మెదక్ లోక్‌సభ నియోజకవర్గం

(మెదక్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గంలో గతంలో సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ నియోజకవర్గములు అధికంగా కలిశాయి. గతంలో మహామహులు పోటీచేసిన ఘనతను ఈ నియోజకవర్గం కలిగిఉంది. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో పాటు మల్లికార్జున్, బాగారెడ్డి వంటి ఉద్ధండులు ఇక్కడి నుంచి గెలుపొందినారు.[1]

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు మార్చు

  1. సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం
  2. మెదక్ శాసనసభ నియోజకవర్గం
  3. నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం
  4. సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం
  5. పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం
  6. దుబ్బాక శాసనసభ నియోజకవర్గం
  7. గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు మార్చు

లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ
మొదటి 1952-57 ఎన్.ఎం.జయసూర్య పీపుల్స్ డెమక్రాటిక్ ఫ్రంట్ (పి.డి.ఎఫ్)
రెండవ 1957-62 పి. హనుమంతరావు భారత జాతీయ కాంగ్రెస్
మూడవ 1962-67 పి. హనుమంతరావు భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ 1967-71 సంగం లక్ష్మీబాయి భారత జాతీయ కాంగ్రెస్
ఐదవ 1971-77 మల్లికార్జున్‌ గౌడ్‌ తెలంగాణా ప్రజా సమితి
ఆరవ 1977-80 మల్లికార్జున్‌ గౌడ్‌ భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 ఇందిరా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 పి.మాణిక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 ఎం.బాగారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991-96 ఎం.బాగారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పదకొండవ 1996-98 ఎం.బాగారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పన్నెండవ 1998-99 ఎం.బాగారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పదమూడవ 1999-04 ఆలె నరేంద్ర భారతీయ జనతా పార్టీ
పదునాల్గవ 2004-09 ఆలె నరేంద్ర తెలంగాణ రాష్ట్ర సమితి
పదిహేనవ 2009-14 విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సమితి
పదహారవ 2014 - 2019 కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి
పదహారవ 2014 - 2019 కొత్త ప్రభాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
పదిహేడవ 2019 - 2023 డిసెంబరు 13 కొత్త ప్రభాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి

2004 ఎన్నికలు మార్చు

2004 ఎన్నికల ఫలితాలను చూపే చిత్రం

  ఆలె నరేంద్ర (50.36%)
  పి. రామచంద్రా రెడ్డి (36.62%)
  సూర్య ప్రకాష్ నల్లా (5.80%)
  ఇండెపెండెంట్లు (7.22%)
భారత సాధారణ ఎన్నికలు,2004: మెదక్
Party Candidate Votes % ±%
తెలంగాణా రాష్ట్ర సమితి ఆలె నరేంద్ర 453,738 50.36 +50.36
భారతీయ జనతా పార్టీ పి. రామచంద్రా రెడ్డి 329,972 36.62 -11.58
బహుజన సమాజ్ పార్టీ సూర్య ప్రకాష్ నల్లా 52,273 5.80
ఇండిపెండెంట్ మహమ్మద్ ఉల్ఫతలీ 34,476 3.83
ఇండిపెండెంట్ కె. లక్ష్మయ్య యాదవ్ 18,457 2.05
ఇండిపెండెంట్ పి. జీవుల నాయక్ 12,099 1.34
మెజారిటీ 124,766 13.74 +61.94
మొత్తం పోలైన ఓట్లు 901,015 71.60 +0.41
తెలంగాణా రాష్ట్ర సమితి hold Swing +50.36

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున నరేంద్రనాథ్ పోటీ చేసారు.[2] భారతీయ జనతా పార్టీ నుండి పటోళ్ళ నిరూప్ రెడ్డి పోటీ చేశారు.[3].తెలంగాణా రాష్ట్ర సమితి తరపున విజయశాంతి పోటీ చేసారు.

2009 ఎన్నికల ఫలితాలు
అభ్యర్థి (పార్టీ) పొందిన ఓట్లు
విజయశాంతి(తె.రా.స)
3,88,839
సి.నరేంద్రనాథ్ (కాంగ్రెస్)
3,82,762

2014 ఎన్నికలు మార్చు

కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు తెరాస

మూలాలు మార్చు

  1. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92600&subcatid=4&categoryid=3
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 18-03-2009