దక్కన్ ఉద్యానవనం

దక్కన్ ఉద్యానవనం (దక్కన్ పార్కు) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కుతుబ్ షాహీ సమాధుల సమీపంలో ఉన్న ఉద్యానవనం.[1] విశాలమైన మైదానం, పచ్చని పచ్చికబయళ్ళు, అనేక రకాల మొక్కలు, చెట్లతో 31 ఎకరాలలో విస్తరించివున్న ఈ పార్కు పర్యాటకులను ఆకర్షిస్తోంది.

దక్కన్ ఉద్యానవనం (దక్కన్ పార్కు)
దక్కన్ ఉద్యానవనం ప్రవేశద్వారం
రకంప్రజా పార్కు
స్థానంకుతుబ్ షాహీ సమాధులు, హైదరాబాదు
నిర్వహిస్తుందిQQSUDA

పార్కు వివరాలు మార్చు

గోల్కొండ కోట, కులీ కుతుబ్ షాహి సమాధుల మధ్య ఈ డెక్కన్ పార్కు ఉంది. 1984లోనే ఈ పార్కు నిర్మాణ పని ప్రారంభమైనప్పటికి, చారిత్రాత్మక స్మారక కట్టడాలకు ఆనుకొని ఉన్నందుకు, భూమి విషయంలో ఇడ్గా కమిటీ, పురావస్తు శాఖల కొంత వివాదం జరిగింది. ఈ వివాదాస్పద భూమిపై ఇద్గా కుతుబ్ షాహి మేనేజింగ్ కమిటీ వాదనను కొట్టివేస్తూ రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ ఉత్తర్వుపై ఇచ్చిన స్టేను హైకోర్టు రద్దు చేసింది. దాంతో ఈ పార్కును తెరవడానికి అనుమతులు వచ్చాయి. ఇడ్గా భూమిని దాని పవిత్రతను కాపాడటానికి కులీ కుతుబ్ షా పట్టణ అభివృద్ధి అథారిటీ సంస్థ కంచెను నిర్మించింది.[2]

ఈ పార్కులో కృత్రిమ జలపాతాలు, జంట నగరాల్లోని పార్కులలో అతిపెద్ద మ్యూజిక్ ఫౌంటెన్‌ (రెండువేల చలనచిత్ర పాటలు ట్యూన్ చేసే) ఉన్నాయి. జంట నగరాల్లోని పార్కులలో పొడవైన (3 కిలోమీటర్ల విస్తీర్ణంలో) రైల్వే ట్రాక్‌లోని రైలు ప్రజలకు, పిల్లల ఆనందం కలిగిస్తోంది. 2.5 ఎకరాలలోని బోటింగ్ సరస్సులో బోటింగం కోసం పడవలు కూడా ఉన్నాయి.[3] పార్కు అభివృద్ధికి 2017లో కేంద్ర ప్రభుత్వం రూ. 99 కోట్లు మంజూరు చేసింది.

ప్రారంభం మార్చు

2002లోనే దీనిని ప్రారంభించడానికి సన్నాహాలు చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు ప్రారంభంకాలేదు. 2017, జూలై 10న అప్పటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ పార్కును ప్రారంభించారు.[4][5]

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. నవ తెలంగాణ, హైదరాబాదు (17 January 2017). "నగరవాసులకు అందుబాటులోకి దక్కన్‌ పార్క్‌". NavaTelangana. Archived from the original on 15 June 2020. Retrieved 15 June 2020.
  2. The Hindu, Hyderabad (15 February 2012). "At last, Deccan Park to be opened". J.S. Ifthekhar. Archived from the original on 16 June 2020. Retrieved 16 June 2020.
  3. The Times of India, Hyderabad (1 May 2002). "City to have a new park". Archived from the original on 5 February 2015. Retrieved 16 June 2020.
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (11 July 2017). "దక్కన్‌ పార్క్‌ ప్రారంభం". www.andhrajyothy.com. Archived from the original on 15 June 2020. Retrieved 15 June 2020.
  5. మన తెలంగాణ, హైదరాబాదు (10 July 2017). "దక్కన్ పార్కు ప్రారంభం". Archived from the original on 15 June 2020. Retrieved 15 June 2020.