చేగుంట

తెలంగాణ, మెదక్ జిల్లా, చేగుంట మండలం లోని జనగణన పట్టణం

చేగుంట, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా, చేగుంట మండలానికి చెందిన గ్రామం.[1] ఇది జనగణన పట్టణం.

చరిత్రసవరించు

తెలంగాణ రాష్టంలోని మెదక్ జిల్లాలోని 23 మండలాలలో చేగుంట అనునది ఒక మండలం. పూర్వం ఈ జిల్లా హైదరాబాదు సంస్థానంలో భాగము. పరిపాలన సౌలభ్యం కొరకు హైదరాబాదు సంస్థానం పదహారు జిల్లాలుగా, ఆ జిల్లాలను నాలుగు విభాగాలుగా చేసారు. అవి హైదరాబాదుతో కలసి ఉన్న గుల్శానాబాద్, మెహబూబ్ నగర్, మెదక్, నల్లగొండ. నిజామాబాద్.

1956 లో రాష్ట్ర పునర్విభజనలలో హైదరాబాదు సంస్థానం మూడు ముక్కలుగా చెయ్యబడి ఆ మూడు ముక్కలలో ఒకటి కర్ణాటకా రాష్ట్రంలో, ఇంకొకటి బొంబాయి రాష్ట్రంలో కలిపారు. ఇక చివరి ముక్క అయిన తెలంగాణాను, అప్పటికే ఉన్న ఆంధ్ర్రరాష్ట్రంను కలపి ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ విడిపోకముందు ఉన్న రాష్ట్రం) అను కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసారు.ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ విడిపోకముందు ఉన్న) రాష్ట్రం యొక్క మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి.మెదక్ మొదటి ఎంపి పి. హనుమంత రావు, మొదటి ఎం.ఎల్.ఎ.గా కాంగ్రెసు పార్టీకి చెందిన వెంకటేశ్వరరావు.

సంస్కృతిసవరించు

హిందూ, క్రైస్తవం, ఇస్లాం, సిక్కు కలసిన వైవిధ్య బరిత సంస్కృతి ఇక్కడ కనబడుతుంది. అనేక ఇతర ప్రాంతాల నుండి ప్రజలు వలస రావటం వలన ఈ ప్రాంతం ఒక పారిశ్రామిక ప్రాంతంగా రూపు చెందింది. ప్రస్తుతం చేగుంటలో భారతదేశంలోని ప్రతి ప్రాంతం నుండి వచ్చిన వారు నివసిస్తున్నారు. అన్ని సంస్కృతుల, ప్రాంతాల పండగలు ఘనంగా జరుగుతాయి.

రవాణా సదుపాయంసవరించు

ఇక్కడ రైలు, బస్సు రవాణా సదుపాయం ఉంది.ఈ పట్టణం జాతీయ రాజదారి జాతీయ రహదారి 7 పై విస్తరించి ఉండటంతో ఇక్కడి ప్రజలకు మెరుగైన ప్రయాణ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు తమ వ్యవసాయ ఉత్పత్తులను సమీప పట్టణాలకు (ఉదా: హైదరాబాదు) చేర్చుటకు రైలు రవాణా మార్గము ఎంతగానో ఉపయోగపడుతుంది.

సామాజిక సంస్థలుసవరించు

చేగుంట గ్రామములోని దీప్తి విద్యాలయం పూర్వపు విద్యార్థులు సంకల్ప అనే సామాజిక సేవా సంస్థను ప్రారంబించి, చేగుంట, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించుచున్నారు.

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=చేగుంట&oldid=3201068" నుండి వెలికితీశారు