ఏకగ్రీవ ఎన్నిక

ఏకగ్రీవ ఎన్నిక : ప్రజలు తమ నియోజకవర్గ ప్రతినిధిగా పోటీ లేకుండా ఎన్నుకునే విధానాన్నే ఏకగ్రీవ ఎన్నిక అని వ్యవహరిస్తారు. ఈ రకపు ఎన్నికలు, సంఘాలలో, సంస్థలలో, కంపెనీలలో, చివరకు సార్వత్రిక ఎన్నికలైనటువంటి, పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలైన పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీలు మొదలగువాటిలో, ఈ తరహా పోటీరహిత ఎన్నికలు కానవస్తాయి.

ఈ పద్దతి వలన లాభాలుసవరించు

  1. ఎన్నికల కోసం అభ్యర్థులు, ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏకగ్రీవ ఎన్నికల ద్వారా మిగులుతుంది.
  2. ఘర్షణలు కొట్లాటలు హత్యలు ఉండవు. సామరస్య వాతావరణం నెలకొంటుంది.
  3. ప్రచారం, సారాయి లాంటి అనుత్పాదక ఖర్చులు తగ్గటమేకాక ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతిని ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించవచ్చు.
  4. అధికారుల యొక్క సమయం ఆదా అవుతుంది.
  5. అభ్యర్థుల ప్రచారం ఉండకపోవుటచే శబ్ద కాలుష్యం బాధ తగ్గుతుంది.

మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులుసవరించు

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు