పింగళి చైతన్య

తెలుగు కథ, సినిమా రచయిత్రి.
(చైతన్య పింగళి నుండి దారిమార్పు చెందింది)

పింగళి చైతన్య తెలుగు కథ, సినిమా రచయిత్రి. ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2016 లభించింది.[1] ఫిదా, నేల టికెట్టు సినిమాలకు పాటలు కూడా రాసింది.[2]

పింగళి చైతన్య
జననం
పింగళి చైతన్య
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు కథ, సినిమా రచయిత్రి.
జీవిత భాగస్వామిబాలగంగాధర తిలక్‌
పిల్లలుఖుదీరాంబోస్‌
తల్లిదండ్రులు
బంధువులుపింగళి వెంకయ్య
నోట్సు


జీవిత విశేషాలు

మార్చు

చైతన్య పుట్టింది విజయవాడ అయినా పెరిగింది కోదాడ దగ్గర నందిగామలో. ఆమె భారతదేశ జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర్యసమరయోధుడు పింగళి వెంకయ్య మునిమనవరాలు. ఆమె తండ్రి పాత్రికేయులు పింగళి దశరధరామ్. ఆయన "ఎన్‌కౌంటర్‌" పత్రిక ద్వారా తెలుగునాట సంచలనం సృష్టించిన వ్యక్తి.[3]

రచనా ప్రస్థానం

మార్చు

చైతన్య రచించిన ‘చిట్టగాంగ్‌ విప్లవ వనితలు’ అనే కథల సంపుటి అవార్డుకు ఎంపికయింది. ఆమె ప్రయోగాత్మక కథా రచనలో విమర్శకుల ప్రసంశలను అందుకొన్నారు. పురస్కార గ్రహీతకు మెమొంటో, 50 వేలు నగదు అందజేస్తారు.[4] దేశవ్యాప్తంగా 24 భాషలకు సంబంధించి 24 మంది యువ రచయితలకు ఈ పురస్కారం ప్రకటించారు. అకాడమీ చైర్మన్ విశ్వనాథ్‌ప్రసాద్ తివారీ నేతృత్వంలో ఇంఫాల్‌లో జరిగిన సమావేశంలో ఈ అవార్డుల ఎంపిక జరిగింది.[5]

తండ్రి పింగళి దశరథరామ్ సోషలిస్టు. చైతన్య చిన్నప్పుడే ఆయన హత్యకు గురయ్యారు. ఇప్పటివరకు చైతన్య రెండు పుస్తకాలు రాసింది. ఒకటి చిట్టాగాంగ్ విప్లవ వనితలు, రెండోది మనససులో వెన్నెల. ఈమె విజయవిహారం పత్రికలో కొంతకాలం పనిచేసింది[6].

సినిమా రంగం

మార్చు

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ఫిదాకి కో-రైటర్‌గా చేసింది. అంతేకాకుండా ఫిదా సినిమాలో 'ఊసుపోదు ఊరుకోదు', 'ఫిదా ఫిదా', నేల టికెట్ సినిమాలో 'బిజిలి', 'విన్నానులే', లవ్ స్టోరీ (2020) సినిమాలో 'ఏయ్ పిల్ల', మసూద (2022) సినిమాలో 'దాచి దాచి' వంటి పాటలు రాసింది.

రచనలు

మార్చు
  • చిట్టగాంగ్ విప్లవ వనితలు.[7]
  • మనసులో వెన్నెల[8]

మూలాలు

మార్చు
  1. "Chaitanya, Subba Rao win Sahitya Awards". Indian Express. 17 June 2016. Archived from the original on 17 జూన్ 2016. Retrieved 18 June 2016.
  2. BBC News తెలుగు (8 March 2021). "తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
  3. telugu, NT News (2023-01-29). "మహిళలూ.. మాస్‌ రాస్తారు!". www.ntnews.com. Archived from the original on 2023-01-29. Retrieved 2023-01-30.
  4. పింగళి చైతన్యకు యువ పురస్కారం 17-06-2016[permanent dead link]
  5. పింగళి చైతన్యకు ‘యువ పురస్కార్’ Sakshi | Updated: June 17, 2016
  6. "చిట్టగాంగ్ విప్ల‌వ చైత‌న్యం". Archived from the original on 2016-06-24. Retrieved 2016-06-23.
  7. చిట్టగాంగ్ విప్లవ వనితల పుస్తక పరిచయం
  8. "మనసులో వెన్నెల పుస్తక పరిచయం". Archived from the original on 2020-11-27. Retrieved 2016-06-18.

ఇతర లింకులు

మార్చు