు
సమీప గ్రామాలుసవరించు
సమీప మండలాలుసవరించు
గ్రామానికి రవాణా సౌకర్యంసవరించు
కొడాలి, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 58 కి.మీ
గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు
జిల్లాపైరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, చిట్టూర్పు, మల్లంపల్లి
గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు
అంగనవాడీ కేంద్రం:- ఈ గ్రామానికి చెందిన శ్రీ గుత్తికొండ గోపాలరావు, కోకిలాంబ దంపతులు, ఈ కేంద్రానికి మూడు సెంట్ల స్థలాన్ని వితరణగా అందించారు. [11]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు
గ్రామ పంచాయతీసవరించు
- ఈ గ్రామ పంచాయతీకి 2021 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో శ్రీ గుత్తికొండ రామారావు సర్పంచిగా గెలుపొందారు. శ్రీ సంధోలు సత్యం, ఉపసర్పంచిగా ఎన్నికైనారు. [2]
- 2014, ఆగస్టు-23వ తేదీన, ఈ గ్రామ పంచాయతీ 55వ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నది. [5]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు
శ్రీ సత్యభామా సమేత శ్రీ కృష్ణ మందిరంసవరించు
వైశాఖ బహుళ పంచమి సందర్భంగా ఇక్కడ, 2014,మే-19, సోమవారం నాడు, ప్రత్యేక పూజలు చేసారు. ఒక ఆధ్యాత్మికరంగ కార్యక్రమం నిర్వహించారు. [3]
శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సహిత శ్రీ కోదండ రామాలయంసవరించు
గ్రామంలోని ఈ చిన్న ఆలయం, శిథిలావస్థకు చేరడంతో, దాత శ్రీమతి పొదిలి సరళాదేవి మరియూ వారి కుటుంబసభ్యులు, పునర్నిర్మాణం చేసారు. ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు, శ్రీ కోదండరామ, సీత, లక్ష్మణ, ఆంజనేయస్వామి వారల రాతి విగ్రహాలను, 2014 లో ఉచితంగా అందజేసినారు. పునర్నిర్మించిన ఈ ఆలయంలో, ఏప్రిల్-2014లో విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. ఇపుడు తి.తి.దేవస్థానం వారు, కళ్యాణం, ఉత్సవాల సందర్భాలలో ఉపయోగించుటకై, శ్రీ కోదండరామ, సీత, లక్ష్మణ, ఆంజనేయస్వామి వారల పంచలోహ విగ్రహాలను 90% రాయితీతో అందజేసినారు. ఈ పంచలోహ విగ్రహాలను శ్రీరామనవమి సందర్భంగా, 2015,మార్చ్-28వ తేదీ శనివారం నాడు, సంప్రోక్షణచేసి, శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించెదరు. [8]
గ్రామంలో ప్రధాన పంటలుసవరించు
వరి,అపరాలు, మొక్కజొన్న కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు
వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు
గ్రామ ప్రముఖులుసవరించు
గొట్టిపాటి బ్రహ్మయ్యసవరించు
కళాప్రపూర్ణ,పద్మభూషణ్.
గీతామాత శ్రీమతి గుత్తికొండ కోకిలాంబసవరించు
ప్రముఖ సంఘసేవకురాలు, రెడ్ క్రాస్ మండల కార్యదర్శి.
- వీరు వైజ్ మెన్ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఎంపికైనారు. మదర్ థెరెస్సా పురస్కార గ్రహీత, రెడ్ క్రాస్ సొసైటీ మండల కార్యదర్శిగా, పలు సామాజికసేవలు అందిస్తున్నందుకు వీరిని ఈ పదవికి ఎంపికచేసారు. [4]
- వీరు, తిరుపతికి చెందిన స్నేహా ఆర్ట్స్ ఎకాడమీ సంస్థవారి రాష్ట్రస్థాయి "సేవావసంతం" పురస్కారానికి ఎంపికైనారు. సామాజిక రంగాలలో విశిష్ట సేవలందించుచున్నందుకు, ఈ సంస్థవారు, రాష్ట్రవ్యాప్తంగా 15 మంది సంఘసేవకులకు ఈ పురస్కారాన్ని అందజేయగా, జిల్లా నుండి శ్రీమతి కోకిలాంబను ఎంపిక చేసారు. శ్రీమతి కోకిలాంబను చినకళ్ళేపలి గ్రామంలో, 2014,ఆగస్టు-31న, సన్మానించి, హైదరాబాదుకు చెందిన ఆల్ ది బెస్ట్ అకాడమీ డైరెక్టరు అయిన శ్రీ వి.ఎస్.ఎస్.నారాయణ, "సేవావసంతం" పురస్కారాన్ని అందజేసినారు. [6]
- వీరు రాష్ట్రస్థాయి సేవాపురస్కారానికి ఎంపిక అయినారు. హైదరాబాదు నగరానికి చెందిన రూపిక ఆర్ట్స్ ఎకాడమీ అను సంస్థవారు, రాష్ట్రంలో సామాజికవిద్య, సాహిత్యం తదితర అంశాలలో సెవలందిస్తున్న పదిమంది ప్రముఖులను ఈ పురస్కారానికి ఎంపికచేయగా, ఆ పదిమందిలో వీరు ఒకరు. వీరికి ఈ పురస్కారాన్ని, త్వరలో హైదరాబాదులో అందజేసెదరు. [9]
- వీరు వైజ్ మన్ క్లబ్ కృష్ణా జిల్లా గ్రామీణ ఉత్తమ డైరెక్టరుగా ఎంపికైనారు. [10]
- వీరు వైజ్ మన్ క్లబ్ జిల్లా గ్రామీణ డైరెక్టరుగా, రెడ్ క్రాస్ మండల కార్యదర్శిగా పలు సామజికసేవలు అందించుచున్నందుకు, వీరిని ఇందిరాగాంధీ జాతీయ సద్భావనా పురస్కారానికి ఎంపికచేసారు. వీరిని మహిళ విభాగంలో రాష్టంనుండి ఈ పురస్కారానికి ఎంపికచేసారు. [12]
- వీరికి 2016,నవంబరు-30న, హైదరాబాదులోని రవీంద్రభారతిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నరు అయిన శ్రీ కొణిజేటి రోశయ్య గారి చేతుల మీదుగా భారత మహిళాజ్యోతి పురస్కారాన్ని అందజేసినారు. వైజ్ మెన్ క్లబ్ జిల్లా గ్రామీణ కార్యదర్శిగానూ మరియూ రెడ్ క్రాస్ మండల కార్యదర్శి గానూ వీరు చేయుచున్న పలున్ సామాజిక కార్యక్రమాలను గుర్తించిన హైదరాబాదులోని ఆల్ ది బెస్ట్ ఎకాడమీ అను సంస్థ వారు, వీరిని కృష్ణా జిల్లా నుండి ఎంపిక చేసారు. [13]
గ్రామ విశేషాలుసవరించు
ఈ గ్రామంలో శ్రీ అయినపూడి విజయకుమార్ అను ఒక ఆదర్శరైతు ఉన్నారు. వీరు వ్యవసాయంలో రసాయనిక మందులు వాడితే ధాన్యం నాణ్యత దెబ్బతింటుందని తెలుసుకున్నారు. అందువలన వీరు 6 సంవత్సరాల నుండి, తన పొలంలో, మహారాష్ట్రకు చెందిన పాలేకర్ విధానంలో, గో ఆధారిత జీవామృతంతో, నాణ్యమైన వరిపంటను పండించుచున్నారు. [7]
గణాంకాలుసవరించు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1378.[3] ఇందులో పురుషుల సంఖ్య 673, స్త్రీల సంఖ్య 705, గ్రామంలో నివాసగృహాలు 387 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 326 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 1,244 - పురుషుల సంఖ్య 616 - స్త్రీల సంఖ్య 628 - గృహాల సంఖ్య 394
మూలాలుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Ghantasala/Chinakallepalli". Archived from the original on 18 ఫిబ్రవరి 2019. Retrieved 25 June 2016. Check date values in:
|archive-date=
(help); External link in|title=
(help) - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.
వెలుపలి లింకులుసవరించు
[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగస్టు-3; 1వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మే-20; 3వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014,ఆగస్టు-20; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగస్టు-23; 1వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,సెప్టెంబరు-1; 1వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,డిసెంబరు-19; 3వపేజీ. [8] ది హిందు ఆంగ్ల దినపత్రిక; 2015,మార్చ్-28; 2వపేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జూన్-11; 1వపేజీ. [10] ఈనాడు కృష్ణా; 2015,జులై-1; 3వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-3; 44వపేజీ. [12] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-22; 44వపేజీ. [13] ఈనాడు అమరావతి; 2016,డిసెంబరు-1; 2వపేజీ.